పవర్ స్టార్, డిప్యూటీ సిఎం లాంటి హోదా ఉన్న వ్యక్తి ఏమైనా చెబితే జనం నమ్ముతారు. ఎందుకంటే వాటిలో నిజాలు ఉంటాయని, నిజమే చెబుతారని. కానీ ఇటీవల మీడియాతో ముచ్చటిస్తూ పవన్ మాట్లాడిన మాటలు మాత్రం అలా నమ్మదగినవిగా లేవు. కానీ ఓపెన్‌గా ఏమీ అనక, మరీ ఇలా ఎలా మాట్లాడుతారు అనే కామెంట్లు టాలీవుడ్ ఇన్‌సైడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తారా, సినిమా షూట్ చేసుకుందామా, సినిమా ఫినిష్ చేసి వదులుదామా అని చూస్తున్నారు నిర్మాతలు. అలాంటప్పుడు తను డేట్స్ ఇచ్చినా షూట్ చేసుకోలేదు అంటే ఎలా?
సినిమాకు సంబంధించినంత వరకు ఎక్కడ షూట్ పెడితే హీరో అక్కడకు వెళ్లాలి. కానీ పవన్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు కనుక మంగళగిరి ప్రాంతంలో షూట్ చేస్తేనే తాను చేస్తా అనడం సరి కాదు కదా. కానీ పవన్ ఇలా ఎక్కడ అనరు. అది అర్థం చేసుకోవాలంతే. పవన్ అధికారంలోకి వచ్చి నెలలు దాటిపోతోంది. కానీ ఓజికి కావాల్సింది 20 రోజులు, హరి హరకి కావాల్సింది 8 రోజులు. ఇవి ఇవ్వడానికి కుదరలేదు అనుకోవాలా? డేట్స్ ఇచ్చినా చేసుకోలేదు అనుకోవాలా?
అలాగే ఉస్తాద్‌కి కథ ఇంకా రెడీ కాలేదు అంటున్నారు. కథ రెడీ కాకుండానే సెట్ మీదకు వెళ్లిందా సినిమా? వారం రోజులు షూట్ చేశారా? గ్లింప్స్ వదిలారు. బోలెడు హడావుడి చేశారు. ఇదంతా కథ లేకుండానేనా? ఇలా చెప్పడం దర్శకుడు హరీష్ శంకర్‌ను కార్నర్‌లోకి తోయడమే కదా. నిర్మాతకు పవన్ నేరుగా వత్తిడి చేయవచ్చు కదా, తన సినిమాలు త్వరగా పూర్తి చేసుకోమని, తన సినిమాకు కథ అర్జంట్‌గా రెడీ చేయమని.
ఓజి దర్శకుడు తన తరువాత సినిమాకు స్క్రిప్ట్ తయారుచేసుకునే పనిలో పడ్డారు. హరి హర వీరమల్లు దర్శకుడు తన పాత సినిమా సీక్వెల్ పనిలో ఉన్నారు. ఉస్తాద్ దర్శకుడు ఏం చేస్తున్నారో మరి.
In the name of film delay also our Dy CM promoted himself…🤣🤣
He requires no such artificial augmentations or spurious elevations to bolster his standing, my dear friend.
Just imagine….. రాజమౌళి+ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మూవీ తీస్తే… నిర్మాత ఒక దశాబ్ద కాలం వెయిట్ చెయ్యాలేమో part 1 రిలీజ్ చేయడానికి
tomorrow if harish shankar is really offended then ykaapa will become harish shankar fan also inlines with becoming allu arjun fan on May 11 2024 Nadhyal visit…. If someone is found straining relationships with pawan…. ykaapa is line vaadu maa vaade…. vaaditho janma janmala sambandham…..anyhow its completely twisting the facts…. when pawan first gave dates to ustad movie Harish worked on his own script called bhavadeeyudu bhagat singh for which look test & demo shoots were done, posters were also released…. pawan has concerns with the script, harish could not satisfy him changes in script and shooting schedules were cancelled….latter harish shankar blended few of bhavadheeyudu bhagat singh story with Teri movie story and prepared a new script, which pawan liked….. pawan latter gave another set of dates for which one schedule of shooting completed and a glimpse has been released prior to election…. story lekundaa shooting chesaraa, harish ni corner chesaaraa….
In the mean time another movie from 3vikram will be announced ..will start during end 2025 and completes march 2027…. the movies already in the pipe line will never get finished. those movies should release in OTT as a documentary (glimpse of PK film life).