ఈ వ్యాసం చదివేందుకు ముందు ‘‘అదిగో పులి.. యిదిగో తొండం’’ ఆర్టికల్ చదవగోర్తాను. ఆ ఆర్టికల్ చదివిన తర్వాత కూడా అనేకమంది కొన్ని సందేహాలు లేవనెత్తుతూ వచ్చారు. ఇప్పటిదాకా లభిస్తున్న సమాచారాన్నంతా ఒక ఆర్డరులో పెట్టుకుంటే మనకు ఏ గందరగోళమూ లేకుండా క్లియర్‌గా పిక్చర్ అర్థమౌతుంది.
1) వివాదానికి కేంద్రబిందువు ఎఆర్ డెయిరీ. అది తక్కువ రేటుకే నెయ్యి సప్లయి చేస్తాననడంతో దాని నేతి క్వాలిటీపై అనుమానం వచ్చింది ఈఓ గారికి. ఇక అక్కణ్నుంచి కథ ప్రారంభమైంది. టిటిడికి ఏడాదికి కావలసినది 5400 టన్నుల నెయ్యి. దాన్ని 5గురు సప్లయిర్ల నుంచి సేకరిస్తారు. ఆర్నెల్లోకోసారి టెండరు పిలుస్తారు. మేలో ఎఆర్ దక్కించుకున్న టెండరు వెయ్యి టన్నులకు. అంటే 20%. దాంతో పాటు మరో నలుగురు సప్లయిర్లు ఉన్నారు. ఈ టెండరింగు ప్రాసెస్ వైసిపి హయాంలో ప్రారంభమైంది. తక్కిన సప్లయిర్ల రేటు రూ. 411 వరకు వుండగా యిది రూ.320 (రూ.319.80)కే ఆఫర్ యిచ్చింది.
ఇది టెండర్‌లో పాల్గొనడానికి వీలుగా వైవి సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉండగా నిబంధనలలో అనేక వెసులుబాట్లు యిచ్చారు. కంపెనీ టర్నోరు, కెపాసిటీ యిత్యాది విషయాలను రిలాక్స్ చేశారు. టిటిడి బోర్డులో, పర్చేజింగ్ కమిటీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు, ప్రముఖులు ఉన్నా పరామీటర్స్ డైల్యూట్ చేయవలసిన అవసరమేమొచ్చిందని అడిగినట్లు యిప్పటిదాకా తెలియదు. దీనిపై రాబోయే రోజుల్లో సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కున్నా ఎదుర్కోవచ్చు.
2) ఏఆర్‌కి కాంట్రాక్టు దక్కింది. అది నెయ్యి సప్లయి చేసేనాటికి టిడిపి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కొత్త ఈఓ వచ్చారు. చైర్మన్ యింకా ఎవరూ రాలేదు కాబట్టి, యీయనదే సర్వాధికారం. లడ్డూ, నేతి విషయం కొంచెం గమనించుకో అని బాబు తనను హెచ్చరించారని ఈఓయే చెప్పారు. ఏఆర్ స్థానంలో హెచ్చు రేటు పెట్టి మరొకరిని తేవాలనే సూచన దానిలో ఉండి ఉండవచ్చు. అందుకని తక్కిన వారి మాట ఎలా ఉన్న ఈఓ ఏఆర్పై బాణాన్ని ఎక్కుపెట్టారని అనుకోవచ్చు. దాన్ని బద్నామ్ చేసి తీసి పారేస్తే కానీ హెచ్చు రేటు పెట్టి మరొకర్ని ఎందుకు తెచ్చారన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం.
3) ఏఆర్ జూన్ 12, 21, 25, జులై4న తారీకుల్లో 4 ట్యాంకర్ల నేతిని సప్లయి చేసింది. అవి ఓకే అయిపోయాయి. జూన్ 16న చార్జి తీసుకున్న ఈఓ తన ఉద్యోగంలో కుదురుకున్నాక జులై 6, 12 తారీకుల్లో సప్లయి చేసిన తలా రెండు అనగా 4 ట్యాంకర్ల నాణ్యతపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. టిటిడి లాబ్స్‌లో టెస్ట్ చేసి, నాణ్యత లేదని తేల్చుకున్నారా అనేది యింకా బయట పెట్టలేదు. లాబ్ ఉందని టిటిడి వెబ్‌సైట్‌లో ఉండగా అసలు లాబే లేదని (ఉంది కానీ వర్కింగ్ కండిషన్‌లో లేదనే సాకు కూడా చెప్పలేదాయన), ఎన్‌డిడిబి ఉచితంగా యిచ్చే యంత్రం కోసం ఎదురు చూస్తున్నామని, యీలోగా చేసిన భౌతిక పరీక్షలో నెయ్యి నాణ్యత లేనిదని తేలిందని ఈఓ అన్నారు. అందుచేత ఆ నేతిని వాడలేదని చెప్పారు. ఇక్కడి వరకు క్లియర్. (వాడారని చంద్రబాబు అన్నదానిపై తర్వాత మాట్లాడదాం).
