6 నెలల కిందట లాంఛింగ్… ఇప్పుడు షూటింగ్

ఎట్టకేలకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు లైన్ క్లియర్ అయింది. రేపట్నుంచి ఎన్టీఆర్-నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఇప్పటిది కాదు. వాస్తవంగా చెప్పాలంటే 2023లోనే వీళ్లిద్దరి కాంబోలో సినిమాను సూచనప్రాయంగా వెల్లడించారు. అప్పట్నుంచి నలుగుతున్న ఈ ప్రాజెక్టును గతేడాది ఆగస్ట్ లో లాంఛ్ చేశారు. ఇక అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్నారంతా.

కానీ సినిమా షూట్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. అలా 2025 సంవత్సరం కూడా వచ్చేసింది. ఎట్టకేలకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు లైన్ క్లియర్ అయింది. రేపట్నుంచి ఎన్టీఆర్-నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ఇది 10 రోజుల షెడ్యూల్.

రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించారు. 1950ల నాటి మహారాష్ట్ర పరిస్థితుల్ని ప్రతిబింబించేలా భారీ సెట్ వేశారు. అందులోనే రేపట్నుంచి షూట్ స్టార్ట్ చేస్తున్నారు. మొదటి రోజు షూటింగ్ లోనే దాదాపు 1500 మంది జూనియర్ ఆర్టిస్టులతో షూట్ చేయబోతున్నాడు నీల్.

అయితే ఎన్టీఆర్ మాత్రం సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. వార్-2 షెడ్యూల్ పూర్తిచేసి, వచ్చే నెల నుంచి తారక్ సెట్స్ పైకి వస్తాడు. ఈ గ్యాప్ లో హీరోతో సంబంధం లేని సన్నివేశాల్ని తీస్తాడు నీల్.

ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్.

3 Replies to “6 నెలల కిందట లాంఛింగ్… ఇప్పుడు షూటింగ్”

Comments are closed.