మరో 2 రోజుల్లో తన తొలి వైవాహిక వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోబోతోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. నిర్మాత జాకీ భగ్నానీని సౌత్ గోవాలని ఐటీసీ గ్రాండ్ హోటల్ లో పెళ్లాడింది. అయితే ఆ టైమ్ లో పెళ్లికొచ్చిన ఆహుతుల నుంచి మొబైల్ ఫోన్లు లాక్కోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎట్టకేలకు ఆ అంశంపై రకుల్ స్పందించింది. తమ పెళ్లి వీడియోలు, ఫొటోలు బయటకొస్తాయనే అభద్రతా భావంతో అతిథుల మొబైల్స్ తీసుకోలేదని, ఓ ప్రత్యేకరమైన కారణంతో ఆ పని చేశామని తెలిపింది.
“మా పెళ్లిని మా ఇద్దరితో పాటు వచ్చిన ఆహుతులంతా ఆస్వాదించాలనేది మా ఆలోచన. అది మా జీవితంలోని ఉత్తమమైన 3 రోజుల పెళ్లి. ఆ పెళ్లిని మాతో పాటు అంతా ఆస్వాదించాలి. అందుకే నో ఫోన్ పాలసీ పెట్టాం. ఎవరో ఫొటోలు తీసి లీక్ చేస్తారని మేం ఆ పని చేయలేదు. పెళ్లిలో మాతో పాటు ఆహుతులు కూడా డాన్స్ చేయాలి. ప్రతి సందర్భంలో మేం డాన్స్ చేశాం. చివరికి నా వెడ్డింగ్ డ్రెస్ తో కూడా. మాతో పాటు బంధువులంతా ఎంజాయ్ చేశారు. అదే మేం కోరుకున్నాం.”
అర్జున్ కపూర్, రకుల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఓ హిందీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని బయటపెట్టింది రకుల్. త్వరలోనే సౌత్ లో ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానంటోంది.
రావు గారి ఫోన్ కూడానా
Good
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు,
Waste news