4) క్వాలిటీ లేదనిపించిన నేతిని తిప్పి పంపడం టిడిపి హయాంలో 14 సార్లు, వైసిపి హయాంలో 18 సార్లు జరిగింది. అప్పుడెప్పుడూ దీన్ని యింకో ల్యాబ్‌కు పంపి వెరిఫై చేయించలేదు. ఇప్పుడు మాత్రం చేయించారు. ఎందుకు అనేదే ప్రశ్న. కల్తీ నేతిని వాడేశారంటూ బాబు చేసిన ఆరోపణకు వత్తాసు పలకడానికి సుప్రీం కోర్టులో సిద్ధార్ఱ లూథ్రా ‘కల్తీ నేతిని లడ్డూ తయారీలో ఉపయోగించారు. అందుకే దాని రుచిలో తేడా వచ్చింది.’ అని చెప్పారు. వెంటనే న్యాయమూర్తి ‘అయితే ఆ రుచి లేని లడ్డూని పరీక్షకై ల్యాబ్‌కి పంపారా?’ అని అడిగారు. దానికి లూథ్రా వద్ద సమాధానం లేదు. లడ్డూని పంపలేదు, నేతినే పంపారు. ‘సరే, ఐదుగురు కాంట్రాక్టర్ల నుంచి నేతిని సేకరిస్తున్నామని అన్నారు. వాటన్నిటినీ కలిపేస్తారా? విడివిడిగా పెడతారా?’ అని న్యాయమూర్తి అడిగారు. లూథ్రా ‘కలిపేస్తారు’ అనగానే ‘అలా అయితే, లడ్డూలో నాణ్యత లేకపోతే ఎవరు సరఫరా చేసిన నెయ్యి కల్తీది అని నిర్ధారించడం ఎలా?’ అని జజ్ నిలదీశారు.
5) ఇదే ప్రశ్న ఏఆర్ అడుగుతోంది. ‘నేతిని టిటిడికి సప్లయి చేయబోయేముందు ఎన్ఏబిఎల్ (National Accreditation Board for Testing and Calibration Laboratories) ఎక్రెడిషన్ ఉన్న చెన్నయ్ ల్యాబ్ నుంచే సర్టిఫికెట్టు తెచ్చుకున్నాం. ఇప్పుడు టిటిడి శాంపుల్ పంపించిన ఎన్‌డిడిబికి కూడా అదే ఎక్రెడిషన్ ఉంది. అందువలన ఎన్‌డిడిబిదే కరక్టు అని ఎలా అనగలరు? ఒకవేళ కరక్టు అనుకున్నా, దానికి శాంపుల్ పంపబోయే ముందు మీరే దానిలో ఏదో కలిపి ఉంటారని మేమెందుకు అనుకోకూడదు? ఎందుకంటే మీరు రహస్యంగా పంపామంటున్నారు. మా ఎదుట శాంపుల్ తీయలేదు – రహస్యంగా తీయవలసిన అవసరం ఏమొచ్చింది?’ ఇదీ ఏఆర్ లాజిక్. బెయిలు పిటిషన్ విచారిస్తున్న హైకోర్టు లేదా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు యీ విషయంపై కూడా ప్రశ్నలు లేవనెత్తవచ్చు.
6) ఇప్పటికే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ‘క్వాలిటీ టెస్టింగ్ లాబ్స్ అన్ని ఉండగా ఎన్‌డిడిబి ల్యాబ్‌కే ఎందుకు పంపారు? వారికి పంపించిన శాంపుల్‌ను ఎక్కణ్నుంచి తీశారు? లడ్డూకి వాడిన నేతిలోంచి తీశారా? అది చెప్పండి. శాంపుల్ టెస్ట్ చేసిన ఎన్‌డిడిబి ల్యాబ్ సైతం యితమిత్థంగా (కన్‌క్లూజివ్‌గా) ఏమీ చెప్పలేదు. ‘అది కావచ్చు, యిది కావచ్చు, దీనిలో పాజిటివ్ వచ్చినా అది ఫలానా ఫలానా కారణాల వలన ఫాల్స్ పాజిటివ్ కావచ్చు.’ అంటూ అనేక డిస్‌క్లయిమర్స్‌తో సందిగ్ధంగా చెప్పినప్పుడు సెకండ్ ఒపీనియన్‌కు యింకో ల్యాబ్‌కు ఎందుకు పంపలేదు?’ అని అడిగారు. లూథ్రా ‘ఎన్‌డిడిబి పేరుమోసిన ల్యాబ్..’ అని ఏదో చెప్పబోతే ‘దేశంలో అదొక్కటే కాదు, పేరు మోసిన ల్యాబ్‌లు చాలా ఉన్నాయి, దగ్గరున్న మైసూరు ల్యాబ్‌కో లేక ఘాజియాబాద్ ల్యాబ్‌కో ఎందుకు పంపలేదు అని అడిగింది. ‘కాన్ఫిడెన్షియల్‌గా పంపించి, రిపోర్టు తెప్పించామని ఈఓ అంటున్నారు. మరి ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు టిటిడి ఆఫీసు నుంచి ఎలా వెలువడింది?’ అని జగన్ అడిగాడు.
7) న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలిన లూథ్రా వెంటనే ‘గత 50 ఏళ్లగా ‘‘నందిని’’ నెయ్యి వాడుతున్నారు. వైసిపి హయాంలోనే కాంట్రాక్టర్ని మార్చారు.’ అంటూ సంబంధం లేని మాటలు మాట్లాడుతూ కోర్టులో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేశాడు. ప్రతీ ఆర్నెల్లకు టెండర్లు పిలుస్తున్నపుడు, ఐదుగురేసి సప్లయిర్లు ఉన్నపుడు 50 ఏళ్ల పాటు ఒకే సప్లయిరు ఎలా ఉంటారు? ‘‘నందిని’’ని 2015లో బాబు హయాంలోనే టిటిడి మార్చింది. వైసిపి హయాంలో తిరిగి కొంతకాలం సప్లయి చేసింది. ఇదంతా రికార్డయి ఉంది. ‘‘నందిని’’ నెయ్యి తీసుకోకపోతే చాలు, కల్తీ అయిపోయినట్లే అనే బిల్డప్ టిడిపి నాయకులు, నందిని సమర్థకులు యిస్తే, చెల్లిపోతుంది కానీ న్యాయస్థానంలో చెల్లుతుందా?
