బాబుగారి మాట.. ఆయన వైఫల్యానికి నిదర్శనం కదా?

ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడు అధికార్లను పురమాయించిన వ్యవహారం గమనిస్తే.. ఆయన వైఫల్యం బట్టబయలు అవుతోంది.

రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) వ్యవస్థపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికార్లకు చాలా గొప్ప సూచనలు చేశారు. దేవాలయాలకు వచ్చే భక్తులు, ఆస్పత్రులకు వచ్చే రోగులు, ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా వారి అభిప్రాయాలు ఫీడ్ బ్యాక్ తెలుసుకునే ఏర్పాట్లు ఉండాలంటూ.. సామాన్యుల చెంతకు హైటెక్ టెక్నాలజీని తీసుకువెళ్లే మార్గ నిర్దేశం చేశారు.

అధికార్లను పురమాయించారు. ప్రజలు సీరియస్ విమర్శలను దృష్టికి తీసుకురాగలిగితే.. వాటిని పరిగణించి లోపాలు దిద్దుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి పనిచేస్తే అభినందించాల్సిందే. కాకపోతే.. అదంతా పక్కన పెట్టి.. ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడు అధికార్లను పురమాయించిన వ్యవహారం గమనిస్తే.. ఆయన వైఫల్యం బట్టబయలు అవుతోంది.

అధికారంలోకి వచ్చిన ఆరునెలల తర్వాత.. తొలినాళ్లలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఆయన జారీచేస్తున్న హుకుం నవ్వు తెప్పిస్తోంది. ప్రజలకు ఇసుక ఉచితంగా అందాల్సిందే అని చంద్రబాబునాయుడు అంటున్నారు. ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు అయ్యేలాగా వాహనాలు జీపీఎస్ ద్వారా పర్యవేక్షించాలి.. అని ఆయన అంటున్నారు. వాహనాలకు జీపీఎస్ సరే.. ఇసుక విక్రయాల్లో స్థానిక ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా సాగిస్తున్న దందాల మాటేమిటి? వాటిని ఏ రకమైన హైటెక్ విధానాలతో నియంత్రించగలనని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారో ప్రజలకు క్లారిటీ రావడం లేదు.

అసలు ఉచిత ఇసుక విధానం సుమారు ఆరునెలలుగా అమలవుతుండగా.. ఇప్పటికీ.. ‘ప్రజలకు ఇసుక ఉచితంగా అందాల్సిందే’ అనే డైలాగు చంద్రబాబు చెబుతున్నారంటే.. దాని అర్థం ఏమిటన్నమాట. ఇప్పటిదాకా అలా అందడం లేదని ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నట్టే కదా? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.

చంద్రబాబు చాలా పెద్ద కసరత్తు చేసి ఉచిత ఇసుక విధానం తెచ్చారు. సీవరేజీ ట్యాక్సులు, స్థానిక పన్నులు తప్ప మరేమీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అయినా సరే.. వైసీపీ జమానాలో కంటె ధర ఎక్కువగా ఉంటున్నదంటూ పెద్దఎత్తున విమర్శలు రావడంతో వెనక్కు తగ్గారు. చివరికి తమ సొంత పార్టీ నేతల దోపిడీని అరికట్టలేకపోయిన చంద్రబాబునాయుడు.. పంచాయతీలకు దక్కేస్థానిక పన్నులను కూడా రద్దుచేసి.. లోడింగ్ చార్జీలు మాత్రం చెల్లిస్తే చాలునన్నారు. మీరే ట్రాక్టరు నింపుకోగలిగితే పూర్తి ఉచితం లాంటి డైలాగులు చెప్పారు. కానీ.. రాష్ట్రంలో ఎక్కడా ఉచితం అనేమాట వినపడ్డం లేదు.

చంద్రబాబు నోట మాత్రమే పలుకుతుంది. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ఇన్నాళ్ల తర్వాత.. చంద్రబాబు మళ్లీ.. ఉచిత ఇసుక అమలుకావాల్సిందే అంటున్నారంటే.. అమలు కావడం లేదని ఆయన ఒప్పుకున్నట్టుగానే ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.

26 Replies to “బాబుగారి మాట.. ఆయన వైఫల్యానికి నిదర్శనం కదా?”

    1. మధ్య నిషేధం గురించి? మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తేవడం గురించేనా? CPs రద్దు గురించేనా?

  1. Y.-.C.-.P హయాము కంటె ఇసుక ఎక్కువ దర ఉందా? ఎమిరా అయ్యా?

    ఎమిరా అయ్యా ఇలా కామెడిలు చెస్తున్నావ్!

  2. Orei k.Ldike arikatla package mundamopi reddy. Nee button reddy jamana lo 6000/- ammina rojulu unnaayi… ippudu janalaki free ga ne dorukutundi..

    California lo broker panulu cheskune neeku ikkada vishayaalu ela telustaai.

  3. ప్రజలకి ఉచ్చితంగా ఇసుక అందాల్సిందె.. అంటె ఇప్పుడు అందటం లెదు అని కాదు, నిరంతరం అoదెలా చూసుకొవాలి అని. కావలి అంటె నువ్వె ఒక లారి వెసుకొని వెళ్ళి తవ్వుకొ! ఎవరు కాదు అన్నారు!!

  4. తమరి అన్నగారు అధికారంలోకి వచ్చిన వెంబటే ఇసుకను బంద్ చేసేసారు. దాదాపుగా సంవత్సరం పాటు దానికి లేకుండా పోయింది. ఆయన అధికారానికి రాకుండా ముందున్న ధరకు ఆయన అధికారానికి వచ్చిన తర్వాత ధరకు నక్కకు నాగనాకోనికన్నత తేడా ఉండేదాన్ని ప్రజలంతా గగ్గోలు పెట్టారు. మరి ఆ గగ్గోలు తమరికి వినిపించలేదా గ్యాస్ ఆంధ్ర. వినిపించిన చెవిటి వానిలాగే విని వెళ్లిపోయావా కనిపించినా కాబోయేలాగా చూచి వెళ్ళిపోయావా ? నీకు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు కూడా ఇలాగే అడిగి ఉండాలి. మోచేతి కింద నీళ్ళు తాగే వాళ్ళకి ఆ దమ్ము ధైర్యాలు ఉండవు మరి

Comments are closed.