కథలు ఎంపిక, పాత్రల విషయంలో మహేష్ బాబు ఎంత సెలక్టివ్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మరీ మాస్ పాత్రలు అతడు చేయడు. అందుకే గతంలో సుకుమార్ చెప్పిన ఓ లైన్ ను తిరస్కరించాడు కూడా.
మేకోవర్ విషయంలో కూడా మహేష్ బాబుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. మొన్నటివరకు తెరపై లుంగీ కట్టడానికి కూడా ఇష్టపడలేదు ఈ హీరో. ఇలాంటి హీరో, రాజమౌళి సినిమా కోసం ఫుల్ గా ఓపెన్ అయ్యాడని, తన చుట్టూ ఉన్న బౌండరీస్, గేట్స్ అన్నీ తెరిచాడని అంటున్నాడు సుధీర్ బాబు.
“బాగా కండలు పెంచడం, షర్ట్ విప్పడం లాంటివి మహేష్ కు నచ్చవు. ఆయన సన్నగా ఉండేందుకే ఇష్టపడతాడు. ఆయన తన చుట్టూ ఓ చట్రం పెట్టుకున్నాడు. రాజమౌళి సినిమాకు మాత్రం మహేష్ బాబు ఎలాంటి బౌండరీస్ పెట్టుకోలేదు. నాకు తెలిసి రాజమౌళికి మహేష్ బాబు సరెండర్ అయిపోయారు.”
మహేష్ తనకుతాను పరిమితులు విధించుకుంటున్నారని అభిప్రాయపడ్డాడు సుధీర్ బాబు. అతడు మరింతగా తన పరిధిని విస్తృతం చేసుకోవచ్చని, తన చుట్టూ ఉన్న గోడల్ని పడగొట్టాల్సిన టైమ్ వచ్చిందని అన్నాడు.
మహేష్ ప్రస్తుతం కనిపిస్తున్న లుక్ ఫైనల్ కాదంటున్నాడు సుధీర్ బాబు. పూర్తిస్థాయిలో జుట్టు, గడ్డం పెంచిన తర్వాత అప్పుడు అసలైన మేకోవర్ కోసం, రకరకాల లుక్స్ ప్రయత్నిస్తారని, ఆ వర్క్ షాప్ త్వరలోనే మొదలవుతుందని చెబుతున్నాడు.
“నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందిపెడుతున్న Swiggy ని ఆంధ్రప్రదేశ్‌లో బహిష్కరించాలని హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి”
మొత్తానికి ఆంధ్రా అంటే కేంద్రానికే కాదు, Swiggy లాంటి వారికి కూడా లోకువయిపోయింది.
సెల్ఫ్ పీటీ బాగా ముదిరి పోయింది!
vc available 9380537747
Call boy works 9989793850
మహేష్ పూర్తిస్థాయిలో జుట్టు పెంచడం ఏమిటి, hair piece కదా
మాకు కూడా థియేటర్లు నచ్చవు