ఏఆర్‌ను తీసేసి, నందినిని తీసుకురావడానికే మొత్తం కసరత్తు జరిగిందనేది స్పష్టంగా కనబడుతోంది. ఈ రోజుల్లో ప్రభుత్వసంస్థలన్నా, కోఆపరేటివ్ సంస్థలన్నా చులకనగా ఉంటోంది. ప్రయివేటు యాజమాన్యంలో సంస్థలకే ప్రాధాన్యత యిస్తున్నారు. అలాటిది ప్రస్తుత టిడిపి ప్రభుత్వానికి నందిని అంటే హఠాత్తుగా ముద్దు వచ్చింది. ఇది యిప్పుడు మాత్రమే. నందిని మొత్తం నేతి అవసరాల్లో 20% మాత్రమే సప్లయి చేయగలిగేది. 2011లో రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం ఉండగా ఒకసారి తప్పించారు. ఆంధ్రలో బాబు ప్రభుత్వం ఉండగా 2015లో మరోసారి తప్పించారు.
8) బాబు వచ్చాకనే 2014 అక్టోబరు నుంచి నందిని రూ.306 రేటు చొప్పున టెండర్ కాల్- ఫర్ చేసిన క్వాంటిటీలో 65% సప్లయి చేసింది. 35% ఇండాపూర్ డెయిరీ రూ. 325 చొ.న సప్లయి చేసింది. (ఎల్1కి 65%, ఎల్2కి 35% యిస్తున్నట్లుంది) 2015 జూన్‌లో 1700 టన్నుల నేతికై టెండర్లు పిలిచినప్పుడు నందిని రూ.324 కోట్ చేస్తే పైఠాన్, మహారాష్ట్రకు చెందిన గోవిందా సంస్థ కిలో నెయ్యికి రూ.276 కోట్ చేయడంతో నందినిని తప్పించేసి, గోవిందాకు 65% కాంట్రాక్టు యిచ్చేశారు. రేటు తక్కువగా కోట్ చేస్తున్నారంటే క్వాలిటీ బాగా లేనట్లే అని వాదిస్తున్న యిప్పటి ఈఓ, అప్పుడు గోవిందా కూడా తక్కువ క్వాలిటీ నెయ్యి సప్లయి చేసిందని ఒప్పుకుంటారా? టెండరు కోల్పోయిన సప్లయిరు ఏమైనా అనవచ్చు. 2015లో నందిని వాళ్లు అప్పుడు టిటిడిపై అలిగి ప్రెస్‌కు వెళ్లారు.
9) గతంలో 400కు పైన రేటు కోట్ చేసిన ఏఆర్ యిప్పుడు రూ. 320లకే ఎలా చేస్తోంది, ఏదో కల్తీ చేయకపోతే? అనే వాదన ఒకటుంది. దానికి సమాధానంగా పురుషోత్తమ రెడ్డిగారు ఒక వీడియో చేశారు. (ఈ వివరాలు ఈఓ గారు సిఎంఓకు యిచ్చిన నోట్‌లో పొందు పరచలేదు) ప్రస్తుతం ఏఆర్‌ను జులైలో బ్లాక్‌లిస్ట్ చేసి ఆగస్టులో టెండర్లు పిలిస్తే నందిని రూ. 470, దిల్లీకి చెందిన ఆల్ఫా రూ. 530 కోట్ చేశాయి. జగన్ రివర్స్ టెండరింగు విధానాన్ని ఎద్దేవా చేసిన (లోకేశ్ ఒకసారి వెనక్కి నడుస్తూ ప్రదర్శన చేశారు కూడా) టిడిపి హయాంలోనే ఈఓ రివర్స్ టెండరింగును అమలు చేశారు. రూ.530 కోట్ చేసిన ఆల్ఫా యీసారి రూ.450 కోట్ చేసింది. నందిని మాత్రం రూ.470కి తగ్గలేదు. ఆల్ఫా ఎల్1గా, నందిని ఎల్2గా తేలింది. అందువలన రూలు ప్రకారం ఆల్ఫా రేటు రూ. 450 తోనే ఆల్ఫాకు 65%, నందినికి 35% ఆర్డరు యిచ్చారట.
10) నందిని కంటె ఆల్ఫా తక్కువగా కోట్ చేసింది కాబట్టి, అది కల్తీ నెయ్యి సప్లయి చేస్తోందని అందామా? నందిని అంత గొప్పదే అయితే దానికే 100% ఆర్డరు యివ్వాలి కదా, రేటు కారణంగా దానికి 35% మాత్రమే యివ్వడమేమిటి? రేటు మాట ఎలా ఉన్నా నాణ్యత కదా చూడాల్సింది. దానిలో తప్పు ఉంటే తిరస్కరించే హక్కు టిటిడికి ఎప్పుడూ ఉంటుంది. దాన్ని వాడుకోకుండా, గాలిలో ఆరోపణలు చేస్తే నిలుస్తాయా? ఏఆర్‌కు తగినంత కెపాసిటీ లేదని, యితరుల నుంచి సేకరించి ఉంటుందని, అందుకే కల్తీ జరిగిందని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు. కానీ దాన్ని ప్రూవ్ చేయగలిగితేనే యాక్షన్ తీసుకోగలరు. కానీ ఈఓ గారికి ఆ పట్టింపులు లేవు.
