హవ్వ! చంద్రబాబు ఎందుకిలా అయిపోయారు?

ఉచితంగా సర్కారు పెట్టే అన్నం తినేసి మిగిలిన సమయంలో ప్రజలు ఏం చేస్తూ గడపాలి.. టీవీలో సీరియల్స్ చూసుకుంటూ గడపాలా?

అమలు రూపంలోకి వచ్చేసరికి అన్నీ అనుకున్నట్టుగా జరుగుతూ వచ్చాయా లేదా చెప్పలేం గానీ.. నారా చంద్రబాబునాయుడును పెద్ద కలలు కనే దార్శనికుడైన నాయకుడిగా ఒప్పుకుని తీరాలి. ఆయన ఆలోచనలు, ప్రకటించే స్వప్నాలు ఎప్పుడూ చాలా పెద్దవిగా ఉంటాయి. ఆయన దార్శనికతను, ప్రాక్టికల్ పరిపాలనా ధోరణికి కూడా మేధావుల్లో ఒక గుర్తింపు ఉంది. అలాంటి చంద్రబాబునాయుడు ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తున్నారు.

గద్దె ఎక్కిన సందర్భంలో ఆయన తనకు తానుగా.. ‘ఇప్పుడు నేను మారిపోయిన చంద్రబాబును’ అని ప్రకటించుకున్న వైనం మనకు తెలుసు. మార్పు మంచిదే గానీ.. ఆయన సామాజిక వ్యవస్థను మరింత దిగజార్చేలా ఇంత దారుణంగా మారిపోయారా? అనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది.

ఒకప్పట్లో ఉచిత విద్యుత్తు ఇవ్వాలనే ఆలోచననే వ్యతిరేకించిన నాయకుడు చంద్రబాబు. ఇలాంటి ఉచిత పథకాలు ఇస్తూ పోతే.. వ్యవస్థ దెబ్బతింటుందని.. వ్యవస్థను కాపాడడం చాలా కష్టం అవుతుందనే ఆచరణాత్మక దృక్పథం ఆయనలో ఉండేది. తర్వాత ఉచిత పథకాలు, జనాకర్షక తాయిలాల పథకాలకు కొద్దిగా మొగ్గుతూ వచ్చారు. నిజం చెప్పాలంటే.. అలాంటి వాటిలో కొన్ని అవసరం అని కూడా అనిపిస్తుంది.

కానీ తాజాగా ఆయన మాటలను గమనిస్తే.. చంద్రబాబునాయుడు చాలా మారిపోయారు.. సామాజిక వ్యవస్థను దిగజార్చేంతగా ఆయన మారిపోయారు అనే భయం కలుగుతోంది.

పింఛన్ల పంపిణీని ఒకటో తేదీకి ఒకరోజు ముందే చేపట్టడానికి ఆయన నరసరావుపేట పరిధిలోని యల్లమంద గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆరునెలల్లో తాము చేసిన పనులన్నిటినీ ఏకరవు పెట్టారు. అన్న క్యాంటీన్లను పునరుద్ధరించిన సంగతిని కూడా చెప్పుకున్నారు. అదే సమయంలో రాబోయే కాలంలో పేదలకు ఉచితంగా అన్నం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అని కూడా చంద్రబాబునాయుడు ప్రకటించారు.

ఈ హామీలోని మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. పేదలకు ఉచితంగా అన్నం పెట్టడం అంటే ఏమిటి? ‘పేదలు’ అనే ట్యాగ్ లైన్ ఉన్న వారందరికీ, ఏ పనీచేయాల్సిన అవసరం లేకుండా, కష్టపడాల్సిన అవసరం లేకుండా.. మూడుపూటలా ప్రభుత్వం ఇంటికి కేరేజీలు పంపడమో లేదా ఊళ్లలో అన్నదాన సత్రాలు నిర్వహించడమో చేస్తూ ఉంటుందా?

