ముందు- వెనుకల విచక్షణ ఉండాలి కదా!

ముందు చేపట్టవలసిన చిన్న పనులకు కూడా నిదులు ఇవ్వకుండా, జగన్ బొమ్మ తొలగింపు 30 కోట్లు తక్షణ అవసరం అన్నట్టుగా పనులు చేయడం.. వారి శైలికి అద్దం పడుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నరు ప్రసంగానికి ధన్యవాద ప్రసంగంలో అనేక విషయాలను ప్రస్తావించారు. సాధారణంగానే ఈ ప్రసంగంలో జగన్ ను నిందించడానికి ఎక్కువ సమయం కేటాయించారు. అవన్నీ పక్కన పెట్టి ఒక్క విషయాన్ని గమనిద్దాం.. సర్వేరాళ్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలు తీయించేందుకు 30 కోట్ల రూపాయలు ఖర్చయిందట.

జగన్ వలన.. కొత్త ప్రభుత్వంపై పడిన అదనపు భారం అది అని ఆయన అంటున్నారు. మంచిదే.. జగన్ స్వార్థంతో తన బొమ్మలు సర్వేరాళ్ల మీద చెక్కించుకోవడం అనేది తప్పే అని.. దానిని దిద్దడానికి కూటమి ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం కరక్టే అని అనుకుందాం. కానీ.. అది కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే చేపట్టవలసిన పనేనా? ఏది ముందు? ఏది వెనుక? అనే విచక్షణ ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉందా? అని ప్రజలు అంటున్నారు.

ఎందుకంటే.. గత జగన్ ప్రభుత్వ హయాంలో మొదలైన పనులు మాత్రమే కాదు.. అంతకుముందు తెలుగుదేశం పాలన కాలంలో మొదలైన నిర్మాణ పనులు, వారికంటె ముందు కాంగ్రెస్ సర్కారు హయాంలో మొదలైన పనులు కూడా అనేకం ఇంకా రాష్ట్రంలో పెండింగులో ఉన్నాయి. 30కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే.. నిర్మాణాలు పూర్తయిపోయి ప్రజలకు అందుబాటులోకి వచ్చే పనులు బోలెడన్ని పెండింగులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో ప్రభుత్వ, స్కూలు భవనాలు, అలాగే మారుమూల ప్రాంతాల్లో జనజీవితానికి ఇబ్బందులు కలుగుతున్న చోట్ల బ్రిడ్జిలు, వంటి అనేక నిర్మాణాలు ఉన్నాయి.

100-200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. బోలెడన్ని ప్రాజెక్టులు పూర్తయిపోయేవి కూడా అనేకం ఉన్నాయి. వీటి గురించిన అన్ని సవివరమైన కథనాలు ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే వస్తున్నాయి.

నిజానికి కొత్త ప్రభుత్వం గద్దె ఎక్కిన తర్వాత.. నిస్వార్థంగా నిర్మాణాత్మకంగా అడుగులు ముందుకు వేయదలచుకుంటే గనుక.. రాష్ట్రంలో అన్ని శాఖల పరిధిలో పెండింగులో ఉన్న పనులు ఏవి.. సగం పూర్తయినవి ఏవి.. వాటికి ఎంత మొత్తం కేటాయిస్తే అవన్నీ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అనే వివరాలను సర్వేచేయించి తెలుసుకుని ఉండాల్సింది. అది నిర్మాణాత్మక కృషి అయ్యేది. అలాంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు. దృష్టి సారించను కూడా లేదు.

అమరావతి నిర్మాణ పనులకు అనుకూలంగా అక్కడ భూమిని సిద్ధం చేయడానికే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అమరావతి కూడా రాష్ట్రానికి అవసరమే. ఖర్చు పెట్టాల్సిందే. కానీ.. ఆ నగరంతో పాటుగా.. మారుమూల ప్రజల జీవనగతిని మార్చే నిర్మాణాలు కూడా అవసరమే కదా. సగం పూర్తయిన వాటికైనా నిధులు ఇవ్వకుండా చేస్తే ఎలా అనేది ప్రజల ప్రశ్న. అలాంటి పనులు పూర్తి చేయించి.. ఆ తర్వాత.. సర్వే రాళ్ల మీద జగన్ బొమ్మలు తొలగించి ఉండవచ్చు కదా. దాని కాస్త వెనుకకు నెట్టినంత మాత్రాన జనజీవితానికి కలిగే ప్రమాదం లేదు కదా.

