ఖ‌ర్మ కాలి టీడీపీ ఒక్క‌చోట ఓడినా.. కూట‌మికి కౌంట్‌డౌన్‌!

ఒక‌వేళ మూడు చోట్లా ఓడిపోతే మాత్రం… కూట‌మి స‌ర్కార్ చాప చుట్టేయ‌డం ఖాయం. గెలిస్తే, గండం గ‌ట్టెక్కిన‌ట్టే.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గురువారం మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మూడు స్థానాల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు టీడీపీకి అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. ముఖ్యంగా ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఖ‌ర్మ కాలి టీడీపీ ఒక్క‌చోట ఓడినా, కూట‌మికి తొమ్మిది నెల‌ల‌కే కౌంట్‌డౌన్ మొద‌లైన‌ట్టే అనే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది. ఎందుకంటే రెండు ప‌ట్ట‌భ‌ద్ర‌ల స్థానాల ఎన్నిక‌లు 67 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ప్ర‌జాభిప్రాయాన్ని ప్ర‌తిబింబించ‌నున్నాయి.

ఉమ్మ‌డి గుంటూరు-కృష్ణా, తూర్పు-ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రులు, ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధ‌మ‌య్యాయి. ఒక్కో స్థానంలో రాజ‌కీయ అనుకూల‌త‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఉత్త‌రాంధ్ర‌లో ఏపీటీఎఫ్ అభ్య‌ర్థి ర‌ఘువ‌ర్మ‌కు టీడీపీ, జ‌న‌సేన . పీఆర్‌టీయూ అభ్య‌ర్థి గాదె శ్రీ‌నివాసులునాయుడికి బీజేపీ, అలాగే పీడీఎఫ్ అభ్య‌ర్థి కోరెడ్ల విజ‌య‌గౌరికి యూటీఎఫ్‌, అంత‌ర్గ‌తంగా వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. ఉత్త‌రాంధ్ర‌లో యూటీఎఫ్ బ‌లంగా ఉంది. మ‌రీ ముఖ్యంగా విజ‌య‌గౌరి ఉపాధ్యాయ ఉద్య‌మాల్లో చురుగ్గా పాల్గొనడంతో మంచి పేరు సంపాదించారు. మొత్తం ఓట‌ర్లు 22,493 మంది. మ‌హిళా ఉపాధ్యాయులు అత్య‌ధికంగా విజ‌య‌గౌరికి మ‌ద్ద‌తు ప‌లికే అవ‌కాశం వుంద‌ని అంటున్నారు.

మిగిలిన ఇద్ద‌రు అభ్య‌ర్థుల్లో ర‌ఘువ‌ర్మ సిటింగ్ ఎమ్మెల్సీ. గాదె శ్రీ‌నివాసులునాయుడు గ‌తంలో రెండుసార్లు ఎమ్మెల్సీగా ప‌ని చేశారు. అయితే ఈ ఇద్ద‌రి పాల‌నారీతుల్ని ఉపాధ్యాయులు చూశారు. ఉపాధ్యాయులు, విద్యారంగం కోసం ఈ ఇద్ద‌రు ప‌ని చేసిందేమీ లేద‌న్న విమ‌ర్శ బ‌లంగా వుంది. ముగ్గురి మ‌ధ్య పోటీ నువ్వానేనా అని ఉన్న‌ప్ప‌టికీ, ఎక్కువ అవ‌కాశాలు మాత్రం విజ‌య‌గౌరికి ఉన్న‌ట్టు మెజార్టీ అభిప్రాయం.

ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి గ‌ట్టి పోటీ నెల‌కుంది. ఇక్క‌డ టీడీపీ నుంచి పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌రం, పీడీఎఫ్ త‌ర‌పున డీవీ రాఘ‌వులు పోటీ చేస్తున్నారు. ఇంకా చాలా మంది అభ్య‌ర్థులు పోటీలో ఉన్న‌ప్ప‌టికీ, ప్ర‌ధానంగా వీళ్లిద్ద‌రి మ‌ధ్యే గ‌ట్టి పోటీ వుంది. టీడీపీ అభ్య‌ర్థి కాపు , పీడీఎఫ్ అభ్య‌ర్థి ఎస్సీ సామాజిక వ‌ర్గాలు. దీంతో ఆ జిల్లాల్లోని సామాజిక వ‌ర్గాలు ఇద్ద‌రికీ క‌లిసి వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని అంచనా. పీడీఎఫ్ అభ్య‌ర్థికి వైసీపీ ప‌రోక్ష మ‌ద్ద‌తు తోడైంది. టీడీపీ అభ్య‌ర్థికి కూట‌మి మ‌ద్ద‌తు ఉన్న‌ప్ప‌టికీ, వాళ్ల‌లో అసంతృప్తి న‌ష్టం చేస్తుంద‌నే భ‌యం వుంది. ఇక్క‌డ గెలుపుపై ఎవ‌రూ ఏమీ చెప్ప‌లేక‌పోతున్నారంటే, హోరాహోరీ ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల స్థానంలో టీడీపీ అభ్య‌ర్థి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పీడీఎఫ్ అభ్య‌ర్థి కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు మ‌ధ్య ప్ర‌ధానంగా పోటీ జ‌రుగుతోంది. అయితే ఎక్కువ అవ‌కాశాలు ల‌క్ష్మ‌ణ‌రావుకే ఉన్న‌ట్టు క్షేత్ర‌స్థాయి అభిప్రాయాలు తెలియ‌జేస్తున్నాయి. అధికారికంగా వైసీపీ పోటీ చేయ‌క‌పోయినా, టీడీపీని ఓడించాల‌న్న ఏకైక కార‌ణంతో పీడీఎఫ్ అభ్య‌ర్థికి ఓట్లు వేయ‌నున్నారు. అంతేకాకుండా, ల‌క్ష్మ‌ణ‌రావు ఇప్ప‌టికి నాలుగుసార్లు ఎమ్మెల్సీగా ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. ఉద్యోగ‌, ఉపాధ్యాయ , విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై చ‌ట్ట‌స‌భ‌లో గ‌ళ‌మెత్తిన నాయ‌కుడిగా మంచి గుర్తింపు వుంది.

