దయలేని నాయకులు- దిక్కులేని ప్రజలు

రాజకీయ ప్రతీకారాలు మంచివి కావు. ఇదొక ఫ్యాక్షనిజం లాంటిది. తరతరాలుగా సాగుతూ పోతే ప్రజాపాలన మరిచిపోయి ఈ దిక్కుమాలిన రివెంజ్ డ్రామాలే మిగులుతాయి

గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అరాచకత్వాన్ని తలపిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవేం పోకడలు అనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు మారే కొద్దీ పరిస్థితులు మెరుగు పడకపోగా మరింత దారుణంగా మారుతున్నాయి.

తెలంగాణ అని కాదు ఆంధ్ర అని కాదు..ఏ పార్టీ ప్రభుత్వమూ దీనికి అతీతం కాదు.

తాజాగా అందరూ నోరెళ్లబెట్టుకుని చూసింది పొన్నం ప్రభాకర్ స్టేట్‌మెంటుని.

“ఒకరిద్దరు కలిసి మద్యం తాగితే ఓకే.. ఎక్కువ మంది కలిసి తాగేటట్లు అయితే ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలి. రాజ్ పాకాల ఇంట్లో మద్యం తాగడానికి అనుమతి తీసుకోలేదు. అందుకే కేసులు పెట్టారు” అని చెప్పాడాయన.

ఇదేం చోద్యం అన్నట్టుగా లేదు? అంటే ప్రైవేటుగా ఇంట్లో కూర్చుని నలుగురు మందు పార్టీ పెట్టుకున్నా ఎక్సైజ్ అనుమతి తీసుకోవాలా? అది సాధ్యమయ్యే పనేనా? అసలీ చట్టం ఉందా? ఉంటే ఉన్నట్టు ఎవరికైనా తెలుసా? ఒకవేళ ఉన్నట్టైతే ఇన్నాళ్లూ ఎవరిమీదా దానిని ఎందుకు అప్లై చేయలేదు? అంటే చట్టాలు కూడా ఎంచుకున్నవారి మీదే ప్రయోగిస్తామని చెప్పకనే చెబుతున్నట్టు ఉంది. ఇదే అప్రజాస్వామికమంటే.

“రైడ్ లో పట్టుబడ్డ ఫలానా వారి భార్య” అంటే ఆ కుటుంబానికి ఎంతటి అప్రతిష్ట? టార్గెట్ చేసినవాళ్ల లక్ష్యం అదేనేమో? ఇది ఫలానా వారికి మాత్రమే జరిగిందని కొట్టిపారేయలేం.

మనం 20 మందిని ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి పిలిచి పార్టీ పెట్టుకుంటే, అందులో ఒక వ్యక్తి మనకి తెలియకుండా ఏ డ్రగ్ పొట్లమో తెచ్చుకుంటే పరిస్థితి ఏంటి? ఎవరికీ తెలియదు కాబట్టి పర్వాలేదు. ఒకవేళ టార్గెట్ చేసి రైడ్ లో దొరికితే మనం రేవ్ పార్టీ నిర్వహించేసినట్టేనా?

ఇదంతా చూస్తుంటే రివెంజ్ పాలిటిక్స్ తప్ప మరొకటి కనిపించట్లేదు.

అప్పట్లో కూతురు పెళ్లి టైం అని కూడా చూడకుండా రేవంత్ రెడ్డిని రాజకీయకోణంలో అరెస్ట్ చేయించినందుకు ఇప్పుడు తీర్చుకుంటున్న ప్రతీకారమా ఇది? దీంతో ఆపుతారా? లేకా ఏ కేసీయార్ నో, కేటీఆర్ నో ఏదో ఒక లెక్కలో అరెస్ట్ కూడా చేస్తారా అనే అనుమానాలు వస్తున్నాయి.

అన్నట్టు ప్రస్తుతం హైదరాబాద్ ఉద్రిక్తంగా ఉంది. ఒక వర్గం పోలీసులు తిరుగుబాటు చేస్తున్నారు. మరో వర్గం పొలీసులే వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ వింత పోకడ హైదరాబాదులో ఉందిప్పుడు.

ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేసిన 21 మంది కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసారు.

హైదరాబాద్ సిటీలో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉన్నపటికీ కానిస్టేబుళ్లు ఆందోళన చేశారని, దోమలగూడ పోలీస్ స్టేషన్లో 2 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

బీఎన్ఎస్ 223, 126(2) సెక్షన్లతో పాటు పోలీస్ ఫోర్సెస్ యాక్ట్ సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేయడం జరిగింది.

క్రిమినల్ కేసులతో పాటు కానిస్టేబుల్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

ఆర్టికల్ 311 (2బి) నిబంధనలు ఉల్లంగించి, నిబంధనలను అతిక్రమించి ప్రవర్తిస్తే తెలంగాణ పోలీస్ శాఖ ఉపేక్షించదని, ఆందోళనకు పాల్పడుతున్న వారిపై శాఖ పరమైన చర్యలు ఉంటాయని తెలిపారు అడిషనల్ డీ.జీ సంజయ్ కుమార్ జైన్.

అసలేవిటి ఈ గొడవంతా? ఎప్పుడూ లేనిది పోలీసులు రోడ్డెక్కి నిరసనలేవిటి? ఆ ప్రశ్నలు జనం బుర్రల్లో మెదిలే లోపు ఏదో ఒక డైవెర్షన్ చేసేస్తారా? అంటే ప్రస్తుతం ఉన్న బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అనబడే ఒకప్పటి 144 సెక్షన్ ఎవరో పెద్ద తలకాయని అరెస్ట్ చేయడానికా? ఆ అరెస్టుతో మీడియా దృష్టిని, జనం దృష్టిని అటు తిప్పి పోలీసుల అరుపులు వినపడకుండా చేస్తారా? ఏమో చూడాలి.

దీపావళి ముందు పెద్ద ధమాకా ఉండబోతోంది అంటూ.. తెలంగాణా నాయకుడొకాయన చెప్పడం వెనుక ఆంతర్యం ఇదేనా? ఇదంతా కక్ష సాధింపు ప్లస్ డైవర్షన్ .. రెండూ ఒకేసారి జరగడానికి చేపడుతున్న “ఒక దెబ్బకి రెండు పిట్టలు” కాన్సెప్టా? ఏమో చూడాలి.

పోలీసు వర్గాల్లో అశాంతి అలా ఉంటే, సామాన్యులకి హైడ్రా పేరుతో జ్వరం తెప్పిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఒక కుటుంబం తిరుమలకి వెళ్లి వచ్చే లోపు తాళం వేసున్న ఇంటిని కూల్చేసారన్న వార్త గుబులు పుట్టిస్తోంది జనానికి. ఇలాంటివి ఎన్నో. అక్రమ కట్టడం అవునో కాదో కోర్టు చెప్పాలి, ఒకవేళ చెప్పినా తగిన సమయం ఇవ్వాలి, ఇవ్వకపోయినా ఇంట్లో సామాన్లు తీసుకువెళ్ళే వరకు అయినా ఆగాలి కదా. ఉన్నపళంగా కూల్చడం కచ్చితంగా అరాచకమే.

ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులు, పోలీసులు, సామాన్యులు అందరూ ఏదో ఒక రకంగా ప్రభుత్వం వల్ల బాధ పడుతున్నవారున్నారు. ఏవిటిది అని అడుగుదామంటే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసు. కేసులు పెట్టొచ్చు, లేదా అడిగిన వాళ్ల ఆస్తులెక్కడున్నాయో గుర్తించి వాటిని ఇబ్బందుల్లోకి నెట్టొచ్చు. అంతా ఫక్తు గూండాగిరీయే.

అప్పట్లో తెరాసా ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఆ పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం తప్పే.

తీన్ మార్ మల్లన్నని నెలల తరబడి జైల్లో మగ్గేలా చేయడమూ తప్పే.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నవీ తప్పులే.

భారాసా టైములో కేసీయార్ అంటే మీడియా మొత్తం భయపడేది. చెయ్యెత్తి రాసేవాడు, నోరెత్తి మాట్లాడేవాడు లేకుండా అయ్యింది. అదీ అప్రజాస్వామికమే. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో జరుగున్నదీ అంతే.

ఇది ఇలాగే కొనసాగితే ప్రజల్లోంచి కూడా తిరుగుబాటు రావొచ్చు. అన్ని వర్గాలూ ఏకమయ్యి మరో బంగ్లాదేశ్ ని తలపింపచేసే ప్రమాదముంది.

