కులం ప్రాతిప‌దిక‌గా ప‌దోన్న‌తా?..టీటీడీలో ఇదేం ప్ర‌క్షాళ‌న‌!

స‌ద‌రు అధికారి త‌మ వాడే అని, ప‌దోన్న‌తి క‌ల్పించ‌డం విమర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టైంది.

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న చంద్ర‌బాబునాయుడు…. టీటీడీలో ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని చెప్పారు. అయితే ఆయ‌న మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న లేద‌నే చ‌ర్చ టీటీడీలో విస్తృతంగా సాగుతోంది. అవినీతి అధికారిగా గుర్తింపు పొందిన ఓ ఉద్యోగికి ఐటీ డీజీఎంగా ప‌దోన్న‌తి క‌ల్పించ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

గ‌తంలో సీవీఎస్‌వోగా ప‌ని చేసిన న‌ర‌సింహ కిశోర్ స్ప‌ష్టంగా స‌ద‌రు అధికారి అవినీతికి పాల్ప‌డ్డాడ‌ని, దూరం పెట్టాల‌ని చెప్పినా… ఈవో శ్యామ‌లారావు ప‌ట్టించుకోలేద‌ని టీటీడీ ఉద్యోగులు అంటున్నారు. స‌నాత‌న హిందూ ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా విదేశాల్లో టీటీడీ శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. టీటీడీ ఏఈవో స్థాయి అధికారిపై తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డం, నిరూప‌ణ కావ‌డం, అత‌నితో జ‌రిమానా కింద ఆ సొమ్మును కూడా క‌ట్టించుకుని, తిరిగి ఇప్పుడు సీఎం సామాజిక వ‌ర్గ‌మ‌నే ఏకైక కార‌ణంతో అంద‌లం ఎక్కించ‌డం తీవ్ర విమ‌ర్శ‌కు దారి తీసింది.

యూకే, యూరప్‌లో కల్యాణోత్సవాలు నిర్వహించాలని యుక్తా అనే ఛారిటీ టీటీడీని కోరింది. ఈ మేర‌కు 2022 అక్టోబరు, నవంబరు నెలల్లో కల్యాణోత్సవాలను నిర్వహించే బాధ్య‌త‌ల్ని అప్ప‌టి ఉన్న‌తాధికారి ధ‌ర్మారెడ్డి ఏరికోరి టీటీడీ ఏఈవో వెంకటేశ్వర్లుతో పాటు పూజారి శ్రీధర్‌కు అప్ప గించారు. ఆ తర్వాత 2023, ఆగ‌స్టులో యుక్తా చారిటీ చైర్మ‌న్ స‌త్య‌ప్ర‌సాద్ నుంచి టీటీడీకి ఫిర్యాదు అందింది.

వెంక‌టేశ్వ‌ర్లుతో పాటు మ‌రికొంద‌రు ఎక్కువ మొత్తంలో డ‌బ్బు డిమాండ్ చేశార‌ని ఆ ఫిర్యాదు సారాంశం. ఈ ఫిర్యాదుపై విచారించిన విజిలెన్స్ అధికారులు నిజ‌మే అని నిర్ధారించారు. సంభావన పేరుతో రూ.27.08 లక్షలు పొందినట్టు తేల్చారు. వెంకటేశ్వర్లు దాదాపు రూ.5.26 లక్షలు దిగ‌మింగిన‌ట్టు విజిలెన్స్ అధికారులు నివేదిక‌లో పేర్కొన్నారని తెలిసింది.

అయితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోక‌పోగా, మంద‌లింపుతో స‌రిపెట్టారు. విదేశాల్లో అవినీతిపై విచారించి, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీటీడీ బోర్డు స‌భ్యుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి ఉన్న‌తాధికారుల‌కు లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇదిలా వుంటే, స‌ద‌రు అధికారి త‌మ వాడే అని, ప‌దోన్న‌తి క‌ల్పించ‌డం విమర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టైంది. ఏకంగా టీటీడీ ఐటీ శాఖ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా ప‌దోన్న‌తి క‌ల్పించ‌డంపై ఉద్యోగులు మండిప‌డుతున్నారు. టీటీడీలో ఇదేనా ప్ర‌క్షాళ‌న అంటే అని నిల‌దీస్తున్నారు.

7 Replies to “కులం ప్రాతిప‌దిక‌గా ప‌దోన్న‌తా?..టీటీడీలో ఇదేం ప్ర‌క్షాళ‌న‌!”

  1. దీంట్లో పెద్ద వింత ఏముంది? అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ యొక్క కులం వాళ్ళకి ముఖ్యమైన పదవులు దక్కుతాయి…..

  2. నువ్వు చెప్పినవన్నీ ఎప్పుడు జరిగాయి? అప్పటి ప్రభుత్వం మందలించి ఎందుకు వదిలేసింది?

  3. పైగా కులాలు అంటున్నావ్? అసలు అప్పట్లో రెడ్డి కులస్తులు తప్ప ఎవడైనా టీటీడీ లో పనిచేసారా? అర్చకులు బ్రాహ్మణులు ఉండాలి కాబట్టి గానీ లేకపోతే ఏ రెడ్డో, కమ్మోడో పూజారి అయ్యేవారు.

  4. ఒకసారి జగన్ ప్రభుత్వం లో అధికార పదవుల పొందిన వారి పేరు చివర తోక లు తో కలిపి లిస్ట్ చెప్పు నాయన గ్రేట్ ఆంద్ర.

Comments are closed.