చచ్చే వరకూ జగ‌న్‌తో కాదు…జ‌నంతో ఉంటేనే భవిష్యత్‌!

కేవ‌లం అధినాయ‌కుడితో స‌త్సంబంధాలున్నంత మాత్రాన జ‌నం ఆద‌రిస్తారని ఎలా అనుకుంటున్నారో అర్థం కావ‌డం లేదు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత బియ్యపు మ‌ధుసూద‌న్‌రెడ్డి ఎన్నిక‌ల్లో ఓడిన త‌ర్వాత ప‌త్తా లేకుండా పోయారు. దీంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ అనాథ అయినట్టు “గ్రేట్ ఆంధ్ర “లో కథనం రాశాం. ఈ కథనంతో ఆయన చుర‌క తగిలింది. ఆఘమేఘాలపై శ్రీకాళహస్తికి మధు వెళ్లారు.

మీడియాతో మాట్లాడుతూ… తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బ‌తికున్నంత కాలం జ‌గ‌న‌న్న‌ తోనే ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి అడుగు వేసే నాటికి తాము ఆయ‌న వెన‌కాల ఉన్నామ‌న్నారు. జ‌గ‌న్ పేరుతో చారిట‌బుల్ పెట్టి సేవ చేశాన‌న్నారు.

రాజకీయాల్లో గతం కంటే వర్తమానం ముఖ్యం. రాజ‌కీయ నాయ‌కుల భ‌విష్య‌త్ అనేది వ‌ర్త‌మానంలో న‌డుచుకునే తీరుపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ విష‌యాన్ని బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి గుర్తించాలి. గ‌తంలో జ‌గ‌న్‌తో పాటు జైలుకెళ్లి, నెల‌ల త‌ర‌బ‌డి ఊచ‌లు లెక్కించిన విజ‌య‌సాయిరెడ్డి, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, అలాగే అన్న వ‌దిలిన బాణ‌మ‌ని చెప్పుకున్న ష‌ర్మిల ఇప్పుడు ఎక్క‌డున్నారో మ‌ధు గుర్తు చేసుకుంటే మంచిది. గ‌తాన్ని గుర్తు చేస్తూ, వ‌ర్త‌మానాన్ని విస్మ‌రిస్తే, భ‌విష్య‌త్ ఉండదని బియ్య‌పు మ‌ధు గ్ర‌హించాలి.

మరీ ముఖ్యంగా జ‌గ‌న్‌తో కాదు, జ‌నంతో ఉండ‌లేద‌నేది బియ్య‌పు మ‌ధుపై ప్ర‌ధాన విమ‌ర్శ‌. త‌న‌కు జ‌గ‌న్ స‌న్నిహితుడ‌నే కార‌ణంతో, జ‌నంలో లేకపోయినా టికెట్ తెచ్చుకోవ‌చ్చ‌నే ధీమాతోనే శ్రీ‌కాళ‌హ‌స్తి వైసీపీని గాలికి వ‌దిలేశార‌న్న చ‌ర్చ త‌న‌పై జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలుసుకోవాలి. జ‌నంతో ఉన్న లీడ‌ర్‌కు ఏ పార్టీ వారైనా ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతారు.

కేవ‌లం అధినాయ‌కుడితో స‌త్సంబంధాలున్నంత మాత్రాన జ‌నం ఆద‌రిస్తారని ఎలా అనుకుంటున్నారో అర్థం కావ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నియోజ‌క‌వ‌ర్గానికి వెళితే, అంత వ‌ర‌కూ ఇబ్బందిప‌డుతున్న వైసీపీ శ్రేణుల్లో న‌మ్మ‌కాన్ని ఏ విధంగా క‌లిగిస్తార‌ని అనుకుంటున్నారో క‌నీసం త‌న అంత‌రాత్మ‌కైనా బియ్య‌పు మ‌ధు స‌మాధానం చెప్పుకోవాలి.

క‌ష్టాల్లో అండ‌గా లేకుండా, త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఎన్నిక‌ల‌కు ముందు వెళితే, ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డానికి జ‌నం, వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులేమైనా వెర్రోళ్ల‌ని అనుకుంటున్నారా? అని మ‌ధును ప్ర‌శ్నిస్తున్నారు. కావున జ‌గ‌న్‌తో కాదు, నిత్యం జ‌నంతో వుండేలా బియ్య‌పు మ‌ధు ఏర్పాట్లు చేసుకుంటేనే రాజ‌కీయంగా భ‌విష్య‌త్ వుంటుంది. లేదంటే బెంగ‌ళూరులో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవ‌డ‌మే ఉత్త‌మం. త‌ద్వారా వైసీపీకి ఎంతో మేలు చేసినట్టు అవుతుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

12 Replies to “చచ్చే వరకూ జగ‌న్‌తో కాదు…జ‌నంతో ఉంటేనే భవిష్యత్‌!”

  1. వీడు MLA ఎలా అయ్యాడో  శ్రీకాళహస్తి ప్రజలకే తెలియాలి.వాడి యాస,భాష, వెకిలి చేష్టలు, చేపల మార్కెట్లలో వేసినట్టు అసెంబ్లీలో కేకలు వెయ్యడం..వీడు జనాల్లో వుండి ఎం చేస్తాడు..?

  2. ముందు మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే రాజకీయాలలో గతం , వర్తమానం, భవిష్యత్తు కన్నా మన ప్రవర్తన ముఖ్యం. మన ప్రవర్తన తేడాగా ఉంటె….గౌరవ అధ్యక్షురాలు అయినా తల్లి అయినా, బాణం అన్న చెల్లి అయినా, జైలు లో తూడు ఉన్న ఇంకెవరైనా చ్చికొట్టి పోతారు

    1. ఇంట్లో సొంత వాళ్ళు ఉన్న లేక పోయిన పథకాలు బ్యాచ్ మాత్రం వెంటే ఉంటారు సర్

  3. ‘రేయ్ నీకు నువ్వ గ్రేట్ అనుకునే “గ్యాసు ఆంధ్రా, .వచ్చే ఎన్నికల్లో  గెలవాలంటే గట్టిగా కళ్ళు మూసుకోవాలి.. అప్పుడే 5 ఏళ్ళు బరా బరా తిరిగి అధికారం తన్నుకుంటూ అదే వస్తది అని మా లెవెన్ మోహనం చెప్పాడు.. అందుకే తుచ తప్పకుండా బియ్యం మధు ఫాలో అవుతుంటే నువ్వేదో పెద్ద మేధావి లా నీతులు చెబుతున్నావ్ .. లెవెనన్న కంటే గొప్పోడివా నువ్వు??

  4. తన కుటుంబం కి ఒక cm పదవి, 2 ఎంపీ పదవి ఇచిన కాంగ్రెస్ పార్టీ కి జగన్ ఏమన్నా విధేయత తో ఉన్నాడా?

    మరల తనకు కూడా ఒకే కుటుంబం లో  రెండో  CM పదవి కావాలి అని మంకు పట్టు పట్టి పార్టీ నీ మోసం చేసి వదిలేశాడు కదా.

  5. Bengaluru లో ఎందుకు అమరావతి లో చెసుకొవచ్చు గా … బాబు మొదలు పెట్టారు గా ఎకరం 20 cr ఏగా……

Comments are closed.