కాంగ్రెసు పార్టీలో ఓ సీతయ్య తయారయ్యడు. పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. మొండి ఘటంలా మారాడు. ఆయనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కులగణను వ్యతిరేకించిన, కులగణన ప్రతులను తగులబెట్టిన తీన్మార్ మల్లన్నకు పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది.
ఈ నెల పన్నెండో తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాని మల్లన్న కేర్ చేయలేదు. గడువు దాటిపోయినా గమ్మున ఉండిపోయాడు. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. ఈ షోకాజ్ నోటీసును తాను లెక్క చేయనని తెగేసి చెప్పాడు. అంతగా సమాధానం ఇవ్వాల్సి వస్తే ఎవరికి సమాధానం ఇవ్వాలో వారికే ఇస్తానని చెప్పాడు.
ఎవరి సమాధానం ఇస్తాడో మాత్రం చెప్పలేదు. రేవంత్ రెడ్డి పాలనపై బహిరంగంగానే విమర్శలు చేశాడు. కులగణను వ్యతిరేకించి బీఆర్ఎస్ కు బలం సమకూర్చిపెట్టాడు. బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించాడు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారు మరి గతంలో యూపీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేయలేదా? అని గుర్తు చేశాడు.
రాహుల్ గాంధీ బాటలో పయనిస్తున్న తనకు ఇలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వడమేంటి అని ప్రశ్నించాడు. కాంగ్రెస్ క్లియర్‌గా ఉంది కానీ సర్కార్ క్లియర్‌గా లేదు…నివేదికను నమ్మే పరిస్థితుల్లో బీసీలు లేరు అని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చాడు. కొందరు నేతలు బీసీలను పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని…. కాంగ్రెస్‌లో బీసీలను అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించాడు. కులగణన సర్వేకు వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శలు చేయడం.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
ప్రతిపక్ష పార్టీలు కూడా తీన్మార్ మల్లన్న చేస్తున్న కామెంట్స్‌తో.. రాష్ట్ర ప్రభుత్వం విమర్శల దాడిని మరింతగా పెంచుతున్నాయి. ఈ నివేదికను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిచడం లేదని.. బీసీల భవిష్యత్తును సమాధి చేసిన నివేదికగా భావిస్తున్నానని తీన్మార్ తెలిపాడు. ఇది దొంగ లెక్క అని.. ఈ దొంగ లెక్కను బీసీలు సమర్ధించరని చెప్పుకొచ్చాడు. బీసీలకు న్యాయం చేయడానికి, రిజర్వేషన్లు కల్పించేందుకు లెక్కలు తీయడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదని అర్థమైందని అన్నాడు.
ఈ దొంగ లెక్కలపై తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని అన్నాడు. బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఆరోపించాడు. బీసీ అయిన తీన్మార్ మల్లన్నను కాంగ్రెసు పార్టీ నియంత్రించలేకపోతోంది. రాష్ట్ర నాయకత్వం ఏం చేయలేకపోతోంది. కాబట్టి చివరకు రేవంత్ రెడ్డి మల్లన్న ధిక్కారాన్ని ఢిల్లీలోని అధిష్టానం దృష్టికి తీసుకుపోవడం తప్ప మరో మార్గంలేదు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు,