ఇంత జరుగుతున్నా ‘వేధింపులు’ అనరాదా?

బియ్యం స్మగ్లింగ్ మరియు పేర్ని నాని వ్యవహారంలో పోలీసులు అడుగులు వేస్తున్న తీరు గమనిస్తే.. ప్రజలకు అలాంటి అనుమానమే కలుగుతోంది.

తాము ఎవరిని టార్గెట్ చేయదలచుకున్నారో.. వారిని ప్రత్యక్షంగా కేసులోకి తీసుకువచ్చేదాకా విచారణ పర్వాన్ని మలుపులు తిప్పుతూ సాగదీస్తూ పోతే అలాంటి దానిని వేధింపులు అని కాక మరేవిధంగా వ్యవహరించాలి? బియ్యం స్మగ్లింగ్ మరియు పేర్ని నాని వ్యవహారంలో పోలీసులు అడుగులు వేస్తున్న తీరు గమనిస్తే.. ప్రజలకు అలాంటి అనుమానమే కలుగుతోంది.

పేర్ని నాని భార్య జయసుధ కు చెందిన బియ్యం గోదాముల నుంచి బియ్యం మాయం అయ్యాయి. ఈ విషయం ఎవ్వరూ గుర్తించలేదు.. ఆయన స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసి తెలియజేశారు. ఆ తర్వాత ఆయన భార్య మీద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గమనిస్తున్న ఆయన కుటుంబం ప్రస్తుతానికి అజ్ఞాతంలోకి వెళ్లింది.

తాజాగా జయసుధకు బెయిలు కూడా మంజూరు అయింది. ఈలోగా కేసులోకి పేర్ని నానిని తీసుకువచ్చారు. బియ్యం మాయం వ్యవహారంలో ఆయన పాత్ర కూడా ఉన్నదని తెలిసినదంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇంతగా కేసులు నమోదు అవుతోంటే ఇలాంటి చర్యలను వేధింపులు అనుకోకుండా మరేం అనాలి.. అనేదే ప్రజల సందేహం.

తాను మంత్రిగా ఉన్నప్పుడు, పదవి నుంచి దిగిపోయిన తర్వాత, అధికారం చేతులు మారిన తర్వాత కూడా ఎన్డీయే కూటమి పార్టీల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వచ్చిన నాయకుడు పేర్ని నాని. దానికి తగినట్టుగానే ఆయనను ప్రభుత్వం టార్గెట్ చేసి ఉంటుందని అనుకోవచ్చు. కానీ.. ఇతర కేసులేవీ ఆయన మీద బనాయించడానికి వారికి అవకాశం దొరకలేదు.

ఈలోగా.. ఆయన తనంత తానుగా తన గోదాములో బియ్యం నిల్వలు తేడా వచ్చాయంటూ స్వయంగా పేర్కొని వివాదంలోకి వచ్చారు. తేడా వచ్చినట్టు అధికారులు తొలుత తేల్చిన మేరకు విధించిన జరిమానా మొత్తానికి సరిపడా దాదాపు రెండు కోట్ల రూపాయలు డీడీల రూపంలోచెల్లించేశారు కూడా. ఆలోగా.. అధికారులు మళ్లీ తనిఖీలు నిర్వహించి.. నిల్వల తేడాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని.. మరో కోటిన్నరకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కొత్త నోటీసులు ఇచ్చారు. ఆ జరిమానా కూడా ఆయన కట్టేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వంలోని పెద్దల లక్ష్యం అది కాదు. ఆయనను అరెస్టు చేయాలి.. ఇబ్బంది పెట్టాలి.. అనేదే!

భార్య పేరుతో గోదాము కట్టింది ఎవరు అంటూ పవన్ కల్యాణ్ అదేదో నేరం అన్నట్టుగా ప్రశ్నించారు. భార్య పేరిట ఆస్తి ఉంటే బినామీ దొంగ ఆస్తి కాదు కదా! కానీ దంపతుల్లో ఒకరిని అరెస్టు చేసి వేధించాలనుకున్న ప్రభుత్వానికి పేర్ని నాని మీద స్వయంగా కేసులేకపోవడం ఇబ్బంది అయింది. భార్యను అరెస్టు చేద్దాం అనుకుంటే.. ఆమెకు బెయిలు వచ్చింది. వెంటనే పేర్నినానిని కేసులోకి తీసుకువచ్చారు. ఆయన పాత్ర ఉందని తేలినట్టుగా చెబుతున్నారు.

ఇంత డొంకతిరుగుడు వ్యవహారాలను వేధింపులు కాకుండా ఇంకేం అనుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.

45 Replies to “ఇంత జరుగుతున్నా ‘వేధింపులు’ అనరాదా?”

  1. బియ్యం మాయం చేయడంలో పేర్ని పాత్ర లేకపోతే.. అన్ని డబ్బులు ఎలా కట్టారో తెలుసుకోవచ్చా?

