వైసీపీ ఇన్‌చార్జ్‌లో ఎంతలో ఎంత మార్పు!

రాజ‌కీయంగా బొజ్జ‌ల కుటుంబం ఎప్ప‌టికీ ప్ర‌త్య‌ర్థే అని ఆయ‌న ప్ర‌క‌టించారు. బొజ్జ‌ల కుటుంబంతో క‌లిసి పోయాన‌నే ప్ర‌చారం అంతా ఉత్తుత్తిదే అని ఆయ‌న చెప్పారు.

ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి వైసీపీ ఇన్‌చార్జ్ బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి …పైకి చెప్ప‌లేదు కానీ, ప్ర‌జ‌ల‌పై అల‌క‌బూనారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏదైనా వుంటే చూసుకుందాంలే అని ఆయ‌న అనుకున్నారు. బెంగ‌ళూరులో వ్యాపారాల్లో త‌ల‌మున‌క‌లై, త‌మ‌ను రాజ‌కీయంగా అనాథ‌ల్ని చేశార‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ శ్రేణుల మ‌నోభావాల్ని వ‌రుస‌గా “గ్రేట్ ఆంధ్ర” అక్ష‌రీక‌రించింది.

శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాల్సిన వైసీపీకి కొత్త ఇన్‌చార్జ్‌ను చూసుకుంటే మంచిద‌నే ప్ర‌జాభిప్రాయాన్ని గ్రేట్ ఆంధ్ర ఆవిష్క‌రించింది. ఈ నేప‌థ్యంలో క‌లుగులో దాక్కున్న బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి శ్రీ‌కాళ‌హ‌స్తికి ప‌రుగు పెట్టారు. శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌కవ‌ర్గ ప్ర‌జ‌ల‌కు, వైసీపీ శ్రేణుల‌కు అండ‌గా వుంటాన‌ని అన‌డ‌మే కాదు, వాళ్ల‌తో స‌మావేశాల్ని కూడా మొద‌లు పెట్ట‌డం విశేషం.

త‌న‌పై స‌ద్వివిమ‌ర్శ‌ల్ని పాజిటివ్‌గా తీసుకోవ‌డంతోనే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డిలో రాజ‌కీయంగా త‌క్కువ స‌మ‌యంలోనే మార్పు క‌నిపించింది. శ్రీ‌కాళ‌హ‌స్తిలో మొట్ట‌మొద‌ట‌గా తొట్టంబేడు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. త‌న‌కు చేసిన సాయాన్ని మ‌రిచిపోన‌ని ఆయ‌న అన్నారు. అలాగే బొజ్జ‌ల కుటుంబంతో రాజీ అయ్యి, నియోజ‌క‌వ‌ర్గాన్ని గాలికి వదిలేశార‌నే విమ‌ర్శ‌ల్ని ఆయ‌న కొట్టి పారేశారు.

రాజ‌కీయంగా బొజ్జ‌ల కుటుంబం ఎప్ప‌టికీ ప్ర‌త్య‌ర్థే అని ఆయ‌న ప్ర‌క‌టించారు. బొజ్జ‌ల కుటుంబంతో క‌లిసి పోయాన‌నే ప్ర‌చారం అంతా ఉత్తుత్తిదే అని ఆయ‌న చెప్పారు. వ్య‌క్తిత్వాన్ని అమ్ముకుని దిగ‌జారిపోయి బ‌తికే మ‌నిషిని కాద‌న్నారు. కూట‌మి పాల‌న‌లో వైసీపీ నాయ‌కుల్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్న‌ట్టు ఆయ‌న ఆరోపించారు. పేద‌ల పక్షాన నిలుస్తున్న త‌న‌పై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తోంద‌న్నారు. భ‌విష్య‌త్‌లో ఇందుకు బాధ్యులైన అధికారులు కూడా త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దని బియ్య‌పు మ‌ధు హెచ్చ‌రించారు.

అయితే బియ్య‌పు మ‌ధులో వ‌చ్చిన మార్పు తాత్కాలికం కాకూడ‌దు. రాజ‌కీయం అంటే పార్ట్ టైమ్ జాబ్ కాద‌ని మ‌ధు గుర్తించాలి. నిత్యం శ్రీ‌కాళహ‌స్తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జానీకానికి, అలాగే సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు అందుబాటులో ఉంటే త‌న‌కే మంచిద‌ని ఆయ‌న గుర్తించాలి. జ‌గ‌న్ తెలుసు క‌దా, టికెట్‌కు ఇబ్బంది వుండ‌ద‌నే ధీమాతో ప‌త్తా లేకుండా పోతే, కొత్త నాయ‌క‌త్వం ముందుకొస్తుంద‌ని బియ్య‌పు మ‌ధు గ్ర‌హించాలి. ఏది ఏమైనా బియ్య‌పు మధులో వ‌చ్చిన మార్పు అభినంద‌నీయం.

