చంద్రబాబు స్తోత్రాల్లో తమ్ముళ్లను మించుతున్న పవన్!

ప్రభుత్వాలు మారినప్పుడు తొలి బడ్జెట్ సమావేశాల గవర్నరు ప్రసంగంలో.. పాత ప్రభుత్వాన్ని నిందించడం తప్పుపట్టడం అనేది చాలా సాధారణమైన సంగతి.

తెలుగుదేశం పార్టీకి చెందిన తమ్ముళ్లందరూ తమ అధినేత చంద్రబాబునాయుడును కీర్తించడంలో తలమునకలవుతూ గడిపితే.. వారి మనుగడకు అది అవసరం అని అర్థం చేసుకోవచ్చు. వారితో పోటీ పడుతున్నట్టుగా.. వారికి ఊహకు కూడా రాని విధంగా తెలుగు తమ్ముళ్లను మించి.. పవన్ కల్యాణ్ చంద్రబాబునాయుడును స్తుతిస్తూ గడిపితే.. దానిని ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి తనే సొంతంగా పార్టీ స్థాపించుకుని, తన రెక్కల కష్టం మీదనే పార్టీని చట్టసభల్లో 21 సీట్లతో ఉండేలాగా తీసుకువచ్చిన పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు భజన చేయడమే తన మనుగడకు కీలకం అని ఎందుకు భావిస్తున్నారో తెలియడం లేదని పలువురు అంటున్నారు.

బడ్జెట్ సమావేశాల్లో స్పీకరు ప్రసంగానికి ధన్యవాద ప్రసంగంలో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో జగన్ ను నిందించడానికి ఏయే అంశాలను ఆయన జాబితా రాసుకుని కంఠోపాటం చేశారో.. అవన్నీ కూడా సభలో మళ్లీ వినిపించే ప్రయత్నం చేశారు. అవన్నీ నివేదించి.. వాటివల్లనే జగన్ ను ప్రజలు ఓడించారంటూ.. ఎన్నికలైన ఎనిమిది నెలల తర్వాత కూడా అదే పాచిపాట పాడారు.

ఇదంతా ఒక ఎత్తు.. ఇక చంద్రబాబునాయుడును కీర్తించడం మాత్రమే మరో ఎత్తు. గవర్నరు ప్రసంగం సందర్భంగా వైసీపీ వాళ్లు చేసిన గొడవ చూస్తే.. సీఎం చంద్రబాబు ఇన్నాళ్లూ వారిని ఎలా తట్టుకుని నిలబడ్డారో అనిపించింది. అందుకు ఎంతో గట్స్, దమ్ము, ధైర్యం ఉండాలి.. ఆయనకు హ్యాట్సాఫ్ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ప్రభుత్వాలు మారినప్పుడు తొలి బడ్జెట్ సమావేశాల గవర్నరు ప్రసంగంలో.. పాత ప్రభుత్వాన్ని నిందించడం తప్పుపట్టడం అనేది చాలా సాధారణమైన సంగతి. ఎవ్వరు కొత్తగా అధికారంలోకి వచ్చినా.. అలాంటి స్క్రిప్టునే పకడ్బందీగా తయారుచేయించి.. చదవాల్సిందిగా గవర్నరు చేతికి అందిస్తారు. ఆ క్రమంలో పాత ప్రభుత్వాన్ని నిందించే సమయంలో.. ఆ పార్టీకి చెందిన సభ్యులందరూ తమ నిరసనను తెలియజేయడం కూడా చాలా సహజంగా జరుగుతుంది. కొత్తగా ఇప్పుడే సభలోకి అడుగుపెట్టి.. జరుగుతున్న ప్రతి విషయాన్నీ అబ్బురంగా చూస్తూ గడుపుతున్న పవన్ కల్యాణ్ కు ఇదంతా తెలియకపోవచ్చు. అంతమాత్రాన విపక్షం నిరసనను ఆయన కొత్త చర్యలాగా అభివర్ణిస్తే ఎలా? విపక్షం నిరసన తెలియజేసిందే అనుకుందాం.. దానికీ చంద్రబాబులోని దమ్ముకు, ధైర్యానికి ఏమిటి లింకు?

