గొప్పల కోసం తిరుమలపై నిరాధార వ్యాఖ్యలు!

ఆలయం మూసివేతకు పాలక మండలి నిర్ణయం ఏదైనా వుంటే చూపించాలని, లేదంటే తన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని స్వామివారి భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి ఆలయంపై మరో మరక అంటించారు. ఒకప్పుడు నీటి కొరతతో స్వామివారి ఆలయాన్ని మూడు నెలల పాటు మూసేయాలని ఆలయాధికారులు నిర్ణయించినట్లు నిరాధారమైన ఆరోపణ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారంటూ ఆయన చేసిన ఆరోపణలతో రేగిన కలకలం సద్దుమణగక మునుపే ఇంకో వివాదానికి తెరదీశారు.

1990వ దశకంలో తిరుమలలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడిందని, ఆ సమయంలో మూడు నెలల పాటు స్వామివారి ఆలయాన్ని మూసివేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారని చంద్రబాబు తిరుమలలో అన్నారు. ఆ సందర్భంగా తాను సంబంధిత అధికారులపై కోప్పడి, యుద్ధప్రాతిపదికన తిరుపతి సమీపంలోని కల్యాణీడ్యామ్‌ నుంచి తిరుమలకు తాగునీటి పైపులైను వేయించాన‌ని గొప్పగా చెప్పుకున్నారు.

చంద్రబాబు నాయుడి మాటలను టీటీడీ అధికారులు తప్పుబడుతున్నారు. తిరుమలలో పలుసార్లు తాగునీటి కొరత ఏర్పడినా, ఆలయాన్ని మూసివేయాలన్నంత తీవ్రంగా ఎన్నడూ లేదని అప్పట్లో పనిచేసిన అధికారులు చెబుతున్నారు. తాగునీటి ఎద్దడిని దృష్టిలో వుంచుకుని స్వామివారి ఆలయాన్ని మూసివేయాలని ఎవరూ ప్రతిపాదన చేయలేదని, మరి చంద్రబాబు ఎందుకు అలా మాట్లాడారో తెలియడం లేదంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తన గొప్పలు చెప్పుకోవడం కోసం ముందూ వెనుకా ఆలోచించకుండా చేసిన వ్యాఖ్యలతో స్వామివారి ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నీటి ఎద్దడిని దృష్టిలో వుంచుకుని స్వామి వారి ఆలయాన్ని మూసివేయాలని ఎవరో యథాలాపంగా ప్రతిపాదన చేసికూడా వుండొచ్చు…అంత మాత్రాన‌ ఇప్పుడు ఆ మాటను ఇలా బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. స్వామివారి ఆలయం మూసి వేయడమనేది అత్యంత సున్నితమైన అంశమని, దానిపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాల్సిన పనిలేదా అని భక్తులు వాపోతున్నారు.

తిరుమలలో భక్తుల తాగునీటి కొరత ఏర్పడవచ్చన్న అంచనాతో ఒకప్పుడు నీటి పొదుపు పాటించిన మాట వాస్తవం. అన్నప్రసాదాల‌ వితరణ కేంద్రంలో స్టీల్‌ ప్లేట్లకు బదులు విస్తరాకులు వినియోగించిన మాట కూడా వాస్తవం. అదే క్రమంలో కల్యాణీ డ్యాం నుంచి తిరుమలకు పైపులైను నిర్మించారు. ఇవన్నీ ముందస్తు జాగ్రత్తలో భాగంగా చేసినవే. అంతేతప్ప నీటి ఎద్దడి కారణంగా ఆలయం మూసివేయాల్సిన దుస్థితి ఎప్పుడూ తలెత్తలేదని టీటీడీలో పనిచేసి రిటైర్‌ అయినవారు చెబుతున్నారు.

వాస్తవం ఇలా వుంటే…తిరుమల శ్రీవారిని కూడా తానే రక్షించినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం అత్యంత బాధాకరమని, ఇకనైనా చంద్రబాబు తిరుమల శ్రీవారి ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయం మూసివేతకు పాలక మండలి నిర్ణయం ఏదైనా వుంటే చూపించాలని, లేదంటే తన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని స్వామివారి భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

8 Replies to “గొప్పల కోసం తిరుమలపై నిరాధార వ్యాఖ్యలు!”

  1. చంబా చెప్పే అబద్ధాలు ని అచ్చేసే బాకాలు ఈనాడు ఆంధ్రజ్యోతి అండ చూసుకొని అంత తన వల్లే జరిగింది నేనే చేశాను అంటాడు.కానీ social media వల్ల ఈ ఆటలు సాగవు నిజాలు తెలుస్తున్నాయి

    1. పింక్ డైమండ్ ఏమైంది అంకుల్? ఎక్కడుంది? నారసుర రక్తచరిత్ర నీ తుడిచేసారా? ఆ రాతల మీద బ్లూ ఇంక్ పడి మసకబారిందా?

  2. P V R K Prasad raised kalyani dam height and like that which was later questioned by the next CM NTR. This is mentioned by Mr Prasad in his book.

    Andhra Pradesh people followed family planning on his adivse, we have to believe.

    CBN means restless self dabba. We have no other go except to believe whatever he says

Comments are closed.