16 Replies to “వైసీపీ ఇన్‌చార్జ్‌లో ఎంతలో ఎంత మార్పు!”

  1. అయితే.. జగన్ రెడ్డి కన్నా.. వెంకట్ రెడ్డి ని వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ గా చేస్తే.. పార్టీ కనీసం బతికి బట్ట కడుతుందేమో కదా..

    జగన్ రెడ్డి మాట కూడా వినని బియ్యం మధు ని… వెంకట్ రెడ్డి ఒకే ఒక్క ఆర్టికల్ తో క్రమశిక్షణ లోకి తెచ్చి లైన్లో పెట్టేసాడు..

    నెక్స్ట్ సజ్జల రెడ్డి సకల శాకా మంత్రి పోస్ట్ కి వెంకట్ రెడ్డి పక్కాగా సెట్ అయ్యేలా ఉన్నాడుగా..

    1. వైసిపికి డ్రిల్ మాస్టర్ అన్నమాట వెంకట రెడ్డి గారు 

      1. సింగల్ సింహాన్ని ఆడిస్తున్నారు అంటే రింగ్ మాస్టర్ అయ్యి ఉంటారు….

  2. మరి ఇంకేం ….మిగతా 174 Incharges గురించి కూడా రాశాయి…ఆక్టివ్ అవుతారు

  3. ఈయనే కదా అధికారం లో ఉన్నప్పుడు సొంత క్యాడర్ ని కూడా వేధించారు అని మీరు అప్పట్లో ఆరోపణ చేసారు…

  4. నీ కన్నా లఫూట్  నా కొడుకుఈ భూ పంచంలో భూతద్దం వేసి వెతికినా దొరకరేమో . ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది 

     ఇటువంటి సమయంలో నీకు మీ అన్నకు ఇటువంటి పనికిమాలిన న్యూస్లు రాయడం చెప్పడం అవసరమా అడ్డ గాడిద. నవ్యము ఇటువంటి పనికిమాలిన పోస్టులు పెడతావు మీ అన్న నోటికి వచ్చి వాగుతుంటాడు. వాడిని వదలను వీడ్ని వదలను వారిని చంపుతా వాడిని పొడుస్తా అంటూనే ఉంటాడు మీ అన్న. అసలు మీకు గాని మీ అన్నకు గాని కనీసం ఇంగిత జ్ఞానం ఉందా ఎప్పుడు ఏ సమయంలో ఏం మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం నీకు లేదు మీ అన్నకు లేదు . మీరు మనుషులుగా ఎలా పుట్టారు మరి అర్థమే కావడం లేదు. అసలు మీరు మనుషులేనా ? మీకు దేశభక్తి లేదా ?

     ఆ బియ్యం గాడు ఉంటే ఎంత పోతే ఎంత  ?

     బోడి బియ్యం కార్డు వస్తే పిండి గాడు వస్తాడు రొట్టెగాడు వస్తాడు అన్నం కూడా వస్తాడు .

     అయ్యో చచ్చినంత మాత్రాన అమాస ఆగుతుంది రా   అడ్డ గాడిద. ప్రతి ఒక్కదానికి ఒక సమయము సందర్భం అనేది ఉంటుంది మీకు సమయం సందర్భాలు ఏమీ తెలియవు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలని తెలియదు అందుకే అంత మట్టి కొట్టుకుని పోయారు 

     అయినా ఇంకా మీకు తెలివి రాలే. ఏం బతుకు రా బోడి బతుకులు. మీ వంటి వారంతా ఈ భూమికి భారంగా ఉన్నారు. మీ వంటి వారు పోతే సగం భారం తగ్గుతుంది ఈ భూమాతకు.

  5. 2029 లో జగనన్న సీఎం. అవ్వాలి అని కోరుకుంటున్నాను కానీ జగనన్న కోసం పని చేసిన నాయకులు నీ కార్య కర్తలు ను మరిచి  వెన్నుపోటు పొడిచిన దొంగనాయల్లను నమ్మి వారి కి మంచి పదవులు ఇచ్చి నెత్తిమీద పెట్టుకొన్నారు కానీ వాళ్లే 2024 లో వెన్నుపోటు పొడిచారు. వాళ్లు కి ఒక్కక్కరి కి 3.4.  పదవులు ఇచ్చి నెత్తిమీద పెట్టుకొన్నారు.  అటువంటి దొంగలు నీ ఇంకా నమ్ముతున్నారు… 

  6. ఇది రాష్ట్రo లో అన్ని ప్రాంతాల్లో జిల్లాలో ఉన్నారు మా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. కలుపు మొక్కలను వేరేది  మంచి వాళ్ళను నమ్మండి.

    మీకు అంతా మంచి జరుగుతుంది అని కోరుకుంటున్నాను.. తర్వాత మీ ఇష్టం జగనన్న. జై జగనన్న జై.

Comments are closed.