తెలుగు హీరోతో హీరోయిన్ పెళ్లి

రష్మిక ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని, అతడ్నే పెళ్లి చేసుకుంటుందనే విషయం తనకు తెలుసని, కానీ ఆ తెలుగు హీరో ఎవరో తనకు తెలియదని అన్నాడు.

హీరోయిన్ రష్మిక, హీరో విజయ్ దేవరకొండ లవ్ ఎఫైర్ ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. ఈమధ్య వీళ్లిద్దరూ తమ లవ్ మేటర్ ను పరోక్షంగా వెల్లడించారు. ఆ మధ్య పుష్ప-2 ఈవెంట్ లో ప్రేమ-పెళ్లి గురించి రష్మికను ప్రశ్నిస్తే, మీ అందరికీ తెలుసు కదా అంటూ సమాధానమిచ్చింది రష్మిక.

ఆ తర్వాత కొన్ని రోజులకు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ కూడా పరోక్షంగా ఇదే విషయాన్ని నిర్థారించాడు. సరైన టైమ్ వచ్చినప్పుడు, మంచి కారణం దొరికినప్పుడు తప్పకుండా లవ్ మేటర్ బయటపెడతానని ప్రకటించాడు. ఇప్పుడీ ఎఫైర్ పై నిర్మాత నాగవంశీ కూడా స్పందించాడు.

విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న ఈ నిర్మాత.. రష్మిక లవ్ మేటర్ తనకు తెలుసన్నాడు. రష్మిక ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని, అతడ్నే పెళ్లి చేసుకుంటుందనే విషయం తనకు తెలుసని, కానీ ఆ తెలుగు హీరో ఎవరో తనకు తెలియదని అన్నాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు వ్యగ్యంగా స్పందిస్తున్నారు. నవ్వు చెప్పకపోయినా మాకు తెలుసంటూ పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, కొత్త ఏడాదిలో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకుంటారట.

అటు విజయ్ దేవరకొండ కూడా తన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు. తన పెళ్లికింకా ఏడాది టైమ్ ఉందంటూ గతంలోనే ప్రకటించిన విజయ్, తాజా ఇంటర్వ్యూల్లో తను చిన్నోడినేం కాదని, పెళ్లీడు వచ్చిందని వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు.

రష్మిక-విజయ్ దేవరకొండ కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. రీసెంట్ గా పుష్ప-2తో హిట్ కొట్టిన రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.

5 Replies to “తెలుగు హీరోతో హీరోయిన్ పెళ్లి”

Comments are closed.