నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండటం దేశంలోని ఏ ప్రతిపక్షానికీ, అంటే బీజేపీయేతర, ఎన్డీఏయేతర పార్టీలకు అసలు ఏమాత్రం ఇష్టం లేదనే సంగతి తెలిసిందే. గత ఏడాదే ఆయన ప్రధాని అయ్యారు. కాని ఆయన పూర్తికాలం పదవిలో ఉండకూడదని కోరుకుంటున్నాయి. ఆయన పదవీ కాలం ఇంకా సగం కూడా పూర్తికాలేదు కదా. మరి పదవి నుంచి ఎలా దిగిపోతారు? అంటే బీజేపీలో తిరుగుబాటు రావాలని కోరుకుంటున్నాయా? అది సాధ్యం కాదు. పార్టీ చీలిపోతుందా? అదీ జరిగే అవకాశం లేదు.
మరెలా? మోదీ ఈ ఏడాదే ఎలాగైనా ప్రధాని పదవి నుంచి దిగిపోవాలి. అప్పుడే ఈ దేశం ప్రశాంతంగా ఉంటుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. మోదీ ఉంటే దేశం బాగుపడదని అనుకుంటున్నాయి. మోదీ ప్రధానిగా ఉండకూడదని కోరుకుంటున్న పార్టీల్లో మహారాష్ట్రలోని ఉద్ధవ్‌థాక్రే శివసేన కూడా ఉంది. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని పదవి నుంచి ఎలా దిగిపోతారో ఆయన చెప్పారు. అలా జరుగుతుందని ఆయన భావిస్తున్నారు. ఊహిస్తున్నారు. పదవి నుంచి మోదీ దిగిపోతారని సంజయ్ రౌత్ ఎలా అనుకున్నారంటే…. బీజేపీలో ఒక రూల్ ఉంది.
పార్టీలోని ఏ నాయకుడైనా సరే 75 ఏళ్లు వచ్చాయంటే పదవి నుంచి దిగిపోవాలి. ఆ లెక్క ప్రకారం మోదీ దిగిపోతారని రౌత్ అన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో మోదీకి 75 ఏళ్లు వస్తాయి కాబట్టి ఆయన పదవి నుంచి దిగిపోతారని చెప్పారు. ఇక ఆయన పని అయిపోయిందని కూడా కామెంట్చేశాడు. పదవి నుంచి దిగిపోయే సమయం వస్తోంది కాబట్టే మోదీ ఉగాది రోజు నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారని చెప్పాడు. ఎందుకంటే మోదీ గత పదేళ్లలో సంఘ్ కార్యాలయానికి వెళ్లలేదట. సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు టాటా, గుడ్ బై చెప్పడానికే మోదీ అక్కడికి వెళ్లారని రౌత్ అన్నాడు. మోదీ వారసుడు మహారాష్ట్ర నుంచే ఉంటాడని కూడా చెప్పాడు. మరి ఆ వారసుడు ఎవరో?
కాని సంజయ్ రౌత్ ఊహిస్తున్నట్లు 75 ఏళ్లు వస్తే మోదీ పదవి నుంచో, రాజకీయాల నుంచో రిటైరయ్యే అవకాశం లేదు. బీజేపీలో 75 ఏళ్లకు రిటైర్మెంట్ అనేది అప్రకటిత నిబంధన మాత్రమే. కాబట్టి అది మోదీకి వర్తించదు. ఆయన 2022లో భరూచ్‌లో మాట్లాడుతూ తాను మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆరోగ్యం విషయానికి వస్తే, మోదీ వంద శాతం ఆరోగ్యంగా ఉన్నారు. ఎక్కువ సమయం పనిచేస్తున్నారు. అంతర్జాతీయంగా ఆయన పాపులారిటీ పెరుగుతోంది.
