పవన్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్

‘మాట వినాలి’ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను 6వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు.

పవన్ కల్యాణ్ అభిమానులకు కొత్త ఏడాదితో తీపి కబురు అందించింది హరిహర వీరమల్లు సినిమా యూనిట్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు సరికొత్త పోస్టర్ తో ప్రకటన విడుదల చేశారు.

‘మాట వినాలి’ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను 6వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. స్వయంగా పవన్ కల్యాణ్ ఈ పాట పాడారు.

పవన్ కల్యాణ్ కు పాటలు పాడడం కొత్త కాదు. గతంలో జానీ, ఖుషి, తమ్ముడు, అత్తారింటికి దారేది సినిమాల్లో చిన్నచిన్న సాంగ్స్ పాడారు. హరిహర వీరమల్లులో ఆయన ఫుల్ లెంగ్త్ పాట పాడారా.. ఎప్పట్లానే బిట్ సాంగా అనేది తేలాల్సి ఉంది. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా 8-9 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. మార్చి 28న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. బాబీ డియోల్ విలన్ గా నటించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటించారు. అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది.