యూఎస్ లోని డాలస్ లో జరిగిన ఈవెంట్ లో ట్రయిలర్ రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. అది మిస్సవ్వడంతో, హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన భారీ కార్యక్రమంలో రిలీజ్ చేస్తారని భావించారు. ఆ తర్వాత భారీ కటౌట్ ఆవిష్కరణ సందర్భంగా వస్తుందని అనుకున్నారు. చివరికి న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న ట్రయిలర్ రిలీజ్ చేస్తారని భావించారు.
అయితే ప్రతి సందర్భంలో గేమ్ ఛేంజర్ ట్రయిలర్ వాయిదా పడుతూనే ఉంది. ఒక దశలో ట్రయిలర్ రిలీజ్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపు లేఖ కూడా బయటకొచ్చింది. ఎట్టకేలకు రామ్ చరణ్ సినిమా ట్రయిలర్ పై అప్ డేట్ ఇచ్చారు.
రేపు గేమ్ ఛేంజర్ ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు. సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఈ సినిమా ట్రయిలర్ అందుబాటులోకి రానుంది. ట్రయిలర్ వస్తే సినిమాపై మరింత క్లారిటీ వస్తుంది.
శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా మూడేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకుంది గేమ్ ఛేంజర్ సినిమా. ఎట్టకేలకు ఈ సినిమాను పూర్తి చేసి, క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇంకాస్త టైమ్ తీసుకొని సంక్రాంతికి రావాలని నిర్ణయించుకున్నారు. జనవరి 10న గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి వస్తుంది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు కూడా తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. సుకుమార్, చిరంజీవి లాంటి కొంతమంది ప్రముఖులు ఆల్రెడీ ఈ సినిమా చూశారు.
Hollywood movies most of them completes in 1-2 years but our makers taking average 2 plus years – Pushpa 2, GC, GK, Devara, Indian 2 etc and final product is not extraordinary. Why wasting producer time and money
Director shankar flop director no expectations on game changer movie
Benefit shows cancel cheyandi malli pushpa movie theatre ghatana repeat avakudadhu