చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని వాపోయిన టీడీపీ ఎమ్మెల్యే

కూట‌మి అధికారంలోకి రావ‌డ‌మే ఆల‌స్య‌మే, చాలా వేగంగా కొంత మంది ఎమ్మెల్యేల‌కు చెడ్డ‌పేరు వ‌చ్చింది. ముఖ్యంగా ఇసుక‌, మ‌ద్యం, భూముల వ్య‌వ‌హారాల్లో టీడీపీ, జ‌న‌సేన ఎమ్మెల్యేలు చెడ్డ‌పేరు మూట‌క‌ట్టుకుంటున్నారు. త‌క్కువ స‌మ‌యంలోనే, ఎక్కువ అప్ర‌దిష్ట‌పాలైన…

కూట‌మి అధికారంలోకి రావ‌డ‌మే ఆల‌స్య‌మే, చాలా వేగంగా కొంత మంది ఎమ్మెల్యేల‌కు చెడ్డ‌పేరు వ‌చ్చింది. ముఖ్యంగా ఇసుక‌, మ‌ద్యం, భూముల వ్య‌వ‌హారాల్లో టీడీపీ, జ‌న‌సేన ఎమ్మెల్యేలు చెడ్డ‌పేరు మూట‌క‌ట్టుకుంటున్నారు. త‌క్కువ స‌మ‌యంలోనే, ఎక్కువ అప్ర‌దిష్ట‌పాలైన వారిలో తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి ప్ర‌థ‌ముడు. గ‌తంలో శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యేపై దోపిడీ ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇప్పుడు బొజ్జ‌ల సుధీర్‌రెడ్డికి వ‌చ్చిన చెడ్డు పేరు ఏ రేంజ్‌లో వుందంటే… వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డే మేలు అని జ‌నం అనుకుంటున్నారు. దీన్నిబ‌ట్టి బొజ్జ‌ల సుధీర్ సంపాదించిన ఆస్తులేంటో అర్థం చేసుకోవ‌చ్చు. త‌న‌కు విప‌రీత‌మైన చెడ్డ‌పేరు వ‌చ్చింద‌ని ఎట్ట‌కేల‌కు బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి గుర్తించ‌డం గ‌మ‌నార్హం. అయితే తాను అమాయ‌కుడిని అని, ఇత‌రుల వ‌ల్ల చెడ్డ పేరు వ‌స్తోంద‌ని చెప్ప‌డ‌మే విచిత్రంగా వుంది.

తిరుప‌తిలో సోమ‌వారం రాత్రి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ నేతృత్వంలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కూట‌మి నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించారు. శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో మంత్రి బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ చేయ‌ని త‌ప్పుల‌కు త‌న‌కు చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని వాపోయారు. అస‌లు ఎమ్మెల్యే ఎందుక‌య్యామా? అని బాధేస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఇసుక ఎక్కువ‌గా ఉండటంతో ఎవరు పడితే వారు తవ్వకాలకు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న‌ట్టు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. వాళ్లంతా తన పేరు చెప్పి చెడ్డపేరు తెస్తున్నారని మంత్రి ఎదుట వాపోయారు. ఏం చేసినా ఎవ‌రూ ప్ర‌శ్నించే వాళ్లుండ‌ర‌నే ఎమ్మెల్యే బొజ్జ‌ల‌, ఆయ‌న అనుచ‌రులు చెల‌రేగిపోతున్నార‌నే చ‌ర్చ శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో వుంది. అయితే విప‌రీత‌మైన చెడ్డ‌పేరు రావ‌డంతో రాజ‌కీయంగా తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌ని బొజ్జ‌ల సుధీర్ గ్ర‌హించారు. కానీ చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా బొజ్జ‌ల వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు. నిజాయితీగా బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి వ్య‌వ‌హ‌రించాల‌ని అనుకుంటే, ఇసుక‌, ఇత‌ర‌త్రా దోపిడీని అరిక‌ట్ట‌డం పెద్ద ప‌నేమి కాదు. మంచి పేరు సంపాదించుకోవాలంటే ఆదాయాన్ని వ‌దులుకోవాల్సి వుంటుంది. అలా కాదు, డ‌బ్బు సంపాద‌నే కావాలంటే, మంచీ, చెడు గురించి ఆలోచించ‌డం మానేయాలి. అవ్వా, బువ్వా కావాలంటే కుద‌ర‌ద‌ని జ‌నం అంటున్నారు. ఇక నిర్ణ‌యం బొజ్జ‌ల సుధీర్‌దే.

6 Replies to “చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని వాపోయిన టీడీపీ ఎమ్మెల్యే”

Comments are closed.