దర్శకుడు హరీష్ శంకర్ మొహానికి మరోసారి మేకప్ వేసుకుంటున్నారు. గతంలో నిప్పు, నేనింతే లాంటి ఒకటి రెండు సినిమాల్లో జస్ట్ కామియో రోల్స్ చేసారు. కానీ ఈసారి మాత్రం కాస్త కీలకమైన వేషమే వేస్తున్నారు.
సుహాస్ హీరోగా నటిస్తున్న ఓ ‘భాయ అయ్యో రామ’ అనే సినిమాలో హరీష్ శంకర్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూట్ లో వుంది. ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది.
ఈ సినిమాను రామ్ గోధల తన తొలి ప్రయత్నంగా దర్శకత్వం చేస్తున్నారు, హరీష్ నల్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ఓ అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సుహాస్, మాళవిక మనోజ్‌ల రొమాన్స్‌ను చూపిస్తూ, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఈ జంట అందించే ప్రేమకథ భావోద్వేగాలను రేకెత్తించేలా ఉండబోతోందని అర్థమవుతోంది.
ఈ సినిమాలో హరీష్ శంకర్ ఓ పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. దర్శకులు అంతా ఎప్పుడో అప్పుడు కామియోలుగా కనిపించడం కామన్. కానీ అలా కాకుండా కాస్సేపు కనపడే వేషం కొంతమంది ప్రిఫర్ చేస్తున్నారు. సంపత్ రాజ్ ఇటీవల అలాగే మంచి పాత్ర చేసారు. ఇదే బాటలో మరి కొందరు ట్రై చేస్తున్నారు. కానీ హరీష్ శంకర్ నటించడం అంటే వేరు. దానికి ఉండే అట్రాక్షన్ వేరు.
Good sir
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,