బీజేపీలోని నాయకులు ఎవరైనా ప్రధాని కావాలని కలలు కంటుంటే, అలాంటివారు మోదీ తరువాత ప్రధాని కావలసిందే, కానీ వయసును కారణంగా చూపించి, ఆయన్ని మధ్యలో దింపేసి ప్రధాని పీఠం ఎక్కడం సాధ్యం కాదు. కాబట్టి మోదీ పని అయిపోయింది అనుకునే నాయకులకు ఆయన పని ఇంకా ఉందని తెలిసివస్తుంది.
Pala ce pula kesi…letter royo uchu gaa….Thaaat kuda radu ani…
UNO lo India ki permanent seat.. ee yanaki nobel peace prize vachhevaraku digadu.. aite yenti? He wants to hold the record of serving PM as most numbers of years.. IN few days he is going to over take Indira.. Next Nehru only.. If BJP wins next election.. he will break that record also.. If not BJP can claim PM served for mot number of years after India became republic.
ప్రతిపక్షాలలో ఒక్కడంటే ఒక్కడు స్కాములో ఇరుక్కుని కేసుల్లో లోపలకూ బయటకూ తిరగని వాడు లేడు. మోడీ ఉన్నంత వరకూ వాళ్ళకు అధికారం సూదూరంలోనే. కనుక వాళ్ళు మోడీ దిగిపోవాలనే కోరుకుంటారు.
మోడీ గానీ బీజేపీ గానీ లేకపోతే, హిందువుల కోసం నోరు విప్పేవాడు దేశంలో ఉండడు. మోడీ దిగిపోతే మళ్ళీ గంధీ నెవ్రూ ల గందగీ సెక్యులరిజం విలసిల్లి తమ గొంతెమ్మ కోరికలు ఎన్ని కావాలంటే అన్ని నెరవేరుతాయి కాబట్టి మైనారిటీ ప్రియసోదరులు మోడీ దిగిపోవాలనే కోరుకుంటాయి.
మోడీ దిగిపోతే, సరదాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు బాంబులు పేల్చుకోవచ్చు అని జిహాదీల ఆకాంక్ష.
మోడీ దిగిపోతే చైనా కు లాభం కాబట్టి చైనా కోసం బ్రతికే చైనా తొత్తుల ఆరాటం.
స్కాముల భారతాన్ని ఆస్వాదించి అప్పుడే పదకొండేళ్ళా, ఇంకా ఎన్నాళ్ళు అంటూ అవినీతిపరుల ఆత్రం.
ఇప్పటికి తొంభై సార్లు ఎన్నికలలో తన పార్టీని తిరుగులేని పరాజయ కానుక ఇచ్చిన రాహుల్ గాంధీ దిగిపోవాలని పై ముఠాలో ఒక్కడికీ ఆలోచన లేదు.
చూద్దాం , ఇంకా ఎన్నాళ్ళు మోడీని భరించాలో
పై అందరికంటే ఎక్కువ కోరుకునేది ఆస్థాన అపానవాయువుగాడు. చస్తున్నాడు ఎక్కడెక్కడి మోడీ వ్యతిరేక గాలి పోగేసుకు రావటానికి
అవినీతి రూపం మారింది, పాత సినిమాల్లో చూపించినట్లు సూటుకేసులో పచ్చనోట్లు నింపుకుని తీసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి, బెదిరించి, ఎలెక్టోరల్ బాండ్లు కనిపించడం, వాటి వివరాలు బయటికి రాకుండా చూసుకోవడం కొత్త తరహా విధానం, ఇవన్నీ ధర్మ పరిరక్షణకే అనుకోవడం మన అమాయకత్వం.