  2. అమ్ముకున్న బియ్యానికి రెండు కొట్ల రూపాయాలు చెల్లించారా? మరి తప్పు చెయనిదె ఆ డబ్బు కట్టాల్సిన అవసరం ఎముంది? దొరికాక డబ్బు కడితె వదిలెస్తారా?

        1. దొంగతనం అంటే దౌర్జన్యం గా దోచుకోవడం..

          తస్కరించడం అంటే.. తెలివిగా కొట్టేయడం..

  3. పొద్దున్న సాక్షి ఫ్రంట్ పేజీ లో రాశారు.. నష్టపరిహారం కట్టేసాడు కదా.. ఇంకా ఎందుకు వేధిస్తున్నారు అని ప్రభుత్వాన్ని “గెట్టిగా” ప్రశ్నించారు..

    వామ్మో.. ఇదెక్కడి గోల రా సామి అనిపించింది..

    ..

    వైసీపీ పార్టీ దందా అంతా ప్రత్యేకం గా ఉంటుంది..

    సంపేసి.. విగ్రహానికి పూల దండ వేసాం కదా.. మా ఇంట్లో వాళ్ళను మేము సంపుకొంటాము.. మా ఇష్టం అంటారు..

    డ్రైవర్ ని సంపేసి.. ఇంటికి డోర్ డెలివరీ చేసాం కదా.. ఇంకేంటి మీ బాధ అంటారు..

    లంచం తీసుకుని దొరికిపోయి… సత్కారాలు, పూల దండలు , సన్మానాలు, బహుమతులు అడుగుతారు..

    దొంగతనం చేసి దొరికిపోయాకా.. వెనక్కి ఇచ్చేసాము కదా.. ఇంకా దర్యాప్తు దేనికి అంటారు..

    ..

    ఏందిరా మీ గోల.. గట్టిగా 11 అంకెలు లెక్క పెట్టలేరు.. మీకెందుకు రాజకీయాలు..

      1. మరి జగన్ రెడ్డి అధికారం లో ఉన్న ఐదేళ్లు ఎవడి సంకలు నాకుతున్నాడు.. లేక వాడు కూడా మేసేయడం లో బిజీ గా ఉన్నాడా..?

        చంద్రబాబు ఆస్తి ఎంతో లెక్కలు తీసి ప్రపంచానికి చూపించాల్సింది..! లేక జగన్ రెడ్డి కూడా చంద్రబాబు దగ్గర లంచం తీసుకుని పైనా కిందా మూసుకుని ఉండిపోయాడా..?

  4. పందికొక్కు మాదిరి “బియ్యం బొక్కిన దొంగే, దొంగ ఏడుపులు” ఏడుస్తున్నాడు

    బొక్కిన బియ్యం డబ్బు కక్కితే వదిలెయ్యరు..

    ఏడిస్తే వదిలెయ్యరు..

    చేసిన తప్పు కి శిక్ష అనుభవించాల్సిందే రా తొర్రి..

    మీకు జేసీ ప్రభాకర్ రెడ్డే నీకు సరైన మొగుడు..

  5. పందికొక్కు మాదిరి “బియ్యం బొక్కిన దొ0గే, దొ0గ ఏడుపులు” ఏడుస్తున్నాడు

    బొక్కిన బియ్యం డబ్బు కక్కితే వదిలెయ్యరు..

    ఏడిస్తే వదిలెయ్యరు..

    చేసిన తప్పు కి శిక్ష అనుభవించాల్సిందే రా తొర్రి..

    నీకు నీ పెళ్ళానికి జేసీ ప్రభాకర్ రెడ్డే సరైన మొగుడు..

  6. పోయింది ఏదో చిన్న వస్తువు కాదు, అయ్యో కనిపించటం లేదు అని చెప్పటానికి. 3 కోట్లు విలువ చేసే టన్నుల బియ్యం. వాటిని తరలించాలి అంటే ఎన్ని రోజులు పట్టుద్ది, ఎంతమంది, ఎన్ని లారీలు కావాలి? ఇది అంతా పేర్ని కుటుంబానికి తెలియకుండా జరిగే పనేనా?

    గోడౌన్ ఎవరి పేరు మీద ఉందో, ఎవరి పేరు మీద *ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో వాళ్లు బాధ్యులు కారా? వాళ్ళ మీద కేసు పెడితే, పేర్ని ఏమో ఇంట్లో ఆడోళ్ళను కాదు నన్ను అరెస్ట్ చేసుకోండి అంటాడు. నువ్వేమో వేధింపులు అంటావు ఏంట్రా? మరీ ఇంత పచ్చిగా వెనకేసుకొస్తున్నావు!!

  7. పోయింది ఏదో చిన్న వస్తువు కాదు, అయ్యో కనిపించటం లేదు అని చెప్పటానికి. 3 కోట్లు విలువ చేసే టన్నుల బి య్యం. వాటిని తరలించాలి అంటే ఎన్ని రోజులు పట్టుద్ది, ఎంతమంది, ఎన్ని లారీలు కావాలి? ఇది అంతా పేర్ని కుటుంబానికి తెలియకుండా జరిగే పనేనా?

