ఇదంతా పెద్ద సినిమాల సంగతి. బుల్లి, బుచ్చి సినిమాల సంగతి కాదు.
ఎంత గొప్ప టాక్ వచ్చిన సినిమా అయినా మండే టెస్ట్ ఎందుకు పాస్ కావడం లేదు. మండే నాడు కలెక్షన్లు దారుణంగా కుప్పకూలుతున్నాయి. కొన్ని సెంటర్లలో ఎందుకు షోలు క్యాన్సిల్ అవుతున్నాయి? కేవలం నిర్మాతల అత్యాశ వల్ల. కేవలం హీరోల భారీ రెమ్యూనరేషన్ల కారణంగా. భారీ రెమ్యూనరేషన్ల తీసుకోవడంతో హీరోలు ఊరుకోవడం లేదు. కాస్టింగ్ ను డిసైడ్ చేస్తున్నారు. టెక్నికల్ క్రూ ను డిసైడ్ చేస్తున్నారు. మేకింగ్ ను నిర్దేశిస్తున్నారు. ఇవన్నీ కలిసి సినిమా నిర్మాణాన్ని అమాంతం పెంచేస్తున్నాయి.
సినిమా రెమ్యూనరేషన్ల అంటే అటు నటీనటులు, ఇటు సాంకేతిక నిపుణులు కలిసి 60 శాతం ఉంటే ముఫై శాతం మేకింగ్ ఖర్చు ఉంటుంది. పదిశాతం వడ్డీలు ఉంటున్నాయి. ఇది ఓ అంచనా. సినిమాను నామినల్ మార్జిన్ తో విడుదల చేయడం లేదు. వీలైనంత ముందే లాగేద్దాం అని చూస్తున్నారు. అందుకే వంద రూపాయలు ఖర్చు చేసిన సినిమాకు ఇరవై నుంచి నలభై రూపాయలు థియేటర్ నుంచి లాగాలని చూస్తున్నారు. అప్పటికే నాన్ థియేటర్ మీద డెభై నుంచి తొంభై రూపాయలు నాన్ థియేటర్ మీద వచ్చినా కూడా.
నాన్ థియేటర్ కు థియేటర్ కు ఉన్న గ్యాప్ కు అనుగుణంగా అమ్మకాలు జరపడం లేదు. సినిమా క్రేజ్, హీరో క్రేజ్, కాంబినేషన్ క్రేజ్ లెక్కలు కట్టి అమ్ముతున్నారు. నాన్ రికవరబుల్ అడ్వాన్స్ ల మీద సినిమా ఇచ్చినపుడు ఇలా భారీగా తీసేసుకోనక్కరలేదు. రీజనబుల్ గా తీసుకుని, కమిషన్లు పోను వసూళ్లను వసూలు చేసుకోవచ్చు. కానీ అలా చేయరు.
ఎందుకంటే నమ్మకాలు లేవు ఇక్కడ. ఎగ్జిబిటర్ కరెక్ట్ గా ఇస్తారో ఇవ్వరో అని డిస్ట్రిబ్యూటర్ కొంత వరకు అపనమ్మకం పెట్టుకుంటారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు ఓవర్ ఫ్లోస్ ఎగ్గొట్టడానికే చూస్తారు అని నిర్మాతలు పూర్తిగా నమ్ముతున్నారు. అందుకే ముందే ఎంత వస్తుందో అంచనా వేసి, ఆ మేరకు ఎన్ ఆర్ అడ్వాన్స్ లు తీసేసుకుందాం అనే దృక్పధంలో వున్నారు.
కానీ ఇంత మొత్తం కట్టాలి అంటే డిస్ట్రిబ్యూటర్ కు ఓ భరోసా కావాలి. టికెట్ రేట్ల పెంపు అనేది దానికే ఓ మార్గం. రేట్లు తెస్తాం.. పబ్లిసిటీ గట్టిగా చేస్తాం, మాగ్జిమమ్ మూడు రోజుల్లో లాగేస్తాం అనే భరోసా ఇస్తున్నారు. ఆ మేరకు ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు.
