టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని తప్పక అభినందించాలి. దర్శన రాజకీయాలు, హిందుత్వం పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడతారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆటల్ని తిరుమలలో వెంకయ్య చౌదరి సాగనివ్వలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ క్రిస్టియానిటీని సాకుగా చూపుతూ నిత్యం రాజకీయాలు చేస్తూ, పబ్బం గడుపుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
అంతెందుకు తిరుమలకు జగన్ వెళ్తున్నాడని తెలుసుకుని, డిక్లరేషన్‌పై మత రాజకీయం చేయడానికి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ చాలా ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేయడానికి హిందూ మతం ఉద్ధరించడానికి అని చెప్పినప్పటికీ, వేర్వేరు కారణాలున్నాయని స్వామీజీకి దగ్గరగా ఉన్న వాళ్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య చౌదరిపై ఉన్నట్టుంది స్వామీజీపై అకస్మాత్తుగా కోపం రావడం చర్చనీయాంశమైంది.
ముందుగా స్వామీజీ ఆరోపణలు ఏంటో తెలుసుకుందాం. ఈ నెల 26న తిరుపతిలో నిర్వహించిన జాతీయ సమ్మేళనానికి ఏడు రాష్ట్రాల నుంచి 300 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు వచ్చినట్టు స్వామీజీ తెలిపారు. వీళ్లందరికీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని సంప్రదించగా, రెండున్నర గంటల పాటు వెయిట్ చేయించారని ఆరోపించారు. అంతేకాదు, తమను హేళనగా వెంకయ్య చౌదరి మాట్లాడారని ఆయన వాపోయారు. సనాతన ధర్మం, సేవా దృక్పధంపై అవగాహన లేదని వెంకయ్య చౌదరిపై ఆయన మండిపడ్డారు. వెంకయ్య చౌదరిని తప్పించకపోతే, తిరుపతిలో దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
స్వామీజీ ఆరోపణలపై టీటీడీ సీరియస్‌గా స్పందించింది. స్వామీజీ 50 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం, అలాగే 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి సౌకర్యం కల్పించాలని అడిగినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. వసతి కల్పించడానికి అంగీకరించామని, అయితే 600 మందికి కోరిన రీతిలో దర్శనం కల్పించడం కుదరదని, ఆ సంఖ్యను తగ్గించాలని వెంకయ్య చౌదరి కోరడంతో వివాదాన్ని క్రియేట్ చేసినట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
స్వామీజీల పేరుతో తిరుమలలో దర్శన రాజకీయాలు చేసేవారికి ఆట కట్టించాలంటే కఠినంగా వుండక తప్పదు. ఈ విషయంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది. ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ దైవ సంబంధ విషయాల కంటే నిత్యం రాజకీయ అంశాలే మాట్లాడుతుంటారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై మతాన్ని ముడిపెట్టి ఆరోపణలు చేస్తూ, కూటమి నేతల అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి.
ఇప్పుడు తాము తెచ్చకున్న ప్రభుత్వంలో కోరినన్ని దర్శనాలు ఇవ్వకపోవడం ఏంటనేది ఆయన ప్రశ్న. స్వాములం కాబట్టి, వెంకయ్య చౌదరిని బదిలీ చేయించాలని అనుకుంటే చేయిస్తామనే బెదిరింపులకు దిగారు. తద్వారా తామంటే టీటీడీలో ప్రతి ఒక్కరూ భయపడి, ఏది కోరితే అది చేస్తారనే ఆలోచనతోనే స్వామీజీ రాజకీయ నాయకులకు మించిపోయి దర్శన రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకు స్వామీజీ తప్ప, పచ్చి రాజకీయాలు చేసే స్వామీజీకి మొదట్లోనే షాక్ ఇచ్చిన వెంకయ్య చౌదరికి ప్రశంసలు రావడం విశేషం.
Call boy works 9989793850
If you give your ad again you will be arrested. I have lodged police complaints about your ads.
vc estanu 9380537747
సనాతన ధర్మం ను కాపాడండి. స్వామిజీ మాట వినండి.
Yevadu ee venkayya chowdary. TDP got power cuz of Janasena and BJP and Sadhus who opposed Jagan Christianity.
స్వామిజి మీద ఇంత కోపం ఎందుకా అనుకున్న
biragulu sannasulu…matam musugulo…chillara chesthalu…peru chivara saraswathi….chillara veshalu…
antaa edavale