బాబులా ఎప్పుడైనా వెళ్లావా జ‌గ‌న్‌?

గ‌తంలో జ‌గ‌న్ చేసిన త‌ప్పుల నుంచి చంద్ర‌బాబు గుణ‌పాఠం నేర్చుకున్నారు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి పాల‌నా తీరే వేరు. చంద్ర‌బాబు, జ‌గ‌న్‌కు మ‌ధ్య పరిపాల‌నా విధానాల ప‌రంగా చాలా తేడా వుంది. అధికారంలోకి వ‌చ్చిన తాను ప్ర‌జ‌ల‌తో, పార్టీ కేడ‌ర్‌తో మ‌మేకం కావాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ అనుకున్నారు. అందుకే ఆ ఐదేళ్లు ఆయ‌న జ‌నంలో క‌నిపించ‌లేదు. కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే, మ‌ళ్లీ ఓట్లు అభ్య‌ర్థించ‌డానికి జ‌నం మ‌ధ్య గ‌డిపారు. అప్ప‌టికే చేతులు కాలాయి. ఆ విష‌యాన్ని జ‌గ‌న్ క‌నిపెట్ట‌లేక‌పోయారు.

చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే, తానే మంచి చేస్తున్నాన‌ని తెలియాలంటే, నేరుగా ల‌బ్ధిదారుల‌కు వెళ్లాల‌నేది ఆయ‌న పొలిటిక‌ల్ ఫిలాస‌ఫీ. అందుకే ప్ర‌తినెలా ఒక‌టో తేదీన ఎన్టీఆర్ పింఛ‌న్ల పంపిణీకి ఏదో ఒక ప్రాంతానికి చంద్ర‌బాబు వెళుతున్నారు. ల‌బ్ధిదారుల‌తో మాట్లాడుతూ, వాళ్ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. వాటి ప‌రిష్కారానికి త‌న వెంట ఉండే అధికారుల్ని ఆదేశిస్తుండ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.

ఇవాళ బాప‌ట్ల జిల్లా చిన‌గంజాం మండ‌లం కొత్త గొల్ల‌పాలెం గ్రామంలో ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీని స్వ‌యంగా చంద్ర‌బాబు చేప‌ట్టారు. తద్వారా ల‌బ్ధిదారులు, వాళ్ల కుటుంబ స‌భ్యుల‌కు చేరువ అయ్యే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు, సీఎం క్షేత్ర‌స్థాయిలో తిరుగుతున్నార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో సానుకూలత ఏర్ప‌రుస్తుంది. ప‌రిపాల‌నానుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబుకు, జ‌గ‌న్‌కు మ‌ధ్య ఉన్న తేడా ఇదే.

జ‌గ‌న్ పాల‌న‌లో వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చారు. ఇదే ప్ర‌జ‌ల‌కు వైసీపీని, జగ‌న్‌ను దూరం చేసింది. ఎటూ జ‌గ‌న్ ప్ర‌జ‌ల ద‌గ్గ‌రికి వెళ్ల‌రు. కానీ వాలంటీర్ల కార‌ణంగా, చివ‌రికి త‌న పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు, స్థానిక నాయ‌కుల్ని కూడా సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిలో భాగ‌స్వామ్యుల్ని చేయ‌లేక‌పోయారు. అందుకే సంక్షేమ ప‌థ‌కాల్ని వాలంటీర్లు ఇచ్చారే త‌ప్ప‌, వైసీపీ ప్ర‌భుత్వం కాద‌నే అభిప్రాయం ల‌బ్ధిదారుల్లో ఏర్ప‌డింది. దీంతో వైసీపీ రాజ‌కీయంగా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది.

పింఛ‌న్లు పంచ‌డానికి కూడా తానే వెళితే, ఇక స‌చివాల‌య వ్య‌వ‌స్థ, దానికి అనుసంధానంగా వాలంటీర్ల‌ను ఎందుకు తీసుకొచ్చిన‌ట్టు? అని జ‌గ‌న్ ప్ర‌శ్న‌. త‌న‌కు తానే ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యే వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చాన‌ని జ‌గ‌న్ గ్ర‌హించ‌లేక‌పోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ త‌న పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కుల్ని జ‌గ‌న్ పంపారు. కానీ పాల‌న‌లో వాళ్ల‌ను భాగ‌స్వామ్యుల్ని చేయ‌లేక‌పోయార‌న్న‌ది వాస్త‌వం. గ‌తంలో జ‌గ‌న్ చేసిన త‌ప్పుల నుంచి చంద్ర‌బాబు గుణ‌పాఠం నేర్చుకున్నారు. అందుకే తానే నేరుగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళుతూ, వాళ్ల ఇబ్బందులు తెలుసుకుంటున్నారు. ఇదే సంద‌ర్భంలో పార్టీ శ్రేణుల‌తో కూడా ఆయ‌న క‌లుస్తున్నారు. ఇదే గ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌ధాన లోపం.

38 Replies to “బాబులా ఎప్పుడైనా వెళ్లావా జ‌గ‌న్‌?”

  1. డబ్బులు పంచితే నాకే జీవితాంతం వోట్ వేస్తారు అనే అతి విశ్వాసం ..ఓవర్ కాంఫిడెన్స్ అంటారు ఆంగ్లం లో ..

  2. adenti saami anni prachara arbhatalatho… sakshi lo full page advertisements tho… anni sarlu button nokki pinchanlu vidudala chesina… prajalakante kanapadaledu…. neeku kooda kanapadaledaaa

  3. ఎక్కడైనా శవాలు ఉంటే చెప్పండి.. మా జగనన్న ప్రత్యేక విమానం లో గ్రద్ద లా వాలిపోతాడు ..

    తల నిమిరి.. ముద్దులు పెట్టేసి.. చంద్రబాబు ని నాలుగు తిట్లు తిట్టేసి.. బెంగుళూరు కి చెక్కేస్తాడు..

    ఈ బోకుగాడు వచ్చి వెళ్లినందుకు.. లోకల్ లీడర్లకు ఖర్చు బొక్క..

  4. ఎందుకు 11 కి పడిపోయారో ఓటమికి కారణాలు అన్నీ విడమరిచి మీరే చెప్తారు…. అయినా సరే బాలట్ పేపర్లు ఉంటె చించేసి ఉండేవాళ్ళము అంటారు….

  5. \”గతంలో జగన్ చేసిన తప్పుల నుంచి చంద్రబాబు గుణపాఠం నేర్చుకున్నారు.”\\

    ఇదీ మరీ కామెడీ GA ? ఇక్కడ కూడా జగన్ కె క్రెడిట్ ఇవ్వాలా ?

    చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఏదో ఒక కార్యక్రమమం పేరుతో వుంటారు. గతంలో ప్రజల వద్దకు పాలన , శ్రమదానం, జన్మభూమి … ఇక జగన్ నుంచి చంద్రబాబు నేర్చుకునేదేముంది?

  6. ఎన్ని చేసినా ఓడిపోయే టైమ్ వస్తె విడిపోతాసం అంతే గుజరాత్ లాగ మనది తెలివయిన సమాజం కాదు సుమ్మ ఒక నాలుగు పథకాలు పడేస్తే చాలు అంతే

    1. కందుకూరు సందుల్లో 9 మందిని.. గుంటూరు స్టేడియంలో ముగ్గురు నలుగురిని శవాలగా మార్చిన వాడిని ఏమని పిలవాలి….??.

  7. వాలంటీర్లు ప్రజల వద్దకు వెళ్లి పింఛన్లు ఇస్తే ఆ ఇచ్చేది జగన్ కాదు వాలంటీర్లు వాళ్ళ జేబులోంచి ఇస్తున్నారు అనుకొని జగన్ ను పక్కన పెట్టారా?

    వినే వాళ్ళు ఉంటే ఎలాంటి రాతలు ఎన్నైనా రాసుకోవచ్చు

  8. చంద్రబాబు నాయుడు గారు గతంలో 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచసిన చంద్రబాబు నయుడు గారు ఏనాడైనా ఇంటి వద్దకే వెళ్లి ఒకటవ తేదీన వృద్ధులు వికలాంగులకు పింఛన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా.. మీరు రాసే కథలకి చంద్రబాబునాయుడు కి పంతులేనిది..

    చంద్రబాబు గారు పాపులారిటీ కోసం పాకులాడి మనస్తత్వం.. జగన్ గారికి ఎక్కడున్నా పని చేస్తే చాలు అనుకునే మనస్తత్వం ఇద్దరిదీ డిఫరెంట్….. మీలాంటి వాళ్లు స్టోరీ రాసేటప్పుడు గతంలో చంద్రబాబునాయుడు గారు ఎప్పుడైనా ఒకటవ తేదీన పింఛన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా అనే విషయాన్ని

  9. అయన ఓడిపోవటానికి కారణం వాలంటీర్ లా ఇలాంటి అనాలసిస్ చేసి ఆయన్ని తప్పు దారి పట్టించడమే

  10. ప్రచార ఆర్భాటం లో బాబు ముందుంటారు. CM గా ఉండే వ్యక్తి మారుమూల ప్రాంతానికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం అంటే ఖర్చుతో కూడుకొన్నది. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సిబ్బంది వున్నారు. మరి ఆయన వెళ్ళాడంటే ప్రచారం కోసమే

Comments are closed.