ముందు నువ్వు నీతిపరులకు ఓటేయ్యి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం
నా ఓటింగ్ ఛాయిస్ విషయంలో చర్చ అనవసరం, ఉన్న వాళ్లలో కాస్త మెరుగైన వాడికి నచ్చితే ఓటేస్తాను. ఎప్పుడూ ఒకే పార్టీకి ఓటేస్తూ కూర్చోలేదు, ఎవరూ నచ్చక పోతే నోటా ఆప్షన్ ఉంది, ఇవన్నీ నిర్ణయించుకోగల స్వతంత్రత ఉంది. ఎవరికి ఓటేసినా వాళ్ల పనితీరును విమర్శనాత్మకంగానే చూస్తాను, ఎవరూ నిజాయితీపరులని, ఈ సమాజానికి సేవచేయడానికి అవతరించారనే భ్రమలో బ్రతకను, ఎవడి తప్పులనీ వెనకేసుకురాను.
వీలైతే మీరు ప్రస్తావించిన పాయింట్ మీద, దాని మీద నా స్పందన పైన చర్చించండి. నా కామెంట్ లో ఏదైనా లోపముంటే చెప్పండి. మనం ఇక్కడ కామెంట్లు రాసేది భిన్న అభిప్రాయాలు పంచుకోవడానికి.
వీలైతే మీరు ప్రస్తావించిన పాయింట్ మీద, దాని మీద నా కామెంట్ మీద చర్చించండి.
మన పార్టీకి మద్దతు ప్రకటించిన మరుక్షణం,అప్పటి వరకు మనమే ఆరోపించిన విపక్ష నాయకులకు అనేక ఆర్థిక నేరాల నుండి ఆకస్మికంగా విముక్తి కలిగించడం కూడా నిజాయితీ కి మరో పార్శ్వం అనుకుంటా.
ఎవరిరికి ఆర్ధినేరాల నుండి విముక్తి కలిగించారో ఒక ఉదాహరణ ఏమైనా ఉంటే ఇవ్వాలి.
మన రాష్ట్రలో నువ్వూ నేనూ ఎవరికి ఓటేశామో తెలిసి అవినీతి గురించి బడాయి దేనికి?
లాలు ప్రసాద్ అవినీతి మీద 25 ఏళ్ళు విచారణ జరిగి శిక్ష పడితే, ఇప్పటికి దర్జాగా బయట తిరుగుతున్నాడు. మన న్యాయవ్యవస్థ సామర్ధ్యం తెలిసి కూడా అవినీతి పరుకు శిక్ష పడలేదని మోదీ కారణం అని అవినీతపరులకు ఓటేసే నీలాంటి నాలాంటి వాళ్ళు వాపోవటం భలే విచిత్రం
లిస్ట్ చాలా పెద్దదే బ్రదర్ కాకపోతే ఒక ఉదాహరణ.. అజిత్ పవార్ తన మాతృపార్టీ ని చీల్చిన కొద్ది రోజులకే పాతిక వేల కో##ట్ల MSCB కుంభకోణం నుండి క్లీన్ చిట్ ఇవ్వబడింది, వెయ్యి కో”**ట్ల పైగా ఐటీ బకాయిలు రద్దు చేయబడ్డాయి. ఇదే పవార్ అ%వి**నీతి మీద మీ నిప్పు లాంటి నాయకుడు బోలేడు ఆరోపణలు చేసి ఉన్నారు.
kallu moosukunte moodellu aipova Reddy?
75 ఏళ్ల నిబంధన పార్టీలో, అధికారంలో తనకు పోటీ లేకుండా వ్యవస్థాపక సభ్యులను రిటైర్ చేయించడానికి అమలు చేసుకున్నది బహిరంగ రహస్యం, పైగా అది వాళ్ల పార్టీ అంతర్గత వ్యవహారం. ఆయన ఇప్పుడు దానిని పాటిస్తాడని అనుకోవడం మీ అమాయకత్వం, ఒకవేళ పాటించినా సంపూర్ణ మద్దతు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లు పాటు అధికారంలో ఉంటుంది, కాబట్టి దీని వలన ప్రతిపక్షాలకు ఒరిగేదేమీ లేదు, ఈ విషయంలో జరిగేదంతా అనవసర చర్చ..