డబ్బులు ఎంతైనా, హీరో కోసం లేదా, సినిమా కోసం ఖర్చు చేసే వాళ్లు ఎప్పుడూ కొంత మంది ఉంటారు. వాళ్లంతా కలిసి తొలి మూడు రోజులకు సరిపోతున్నారు. మండే సినిమా ఢమాల్ అని కూలుతోంది. ఎందుకంటే అదనపు రేట్లు వారం పొడవునా వుంటాయి. తగ్గించాం, తగ్గిస్తున్నాం.. ఇవన్నీ కంటితుడుపు ప్రకటనలు. నిర్మాత తగ్గించినా, నిర్మాత టికెట్ రేట్లు తేకపోయినా, కూడా లోకల్ అధికారులను మేనేజ్ చేసి రేట్లు పెంచే పద్దతి థియేటర్లు చేస్తూనే ఉంటాయి. అదో రీజన్.
మొత్తం మీద మండే నుంచి మళ్లీ శాటర్ డే వరకు థియేటర్ రేట్లకు భయపడి జనం దూరంగా ఉంటున్నారు. ఫస్ట్ వీక్ తరువాత సినిమా బాగుంది అంటే అప్పుడు సెకెండ్ వీకెండ్ కు జనం మళ్లీ వస్తారు. ఆ తరువాత మళ్లీ వర్కింగ్ డేస్, మళ్లీ వీకెండ్ వచ్చే సరికి జనం మూడ్ మారిపోతుంది.. అప్పుడే రెండు వారాలు అయింది కదా.. వారం పోతే ఓటిటి లోకి వచ్చేస్తుంది చూడొచ్చులే అనుకుంటున్నారు.
ఇలా సినిమాను సినిమా జనాలే చంపేసుకుంటున్నారు. కానీ నింద లేనిదే బొంది పోదు అని సామెత మాదిరిగా దర్శకుడిని పాంపర్ చేయడానికి, హీరోను మంచి చేసుకోవడానికి ఏవో పిచ్చి కారణాలు చెప్పుకుంటారు. సినిమా బాగుంది సర్.. ఆ రోజు వర్షం పడింది.. లేదా…మీడియా చంపేసింది సర్…ఈ యాంటీ ఫ్యాన్స్ తో పెద్ద తలనొప్పి అయిపోయింది సర్.. అంటూ చెప్పుకుని ఆనందపడతారు. హీరోలు అదే నిజం కాదు అని తెలిసినా, అదే నిజం అనుకునే భ్రమలో బతికేస్తూ ఉంటారు. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ సాగిపోతారు.
ఏడాది రెండేళ్ల క్రితం ఓ సినిమా దారుణంగా ఫెయిలయింది. పది కోట్లు తీసుకున్న హీరో సైలంట్ గా మరో నిర్మాతకు సినిమా చేయడానికి రెడీ అయ్యారు. సినిమా పోయి రోడ్డున పడ్డ నిర్మాతకు చేస్తే రెమ్యూనరేషన్ తగ్గించాల్సి వస్తుందని ఆలోచన. రెమ్యూనరేషన్ తగ్గించవద్దు, ఎంత అడిగితే అంతా ఇస్తాను తనకే చేయమని నిర్మాత బతిమాలి ఒప్పించారు. ఇదీ టాలీవుడ్ పరిస్థితి.
థియేటర్ మీద దమ్మిడి ఆదాయం తేలేని మిడ్ రేంజ్ హీరోలను కొన్నాళ్లు పక్కన పెట్టాలని నిర్మాతలు అంతా కలిసి నిర్ణయం తీసుకుంటే, ఆ హీరోలు కిందకు దిగిరారా? కానీ అలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. అక్కడ పైసా తగ్గిద్దాం..ఇక రెండు పైసలు తగ్గిద్దాం అని అర్థం లేని ఆలోచనలు చేస్తుంటారు.
థియేటర్ అంటే భయపడే పరిస్థితిని టాలీవుడ్ నే తీసుకువచ్చింది.
థియేటర్ ఆనందాన్ని టాలీవుడ్ జనాలే దూరం చేస్తున్నారు.
