లోకేశ్ గుడ్ వ‌ర్క్‌!

ఐటీ, మాన‌వ వ‌న‌రుల‌శాఖ మంత్రి నారా లోకేశ్ గుడ్ వ‌ర్క్ చేస్తున్నార‌నే భావ‌న క‌లిగించేలా న‌డుచుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు, విదేశీ పెట్టుబ‌డుదారుల‌ను ఆక‌ర్షించే ప‌నిలో బిజీగా…

ఐటీ, మాన‌వ వ‌న‌రుల‌శాఖ మంత్రి నారా లోకేశ్ గుడ్ వ‌ర్క్ చేస్తున్నార‌నే భావ‌న క‌లిగించేలా న‌డుచుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు, విదేశీ పెట్టుబ‌డుదారుల‌ను ఆక‌ర్షించే ప‌నిలో బిజీగా ఉన్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదేళ్ల‌తో ఆయ‌న భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల కోసం ప‌లు అంశాల్ని స‌త్య నాదేళ్ల ముందు లోకేశ్ ప్ర‌తిపాద‌న‌లు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఏపీలో డిజిట‌ల్ గ‌వ‌ర్నెన్స్‌కు సాంకేతిక స‌హ‌కారం, ఐటీ-స్కిల్స్, అలాగే అమ‌రావ‌తిని ఏఐ క్యాపిట‌ల్‌గా తీర్చిదిద్దేందుకు స‌హ‌క‌రించాల‌ని స‌త్య నాదేళ్ల‌ను లోకేశ్ కోర‌డం విశేషం. అంతేకాదు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రావాల‌ని స‌త్య నాదేళ్ల‌ను ఆయ‌న ఆహ్వానించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ప్ర‌పంచం ఏ దిశ‌గా ప‌య‌నిస్తోంద‌ని, అవ‌కాశాలు ఏ రంగాల్లో ఎక్కువ‌గా ఉన్నాయో ప‌సిగ‌ట్టి, అందుకు సంబంధించిన పారిశ్రామిక‌వేత్త‌ల ప్ర‌ముఖ‌ల‌ను లోకేశ్ క‌లుస్తున్నారు.

త‌మ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఎలాంటి అవ‌కాశాలున్నాయో వివ‌రిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఏపీలో ఎలాంటి సానుకూల‌త వాతావ‌ర‌ణం ఉందో లోకేశ్ విదేశాల‌కు వెళ్లి మ‌రీ వివ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే అనంత‌పురం జిల్లాలో ఎల‌క్ట్రానిక్ వెహిక‌ల్స్ (ఈవీ) ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు అనువైన వాతావ‌ర‌ణం ఉంద‌ని, పెట్టుబ‌డులు పెట్టాల‌ని ప్ర‌ముఖ సంస్థ టెస్లాను ఆయ‌న ఆహ్వానించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కీల‌క నాయ‌కుడిగా లోకేశ్ ఉన్నారు. ఐటీ మంత్రిగా విదేశాల్లో ప‌ర్య‌టిస్తూ, ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆహ్వానించ‌డం లాంటి ప‌రిణామాలు ఫీల్ గుడ్‌ను క్రియేట్ చేసే అవ‌కాశాలున్నాయి. ప్ర‌ధానంగా త‌మ ప్ర‌భుత్వంపై అలాంటి అభిప్రాయాన్ని క‌లిగించేందుకే కూట‌మి నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో కొంత మేర‌కు వాళ్లు స‌క్సెస్ అయ్యార‌ని భావించొచ్చు. ఏది ఏమైనా ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తే, అంత‌కంటే కావాల్సింది ఏముంటుంది?

36 Replies to “లోకేశ్ గుడ్ వ‌ర్క్‌!”

    1. Endole.. maa anniya ki anni kastalee.. Intlo mariyu Bayata gudduloodadisi Den**tunnaru. Debba meda debba..Asalu anniya ee avamanalanni ela baristunnadoo.. Seema **dda. (Bidda bhayya).

  1. అసలు ఇప్పుడె అబిరుద్ది కొరె ప్రభుతం అనెది ఒకటి ఉంది అనిపిస్తుంది.

    గడచిన 5 ఎళ్ళు ఎదొ జగన్ సొంత జారీరులా, ఎవరు వ్యాపారాలు చెయలి అన్నా జగన్ దయా దాక్షణ్యాలు ఉండాలి అన్న్ విదం గా నడచింది.

  2. సత్య నాదెళ్ల దాకా వెళ్లగలిగాడంటే గొప్ప విషయమే. ఏపీ లో కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వస్తే, ఇక తిరుగే ఉండదు.

    1. 10 మందిని కలిస్తే ఒకరైనా వస్తారు. గతంలో లా గుడ్లు పెట్టాలి. పొదగాలి అని మీడియా ముందు స్టేట్మెంట్ లు ఇస్తే రావు.

  3. ఊరురికీ జెగ్గులు తెచ్చిన చేపల మార్కెట్, రొయ్యల మార్కెట్గు, గుడ్లు పొదిగే పరిశ్రమ కంటే లోకేష్ efforts విదంగా బెటర్ అంటావ్??

  4. అ సైకొ లుచ్చా నా..కొడు..కు ఇలా ఎ ఒక్క రొజు ఐనా ఇలా పారిస్రామిక వెత్తలను కలిసాడా

    అందరు వాడినె కలవాలనె ఫూడల్ మన్శ్తత్వం

  5. అ సై..కొ లు..చ్చా నా..కొడు..కు ఇలా ఎ ఒక్క రొజు ఐనా ఇలా పారిస్రామిక వెత్తలను కలిసాడా

    అందరు వాడినె కలవాలనె ఫూడల్ మన్శ్తత్వం

  6. ఏమయ్యా లొకేష, కస్టపడి నువ్వు తెచ్చే IT పరిశ్రమలు కూడు పెడతాయా??

    మావోడు పులివెందులకి కూడా చేపలు & రొయ్యలు మార్కెట్స్ తెచ్చి 10 లక్షల కోట్లు అప్పు అందరికీ పంచేసి, ప్రతీ ఒక్కరిని కోటేశ్వరుణ్ణి చేసేసాడు కదా??

    ఇంకా జాబులు ఎవడు చేత్తాడు??

  7. దావోస్ లో చలి ఎక్కువని ఇక్కడే గుడ్లు పొదిగిన గుడి||అమర్ కన్నా చాలా బెటర్, కనీసం ఒక్కటైనా వర్కవుట్ అయితే కనీసం కొంత మందికైన జాబ్ దొరుకుతుంది కదా…

  8. అడిగిన వెంటనే ఎవరు పెట్టుబడులు పెట్టరు కానీ పదిమందితో టచ్ లో ఉంటే తప్పక పరిశ్రమలు వస్తాయి కృషి ఎప్పటికి వృధాకాదు లోకేష్ గారు బాగా కష్టపడుతున్నారు ఒక్కటి తెచ్చిన రాష్ట్రానికి మేలే

Comments are closed.