జీవీకో న్యాయం? ప‌వ‌న్‌కు మ‌రో న్యాయ‌మా?

జీవీరెడ్డితో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేద‌నే లెక్క‌లేని త‌న‌మా? లేక ప‌వ‌న్ అంటే భ‌యంతో చంద్ర‌బాబు పిలిచి మాట్లాడ‌లేదా?

ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్‌గా జీవీరెడ్డి వాస్త‌వాల్ని మాట్లాడ‌మే త‌ప్పైంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అత‌న్ని పిలిపించి మంద‌లించిన సంగ‌తి తెలిసిందే. ఐఏఎస్ అధికారి నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్ర‌భుత్వ సొమ్ము దుర్వినియోగం కావ‌డం, అలాగే న‌ష్టం జ‌రుగుతోంద‌ని జీవీరెడ్డి వాపోయారు. రాజ‌ద్రోహంతో స‌మాన‌మ‌ని ఘాటు విమ‌ర్శ చేశారు. జీవీ వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వానికి న‌ష్టం తెస్తున్నాయ‌ని భావించి సీఎం పిలిపించి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో మ‌నస్తాపం చెందిన జీవీరెడ్డి మీ ప‌ద‌వికి, పార్టీకి ఓ దండం అని రాజీనామా ప‌డేసి బ‌య‌టికి వ‌చ్చేశారు.

మ‌రి డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌లు సంద‌ర్భాల్లో టీటీడీ పాల‌క మండ‌లి, అలాగే హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, శాంతిభ‌ద్ర‌త‌ల‌కు సంబంధించి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ గురించి మాట్లాడిన మాట‌ల సంగ‌తేంటి? శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని డీజీపీ, నిఘా అధికారి ఏం చేస్తున్నార‌ని ఆయ‌న బ‌హిరంగంగా ప్ర‌శ్నించ‌లేదా? అలాగే తాను హోంశాఖ తీసుకుంటే ప‌రిస్థితి మ‌రోలా వుంటుంద‌ని ప‌వ‌న్ వేలాది మంది స‌మ‌క్షంలో ఆవేశంగా మాట్లాడ‌లేదా? జ‌నం త‌మ‌ను తిడ్తున్నార‌ని ప‌వ‌న్ మాట్లాడ్డం నిజం కాదా?

తిరుప‌తి తొక్క‌స‌లాట‌కు బాధ్య‌త వ‌హించి టీటీడీ పాల‌క మండ‌లి క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందే అని ప‌వ‌న్ డిమాండ్ చేయ‌లేదా? ఇవ‌న్నీ కూట‌మి స‌ర్కార్‌కు మంచి పేరు తెచ్చేవా? అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ప‌వ‌న్ కామెంట్స్‌పై ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మందకృష్ణ మాదిగ‌కు కోపం వ‌చ్చింది. ప‌వ‌న్‌ను కృష్ణ మాదిగ మంద‌లించ‌డం వాస్త‌వం కాదా? ఏదైనా వుంటే చంద్ర‌బాబుతో మాట్లాడాల‌ని, అనిత శాఖ‌లో ప‌వ‌న్ చొర‌బ‌డ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీయ‌డం వాస్త‌వం కాదా?

జీవీరెడ్డితో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేద‌నే లెక్క‌లేని త‌న‌మా? లేక ప‌వ‌న్ అంటే భ‌యంతో చంద్ర‌బాబు పిలిచి మాట్లాడ‌లేదా? అనే చ‌ర్చకు తెర‌లేచింది. డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ నెగెటివ్ కామెంట్స్‌తో ప్ర‌భుత్వానికి ఎక్కువ చెడ్డ‌పేరు వ‌స్తుంద‌న్న‌ది వాస్త‌వం. మ‌రెందుక‌ని చంద్ర‌బాబు ఎప్పుడూ ఆయ‌న్ను పిలిచి మంద‌లించ‌లేద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఏంటి? మంద‌లింపులో కూడా లాభ‌న‌ష్టాలు బేరీజు వేసుకుంటున్నారా? విధానాల ప‌రంగా చంద్ర‌బాబు కోప‌తాపాలుండ‌వా? అనే ప్ర‌శ్న‌కు సొంత పార్టీ శ్రేణుల‌కు స‌మాధానం చెప్పాలి. ఎందుకంటే, జీవీరెడ్డిని పోగొట్టుకోవ‌డంపై టీడీపీ శ్రేణులే ఎక్కువ‌గా చంద్ర‌బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

13 Replies to “జీవీకో న్యాయం? ప‌వ‌న్‌కు మ‌రో న్యాయ‌మా?”

  1. మీకేoటి GA…..బాబాయ్ గుండెపోటుతో లాభమే, తల్లిని, చెల్లి ని గెంటి వేసిన లాభమే….శవం దొరికితే ఇంకా లాభమే….అంతేనా అతి తెలివి GA….

  2. ఓరి సన్నాసి…జి వి పార్టీ సంబందించిన వ్యక్తి…పవన్ కూటమి భాగస్వామి. సొంత పార్టీ వారిని అన్నట్లు పక్క పార్టీ వారిని అనలేరురా గూట్లే

  3. ఇదే అర్టికల్ మన ఆస్ధాన భాషాకోవిదులు నాని ద్వయం, పోసాని లాంటి వారు వాగినప్పుడు జగన్ గారు కూడా దిగిపోవాలి అని రాయల్సింది

  4. నువ్వు నీ ల వడా లో ఆర్టికల్స్ 😂 మొన్న నిన్న సె క్స్ రాకెట్ లో నాయక్ ST అని పృద్వి కి ఓటు బ్యాంకు లేదు అని తీసేసారు వైస్సార్ పార్టీ నుండి , ఎందుకు అవినాష్ ని, ఆంబోతు ను, గోరంట్ల ను పార్టీ నుండి పంపించ లేదు.. దాని మీద ఎందుకు పోస్ట్ లు ఆర్టికల్స్ రాయలేదు.. 😂🤣

  5. ఈ జి ఏ గాడికి మెదడు మోకాలిలోకి వెళ్లిపోయింది వీడ్ని చూపించండి ఇలాంటి రాతలతో ఏం సాధిస్తాడు

  6. ఒక రెడ్డి పార్టీ వీడితే క్యాడర్ మొత్తం ఒక్క తాటి పైకి వచ్చి అధిష్టానానికి ఎదురు తిరిగింది.

    అదే ఒక కమ్మని అరెస్టు చేస్తే క్యాడర్ మొత్తం సంతోష పడింది.

    అది టీడీపీ క్యాడర్ అంటే !!! టీడీపీ అంటే !!

    1. Aa reddi nijayithi parudu anukunnaru kabatti akkada andaru oke taati meedaki vachharu……. Arrest kaabadina kamma parama loafer anukunnaru kabatti ikkada andaru santoshincharu……

Comments are closed.