ఆయన రాజకీయ అదృష్టవంతుడు

ఈ మాట ఏపీ రాజకీయాలలో ఎవరికి సరిపోతుంది అన్నది.. రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారికి ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. అప్పట్లో అంజయ్య జంబో జెట్ మంత్రి వర్గంలో లక్కీగా మంత్రి అయి…

ఈ మాట ఏపీ రాజకీయాలలో ఎవరికి సరిపోతుంది అన్నది.. రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారికి ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. అప్పట్లో అంజయ్య జంబో జెట్ మంత్రి వర్గంలో లక్కీగా మంత్రి అయి ఆ తరువాత ఏపీ రాజకీయాల్లో నాలుగున్నర దశాబ్దాలుగా తనదైన శైలిలో రాణిస్తున్న చంద్రబాబు కంటే రాజకీయ అదృష్టవంతుడు ఉంటారా అని కూడా అంటారు.

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లుగా రాజకీయాల్లోకి అప్పుడే వచ్చి కాంగ్రెస్ మహా సముద్రంలో ఈదుతున్నా చంద్రబాబు కోసమే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారా అన్నది తరువాత కాలంలో అందరికీ డౌట్లు వచ్చాయి. చివరికి అదే నిజం అయింది కూడా.

పార్టీని పెట్టిన ఎన్టీఆర్ 14 ఏళ్ల పాటు మాత్రం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నుంచి పార్టీ తీసుకున్న బాబు మూడు దశాబ్దాలుగా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ తరానికి టీడీపీ సంస్థాపకుడు ఎవరు అంటే బాబు అని చెప్పినా ఆశ్చర్యం లేదు

నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా కావడం అన్నది కూడా తెలుగు రాజకీయాల్లో మరొకరికి కలగని అదృష్టమే. ఇవన్నీ చూసిన బాబు సమకాలీనుడు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ బాబు కంటే రాజకీయ అదృష్టవంతుడు ఎవరూ లేరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు.

విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయాల్లో బాబుకు ఉన్నంత లక్ ఎవరికీ లేదని అన్నారు. తనకు చంద్రబాబు అయిదు దశాబ్దాలుగా తెలుసు అని అన్నారు. ఈ రోజున దేశ రాజకీయాలే ఆయన చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. బాబు తలచుకుంటే ఏమైనా చేయవచ్చునని అంతటి రాజకీయ శక్తి ఆయనకు ఉందని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడే సత్తా బాబుకు మాత్రమే ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు వారిని వీరినీ డిమాండ్ చేయడం మాని బాబు ఇంటి ముందు ధర్నా చేస్తే ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆగుతుందని సలహా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ మీద చింతా మోహన్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా అతి పెద్ద కుంభకోణం ఈ ప్రాజెక్ట్ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మాదిరిగానే పోలవరం మీద కూడా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు

మతాన్ని అడ్డుకు పెట్టుకుని దేవుడిని మధ్యలోకి లాగి జగన్ ని ఇబ్బంది పెట్టలేరని, జగన్ ని భారీ షాక్ ఇవ్వాలంటే ఆయన బెయిల్ రద్దు చేయించండి అని చంద్రబాబుకు పవన్ కి ఆయన సూచించారు. తిరుమల లడ్డూ గురించి మాట్లాడటం మంచిది కాదని సూచించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎపుడైనా కూలిపోవచ్చు అని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

8 Replies to “ఆయన రాజకీయ అదృష్టవంతుడు”

  1. విశాఖపట్నం లో ప్రసిద్ధి పొందిన అస్పత్రి లో చికిత్స ఏమైనా చేయించుకున్నాడేమో, ఇంకా నయం కాలేదు కాని కొంచం ఫర్వాలేదు,

    1. మీకు బీజేపీ మీద ప్రేమ కన్నా,

      చంద్రబాబు, పవన్, చిరంజీవి లా మీద ద్వేషం ఎక్కవ

      విచిత్రంగా జగన్ కి అనుకూలము అని

      కనిపిస్తూ వుంటది మీ కామెంట్ల లో.

      మిమ్ములను అంతగా వారు ఏం ఇబ్బంది పెట్టారు.

      1. 2014 కి ముందు బేసిక్ గా ఏపీ విషయం లో టీడీపీ కంటే కాంగ్రెస్ ని ఫేవర్ చేసేవాణ్ణి. ఇక నేను సూపర్స్టార్ కృష్ణ ఫాన్ ని కనుక మెగా హీరో లకి వ్యతిరేకం!

  2. ఔను…చంద్రబాబు-రాజకీయ-అద్రుష్టవంతుడు…మన-జగనన్న-రాజకీయ-దరిద్రుడు…151-సీట్లతో-అధికారం-ఇస్తే…అద్రుష్టం-చేజార్చుకున్న-దరిద్రపు-దద్దమ్మ

Comments are closed.