జగన్ మీద కక్ష తీర్చుకోవడం కూటమి ప్రభుత్వానికి ఒక లక్ష్యం కావొచ్చు. కాదనలేం. కానీ.. అదొక్కటే లక్ష్యం అన్నట్టుగా ఆ పార్టీ వ్యవహరించడం.. ముందు చేపట్టవలసిన చిన్న పనులకు కూడా నిదులు ఇవ్వకుండా, జగన్ బొమ్మ తొలగింపు 30 కోట్లు తక్షణ అవసరం అన్నట్టుగా పనులు చేయడం.. వారి శైలికి అద్దం పడుతోంది.

23 Replies to “ముందు- వెనుకల విచక్షణ ఉండాలి కదా!”

  1. మన తుగ్లక్ రెండు వెల కొట్లు కర్చు చెసి ప్రబుత్వ భవనాలకి. పార్టి రంగులు వెస్తుంటె, 2 వెల కొట్లతొ ఎన్నొ పనులు చెయవచ్చు అని చెప్పవా?

    500 కొట్లతొ విశాకలొ ప్యాలెస్స్ కట్టించుకుంటుంటె, ఆ డబ్బు తొ ఎన్ని పనులు చెయవాచ్చొ గుర్తుకు రాలెదా?

    700 కొట్లు కర్చు చెసి రాల్ల మీద తన ముకారవిందాన్ని చెక్కుంటె, ఇది అవసరమా అని నీకు అనిపించలెదా?

    బటన్ నొక్కినప్పుడల్లా సాక్షి లొ పూర్తి పెజీ యాడ్లకి కొట్లాది రూపాయాలు తగలెస్తుంటె కనీసం మొరిగావా?

    .

    ఎందుకురా ఇప్పుడు గురువింద నీతులు చెపుతావు! ప్రజలు ఛీ.. కొట్తిన తు.-.గ్ల.-.క్ గాడి బొమ్మ ఇంకా వెయాలా?

  2. మన తు.-.గ్ల.-.క్ రెండు వెల కొట్లు కర్చు చెసి ప్రబుత్వ భవనాలకి. పార్టి రంగులు వెస్తుంటె, 2 వెల కొట్లతొ ఎన్నొ పనులు చెయవచ్చు అని చెప్పవా?

    500 కొట్లతొ విశాకలొ ప్యాలెస్స్ కట్టించుకుంటుంటె, ఆ డబ్బు తొ ఎన్ని పనులు చెయవాచ్చొ గుర్తుకు రాలెదా?

    700 కొట్లు కర్చు చెసి రాల్ల మీద తన ముకారవిందాన్ని చెక్కుంటె, ఇది అవసరమా అని నీకు అనిపించలెదా?

    బటన్ నొక్కినప్పుడల్లా సాక్షి లొ పూర్తి పెజీ యాడ్లకి కొట్లాది రూపాయాలు తగలెస్తుంటె కనీసం మొరిగావా?

    .

    ఎందుకురా ఇప్పుడు గురువింద నీతులు చెపుతావు! ప్రజలు ఛీ.. కొట్తిన తు.-.గ్ల.-.క్ గాడి బొమ్మ ఇంకా వెయాలా?

  3. 30 కోట్ల గురుంచి కాదు ఈడి భాద.. 7 వేలకోట్లు ఖర్చు పెట్టి, ప్రతీ రైతు పొలం లో పెర్మనెంట్గా ఉండాల్సిన మావోడి కార్వుడ్ స్టోన్స్ ఇంకొన్ని సంవత్సరాలైనా ఉంటేచూసి మురిసిపోవచ్చు అనుకుంటే అంత తొందరగా పెరికేసాడనే భాధ, ఆవేదన, ఆకరోశం అంతే..

