జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ఈ నెల 8న సమావేశం కానుంది. ఈ సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం జమిలి ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో వుంది. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఏదైనా చేస్తారనే ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే.
జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం లేదు. విపక్ష పార్టీల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆ పార్టీల్లో ఏవో భయాలున్నాయి. వాటన్నిటిని జేపీసీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం వుంది. అసలు జమిలి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ఎందుకంత ఆత్రుత పడుతోందనే ప్రశ్న విపక్షాల నుంచి వస్తోంది. ఎన్నికల ఖర్చు తగ్గించడానికి, అలాగే ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించొచ్చని బీజేపీ వాదిస్తోంది.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా, జమిలి ఎన్నికలు సాధ్యం కాదని మెజార్టీ అభిప్రాయం. ఎందుకంటే జమిలి ఎన్నికలపై బీజేపీలోనే ఏకాభిప్రాయం లేదని చెప్పేవాళ్లు లేకపోలేదు. అయితే సొంత పార్టీ ప్రజాప్రతినిధుల్ని దారిలోకి తెచ్చుకోవడం బీజేపీకి పెద్ద కష్టమేమీ కాదు. ఈ నెల 8న జేపీసీ నిర్వహించే కీలక సమావేశంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయో చూడాలి. ఏది ఏమైనా ఈ సమావేశంపై అందరి దృష్టి పడింది.
తొందరగా జమిలికి లైన్ క్లియర్ చేసి ఏపి లో ఎన్నికలు జరిపించాలని కోరుతున్న అన్నయ్య..
(పరదాలు లేకుండా పర్యటనలు చేయడం కష్టం గా ఉందంట)