సభ్యత్వ నమోదుపై వైసీపీ అలసత్వం ప్రదర్శిస్తోంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు అసలు పార్టీ గురించి జగన్‌తో పాటు ఇతర ముఖ్య నాయకులెవరూ పట్టించుకోలేదు. బహుశా ఇలా ఏ పార్టీ వ్యవహరించి వుండదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందులోని మూడు పార్టీలు సభ్యత్వంపై దృష్టి సారించడాన్ని గమనించొచ్చు.
తాజాగా టీడీపీ కోటి సభ్యత్వాల నమోదే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికి 94 లక్షల మంది సభ్యత్వాలు నమోదు చేసుకోవడం విశేషం. ఏ పార్టీకైనా సభ్యత్వాలు అత్యంత కీలకం. ఎందుకనో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభ్యత్వాల నమోదుపై అసలు ఆసక్తి కనబరచడం లేదు. ఎంతసేపూ పోరాటాలపై ఆరాటం తప్ప, సభ్యత్వాలను పెంచుకోవాలనే ధ్యాసే లేదు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇప్పుడు కావాల్సినంత తీరిక వుంది. క్షేత్రస్థాయిలో అన్ని రకాల కమిటీలను చకచకా ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఇచ్చారు. ఇదే సందర్భంలో సభ్యత్వాలపై టార్గెట్ పెడితే బాగుంటుంది. అది కూడా నిజాయతీగా సభ్యత్వాలను చేర్పించాలి.
సహజంగా సభ్యత్వాల నమోదు ఎలా వుంటుందంటే… నాయకులే సభ్యత్వ రుసుం చెల్లించి, తమకు తెలిసిన వాళ్ల పేర్లపై తీసుకుంటుంటారు. దీంతో భారీగా సభ్యత్వాలు నమోదు చేయించినట్టు అధినాయకుల్ని మోసగిస్తుంటారు. ఇందుకు టీడీపీ, జనసేన నాయకులు అతీతం కాదు. అధినాయకులు తమ పార్టీ సభ్యత్వాలు పెద్ద మొత్తంలో ఉన్నట్టు మురిసిపోతుంటారు. నిజాయతీగా చేసే వాళ్లతో ఇబ్బంది లేదు. కానీ మభ్యపెట్టేవాళ్లతోనే అసలు సమస్య.
వైసీపీ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించాల్సిన అవసరం వుంది.
జెండా పీకేసే టైం వచ్చింది.!
మా అసమర్ధ ల0గా గాడ్ని వదిలేసి ఉన్న నాయకులే ఎగిరిపోతుంటే, ఇక కార్యకర్తలు గా చేరుతామంటూ ఎదురు డబ్బులు ఇచ్చి ఎవడు సభ్యత్వం తీసుకుంటాడు??
అయినా ‘EVM లు కదా గెలిపించేది??
పార్టీ కి కార్యకర్తలు ఎందుకూ??
ఆంధ్ర రాష్ట్రం లో వైసీపీ సభ్యత్వం తీసుకుంటే.. వాడిని కొండగొర్రె గానో.. గ్రహాంతరవాసి కప్ప గానో చూస్తున్నారు..
పైగా జగన్ రెడ్డి అభిమాని అంటే.. కనీస గౌరవం ఇవ్వడం లేదు..
డబ్బులు దొబ్బేస్తాడని డబ్బు దాచుకొంటున్నారు.. పిల్లల్ని ఎత్తుకుపోతాడేమో అని పిల్లలను దాచేస్తున్నారు.. స్థలాలు కబ్జా చేస్తాడని కంప్లైంట్స్ ఇస్తున్నారు..
..
అందుకే మొన్న జగన్ రెడ్డి పులివెందుల కి వెళితే జగన్ రెడ్డి ని కొట్టడానికి అప్పులోళ్లు వెళ్లారు.. దెబ్బకి బెంగుళూరు పారిపోయాడు.. ఫ్లైట్ కాన్సల్ అయితే రోడ్డు మార్గం లో తుర్రుమన్నాడు .. సన్నాసి.. పిరికిపంద.
మన అన్నయ్య ఇమేజ్ ఉంటే సరిపోతుంది కదా పార్టీ గెలవడానికి
wrong, జనాలకే ycp అంటే అలసత్వం!!
wrong, జనాలకే ఆ పార్టీ అంటే అలసత్వం!!