11) ప్రస్తుతం టిటిడి నందినిని ఫేవర్ చేస్తోందని యింతకంటె రుజువులు అక్కరలేదు. దీనికి గాను ఏఆర్‌ను తరమాలని ఈఓ నిశ్చయించుకున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా తిరస్కరించిన నేతి ట్యాంకరు నుంచి శాంపుల్ తీసి (ఇది ప్రశ్నార్థకం. శాంపుల్ తీయడం, సీళ్లు వేయడం, ఎన్‌డిడిబి ల్యాబ్‌లో ఆ సీళ్లు విప్పడం.. యిలా మొత్తం ప్రాసెస్‌ను వీడియో తీసి ఉంటే తప్ప టిటిడి తనను తాను డిఫెండ్ చేసుకోలేదు. మధ్యలో మీరేదో కలిపేశారు అని వాదించడానికి ఏఆర్‌కు అవకాశం ఉంది) రహస్యంగా పంపడం, ఆ రిపోర్టు వస్తూండగానే ప్రెస్ మీట్‌లో సప్లయిర్‌ను బ్లాక్‌లిస్ట్ చేస్తామని ప్రకటించడం, (గత పదేళ్లలో 32 సార్లు రిజక్ట్ చేసినప్పుడు బ్లాక్‌లిస్ట్ చేసిన సందర్భాలున్నాయా?) వాళ్లతో వివాదం నడుస్తూండగానే, సంగతి ఏదీ తేలకుండానే దాని స్థానంలో వేరే సప్లయిర్ల గురించి మరుసటి నెలలోనే టెండర్లు పిలవడం, రెండు నెలల తర్వాత ల్యాబ్ రిపోర్టును ఒక రాజకీయ పార్టీ ఆఫీసు ద్వారా లీక్ చేయడం, తమిళనాడు ఎఫ్ఎస్‌ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్‌స్ అథారిటీ ఆఫ్ ఇండియా)కి ఫిర్యాదు చేయడం, (ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏఆర్‌కు నోటీసు యివ్వడం పెద్ద విషయంగా కొందరు పాఠకులు అభిప్రాయ పడ్డారు, ఫిర్యాదు వచ్చినపుడు షో కాజ్ నోటీసు యివ్వడం సహజం. దానికి ఏఆర్ సమాధానం కూడా యిచ్చింది. అంతిమంగా యాక్షన్ ఏం తీసుకున్నారన్నదే గమనార్హం) క్రిమినల్ కేసు పెట్టడం, అరెస్టు చేయాలని చూడడం, అతను ముందస్తు బెయిలుకి వెళ్లడం.. యిదంతా చాలా అతిగా సాగింది.
12) ఏఆర్ మంచిదో, చెడ్డదో మనకు తెలియదు కానీ వైసిపి హయాంలో తక్కువ రేటుతో టెండరులో పాల్గొందని, దాని కోసమే వైవి సుబ్బారెడ్డి రూల్సు సడలించారని టిడిపి కక్ష కట్టడంతోనే యిదంతా జరిగిందని సులభంగానే ఊహించవచ్చు. దానితో బాటు కొత్త కాంట్రాక్టరుని తెచ్చి లబ్ధి పొందుదామని చూసే ఊహ కూడా ఉండవచ్చు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంట్రాక్టర్లకు యీ కష్టం తప్పదు. ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ గత ప్రభుత్వంతో అయిపోయాక, కొత్తవాడొచ్చి ‘నాకేంటంట?’ అని అడిగితే, వీళ్లు తెల్లమొహం వేసి, మీకేం లేదంటే బిల్లు చెల్లింపులు ఆపేస్తారని భయపడి, పనిలో నాణ్యత తగ్గిస్తారు. లేదంటే పాత కాంట్రాక్టుకే సప్లిమెంటు అంటూ కొన్ని అదనపు పనులు చేర్చి, కొత్త రేట్లు చెప్పి, కిట్టుబాటు అయ్యేట్లా చేసుకుంటారు.
13) వైసిపి హయాంలో రివర్స్ టెండరింగు అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. పాత కాంట్రాక్టరు చేతనే తక్కువ రేట్లతో కొత్త కాంట్రాక్టు కుదుర్చుకోవడం ఎలా సాధ్యం అని జనం ఆశ్చర్యపడితే, వైసిపి వారు ‘గత ప్రభుత్వం కమిషన్లు అడిగేది, దాన్ని ఫ్యాక్టరైజ్ చేసుకుని వాళ్లు రేట్లు కోట్ చేశారు, మేం మాకు కమిషన్లు వద్దు, ఆ మేరకు ప్రభుత్వానికి మేలు చేయమన్నాం, దాంతో ఆ మేరకు తగ్గించుకుని రేటు చెప్పారు’ అని చెప్పారు. ఇప్పుడు టిటిడి వారు కూడా రివర్స్ టెండరింగు అంటూ ఆల్పా చేత 530 నుంచి 450కి రేటు తగ్గింప చేశారు. కానీ ఎంతైనా అది ఏఆర్ వారి 320కంటె 130రూ.లు ఎక్కువే కదా!
