కొత్త ఏడాది వచ్చేసింది. మరి కొత్త ఏడాదిలోనైనా గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం అసెంబ్లీకి వస్తాడా? ఆయన పార్టీతోపాటు ఇతర పార్టీల్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది. గత ఏడాది ఆయన ఒక్కరోజు మినహా అసెంబ్లీకి రాలేదు.
చివరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపడానికి, ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించడానికి ఏడాది చివర్లో ఒక్కరోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. దానికీ కేసీఆర్ హాజరు కాలేదు.
ఆయన వచ్చి ఉంటే బాగుండేదని ఆయన పార్టీ నాయకులే కాదు ఇతర పార్టీ నాయకులు కూడా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే తెలంగాణ బిల్లు పార్లమెంటులో నెగ్గేలా కృషిచేసిన ప్రధాని మన్మోహన్. అంతే కాకుండా కేసీఆర్ ఆయనకు సన్నిహితుడు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు తెలియదా? మరి ఆయన ఎందుకంత అవమానంగా ఫీలవుతున్నాడో అర్థం కావడంలేదు. వాస్తవానికి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి సరైన కారణం ఇప్పటివరకు బయటకు రాలేదు.
అవమానంగా ఫీలవుతున్నాడని, రేవంత్ రెడ్డికి ఎదురుపడటం ఇష్టం లేదని అనుకోవడమే తప్ప అవే కారణాలు అవునో కాదో చెప్పలేం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏ పరిస్థితినైనా తట్టుకొని నిలబడతారు. అందులోనూ కేసీఆర్ ఉద్యమ నాయకుడు.
తెలంగాణ వచ్చుడో …కేసీఆర్ సచ్చుడో అని నినదించిన కేసీఆర్ జస్ట్ అసెంబ్లీకి రావడానికి భయపడతాడా? ఇక అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన హరీష్ రావు కేసీఆర్ కు అసెంబ్లీలో తగిన గౌరవం లభించపోవడం వల్లనే ఆయన అసెంబ్లీకి రావడం లేదన్నాడు. కేసీఆర్ గత ఏడాదంతా అసెంబ్లీకే రాలేదు. ఇక ఆయనకు గౌరవం లభించకపోవడమన్న ప్రశ్నే లేదు కదా.
హరీష్ రావు మామను సమర్ధించే క్రమంలో అలా అని ఉండొచ్చు. అసెంబ్లీ అంటేనే వాదోపవాదాలు, విమర్శలు ఉంటాయి కదా. అసెంబ్లీలో, పార్లమెంటులో సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ కు ఈ సంగతి తెలుసు కదా. విభజిత ఏపీకి మొదటి సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రెండోసారి ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది.
కానీ ఆయన అసెంబ్లీకి పోకుండా ఉండలేదు. గత ఎన్నికల్లో ఆయన జనసేన, బీజేపీతో కూటమి ఏర్పాటుచేసి అధికారంలోకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ అధికారంలోకి రావొచ్చేమో ఎవరు చెప్పగలరు? ఆరు నెలలకొకసారి అసెంబ్లీకి హాజరై సంతకం చేయాలనే నిబంధన ఉంది. కొత్త ఏడాదిలో అలా సంతకం చేసి వెళ్ళిపోతాడా? అసెంబ్లీ కార్యాక్రమాల్లో పాల్గొంటాడా? చూడాలి.
లెవన్మోహన్ గాడు ,ఈ కచరా గాడు ఈ సంవత్సరం కాదు.. ఇక ఏ సంవత్సరం అసెంబ్లీలో కి అడుగు పెట్టలేరు.
Jagan should be disqualified for not attending assembly along with KCR. I will be fired if I dont go to office. Same logic applies here.