మరి ఈ సమస్యకి పరిష్కారమేమిటి? ఉన్న నాయకులకి బుద్ధన్నా మారాలి. లేదా ఎవరో గొప్ప నాయకుడు కలగజేసుకుని కథ మార్చాలి. అంతవరకూ చెరలో ఉన్న జీవుల్లాగ ప్రజానీకం బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిందే.

తెలంగాణా పరిస్థితి అదైతే ఆంధ్రా కూడా ఏమాత్రం తీసిపోదు. అక్కడ ప్రస్తుత ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డిపై తిరుగుబాటు తీర్చుకుంటూ తమ పాలనలో తప్పులు జనానికి కనపడకుండా డైవర్ట్ చేయాలి. ఆ పద్ధతిలో సాగిపోతోంది కూటమి ప్రభుత్వం.

విజయవాడ వరద బాధితులకి సాయం ప్రకటించిన చంద్రబాబు ఏమీ ఇవ్వకుండా మొండిచేయి చూపడంతో ఆ ప్రాంత ప్రజలు రోడ్డెక్కి నిసరసనలు చేసారు. ఆ గొడవని డైవర్ట్ చేయడానికి తిరుమల లడ్డూ ఇష్యూని పెద్దది చేసారు. మీడియా మొత్తం అదే కూయడంతో, జనం సెంటిమెంట్ కూడా డిస్టర్బ్ అవ్వడంతో అందరూ దాని మీదే దృష్టిపెట్టారు. వరద బాధితుల గోడు గోడెక్కింది.

అన్నట్టు దానికి ముందు చంద్రబాబు పదవిలోకి వచ్చి ఇన్నాళ్లైనా పథకాలు ఇవ్వట్లేదు.. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తలొక 15000 ఇస్తానన్నాడు కదా అనే సౌండ్ మొదలవ్వగానే.. అంతకంటే పెద్ద సౌండులో కాదంబరి జత్వానీ కేసుని లాక్కొచ్చి టీవీల్లో రోజుల తరబడి నడిపారు. ఆ గోలలో పథకాల గోల వినిపించకుండా పోయింది.

ఇక ఇప్పుడు రోడ్ల మీద మద్యం బాటిళ్లు కూరగాయలమ్మినట్టు అమ్ముతున్నారు ఆంధ్రాలో. ఇదేంటని ప్రశ్నించడానికి వీల్లేకుండా, ప్రశ్నించినా వింపించకుండా షర్మిల అన్నగారిపై చేస్తున్న యుద్ధాన్ని హైలైట్ చేస్తూ కూర్చున్నారు తెదేపా నాయకులు. షర్మిలని లైట్ తీసుకోండి అని జగన్ తన వైకాపా పార్టీ వారికి చెప్పినా, తెదేపా నాయకులు మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. అందుకే యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర కూడా అదే టాపిక్ మీద ప్రెస్ మీట్లు పెట్టి వైకాపా శ్రేణుల్ని రెచ్చగొట్టే పని పెట్టుకున్నారు. అవును మరి.. ఇప్పటికిప్పుడు షర్మిల టాపిక్ సైడైపోతే, తమ పాలనలో తప్పులు కనపడకుండా అడ్డం పెట్టుకోవడానికి కొత్తగా మరొక టాపిక్ వెతుక్కోవాలి కదా! అందాకా షర్మిల సీరియల్నే ఆడిస్తారు మరి.

ఇదిలా ఉంటే “ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ వాడిని మా ముందే కూర్చోబెట్టి మాట్లాడతావా”, అని ఒక వర్గం వాళ్లు ఒక పోలీసుని నిలదీస్తే ఆ పోలీసు బెదిరి ఆ కూర్చున్న వ్యక్తిని లేపి నిలబెట్టాడు.

మరొక సంఘటనలో ఒక ప్రజాప్రతినిధి పాల డైరీలోకొచ్చి ఫోన్లో రుబాబు చేస్తుంటే పక్కనున్న పోలీసులు ముసిముసి నవ్వులు నవ్వుతూ చేష్టలుడిగి చూస్తున్నారు.

మరొక చోట రోడ్డు మీద రెండు వర్గాల వాళ్లు కొట్టుకుంటుంటే మధ్యలో పోలీసులు ఉండి కూడా వాళ్లని ఆపట్లేదు.

