కేంద్రానిదే భార‌మంటున్న చంద్ర‌బాబు

కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

మిర్చిరైతులకు గిట్టుబాటు ధ‌ర లేక‌పోవ‌డం ప్ర‌ధాన స‌మ‌స్య‌. దీంతో ఎక‌రాకు రూ.ల‌క్ష‌కు పైగా న‌ష్ట‌పోయామ‌ని రైతులు ల‌బోదిబోమంటున్నారు. మిర్చిరైతుల‌ను ఆదుకోవాల‌ని, వాళ్ల పంట‌కు స‌రైన గిట్టుబాటు ధ‌ర చెల్లించాల‌ని గుంటూరు మిర్చియార్డ్ ప‌ర్య‌ట‌న‌లో వైఎస్ జ‌గ‌న్ డిమాండ్ చేశారు. కూత‌వేటు దూరంలో ఉన్న సీఎం చంద్ర‌బాబు ఇక్క‌డికి ఎందుకు రాలేద‌ని కూడా ఆయ‌న నిల‌దీశారు.

ఈ నేప‌థ్యంలో మిర్చిరైతుల స‌మ‌స్య‌ల‌పై హ‌డావుడిగా చంద్ర‌బాబు అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. అంతేకాదు, కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మిర్చిరైతులకు గిట్టుబాటు లేక‌పోవ‌డంతో ద‌య‌నీయ ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని లేఖ‌లో సీఎం ప్ర‌స్తావించారు.

మిర్చి పంట‌ను వెంట‌నే కొనుగోలు చేయాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని సీఎం కోరారు. ఈ నెల 14న మిర్చి ధ‌ర‌ల ప‌త‌నంపై ఢిల్లీలో చ‌ర్చించిన‌ట్టు సీఎం గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న లేదంటే, చంద్ర‌బాబు ప‌లుకుబ‌డి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఎన్డీఏలో భాగ‌స్వామి కూడా అయిన తాను, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మిర్చిరైతుల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించేలా ఒత్తిడి చేయ‌డంలో చంద్ర‌బాబు స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించ‌లేద‌నే అభిప్రాయం క‌లుగుతోంది.

చంద్ర‌బాబు నిజంగా అనుకుంటే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మిర్చి రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించి, వాళ్ల‌ను అప్పులు, న‌ష్టాల ఊబి నుంచి బ‌య‌ట ప‌డేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌నే వాద‌న లేక‌పోలేదు. గుంటూరు మిర్చియార్డ్‌కు జ‌గ‌న్ వెళ్తున్నార‌ని తెలిసి. చంద్ర‌బాబు అప్ర‌మ‌త్త‌మై కేంద్రానికి లేఖ రాయడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేవ‌లం మిర్చి పంట‌ను కొనుగోలు చేయ‌డం ప‌రిష్కారం కాదు. వాళ్ల‌కు స‌రైన గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డ‌మే చంద్ర‌బాబు స‌ర్కార్ ఎదుట ఉన్న స‌మ‌స్య‌.

14 Replies to “కేంద్రానిదే భార‌మంటున్న చంద్ర‌బాబు”

  1. మిర్చి రైతులకి మద్దతు ధర పడిపోయింది అని జగన్ గారు ఇవ్వాళా వెళ్ళారంట.

    ఆయన అధికారంలో ఉన్నప్పుడు క్విన్టా 27000 ఉండేది .. ఇప్పుడు 11000 మాత్రమే ఉంది..

    అందుకని ఆ రైతులకి సపోర్ట్ గా వెళ్లారు అంట..

    .

    ఎందుకో నాకు అర్ధం కాదు….

    .

    ఆయన ఉన్నప్పుడు మీడియేటర్స్ ని తగ్గించారు.. మిల్లెర్స్ ఆగడాలు తగ్గించారు… రైతుల దగ్గర తక్కువ రేట్ కి కొనేసి, ప్రభుత్వానికి ఎక్కువ రేట్ కి అమ్మే మోసాన్ని తగ్గించారు… ఎప్పుడైనా ఇంకా రేట్ పడిపోతే గవర్నమెంట్ సొంతంగా కొనడం చేసే వారు.. దాంతో రేట్ తగ్గకుండా కంట్రోల్ లో ఉండేది..

    .

    అవన్నీ చేసినా.. జనాలు మందులో 20 రూపాయిలు ఎక్కువ ఉంది కదా అని వోట్ చెయ్యలేదు..

    బాబొరి ని సపోర్ట్ చేసే వాళ్ళు ఆ మిల్లెర్స్, మిడిల్ మెన్… వాళ్ళు గత ప్రభుత్వంలో ఎంతో బాధ పడిపోయేవారు..

    దాంతోనే అరాచకం అయిపోయేది అని ప్రచారం చేసే వాళ్ళు… ఎందుకంటే, వాళ్లకి ఎంతో లాస్ కాబట్టి..

    .

    సో, జనాలు బాబొరినే గెలిపించారు… సో, ఆ మిడిల్ మెన్, మిల్లెర్స్ వాళ్ళ టాలెంట్ చూపిస్తున్నారు..

    .

    ఇందులో తప్పేముంది.. కరెక్టే కదా.. కావాలనే తెచ్చుకున్నప్పుడు, అడిగినట్టే మందు రేట్ తగ్గించారు…

    .

    ఎం కావాలో అదే చేశారు… వద్దు అనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ లో డిసైడ్ అవ్వాలి.. అప్పటి దాకా ఇలానే ఉంటుంది..

  2. Central Govt may set up a Central Mirchi Board similar to Makaan board, and Turmeric Board. The variation of prices in different states may be considered and recommended by Board while giving minimum purchase price. Govt may provide free storage facilities for farmers who are not willing to sell now, and wait for the price adjustment.

  3. business annaka up and down vuntayi. Anduke agriculture is waste. Kootami is trying to build industry in Amaravathi for the same reason. Wait for 5 years and you will have factories and jobs there. Learn some useful skills ra yoosless fellows. entha kaalam ilaa paniki raani vyavasaayam chesukuni janaala tax dobbulu kaavaali ani edustharu.

  4. Every business has up and down. Agriculture is a low profit low margin business. And the risk is also very high. That is why kootami is trying to build buildings in Amaravathi and develop real estate there. Wait for 5 years and you will see the development. Everyone will become rich with PPPP model. But you need to give it time. Everything cannot happen overnight.

  5. Agriculture is a low profit low margin business. And the risk is also very high. That is why kootami is trying to build buildings in Amaravathi and develop real estate there. Wait for 5 years and you will see the development. Everyone will become rich with PPPP model. But you need to give it time. Everything cannot happen overnight.

  6. Agriculture is a low profit low margin business. And the risk is also very high. That is why kootami is trying to build buildings in new capital and develop real estate there. Wait for 5 years and you will see the development. Everyone will become rich with PPPP model. But you need to give it time. Everything cannot happen overnight.

  7. Agriculture is a low margin business. And the risk is also very high. That is why kootami is trying to build buildings in new capital and develop real estate there. Wait for 5 years and you will see the development. Everyone will become rich with PPPP model. But you need to give it time. Everything cannot happen overnight.

  8. That is why kootami is trying to build buildings in new capital and develop real estate there. Wait for 5 years and you will see the development. Everyone will become rich with PPPP model. But you need to give it time. Everything cannot happen overnight.

Comments are closed.