14) బయట సరైన పద్ధతిలో నెయ్యి తయారు చేయాలంటే కిలో 900-1000 దాకా అవుతుందని చంద్రబాబు దగ్గర్నుంచి, చాలామంది చెప్తున్నారు. దేశవాళీ ఆవు పాలతో కిలో నెయ్యి చేయాలంటే ఎంతవుతుందో గోసేవలో ఉన్న ఒకాయన లెక్క వేసి చెప్పారు. దానికి 30-35 లీటర్ల పాలు అవసరమౌతాయట. ముడిసరుకుకై కిలోకి 1800 అవుతుందట. పాలు కాచి, తోడు పెట్టి, పెరుగు, మజ్జిగ చేసి, వెన్న తీసి, కరగబెట్టే ప్రాసెస్‌కు కనీసం రూ.100 అవుతుందట. అందువలన రూ.1900-2000 రేటు లోపు యిచ్చే నెయ్యి మాత్రమే సక్రమ పద్ధతిలో తయారైన దేశవాళీ ఆవు నెయ్యి అంటాడాయన. ఇప్పుడు ఏఆర్‌పై యింత దుమ్మెత్తి పోసి, తరిమేసి తెచ్చిన ఆల్ఫా రూ. 450కి యిస్తోందంటే అదీ సవ్యమైనదని అనలేం కదా! దేశవాళీ ఆవు కాకపోయినా, మామూలు ఆవుపాలతో, వేరే ప్రాసెస్‌లో చేసినా రూ.900 రేటుకి కొనే వరకు టిటిడి సవ్యమైన నేతిని వాడుతున్నట్లు వీరెవ్వరూ, చంద్రబాబుతో సహా, భావించడానికి వీల్లేదు.
15) అసలీ రిపోర్టుల గురించి ఎందుకు మాట్లాడతారు ప్రసాద్ గారూ, గత ఐదేళ్లలో మీరు తిరుపతి లడ్డూలో మార్పు గమనించలేదా? అని అడుగుతున్నారు కొందరు పాఠకులు. అయ్యా, అదొక్కటే కాదు, ఆ ఐదేళ్లలోనే కాదు, ప్రతీ దానిలోనూ ఏటేటా క్వాలిటీ తగ్గుతూ వస్తోంది. తిరుపతి లడ్డూయే కాదు, అనేక ప్రముఖ బ్రాండ్ల ఉత్పాదనల దగ్గర్నుంచి నాది యిదే ఫిర్యాదు. పాలు సరిగ్గా తోడుకోవు. పెరుగు గట్టిగా ఉండదు, త్వరగా పులిసిపోతుంది, ఆకు కూరలు తెస్తే రెండో రోజుకల్లా వాడిపోతున్నాయి, మామిడిపళ్లు లోపలలోపలే కుళ్లిపోతున్నాయి, కూరలకి రుచీ,పచీ ఉండటం లేదు.. యిలా యీ లిస్టు అనంతం.
16) దీనికీ, నేతి కల్తీకి లింకు పెట్టి మాట్లాడడం అనవసరం. తిరుపతి లడ్డూ బరువు 160 గ్రా.లు, దానిలో వాడే నెయ్యి బరువు 30 గ్రా.లు అని చెప్పారు. తక్కిన 130 గ్రా.ల ఇన్‌గ్రేడియంట్స్ క్వాలిటీ గురించి మాట్లాడరేం? ఈఓ గారు కల్తీ నెయ్యి అని మొదలెడితే మనమూ అదే పట్టుకుని వేళ్లాడాలా? రేపు కోర్టులో లూథ్రా గారు లడ్డూ రుచి తగ్గింది కాబట్టి… అని మళ్లీ అంటే న్యాయమూర్తి ‘శెనగపిండి క్వాలిటీ చెక్ చేశారా? కిస్‌మిస్ క్వాలిటీ చెక్ చేశారా?’ అని ప్రశ్నలు సంధిస్తే, లూథ్రాగారు తల గోక్కోవాలి. ఏఆర్‌ను తప్పించేటప్పటికి లడ్డూ క్వాలిటీ అమాంతం పెరిగిపోయిందా? పెరిగి పోయిందని తిరుమల భక్తులు చెప్పేస్తున్నారు, టీవీ కెమెరాల ముందు. ‘బాబు గారు వచ్చాక, లడ్డూ నాణ్యత పెరగిపోయిందండి’ అని అనేస్తున్నారు. ఇదీ బ్రెయిన్ వాషింగ్ ప్రభావం.
మోహన్ కందాగారి నాన్నగారు ఒక జోక్ చెప్పేవారట – ఇద్దరు ఎదురు పడ్డారు. ‘‘ఏరోయ్, ఎక్కణ్నుంచి?’’ అడిగాడొకడు. ‘‘కాలవలో సంధ్య వార్చుకుని వస్తున్నా…’’ అన్నాడు రెండోవాడు. ‘‘అదేమిటి? కాలవలో నీళ్లు లేవన్నారే!’’ అని తెల్లబోయాడు అడిగినవాడు. ‘‘..ఉన్నాయన్నారే!!’’ అంటూ యింకా తెల్లబోయాడు యివతలివాడు! జోక్‌లా అనిపించినా, బ్రెయిన్ వాషింగు మహిమ ఎలాటిదో చెప్తుందిది. వాడెవడో నీళ్లున్నాయన్నాడు, వీడు నమ్మాడు, వెళ్లి అర్ఘ్యం యిచ్చి వచ్చాడు. ఈనాటి వాట్సాప్ రోజుల్లో యిది మరింత ప్రస్ఫుటంగా కనబడుతోంది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు, నందిని పందిలా, పందిని నందిలా నమ్మించ గలుగుతున్నారు వాట్సాప్ ప్రొఫెసర్లు!
లడ్డూ నాణ్యత హఠాత్తుగా ఎలా పెరుగుతుంది చెప్పండి. ఏఆర్ తప్ప తక్కిన నాలుగు సప్లయర్లు వాళ్లే కొనసాగుతున్నారు. ఆల్ఫాకు దక్కిన 650 టన్నుల కాంట్రాక్టు, నందినికి దక్కిన 350 టన్నుల కాంట్రాక్టు ప్రారంభమై, వాళ్లు సరఫరా మొదలు పెట్టిదని యీ మధ్యే! ఈలోపునే లడ్డూలో యితర సామగ్రి కూడా నాణ్యత పెంచేసుకుని, అద్భుతంగా అయిపోయాట! చెప్పానుగా, తెలుగు మీడియా చేసే మోళీ!