  4. చంద్రబాబు ని తిడుతున్న రైతులు, కృతజ్ఞతలు చెప్పిన జెగ్గులు

    ల0గా మోహన ఉన్న రాళ్ళని రోజూ తన్ని, ఉచ్చపోసి ఇంకొన్ని రోజులు ఆనందం పొందకుండా ఆ రాళ్ళని అర్జెంటు గా పెరికించినందుకు రైతులకికోపం, ఆనందపడుతున్న A1 లెవెన్ మోహన

  5. అవునా…ఇంకేం పని లేనట్లు , పజావేదిక ని కూల్చిన

    ప్పుడు ఇలాంటి నీతి ముక్తావలి వాళ్ళించ్చారా తమరు

  6. ఆ దిష్టిబొమ్మ మొహం గానీ ఫోటో తీయించడానికి ౩౦ CR ? karchaa babu Gaaru ?

    ఈ మనీ ని జగ్లక్ gaade కట్టేలా Govt నోటీసులు ivvali ఆ జో క ర్ g a adiki

  7. అవునా ఇప్పుడు గుర్తు కొచ్చిందా నీకు ..అసలు రాళ్ల మీద బొమ్మలు వేస్తూ ఉంటె చూస్తూ కూర్చున్నావు .. నీది న్యూట్రల్ జర్నలిజం మళ్ళి ..

  8. చంద్రబాబుని తిట్టని గడప లేదు..

    రైతులకి ల0గా గాడు గుర్తుకొస్తే చేనుకి పొయ్యి ఉచ్చపోసి, చెప్పుతో జెగ్గులు గాడి రాయికి హాయిగా కొట్టేవారు. ఇక మీదట ఆ అవకాశం లేకుండా చేస్తున్న చంద్రబాబు ని తిట్టని గడప లేదు.

  9. చంద్రబాబుని తిట్టని గడప లేదు..

    రైతులకి ల0గా గాడు గుర్తుకొస్తే చేనుకి పొయ్యి ‘ఉచ్చపోసి, చెప్పుతో జెగ్గులు గాడి దిష్టిరాయికి హాయిగా కొట్టేవారు. ఇక మీదట ఆ అవకాశం లేకుండా చేస్తున్న చంద్రబాబు ని తిట్టని గడప లేదు.

  10. చంద్రబాబుని తి’ట్టని గడప లేదు..

    రైతులకి ల0గా గాడు గుర్తుకొస్తే చేనుకి పొయ్యి ‘ఉచ్చపోసి, చె’ప్పుతో జెగ్గులుగాడి దిష్టిరాయికి హాయిగా కొట్టేవారు. ఇక మీదట ఆ అవకాశం లేకుండా చేస్తున్న చంద్రబాబు ని తి’ట్టని గడప లేదు.

  11. మా వూళ్ళో జగన్ వీర అభిమాని వున్నాడు. ప్రతిచోటా జగన్ వుండాలి అని కక్కుసు మీద కూడా జగన్ బొమ్మ వేసుకున్నాడు. అభిమానం అంటే అలా వుండాలి.

  12. ప్రభుత్వం డబ్బుతో సొంత భార్య పేపర్ లో ప్రకటనలు పేరుతో కోట్ల రూపాయలు కజేసినప్పుడు, మొరగలేదు ఏంటి వెనకటి రెడ్డి ? ఇప్పుడు మొరుగుతున్నావు.

  13. ఎన్నికయ్యేక రాష్ట్రాన్ని ఆర్ధిక స్థితినుంది దివాళా స్థితికి తీసుకెళ్లాలంటే ఇలాంటి పనికిమాలిన పనులు అయినోళ్ళకి అప్పగించడమే అని సీబీన్ కి తెలిసినట్టు మరెవ్వరికింతేలుసు..

  14. బాబు గారు తప్పు చేసారు జగన్ గారి బొమ్మ కావలిసిన వాళ్ళు ఉంటే పెడతాం అని ఒక ఆప్షన్ ఇవ్వవలిసింది కావలిసిన వాళ్ళ పాసుబుక్ ల మీద సర్వే రాళ్ల మీద వాళ్ళ చేనులో వేసుకొందురు మిగిలిన వాళ్ళకి రాజముద్రతో ఇస్తారు

Comments are closed.