మరొక చోట గొడవలో రెండు వర్గాల వాళ్లు కొట్టుకుంటూ మధ్యలో పోలీసొస్తే అతన్ని పక్కకి తోసి మరీ కొట్టుకున్నారు. ఆ పోలీసు టోపీ సర్దుకుని దూరంగా నిలబడ్డాడు.

ఇదీ పరిస్థితి. ఈ విషయంలో చంద్రబాబుని కూడా పూర్తిగా నిందించలేం. పరిస్థితి అదుపు దాటి అనార్కీ దిశగా వెళ్తోంది. ఎవరు ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు.

రాజకీయ ప్రతీకారాలు మంచివి కావు. ఇదొక ఫ్యాక్షనిజం లాంటిది. తరతరాలుగా సాగుతూ పోతే ప్రజాపాలన మరిచిపోయి ఈ దిక్కుమాలిన రివెంజ్ డ్రామాలే మిగులుతాయి చరిత్రలో. నాయకులు కూడా చరిత్రహీనులుగా మిగులుతారు తప్ప హీరోలైపోరు. ఎందుకంటే నాయకుల్ని హీరోలుగా చేసేది జనమే. ప్రజలకి నచ్చినట్టుండాలి తప్ప తమకి నచ్చినట్టు చేసుకుపోతామంటే కుదరదు. ఎన్ని బాధలు పడినా ఎన్నికలొచ్చేదాకానే కదా!

ఇలాంటి అరాచకాలు జరుగుతున్నప్పుడే దశాబ్దాల క్రితం నక్సలిజం పుట్టింది. చాలా ఏళ్లుగా లేదు. కారణం మెజారిటీ ప్రజలు విసిగిపోయేంత పరిస్థితి రాలేదు. గొడవలన్నీ రాజకీయ పార్టీల మధ్యనే ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి గీత దాటి ప్రజల మీద పడుతోంది. ఇక్కడ వర్గాలతో, కులాలతో, పార్టీ అనుబంధాలతో సంబంధం లేదు. అన్ని రకాల ప్రజల్లోనూ ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నవాళ్లు పెరుగుతున్నారు. కనుక మళ్లీ మరో రూపంలో నక్సలిజం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో! ఆ పరిస్థితి రాకూడదని కోరుకుందాం. ఎందుకంటే అది సమాజానికి, ప్రజాస్వామ్యానికి, శాంతిభద్రతలకి, అభివృద్ధికి దేనికీ మంచిది కాదు.

ఈ దీపావళి “తమసోమా జ్యోతిర్గమయ” అంటూ, ప్రతీకారమనే చీకట్ల నుంచి ప్రజాపాలన అనే కాంతివైపుకి నాయకుల్ని, వ్యవస్థల్ని నడిపించాలని కోరుకుందాం.

– శ్రీనివాసమూర్తి

42 Replies to “దయలేని నాయకులు- దిక్కులేని ప్రజలు”

  1. రెండు తెలుగు రాష్ట్రంలను ఐదేళ్ళు పరిపాలించి బురదగుంటను చేసి పోయారు గతపాలకులు……… అదే బురదలొ వీళ్ళు పడి గిలాగిలా కొట్టుకొంటున్నారు.

    ఈ సైట్ లో నీతులు చెప్పేవాల్లంతా గత నాలుగు నెలలనుండి పుట్టుకొచ్చారు…….అంతకుముందు అన్ని మూసుకొని కూర్చున్నారు…

  2. జగన్ రెడ్డి హయాం లో మద్యపాన నిషేధం చేసేసినట్టు “శ్రీనివాసమూర్తి” భ్రమలో పరిభ్రమిస్తున్నారేమో..

    జగన్ రెడ్డి 2019 మే లో అధికారం లోకి వస్తే.. 2020 జనవరి లో అమ్మ ఒడి మొదటి విడత రిలీజ్ చేశారు..

    అప్పుడు లేవని నోర్లు.. ఇప్పుడు నోటి విరోచనాలు చేసుకొంటున్నారు..

    అప్పట్లో భారతక్క కూడా ప్రతి బిడ్డకి 15000 అని చెప్పి జగన్ రెడ్డి బావ ని గెలిపించుకుంది.. గెలిచాక ఆ హామీకి తిలోదకాలిచ్చేశారు..

    అప్పుడు లేవని నోర్లు.. ఇప్పుడు భూతుల నీతులు వినిపిస్తున్నారు..