థియేటర్లలో ఫుడ్ కోర్టులు పెరిగిపోయాయి. థియేటర్ కు క్యాంటీన్, పార్కింగ్ ఆదాయాలు మంచి వనరులుగా మారాయి. అంత వరకు బాగానే ఉంది. కానీ పిల్లలతో థియేటర్ కు వచ్చిన వాళ్లను ఈ క్యాంటీన్ లే భయపెడుతున్నాయి. పిల్లలను సముదాయించలేరు. వందలు పెట్టి కొనలేరు. పెద్దలు కంట్రోలు చేసుకోగలరు. పిల్లలను కంట్రోల్ చేయలేరు. అందుకే ఫ్యామిలీలను థియేటర్ కు తీసుకురావడం తగ్గుతోంది. అంతే కాదు, డార్క్ జానర్, బూతులు, రక్తపాతం తో కథలను నింపేస్తున్నారు. వాటిని పిల్లలకు చూపించడానికి జనం భయపడుతున్నారు.
ఎప్పుడైతే ఫ్యామిలీలు రావడం లేదో, నెంబర్ ఆఫ్ టికెట్ లు పెరగడం లేదు.
అన్నింటికీ మూలం హీరోల అత్యాశ.. దాని కారణంగా నిర్మాతల బాధలు.. దాని కారణంగా టికెట్ రేట్ల పెంపు..
అతిగా ఆశపడే టాలీవుడ్ బాగుపడడం కష్టం.. ముఖ్యంగా సరైన కారణాలు వెతుక్కోకుండా, భ్రమలో బతికేయడం అన్నది అతి పెద్ద సమస్య. దానికి మందు లేదు…
ఇంత స్టోరీ ఇచ్చాక ఓ చిన్న రిఫరెన్స్ ఇవ్వకుంటే ఎలా?
ఈవారం విడుదలైన హిట్ 3 సంగతే చూద్దాం. సినిమా విడుదల నాటికే లాభాల్లో ఉంది. థియేటర్ మీద నాన్ రికవరబుల్ అడ్వాన్స్ రూపంలో కాస్త తక్కువ తీసుకున్నా ఫర్వాలేదు అనే స్ధాయిలో ఉంది. అలాంటప్పుడు ఆంధ్ర, సీడెడ్ లో కాస్త తక్కువ తీసుకుని ఉంటే బ్రేక్ ఈవెన్ సమస్య ఉండేది కాదు. పోనీ బ్రేక్ ఈవెన్ సమస్య కాదు అనుకున్నా అంత రేట్లు కానప్పుడు, టికెట్ రేట్లు తెచ్చే అవసరం ఉండేది కాదు. టికెట్ రేట్లు పెంచనపుడు మండే జారిపోయే అవకాశం ఉండదు కదా..
మ్యాడ్ 2 లాంటి చిన్న సినిమాకు కూడా రేట్లు తెచ్చారు. అవసరమా?
సినిమాలు లేకుండా మూలన ఇంట్లో కూర్చున్న ఇద్దరు హీరోలను బయటకు తెచ్చి రెండేసి కోట్లు వంతున ఇచ్చి సినిమా చేయడం అంటే తప్పు ఎవరిది?
ఇవి జస్ట్ ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే.. చాలా సినిమాలకు ఇలాగే జరుగుతోంది అని గమనించాలి కదా. టాలీవుడ్ సమస్యలకు మందు టాలీవుడ్ లోనే ఉంది. కానీ ఆ మందు వాడకుండా, వేరే వేరే చిట్కా వైద్యం చేస్తూ ఉంటారు తప్ప అసలు ట్రీట్ మెంట్ వాడరు..వాడలేరు.
-విఎస్ఎన్ మూర్తి
so called peddha herolu , picha L kodukulu remuneration mingi prabhuthwaala M gudusi tickets rates penchukuni janaalanu sarva naasanam chesthunnaaru. idhithappa vere reason emi ledhu. telugu cinema chachipovaali.
Court movie monday crash kaaledhu, hold ayyindhi. Monday crash avuthunnayi ante, content lekapovadam valla. Content leni movie ki mundhe buzz create chesi release chesttunaru, weekend taruvatha adhi crash avuthunnayi.
Tollywood ante ne block money ni white ga March Adam…Ippudu aa block money taggindi…from now on every single year, it will continue like this..
heroism should be dead and only true actors will carry the legacy…
if people have sense and brains they would not watch indian movies