17) ఫైనల్‌గా జరిగింది చెప్పాలంటే కిలో 320 రూ.ల రేటుకి యిచ్చిన ఏఆర్‌ను తప్పించి రూ.450కు యిచ్చే ఆల్ఫాను, నందినిని తెచ్చారు. అంటే కొత్త ఈఓ వచ్చాక కిలోకి రూ.130 రూ.లు పెరిగిందన్నమాట! 10 లక్షల కిలోల కాంట్రాక్టు కాబట్టి 1300 లక్షలు, అనగా రూ.13 కోట్ల అదనపు ఖర్చు అన్నమాట. అతి త్వరలోనే రూ.410 లోపు రేటుకి సప్లయి చేసే తక్కిన కాంట్రాక్టర్లు కూడా రూ. 450 రేంజికి వచ్చేస్తారని భావించవచ్చు. ఆ విధంగా టిటిడి ఖర్చును పెంచే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏఆర్ కాంట్రాక్టు పూర్తయ్యేవరకైనా ఆగకుండా సత్వరమే యీ పని పూర్తి చేయాలనే తహతహతోనే ల్యాబ్, టెస్టింగు అంటూ ఓ ప్రహసనాన్ని నడిపారు. వెజిటబుల్ ఫ్యాట్ కల్తీ అయింది అని ఒకసారి చెప్పి, ఆ తర్వాత మాట మార్చి యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నారు. ఈ కన్‌ఫ్యూజన్‌కి కారణం ఏమిటి?
18) యానిమల్ ఫ్యాట్ అంటే…? వెన్న అనేది యానిమల్ ఫ్యాటే. ఆవు, గేదె యివన్నీ జంతువులే కదా. వాటి వాటి పాలల్లోంచి తయారయ్యే పెరుగు, వెన్న, నెయ్యి యివన్నీ జంతు సంబంధమైనవే. వాటిలో కొవ్వు పదార్థం సహజంగా ఉంటుంది. ఆవు పాలలో కొవ్వు శాతం ఎక్కువ. ఇంకా వివరాలు కావాలంటే https://www.ncbi.nlm.nih.gov/ వెబ్‌సైట్‌కి వెళ్లి చూడవచ్చు. వెజిటబుల్ ఫ్యాట్ అంటే గింజల లోంచి, ధాన్యంలోంచి తీసే నూనెలో ఉండే కొవ్వు పదార్థం. వనస్పతిలో యానిమల్ ఫ్యాట్ కలిపితే అది కల్తీ. 1983లో జైన్ వనస్పతిలో బీఫ్ ట్యాలో కలిసిందని వివాదం వచ్చి పార్లమెంటులో చర్చ, కేసులు పెట్టడాలు అన్నీ జరిగాయి. బీఫ్ ట్యాలో అంటే ఆవు కొవ్వుతో తయారు చేసిన పదార్థం. దాన్ని వంట నూనెగా వాడతారు, కొవ్వొత్తులు చేస్తారు, స్కిన్ కేర్ ఉత్పాదనలు చేస్తారు.
యానిమల్ ఫ్యాట్‌లో వెజిటబుల్ ఫ్యాట్ కలిపితే కల్తీ అంటారు. ఏఆర్ వారి నెయ్యి నమూనాలో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది కాబట్టే తిప్పి పంపామన్నారు ఈఓ జులైలో. చంద్రబాబు దాన్ని ‘యానిమల్ ఫ్యాట్’గా మార్చి అది నేతిలో కలిసింది అన్నారు. ఆ చెప్పడంలో కూడా జంతువుల కొవ్వు అని నొక్కి చెప్పడంతో ఆ నేతిలో ఆవు, పంది పేగుల్లోంచి తీసి కలిపేశారేమో అన్నంత ఫీలింగు కలిగేట్లా చేశారు. ఇదే గందరగోళానికి కారణం. తీరా చేసి ఎన్‌డిడిబి ల్యాబ్ రిపోర్టులో కూడా యానిమల్ ఫ్యాట్ కలిసిందని నిర్ధారింప బడలేదు. ఎందుచేత అనే విషయాన్ని సాంకేతిక అంశాలతో ‘‘హిందూ’’ పత్రిక తన 29-09-24 సంచికలో ‘వజ్ ఏనిమల్ ఫ్యాట్ ప్రెజంట్ ఇన్ తిరుపతి లడ్డూస్?’’ అనే పేరుతో వ్యాసం వేసింది. నాకు అర్థమైనంత వరకు క్లుప్తంగా సారాంశం చెప్తాను.
ఆవు నేతిలో ఉండే ట్రైగ్లిసరైడ్ పేటర్న్‌స్ తక్కిన జంతువుల నెయ్యి కంటె, వెజిటబుల్ నెయ్యి కంటె భిన్నంగా ఉంటాయి. దీనిలో వాటిని కలిపారా అని తెలుసుకోవడానికి గ్యాస్ క్రోమాటోగ్రఫీ అనే విధానంలో తెలుసుకుంటారు. ఇసిజిలో వచ్చే వేవ్స్‌లా దానిలో కూడా వేర్వేరు జంతుఘృతాల వేవ్స్ వస్తాయి. 1991లో ఒక జర్మన్ సైంటిస్టు ఎస్ (స్టాండర్డ్) వేల్యూ మెథడ్‌ను కనుగొన్నాడు. ఎస్1 సోయా బీన్, ఫిష్ ఆయిల్ వగైరాల ద్వారా జరిగే కల్తీని, ఎస్2 కొబ్బరినూనె, పామాయిల్ కల్తీని, ఎస్3 పామాయిల్, బీఫ్ టాలో కల్తీని, ఎస్4 లార్డ్ (పంది కొవ్వు), ఎస్5 మొత్తం కల్తీని సూచిస్తాయి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటే యీ ఎస్‌ల రేంజ్ 3-4% విండో లోపున ఉండాలి. వీటిల్లో ఏ ఒకటి రేంజికి బయట ఉన్నా ‘ఫారిన్ (ఇతర) కొవ్వు కలిసింది’ అంటారు. ఈ ప్రాసెస్‌ను ఐఎస్ఓ (ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) ఆమోదించిన యీ ప్రాసెస్‌నే ఎన్‌డిడిబి కాల్ఫ్ కూడా అనుసరిస్తుంది.
