బాబు మీకే చెల్లు సామి!

ఏది మాట్లాడినా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికే చెల్లుబాటు అవుతుంద‌నేలా వ్య‌వ‌హార శైలి వుంటోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఏది మాట్లాడినా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికే చెల్లుబాటు అవుతుంద‌నేలా వ్య‌వ‌హార శైలి వుంటోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఢిల్లీలో ఎన్డీఏ త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారానికి చంద్ర‌బాబు వెళ్లారు. ఢిల్లీని సీఎం కేజ్రీవాల్ పాల‌న నాశ‌నం చేసింద‌ని విమ‌ర్శించారు. బీజేపీ మెప్పు కోస‌మే చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేశార‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే, 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేజ్రీవాల్ ప్ర‌చారం చేశారు. ఆ విశ్వాసం కూడా చంద్ర‌బాబుకు లేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఢిల్లీలో చంద్ర‌బాబు రెండు సంద‌ర్భాల్లో వ్య‌వ‌హ‌రించిన తీరు చూస్తే, ఏదైనా ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్యం అని చెప్ప‌క త‌ప్ప‌దు. మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం రెండు రోజుల క్రితం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అన్నీ ఇచ్చింద‌ని గొప్ప‌లు చెప్పారు. మ‌రోవైపు ఇదే చంద్ర‌బాబు 16వ ఆర్థిక సంఘం చైర్మ‌న్ అర‌వింద్ ప‌న‌గ‌డియాను క‌లిసి రాష్ట్రాన్ని ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేయ‌డం ఎలా అర్థం చేసుకోవాలి? అనే ప్ర‌శ్న ఎదురైంది.

మీడియాతో మాట్లాడుతూ బాబు ఏమ‌న్నారంటే… “మేము కేంద్ర ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేస్తున్నాం. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల‌న్నింటికీ ఏడు నెల‌ల్లోనే నిధులు ఇచ్చింది. అమ‌రావ‌తి, పోల‌వ‌రం, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌, ఇండ‌స్ట్రియ‌ల్ పార్కుల‌కు నిధులు కేటాయించింది. గ‌త పాల‌కుల విధ్వంసంతో దెబ్బ‌తిని, వెంటిలేట‌ర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజ‌న్ అందించింది” అని అన్నారు.

16వ ఆర్థిక సంఘం చైర్మ‌న్‌ను క‌లిసి..”ఒక వైపు విభ‌జ‌న కార‌ణంగా న‌ష్ట‌పోయి, మ‌రోవైపు గ‌త ఐదేళ్ల ప‌రిపాల‌న వ‌ల్ల ఆర్థికంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విధ్వంస‌మైంది. కావున‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఆదుకోండి” అని అర‌వింద్ ప‌న‌గ‌డియాకు చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం అన్నీ ఇచ్చింద‌ని, ఆక్సిజ‌న్ అందించింద‌ని ఎవ‌రి మెప్పుకోసం చంద్ర‌బాబు చెప్పార‌ని అర్థం చేసుకోవాలి? అన్నీ ఇచ్చిన‌ప్పుడు ఇక 16వ ఆర్థిక సంఘం చైర్మ‌న్ వ‌ద్ద మాత్రం… అందుకు భిన్నంగా మాట్లాడ్డం ఏంటి? ఇంత‌కూ చంద్ర‌బాబు చెప్పిన దాంట్లో ఏది నిజం? ఏది అబ‌ద్ధం? ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల కంటే, రాజ‌కీయ అవ‌స‌రాలే ఎక్కువ‌య్యాయా? అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

బ‌డ్జెట్‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చింది ఏమీ లేద‌ని రాష్ట్ర ప్ర‌జానీకం ల‌బోదిబోమంటోంది. టీడీపీ, జ‌న‌సేన నేత‌లు మాత్రం… ఆహా, ఓహో అని అంటున్నారు. ఇవ‌న్నీ ఉత్తుత్త‌వే అని స్వ‌యంగా చంద్ర‌బాబు 16వ ఆర్థిక సంఘం చైర్మ‌న్ వ‌ద్ద మొర పెట్టుకోవ‌డ‌మే నిద‌ర్శ‌నం.

11 Replies to “బాబు మీకే చెల్లు సామి!”

  1. అందుకే చదువుకోవాలి అనేది…బడ్జెట్ అనేది వచ్చే ఏడాదికి సంబంధించిన కేటాయింపుల గురించి. ఫైనాన్స్ కమిషన్, టాక్స్ డిస్ట్రిబ్యూషన్, స్పెషల్ గ్రాంట్స్ రెచొమ్మెంద్ చేస్తుంది….రెండు వేరు వేరు రా సన్నాసి

  2. దావోస్ వెళుతున్నాం, కోట్లకు కోట్లు పెట్టుబడులు తెస్తున్నాం. నేషనల్ టీవీలో ప్రచారం చేయండి. మన జాకీ ఛానెల్స్ లో ఉదరగొట్టేయండి entha డబ్బు కార్చు అయిన పర్వాలేదు

    దావోస్ హోటల్ లోని అన్ని గదుల కిటికీ అడ్డాలు పగిలిపోయాయి. -12 డిగ్రీలా చలి. అయినా కూడా ఆకుంటుత దీక్షతో చంబా గారు కట్ డ్రాయర్ పైనా కూర్చి ఆలోచన చేస్తున్నాడు ఎలా జనాలకి కాకమ్మ కబుర్లు చెప్పాలి అని.

    ఉదయం మిగిలిన అధికారులు లేట్ గా లేచి చూస్తే వీవీఐపీ గదిలో లేరు, కంగారు పడిపోయి ఫోన్ లు చేస్తే దావోస్ అధికారులు చెప్పరు

    ఇక్కడెవరో జనాలు లేవకుండానే స్టాల్ కూర్చోని బిల్డప్ కొడుతున్నాడు అని

    అధికారులు పరుగు పరుగు నా వెళ్లి చూస్తే అంత చలిలో బట్టలు లేకుండా మన చంబు కూర్చోని రెడ్బుక్ పట్టుకొని జనాలకోసం వేచి చూస్తున్నాడు

    కట్ చెస్తే

    కాళీ చేతులతో తిరిగి వచ్చి అంటాడు, అసలు మీకు ఎవరు చెప్పరు దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనీ ?

  3. నాడు వివేకాను లేపేసి సీబీన్ మీదకు దొబ్బి ఓట్లు వేయించుకున్న జగన్, 2019 లో అమ్మను, చెల్లి ప్రచారానికి వాడుకొని, గెలిచి షియ్యం అయి అమ్మ, షెల్లిని ఆస్తిలో వాటాలు ఇవ్వకుండా దొబ్బేసిన మన జగనన్న

    భారతదేశపు డిర్టిస్ట్ పొలిటిషన్ మన జగనన్న( క్షమించండి బెయిల్ మీద వున్న )

Comments are closed.