ఆల‌పాటిపై కూట‌మిలోనే వ్య‌తిరేక‌త వున్న‌ట్టు స‌మాచారం. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌లోనూ, అలాగే నిరుద్యోగ భృతి హామీని నిల‌బెట్టుకోవ‌డంలోనూ, ఇటీవ‌ల గ్రూప్‌-2 ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వ ఉదాసీన వైఖ‌రి, మ‌రీ ముఖ్యంగా ఉద్యోగుల స‌మ‌స్య‌ల గురించి అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఇవ‌న్నీ మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌నే భ‌యం టీడీపీని వెంటాడుతోంది. ఒక్క‌చోట ఓడినా నెగెటివ్ సంకేతాలు బ‌లంగా జ‌నంలోకి వెళ్లి, ఇక కూట‌మి స‌ర్కార్ ప‌ని అయిపోయింద‌ని అనుకుంటార‌నే భ‌యం వాళ్ల‌లో వుంది. ఒక‌వేళ మూడు చోట్లా ఓడిపోతే మాత్రం… కూట‌మి స‌ర్కార్ చాప చుట్టేయ‌డం ఖాయం. గెలిస్తే, గండం గ‌ట్టెక్కిన‌ట్టే.

33 Replies to “ఖ‌ర్మ కాలి టీడీపీ ఒక్క‌చోట ఓడినా.. కూట‌మికి కౌంట్‌డౌన్‌!”

  1. అవునా ౨౦౨౩ లో మూడు స్థానాలు ఓడిపోతే అప్పుడు రాయలేదు ఎందుకో .. కౌంట్ డౌన్ .. అని ..

    1. ఆనాడే చెప్పాం వీళ్ళు మా ఓటర్లు కాదని మా ఓటర్లు వేరే ఉన్నారని: సజ్జల

  2. 😂😂😂😂….మన single సింహం అసలు పోటీ చేయడానికే భయపడి, వేరే వాళ్ళకి support చేయడాన్ని యేమoటారు GA…..అప్పట్లో జనసేన మీద లేకి comedy చేశారు…ఇప్పుడు యెడుస్తున్నారు….అందుకే GA….జనం అధికారం ఇచ్చినప్పుడు పధ్దతి గా పని చేయాలీ ….అనవసరం ఐన హెచ్చులకు పోకూడదు….అర్దం అయ్యిందా రాజా…..

  3. ఏమిటి MLC ఒక్కటి ఓడిపోయినా , ఎప్పుడో నాలుగు యేళ్ళు పైగా టైం ఉన్న కూటమికి కౌంట్డౌనా?కాని సార్వత్రిక ఎన్నికలకి కొన్ని నెలల ముందు మూడు MLC లు ఓడినప్పుడు మాత్రం ,వై నాట్ 175 ?ఎక్కడో కొడుతుంది సీనా?

    1. మీ లా rational గా ప్రశ్నించే magaallee నేటి భారతావనికి అవసరం…appreciate ur analysis…use ur skill for building kattar హిందూ భారత్…

  4. వైసీపీ మద్దతు ఇవ్వక పొతే ఏమైనా గెలిచే అవకాశాలు వుండొచ్చునేమో కానీ జగన్ గారు మద్దతు ఇచ్చాక ఇక గెలిచే సమస్యలేదు కూటమి మూడు స్థానాలలో గెలుపు ఖాయం

  5. 3 సీట్లు టీడీపీ గెల్చినా, over కాంఫిడెన్స్ పెరిగి వచ్చే ఎలక్షన్స్ లో తీవ్రంగా నష్టపోతుంది అని ఇంకో ఆర్టికల్ రాసి రెడీ గా పెట్టుకో గ్యాస్ వెంకులూ.. ఏమంటావ్??

  6. పందులు సిద్ధమా.. సింగల్ గా 175/175 గెలుస్తాం అనే ‘గుద్ద కొవ్వు నుండి, “YCP అనే పార్టీ అసలు పోటీ చెయ్యడానికే ఉ’చ్చపోసుకునే స్థాయికి దిగజారి, ప్రత్యర్థి ఒక్క సీటు ఓడినా సంభరపడే స్థాయికి దిగజారడం ఏదైతే ఉందో.. నభూతో నాభవిష్యత్ రా జెగ్గుల్

      1. Poraa తిక్క పుంక పచ్చ వుచ్చలు తాగే నా కొడక.. ఒకసారి GVK Reddy press meet విను.. నీ పార్టీ అసలు రూపం తెలుస్తుంది… ఎక్కువ వాగితే మడిచి చెక్కుతాడు మా PK Anna.. jai పవర్ స్టార్

  7. Karma kaladu… kootami odipodu…

    Dabbulu icharu, bayapettaru, dourjanyam chesaru ani vere kunti sakulu rasuko…

    1st ki payment istaru…2nd ki result.. manchi articles prepare chesuko

  8. కూటమి గెలిచిన 11 రెడ్డి కి లాభం 2029 ఎలక్షన్స్ లో. కూటమి ఓడిన 11 రెడ్డి కి 2034 ఎలక్షన్స్ లో లాభం. ఏమీ జరిగినా 11 రెడ్డి కి లాభం.

Comments are closed.