టిటిడి పంపిన రెండు శాంపుల్స్ లోని నేతిలో ఎస్1 నుంచి ఎస్5 వరకు అన్నీ రేంజికి వెలుపల ఉన్నాయి. ఉదాహరణకి ఎస్3 (పామ్ ఆయిల్, బీఫ్ టాలోకు సంబంధించినది) 95.9-104.1 రేంజిలో ఉండాలంటే యివి 22.43లో ఉన్నాయి. ఇలా ఉన్నంత మాత్రాన దీనిలో బీఫ్ టాలో కలిసిందని అనలేము. ఒక ఎస్ వేల్యూలో తేడా వచ్చినంత మాత్రాన కల్తీకై కలిపిన ఫారిన్ (యితర) పదార్థమేదో నిర్ధారించలేము. ఎందుకంటే లార్డ్ తప్ప తక్కినవన్నిటినీ ఒక గ్రూపుగానే గుర్తిస్తారు తప్ప వేర్వేరుగా ఫలానా అని చెప్పే సాంకేతిక జ్ఞానం లేదు. ఎస్3 కనుక 100 దాటి ఉంటే ఆ ఫారిన్ ఫ్యాట్ ఎంత కలిపారో తెలిసేది. ఈ నేతి విషయంలో 100 కంటె తక్కువ ఉంది కాబట్టి అదీ చెప్పలేము.
ఎస్ వేల్యూలను మేథమెటికల్ పద్ధతుల ద్వారా అన్వయించి చెప్పే విధానం ఉంది కానీ కాల్ఫ్ రిపోర్టులో అది లేదు. ఎందుకంటే యివి యూరోప్‌లోని ఆవుల మీద ప్రయోగాలు చేసి నిర్ణయించిన అంకెలు. వాటిని మన దేశపు ఆవులకు అన్వయించాలాంటే చాలా డేటా బేస్ కావాలి. ప్రస్తుతానికి అది మన దగ్గర లేదు. – ఇదీ ఆ వ్యాసం చెప్తున్నది. దీనికి తోడు కాల్ఫ్ రిపోర్టు ఆవుకి సరిగ్గా గడ్డి పెట్టకపోయినా, ఆవు ఆరోగ్యం అంత బాగోకపోయినా.. అంటూ అనేక రైడర్స్, కేవియట్స్ చెప్పింది. ఆ రిపోర్టు పట్టుకుని పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసింది అని యాగీ చేయబోతే రుజువు చేయడం కుదరదు. ఏదో కల్తీ మాత్రం జరిగింది అనే చెప్పవచ్చు. అందుకే ఈఓ గారు కాస్త జాగ్రత్తగా వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది అన్నాడు. నెయ్యి తక్కువ రేటు కిచ్చారు కాబట్టి చౌకగా ఉండే వెజిటబుల్ ఫ్యాట్ కలిపారు అంటే నమ్మవచ్చనే లెక్కతో!
19) వ్యవహారం యిక్కడితో ఆగితే యిది ఒక ఆర్థిక అక్రమంగా ఉండిపోయేది. టిటిడిలో యిలాటివి గతంలో కూడా జరిగాయనే వార్తలు అనేకం చూశాను. వాటిల్లో యిదీ ఒకటని పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. తిరుపతిలో అక్రమాలు, అవినీతి, ఆశ్రితపక్షపాతం, అన్యమతస్థుల చేష్టలు, నియామకాల్లో వివాదాలు.. యివేవీ కొత్తవి కావు. ఏం జరిగినా భక్తులు చలించరు. ‘అన్నీ ఆ దేవదేవుడే చూసుకుంటాడు’ అనుకునే విశ్వాసంతో తరలి వస్తూనే ఉంటారు. కానీ యీ వ్యవహారాన్ని చంద్రబాబు నెక్స్‌ట్ లెవెల్‌కి ఎస్కలేట్ చేసి రాజకీయ లబ్ధి పొందుదామని చూశారు. దాంతో వచ్చింది గొడవ.