  3. కాదంBari jatgwani ధి. ఎంత అన్యాయం ఎక్కడో ముంబాయిలో ఉన్న అమ్మాయి నీ ఆంధ్ర లో భూ కబ్జా. కేసు లు పెట్టి anayaynag arrest చేసారు. అది కొత్త ప్రభుత్వం పట్టుకుంటే అది తప్పే అంటున్నావ్. శభాష్ . అన్నయ్య చెల్లి ఆస్తుల కోసం కొట్టుకుంటే అది డైవర్షన్ సెరీ గుడ్ . చీకట్లో 322 G O lu ఇచ్చాడు జగన్ next కూటమి అవి కూడా బయటకు తీస్తుంది .

  4. జిత్వాని అంత ముబాయి లో ఉంటుంది ఆమె ఆంధ్ర లో భూ కబ్జా చసిద్దు అని కేసు పెట్టారు very nice naanna . అది next వచ్చు a na ప్రభుత్వం బయటకు తీస్తే డైవర్షన్ అంటున్నావ్ వే రి నఐస్ నాన్న

  5. ఎక్కడో. జి త్. వా. నీ. అనే అమ్మాయి. ఆంధ్ర. లో భూ. క. భా. జ. చేసింది. అంట. ఆంధ్ర లో ఇలాంటి. కె. సు. లు. పెట్టారు. అవి ఇప్పుడు బయటకు తీయ కొడదు అంతే గా మీరు చెప్పేది

  6. ఆమె పేరు చెప్తేనే నా కామెంట్. Bl. O. Ck. చేస్తున్నాడు అంటేనే అర్థం అవుతుంది మీ bh yam. Ika 322 G O ల చీకట్లో పెట్టారు అడగా కూడదు అలాంటివి . అడిగితే తప్పు వస్తుంది .

  7. మన దయ లెని రెడ్డి ఉన్నని రొజులూ ఇలా ఎప్పుడన్నా రాశావా రా?

    ఒక Dr. సుధాకర్,

    రంగనాయకమ్మా

    RRR మీద 3rd డిగ్రీ

    పైల్స్ తొ ఉన్న అచ్చెన అర్రెస్త్

    లక్ష ఫర్నీచర్ కొసం కొడెల శివ ప్రసాద్ మీద వెదింపులు

    అనెక మంది ప్రతిపక్ష నాయకుల పై అక్రమ కెసులు అర్రెస్ట్లు

    రాజదాని రైతుల పై 3 వెల కెసులు

    ఇవన్ని ఎ సై.-.కొ గాడు చెసాడు రా!

  8. రెండు తెలుగు రాష్ట్రాల లో ఇంతకుముందు చెత్త పాలన మళ్ళీ ఎవరూ కోరుకోవట్లేదు మూర్తి గారు

  9. మన బాబు అనే దరిద్రం పోయాలి

    అమరావతి ముసుగులో 2,00,000 కోట్ల దోపిడీ.( 2 లక్ష కోట్ల)

    మన బాబు ఎన్టీఆర్ Seva ట్రస్ట్ క్రిందా కామ పిల్లల కి దోచిపెట్టినది: 2600 కోట్లు

    మన బాబు కాంట్రాక్టర్స్ కి దోచిపెట్టినది: 75,000 కోట్లు

    మన బాబు ఫీజ్ రేయింబర్సుమెంట్ కింద కామ పిల్లల కి దోచిపెట్టినది: 3,500 కోట్లు

    అన్న కాటెన్ ద్వారా k-బ్యాచ్ కాంట్రాట్స్ కి దోచిపెట్టినది: 580 కోట్లు

    పోలవరం ద్వారా. డ్రామోజీ దోచిపెట్టినది: 15,000 కోట్లు

    మురళీమోహన్ రియల్ భేర ద్వారా దోచిపెట్టినది: 40,500 కోట్లు

  10. నాయనా మూర్తి, సోషల్ మీడియా లో ఎదో కామెంట్ పెట్టిందని ముసలావిడను కూడా అరెస్ట్ చేసారు, ఊళ్ళో నుండి తరిమేస్తే ఎక్కడో హైదెరాబాద్లో ఉంటోంది. అప్పుడు ఏమైనాయి నీ సూక్తులు?