ఉచితంగా సర్కారు పెట్టే అన్నం తినేసి మిగిలిన సమయంలో ప్రజలు ఏం చేస్తూ గడపాలి.. టీవీలో సీరియల్స్ చూసుకుంటూ గడపాలా? ఇంటింటికీ టీవీ పథకమూ, ఉచితంగా ఫైబర్ నెట్ కనెక్షనూ కూడా ఇచ్చే పథకాలు తెస్తే.. పాపం.. వారికి ఖాళీ సమయం బోరు కొట్టకుండా చంద్రబాబు మేలు చేసిన వారవుతారు.. అనే సెటైర్లు పేలుతున్నాయి.

‘చేపను వండిపెట్టడం కాదు.. చేపను పట్టడం ఎలాగో నేర్పు’ అని పెద్దలు అంటారు. అలాంటి వ్యక్తిత్వ వికాస సిద్ధాంతాలు బోలెడు చదువుకున్న చంద్రబాబు.. పేదల్ని మాత్రం వారికి అన్నం పెట్టేసి వారిని ఎందుకూ పనికిరానివారుగా తయారుచేయాలనుకుంటున్నారా? అనేది అర్థం కావడం లేదు. ఈ ఉచిత అన్నం పెట్టే పథకం గురించి మరిన్ని వివరాలు తెలిస్తే తప్ప.. ఆయన ఆలోచన మనకు అర్థం కాదు.

10 Replies to “హవ్వ! చంద్రబాబు ఎందుకిలా అయిపోయారు?”

  1. ఆయన ముందుచూపు ని అర్థం చేసుకొనే రేంజ్ నీది కాదు.. ఆ తెలివితేటలు నీకు లేవు..

    మరిన్ని వివరాలు తెలిసేలోగా.. ఎందుకు తొందరపడుతున్నావు.. ఎందుకు విషం కక్కుతున్నావు..?

    ..

    పని లేకుండా .. ఒళ్ళు వంచకుండా.. కష్టపడకుండా.. ఏదీ ఉచితం ఉండదు.. ఉండకూడదు..

    కాస్త ఆగు.. నువ్వే ఏడుస్తూ ఇంకో ఆర్టికల్ రాస్తావు..

  2. ఆటోవాలా కి పది వేలు ఇచ్చినప్పుడు …వాడు అవి తీసుకొని తొంగుంటాడు అని గుర్తుకురాలేదా?

  3. జూనియర్ లాయర్ కి లా నేస్తం పేరు తో డబ్బు పంచితే వారు సోమరులు అవుతారన్న బుద్ధి అప్పుడు రాలేదా?

  4. అదె సంగ్షెమం జగన్ చెస్తె రాబిన్ హుడ్ అంటూ పొగిడావ్! అసలు అబిరుద్దె అవసం లెదు అన్నావ్! అప్పు ఎంత చెసినా పరవా లెదు అన్నావ్! ఇలా బట్టన్లు నొక్కితె అదె అబిరుద్ది అన్నావ్!

    మరి ఇప్పుడు ఇలా ఎడుస్తున్నవ్ ఎమిటి అయ్యా!!

  5. పేదలంటే పేదలలోని ఒంటరి వృద్దులకు తప్పక భోజనం పెట్టవల్సిందే వాళ్ళ పెన్షన్ లలో కొంత మొత్తం తగ్గించి ఇస్తే సరిపోతుంది

  6. 2029 లో జగన్ గారు ఒక కొత్త పథకం తెస్తారు. దాని కింద ప్రభుత్వమే వంట చేయించి, కారియర్స్ సర్దించి పేదల ఇళ్ళకి పంపిస్తుంది. వలంటీర్స్ అన్నం ముద్దలు కలిపి తినిపిస్తారు.

    1. వాలెంటీర్స్ వలన ప్రజలకి మంచే జరిగింది. చిన్న చిన్న పనుల కోసం ప్రజలు గొవ్త్. offices చుట్టూ తీరకుండానే చాల పనులు వాలెంటీర్స్ వలన అయిపోయాయి. ఇంకా వాళ మీద ఏడుపే.

Comments are closed.