పహల్గాం ఉగ్రదాడిలో మన పర్యాటకుల ఉసురు తీసిన టెర్రరిస్టుల అంతు చూడడానికి భారత్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా గత అర్ధరాత్రి నుంచి ఉగ్రవాదుల స్థావరాల పైన అటాక్ మొదలు పెట్టింది. దీంతో యావత్ దేశమంతా జమ్ము కశ్మీర్‌లో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ప్రతి భారతీయుడు మన త్రివిధ దళాలకు అండగా నిలుస్తున్నాడు.
ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు యావత్ భారత్ అంతా ఏకతాటిపై నిలుస్తుందని, ఉగ్రవాదుల్ని తుదముట్టించాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ భారత్ సైన్యం న్యాయం జరుగుతుందని చేసిన ట్వీట్‌ను షేర్ చేస్తూ, ఆయన అదే విషయాన్ని నొక్కి చెప్పారు. జైహింద్ అంటూ నినదించారు.
ఇదే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆ పోస్టు ఏంటంటే .. “పహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్రతిచర్యగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజల్ని రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్” అని జగన్ ట్వీట్ చేశారు.
ఇంకా అనేక మంది రాజకీయాలు, కులాలు, మతాలు పక్కన పెట్టి భారత రక్షణ దళాలకు అండగా నిలుస్తూ, తమదైన మద్దతు తెలియజేస్తున్నారు.
జగన్ రెడ్డి ని నమ్మలేము
రెడ్డి కాదు నకిలీ ‘చెడ్డీ వాడు
సోనియా నే ఎదురించి, మోడీ మెడలు వొంచేసిన మా సింగల్ సింహాన్ని పంపించుంటే పాక్ శత్రువుల బట్టలూడదీసి సర్వీస్ చేసి , టెర్రరిస్ట్ తలలు తెచ్చేవాడు తెలుసా??
.
ఏంటో ఎవ్వరూ అర్థం చేసుకోరు ..
ఇలాంటి పప్పు మాటలు పరిటాల గుండు కధలు భలే వస్తాయి మీ పచ్చ పూ గల కి
Twitter lo text kabatti saripoindhi .. leka pote ah sourbhomatvam anadaniki nana avastha padevadu anniya
Anna ni Lokesh no compare chesthu rasavante, Lokesh edigesadu Anna maata
Jai hind kadu, Jai Jagan anali
mari Pakisthan lo vunna Jagan fans Tuglak batch paristhithi yemiti?
దినే పచ్చ పూ మాటలు అంటారు రా
వామ్మో..!