సొంత పార్టీ శ్రేణుల్లో జ‌గ‌న్ పిలుపు ప‌లుచ‌న‌య్యేలా!

ఒక కార్య‌క్ర‌మాన్ని కార‌ణాలేవైనా మూడుసార్లు వాయిదా వేస్తే, ఇక పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో ఆస‌క్తి ఎందుకు వుంటుంది?

ఏదైనా ఒక ఆందోళ‌న కార్య‌క్ర‌మానికి పిలుపు ఇచ్చారంటే, దాన్ని ఖ‌చ్చితంగా నిర్వ‌హించేలా వుండాలి. ఒక‌వేళ వాయిదా వేయాల్సి వ‌స్తే … బ‌ల‌మైన కార‌ణాన్ని చూపాలి. లేదంటే ప్ర‌జ‌ల్లోనే కాదు, సొంత పార్టీ శ్రేణుల్లో కూడా ప‌లుచ‌న భావం ఏర్ప‌డుతుంది. ఫీజు పోరుకు సంబంధించి వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన పిలుపు కూడా ప‌లుచ‌న అయ్యింది.

ముచ్చ‌ట‌గా మూడోసారి ఫీజు పోరు వాయిదా ప‌డ‌డం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. విద్యార్థుల పెండింగ్ ఫీజులు చెల్లించాల‌నే డిమాండ్‌తో ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్య‌క్ర‌మానికి పిలుపు ఇచ్చారు. దీంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై రూ.800 కోట్లు విడుద‌ల చేసింది. వైసీపీ ఒత్తిడే కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు.

అయితే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ వుంద‌ని తెలిసి కూడా, ముందూవెనుకా ఆలోచించ‌కుండా ఫిబ్ర‌వ‌రి 5న ఫీజు పోరు వుంటుంద‌ని, ఇందుకు సంబంధించి పోస్ట‌ర్ల‌ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్క‌రించారు. మ‌రోవైపు ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను అనుమ‌తి కోర‌గా, అటు వైపు నుంచి ఎలాంటి స్పంద‌నా రాక‌పోవ‌డంతో వ‌చ్చే నెల 12కు వాయిదా వేసిన‌ట్టు వైసీపీ ప్ర‌క‌టించింది.

ఇలా ఒక కార్య‌క్ర‌మాన్ని కార‌ణాలేవైనా మూడుసార్లు వాయిదా వేస్తే, ఇక పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో ఆస‌క్తి ఎందుకు వుంటుంది? ఏదైనా కార్య‌క్ర‌మం చేప‌ట్టడానికి వైసీపీ నాయ‌కులు స‌మావేశ‌మై, అన్ని అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోర‌నేందుకు ఫీజు పోరు వ‌రుస వాయిదానే నిలువెత్తు నిద‌ర్శ‌నం.

వైసీపీలో ఎవ‌రికి వారే య‌మునా తీరు అన్న చందంగా నిర్ణ‌యాలు వుంటాయి. జ‌గ‌న్‌కు మ‌దిలో ఏది మెదిలితే, దాన్ని ప్ర‌క‌టిస్తుంటారు. వైసీపీలో నిర్మాణాత్మ‌క నిర్ణ‌యాలు జ‌ర‌గ‌వ‌నేందుకు ఆ పార్టీనే త‌ర‌చూ నిరూపించుకుంటోంది. ఇలాగైతే రానున్న రోజుల్లో ఏదైనా పిలుపు ఇస్తే, పార్టీ శ్రేణులు సీరియ‌స్‌గా తీసుకునే అవ‌కాశం వుండ‌దు. అందుకే వైసీపీ ఇక‌నైనా సీరియ‌స్‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం వుంది. వాయిదాల ప‌ర్వానికి స్వ‌స్తి చెప్పాలి.

17 Replies to “సొంత పార్టీ శ్రేణుల్లో జ‌గ‌న్ పిలుపు ప‌లుచ‌న‌య్యేలా!”

  1. నేను రెండు వారాల క్రితమే నా కామెంట్స్ లో చెప్పాను..

    ..

    వీడికి రాజకీయాల పట్ల ఇంటరెస్ట్ పోయింది.. ఎంత ఎగిరినా మళ్ళీ గెలిచే అవకాశాలు లేవని వాడికే స్పషం గా తెలుసు..

    పైగా.. ఈ రోజే మీ ఎర్నలిస్టు “సాయి రెడ్డి” కూడా వీడియో వదిలాడు.. మోడీ / చంద్రబాబు డెడ్లీ కాంబినేషన్..

    2019 లో వీసా రెడ్డి పుణ్యమా అని .. ఆ రెండు పార్టీలను విడగొట్టాడు.. కానీ ఇప్పుడు ఆ సూచనలు కనపడటం లేదు.. ఆ తప్పు కూడా చంద్రబాబు చేసేలా లేడు .. ఢిల్లీ కి ప్రచారానికి వెళ్లి మరీ మోడీ భజన చేసాడు.. ఇక వాళ్ళని విడగొట్టడం జరిగే పని కాదు..

    ..

    ఇక జగన్ రెడ్డి కి అవకాశం లేనట్టే.. అని మీ ఉప్పు తినే మీ గజ్జికుక్కలే ప్రచారం చేస్తున్నారు..

    ..

    మీకో ఉచిత సలహా.. ప్యాక్ అప్..

      1. అలాంటప్పుడు వై నాట్ 175 అని ఎగరకూడదు..

        అందుకే జనాలు జగన్ రెడ్డి ని లేవకుండా కొట్టారు..

          1. అంటే.. మేము గెలిపిస్తే జగన్ రెడ్డి గెలిచాడా..

            అక్కడ కూడా విషయం లేదా జగన్ రెడ్డి కి…?

      2. మన అన్నియ్య పాలన అలా ఇలా లేదు . ప్రజలకి అది ఒక పీడ కల. మళ్ళీ కోరి తెచ్చుకోరు .

  2. లెవెనన్నాయ్, కేవలం కళ్ళు గట్టిగా మూసుకుంటే వచ్చే అధికారానికి, గీ ఫీజు ఫోర్లు, సిక్సర్లు అవసరమా చెప్పు??

    మన హయాం లో అతి నిజాయితీ గా బటన్ మాత్రమే నొక్కి, స్టూడెంట్స్ కి ఎగొట్టిన ఫీజు 3000 కోట్లు ఎక్కడ దాచావ్ అన్నాయ్??

  3. మన హయాం లో అతి నిజాయితీ గా బటన్ మాత్రమే నొక్కి, స్టూడెంట్స్ కి ఎగొట్టిన ఫీజు 3000 కోట్లు ఎక్కడ దాచావ్ అన్నాయ్??

    వాళ్ళు దీనికి answer చెప్పి తర్వాత ఫోర్లు సిక్సర్లు కొట్టుకో అంటున్నారు అన్నాయ్

  4. మన హయాంలో అతి నిజాయితీ గా బటన్ మాత్రమే ‘నొక్కి, తెలివిగా స్టూడెంట్స్కి ఎగొట్టిన ఫీజు 3000 కోట్లు ఎక్కడ దాచావ్ అన్నాయ్??

    వాళ్ళు దీనికి answer చెప్పి, తర్వాత ఫోర్లు సిక్సర్లు కొ’ట్టుకో అంటున్నారు అన్నాయ్

  5. మన హయాం లో జనవరి లో బటన్ నొక్కి, జూన్ లో కూడా ఫీజు జమ చెయ్యకుండా కొట్టేసిన 3000 కోట్లు ఎక్కడ దాచావు లెవెన్ అన్నాయ్?? ఊహు ఎం లేదు నీ మొగుడు పవన్ అడుగుతున్నాడు అందుకే..

Comments are closed.