    గోడౌన్ ఎవరి పేరు మీద ఉందో, ఎవరి పేరు మీద *ప్రభుత్వం *డబ్బులు ఇస్తుందో వాళ్లు బాధ్యులు కారా? వాళ్ళ మీద కే సు పెడితే, పేర్ని ఏమో ఇంట్లో ఆడోళ్ళను కాదు నన్ను *అరెస్ట్ చేసుకోండి అంటాడు. నువ్వేమో వే ధిం పు లు అంటావు ఏంట్రా? మరీ ఇంత పచ్చిగా వెనకేసుకొస్తున్నావు!!

  8. ఇంకా నయం….pds Rice బొక్కినందుకు సన్మానం చెయ్యమని ఆగలేదు….మీ ఈ విచ్చలవిడి దోపిడీ normal కాదు GA….

  9. అసలు 2 కొట్ల తెడా వచ్చింది అంటె, గూడెం లొ ఎన్ని బస్తాలు మాయం అయ్యాయి రా?

    ఎదెమన్నా పదొ, పాతికొ బస్తాల తెడా కాదుగా? సుమారు ఒక 20 వెల బస్తాల తెడా అనుకొవచ్చా?

  10. పందికొక్కు మాదిరి కోట్ల రూపాయల”బియ్యం బొక్కినోడికి”శాలువా కప్పి, సన్మానం చేసి, అవార్డు గివార్డ్ ఏదైనా ఉంటే ఇవ్వాల్సింది పోయి

    కేసులు పెట్టి వేధింపులు ఏంటి అధ్యక్షా??

  11. నాకు ఈ మార్గదర్శి కేసు గుర్తుకువస్తుంది. వాళ్ళు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ లు తీసుకున్నారు కానీ రూల్స్ ప్రకారం కుదరదు అని తెలిసిన తరువాత డిపాజిట్డారులకి వడ్డీ తో సహా పూర్తిగా చెల్లించారు. ప్రస్తుతం ఒక్కరి నుంచి కూడా కంప్లైంట్ లేదు. కానీ మీరు రామోజీ రావు తప్పు చేసాడు మోసం చేసాడు మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చినా సరే ఆ తప్పుకు ఉరి వేయాలి అన్నట్టు, జంట కవులు దేశం మొత్తం తిరిగి డప్పు వాయించారు. అప్పుడు నువ్వే కనీసం ఒక వంద ఆర్టికల్ వ్రాసి ఉంటావు.

    దానికి,

    ఇప్పుడు నాని గారు కేసు కు తేడా ఏమిటో చెప్పగలరు.

  12. Erri GA, I’m controlling my self to write harsh comments. Did Nani wrote letter or koti Reddy? Everyone one knows Nani’s wife name is on the paper and Nani is behind the scene looting ration rice. If your theory is correct.. I want to slap on your face and say sorry… Will you stay calm without filing a case on me?

  13. Erri GA, I’m controlling my self to write harsh comments. Did Nani wrote letter or koti Reddy? If your theory is correct.. I want to slap on your face and say sorry… Will you stay calm without filing a case on me?

  14. GA, Did Nani wrote letter or koti Reddy? Everyone one knows Nani’s wife name is on the paper and Nani is behind the scene looting ration rice. If your theory is correct.. I want to slap on your face and say sorry… Will you stay calm without filing a case on me?

    1. ప్రతిపక్షం లో ఉండగా అమరావతి రాజధాని అని ఒప్పుకుని .. అధికారం లోకి రాగానే మొదలు అయినా పనులను ఆపేయడము కక్షకాదు కదా సర్ ..

  15. పోలి*సు స్టేషన్ లు, కోర్టు*లు ముసెయ్యండి.

    గ్రేట్ ఆంద్ర గొప్ప మాట చెప్పాడు.

    దొంగ తనం చేసి ఫైన్ కట్టాడు కదా, ఇంకా కే*సు లు యెం*దుకు అని.

    ఇదేమన్నా రే*ప్ చేసి చ*ర్చి లో పాపపరిహారం డబ్బు కడితే యే*సు ఆ రే*ప్ చేసిన వాడిని క్ష*మిచేసి తన పర*లోకం లో స్వ*ర్గం కి టి*క్కెట్టు ఇవ్వ*డం లాంటి బిజి*నెస్ డీల్ అనుకున్నావా ?

  16. రాష్ట్రాన్ని ప్రజాధనాన్ని లూటీ చేసినోళ్లను వదిలేసి రికార్డింగ్ డాన్స్ ల వాళ్ళను కోడిపందాల గాళ్ళ మీద పడదామనా అందుకే రాష్ట్రానికి ఇంత అప్పు అయింది

Comments are closed.