చూడబోతే.. కూటమిలో లుకలుకలు మొదలైనట్టుగా బయట బాగా ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు స్వయంగా ఫోను చేస్తే ఆన్సర్ చేయడానికి కూడా ఖాళీ లేనంతగా పవన్ ఉన్నారని అందరూ నవ్వుకుంటున్న తరుణంలో.. ఏదో మాయ చేయడానికి చంద్రబాబును అడ్డంగా కీర్తించాలని ఆయన ఫిక్సయ్యారు. ఎందుకు కీర్తించాలో ఆయనకు కూడా క్లారిటీ లేదు. ఏదో.. బడ్జెట్ సమావేశాల తొలిరోజున వైసీపీ నిరసనలకు ముడిపెట్టి అయినా.. చంద్రబాబును కీర్తించాలని లాజిక్ తెలియకుండా మట్లాడినట్టు ఉన్నది తప్ప.. మరొకటి కాదని ప్రజలు భావిస్తున్నారు.

16 Replies to “చంద్రబాబు స్తోత్రాల్లో తమ్ముళ్లను మించుతున్న పవన్!”

  1. ఓరి సన్నాసి…పవన్ ఏమన్నాడు అన్నది పక్కన పెడితే , ఇక్కడ ప్రతిపక్షం పారిపోయింది గవర్నర్ ప్రసంగం కి వ్యతిరేకంగా కాదు, తమ నేత కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అని. చూసికొని రాయి.

  2. ఎడిటర్ ఎవడురా గూట్లే…స్పీకర్ ప్రసంగానికి ధన్యవాదాలు ఏమిటిరా తింగరి సన్నాసి….అది గవర్నర్ ప్రసంగం రా

  3. Asalu పవన్. పొగడ్తలు పక్కన పెదాం.జగన్ గారికి. ప్రజలు M L A హోదా ఇచ్చారు అలాగే 11 సభ్యులను ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుతవ్వన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలి. రోస్టర్ విధానం సౌరించ కుండా గ్రూప్ 2 పెట్టారు . అలాగే ఫీజు బకాయిలు జగన్ గారు 3 వేల కోట్లు పెడితే కొత్త ప్రభుత్వం ఇంత వరకు రూపాయి ఇవ్వ లేదు ఇలాంటి అర్థవ నత మయిన చర్చలు చేసుకోవాలి గాని. చంద్ర బాబు ఎంత గొప్పొడి లేదా జగన్ కు ప్రత్యేక హోదా వల్ల ఎవరికి ఉపయోగం లేదు. వ్యక్తి పూజ మనేసినపుడే మనకి అభివృద్ధి

  4. ఇదెరా మీతో వచ్చింది Dy.CM పవన్ మాట్లాడకపోతే మాట్లాడడం లేదు అని ఏడుస్తారు . మాట్లాడితే సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా లో గుక్కపెట్టి ఏడుస్తారు ఎలా రా మీతో పడేది. ?

      1. హ కరెక్ట్…. అస్సలు అమలు చేయకండి.. చేస్తే .. జగని ని గుండు గీసి నామాలు పెట్టినట్టు పెడతారు..

    1. When blind folded fools like you can’t see…it doesn’t mean they did not mention. Last few days record sales happening in Guntur mirchi yard, farmers issues are getting solved. DSC is in court cases (not new, its been from years). CBN already mentioned about Super Six implementation in his reply to governor speech

  5. పావనికి 2014 లో చంద్రికాది , లోకిది సమ్మగా వుంది

    2019 లో చంద్రికాది , లోకిది చేదుగా వుంది

    2024 లో చంద్రికాది , లోకిది సమ్మగా వుంది

    2029 ?

  6. పవన్కళ్యాణ్ చంద్రబాబు నీ పొగటటానికి కి అర్ధం మేము cm గా చంద్రబాబు కి మద్దతు ఇస్తాము కానీ లోకేశం కి ఇవ్వము అని

  7. రైతులకి గిట్టుబాటు ధర రాలేదని ధర్నా చేస్తున్నారంట… ఓహ్ దాన్తో మనకేం పని.. అది మన మినిస్ట్రీ క్రిందకు రాలేదు… మనం డిప్యూటీ అంతే

    విద్యార్ధులకి ఇంతవరుకు ఫీజు రేయింబర్సుమెంట్ రాలేదు…వాళ్ళు గోల చేస్తున్నారు.. ఓహ్ దాన్తో మనకేం పని.. అది మన మినిస్ట్రీ క్రిందకు రాలేదు… మనం డిప్యూటీ అంతే

    గ్రూప్ 2 విద్యార్ధులకి అన్యాయం జరుగుతుంది అని గోల చేస్తున్నారు..ఓహ్ దాన్తో మనకేం పని.. అది మన మినిస్ట్రీ క్రిందకు రాలేదు… మనం డిప్యూటీ అంతే

    ఇంకా ఎంతో ఎంతో..

Comments are closed.