ఈ కాలం పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలంటే పండగలు కావాల్సిందే. అవి లేకపోతే వేసవి శెలవులైనా ఉండాల్సిందే. రాజాసాబ్ సినిమా వేసవిని మిస్ అయింది. కాబట్టి ఇప్పుడు దసరా పండగపై కన్నేసింది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరా సందర్భంగా రాజాసాబ్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు కొత్త డెడ్ లైన్స్ పెట్టుకొని యూనిట్ పనిచేస్తోంది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది రాజాసాబ్ సినిమా. షూటింగ్ ఎప్పుడో పూర్తయిందని, మంచి టైమ్ చూసి ప్రచారం ప్రారంభిస్తామని చాన్నాళ్ల కిందటే మారుతి చెప్పుకొచ్చాడు.
కానీ రాజాసాబ్ షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. పైగా కీలకమైన గ్రాఫిక్ వర్క్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఇంతకుముందు చెప్పినట్టు ఏప్రిల్ 10కి సినిమా విడుదల చేయలేమనే విషయం మేకర్స్ కు అర్థమైపోయింది.
అందుకే ఆ తేదీ నుంచి సినిమాను తప్పించారు. పోనీ మే, జూన్ నెలల్లో వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు దసరా టార్గెట్ గా పని చేస్తున్నారు. అయితే దసరాకు ఆల్రెడీ అఖండ-2 షెడ్యూల్ అయి ఉంది. ప్రస్తుతానికైతే ఆ పోటీ గురించి ఆలోచించకుండా సినిమాను పూర్తిచేయడం పైనే మేకర్స్ దృష్టిపెట్టారు.
Hi
Waiting
కాల్ బాయ్ జాబ్స్ >>>
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,