  11. డ్రగ్స్ తీసుకుని మత్తులో బట్టలు విప్పి డాన్సు లు , విదేశీ మద్యం , లౌడ్ స్పీకర్లు పెట్టి రేవ్ పార్టీ చేసుకుంటే వొదిలేయాల ? ఇదేనా డ్రామా రావు గాడు , ముక్కోడు , లిక్కర్ రాణి కవిత తెచ్చిన బంగారు తెలంగాణ ??

  12. రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ వెరీ క్లియర్. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో hyd లో ఒక్క సీటు కూడా రాలేదు. మొత్తం ఓట్లు సీట్లు బయటే వచ్చాయి, అందుకే hyd ప్రజల మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు. మూసీ ప్రక్షాళన అనేది ఒక నాన్సెన్స్. కేవలం వేల కోట్ల రూపాయలు పార్టీ హై కమాండ్ కి పంపే కుట్ర ఇది. రేపు జమిలి ఎన్నికలు వచ్చినా డబ్బులు కావాలి. అందుకే ఇది.

    హైదరాబాద్ రియల్ పూర్తిగా నాశనం అయిపోయినా అతనికి సంబంధం లేదు రేపు ఎలాగూ గెలవరు. అందుకే ఇంత విద్వంసం.

  13. Abbo revenge politics jarugutunnai Ani e rojey telisindi gata paddeluga jarugtundi idey ga. Antey manaki nachina vallu chestey Anni muskuntam nachhani vallu chestey Anni terchikumtam.

  14. ఆంధ్ర లో ఏమైంది GA ? రియల్ ఎస్టేట్ ఊపు అందుకుంది, ముందు ప్రజలు మనఃశాంతి తో ఉన్నారు, రైలు వచ్చింది , పరిశ్రమలు వస్తున్నాయి. రాజధాని కి పట్టిన పీడ వదిలింది, TCS విశాఖలో వచ్చింది ఒక్క LU LU ని తరిమితే 3 లు లు వచ్చాయ్

  15. నేను తటస్తుడిగా చెబుతున్నాను ఏ ప్రభుత్వమూ లోనైన కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ cbn ప్రభుత్వంలో మీరు చెప్పిన విధంగా ఘోరాలు ఏమి లేవు.

  16. వైసీపీ పార్టీకి బిగ్ షాక్ : Paytm కుక్కలతో, వైసిపి కార్యకర్తలతో విసుగు చెంది వైసీపీ పార్టీకి జగన్ రాజీనామా….. పవన్ కళ్యాణ్ గారి పిలుపు కోసం జగన్ ఎదురు చూపులు.. వైసీపీ నీ వీడి జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న పులివెందుల ఎంఎల్ఏ జగన్.

  17. Telangana people, particularly Hyderabad City people are terribly afraid of Hydra. Congress misused the golden opportunity given in 2023. Now.. TRS will bounce back whenever elections are held.

    In AP also.. Kutami is just passing time with useless issues and highlighting them days together. Their.policy is Talk more…Work less. How kutami is.better than in so many matters ?

  18. అయ్యా శ్రీనివాసమూర్తి గారూ ఏ కలుగులోంచి బయటకు వచ్చారు తమరు? గడిచిన ఐదు వసంతాలు ఏ అడవిలో దొంగ జపం చేసుకుంటున్నారు? రాష్ట్ర ఈ నాటి (మీ దృష్టిలో ) పరిస్థితులకు కారణం ఎవరు? ఇప్పటి వరకు ఆ దురాగతాలమీద నోరు ఎందుకు తెరవ లేకపోయారు. అసలు ఎక్కడ లేని అరరాచకం మీకు మాత్రమే ఎందుకు కనబతుతున్నది. కొంచం అయినా ఆలోచన లేకుండా ఈలాంటి ఆర్టికల్ వ్రాస్తున్నారు అంటేనే అర్ధం అవుతుంది

  19. తెలంగాణా లో తెరాస ని తిట్టావు .. కాంగ్రెస్ నీ తిట్టావు. మరి ఏపీ లో కేవలం కూటమి ప్రభుత్వాన్ని తిట్టి ఊరుకుంటే ఎలా? వాళ్ళు చేస్తోంది (నిజంగా నువ్వు రాసిందంతా నిజమే అనుకున్నా..!) కేవలం ప్రతిచర్యే కదా? అంతకుముందు ప్రభుత్వపు పాలనలో జరిగిన అరాచకాలకి జవాబు మాత్రమేగా..!! 

Comments are closed.