20) చంద్రబాబు సెప్టెంబరు 18న రాజకీయ సమావేశంలో అతి కాజువల్‌గా యీ లడ్డూలో ‘ఆనిమల్ ఫ్యాట్ కలిసిన కల్తీ నెయ్యి కలిసింది. గతంలోనూ యిలా జరిగింది.’ అనే స్టేటుమెంటు యిచ్చేశారు. ‘వ్యవస్థలన్నీ జగన్ భ్రష్టు పట్టించాడు’ అనేది ఎప్పుడూ పాడే పల్లవే. దానికి ఒక చరణంగా యిది చేర్చేశారు. చంద్రబాబు వ్యూహమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. ఈ నేతి గొడవంతా జరిగినది జులైలో. ఆయన హయాంలో! ఇలాటి ఆరోపణ చేస్తేగీస్తే ప్రతిపక్షం చేస్తుంది. అధికారపక్షం ఖండిస్తుంది. కానీ యిక్కడ అధికార పక్షమే కల్తీ నేయి కలిపేసి, లడ్డూని అపవిత్రం చేసేశారని అంది. గత ఐదేళ్లలోనూ యిలాగే జరిగింది అని కూడా నిరూపించాలంటే, అప్పటి రిపోర్టులు చూపించాలి కదా! ఇప్పుడు ఏదో ఒక కంపెనీ సప్లయి చేసిన సరుకులో నాణ్యత లేదంటే, గత ఐదేళ్లగా ప్రతీ కంపెనీ సప్లయి చేసిన నేతిలో నాణ్యత లేదని ఎలా అనగలరు? పోనీ యిదే కంపెనీ సప్లయి చేసిన ప్రతీ కన్‌సైన్‌మెంట్ డిఫెక్టివ్ అని కూడా అనలేము. ఉత్పత్తి చేసే ప్రతి ఫ్యాక్టరీలో ప్రతీ బ్యాచ్ క్వాలిటీ కంట్రోలు విభాగం ద్వారానే బయటకు వెళుతుంది. క్వాలిటీ చాలలేదనుకుంటే ఆ సరుకు పక్కన పడేస్తారు. ఒక బ్యాచ్ ఫెయిలయింది కాబట్టి అన్ని బ్యాచ్‌లూ ఫెయిలయినట్లే అని ఎవరూ అనరు.
21) ఈపాటి ఆలోచన లేకుండా అనేయడంతో ఆధారాలు చూపించండి అని అందరూ అడిగారు. వెంటనే ఎన్‌డిడిబి ల్యాబ్ రిపోర్టు పార్టీ ఆఫీసు నుంచి లీక్ చేశారు, ఈఓ చేత కూడా యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పించారు. ఎన్ని చెప్పినా, ఏం చేసినా యివన్నీ యిప్పటి నేతి సరఫరా గురించే! గత ఐదేళ్లలో జరిగిందని నిరూపించే ఆధారమేదీ చూపించలేదు. బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసరు కస్టమర్ గోడౌన్ చెక్ చేయాలంటే లేటెస్టు స్టాక్ స్టేటుమెంటు పట్టుకుని వెళ్లాలి, పాతది పట్టుకెళితే ‘ఆ స్టాకంతా మారిపోయింది, యింకెక్కడున్నాయ్’ అంటారు. హైదరాబాదులో యిటీవల హోటళ్లపై దాడులు జరిగినప్పుడు వంటింట్లోకి వెళ్లి వండుతున్న, ర్యాక్‌లో ఉన్న సరుకుల క్వాలిటీ చెక్ చేశారు. కోర్టు గత హయాం విషయం యింకా ఎత్తలేదు. సుబ్బారెడ్డి పిటిషన్ విచారణకు వచ్చినపుడు ఎత్తుతుందేమో!
22) ఈలోపునే బాబు నెత్తి మీద లూథ్రా ద్వారా అక్షింతలు వర్షించింది. ‘ప్రైమా ఫేసీ చూస్తే లడ్డూ తయారీలో ఉపయోగించిన నేతిలో కల్తీ జరిగిందనడానికి ఆధారాలేవీ లేవు. అసలా నెయ్యి వాడలేదని ఈఓ చెప్తున్నారు. అలాటప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ చంద్రబాబు లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడారనీ, దానిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనీ, బహిరంగంగా, సిట్ విచారణకు ముందే, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి వారం రోజుల ముందే ఆరోపణలు చేయడమేమిటి? రిపోర్టు అసమగ్రత గురించి చెప్పకుండా యిలా ప్రకటించడం వలన అదే జనాల్లోకి వెళ్లి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతింటాయని గ్రహించలేదా? జులైలో రిపోర్టు వస్తే సెప్టెంబరు వరకు దానిపై మాట్లాడలేదేం? విచారణకు ఆదేశించలేదేం? దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచలేరా?’ అని తలంటింది. ప్రభుత్వం చేసే పనులపై వ్యాఖ్యానించే హక్కు కోర్టు కుండడంపై పురంధేశ్వరి అవకతవక, అసంబద్ధపు స్టేటుమెంటు యిచ్చారు. జగన్ ప్రభుత్వంపై కోర్టులు యిలాటి వ్యాఖ్యలు చేసినప్పుడు జేజేలు కొట్టినవారే వీరంతా అని జనాలకు గుర్తుంది.
23) తన స్టేటుమెంటు ప్రపంచ హిందువులందరిలో కల్లోలం రేపి, అందరూ నిజనిర్ధారణకై దర్యాప్తు చేయించమని కోరగానే తన పని బూమెరాంగ్ అయిందని గ్రహించిన బాబు యిస్యూని భూస్థాపితం చేయడానికి సమకట్టారు. మీడియా ద్వారా జగన్‌పై బురద చల్లే కార్యక్రమం అయిపోయింది కాబట్టి, క్రమేపీ స్టీమ్ తగ్గిస్తూ పోతే మంచిదనుకున్నారు. గతంలో తన హయాంలో పింక్ డైమండ్ మాయమైందంటూ, గుప్త నిధుల కోసం పోటు తవ్వేశారంటూ వైసిపి ఉత్తి పుణ్యాన హడావుడి చేసినప్పుడు ‘నేను ముఖ్యమంత్రిగా ఉంటూ దానిపై సిట్ వేసినా జనాలు నమ్మరు. అందువలన మీరే ఎవరైనా జజ్ చేత విచారణకు ఆదేశించండి.’ అని అప్పటి హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. కానీ యిప్పుడా ధైర్యం చేయలేదు. అప్పుడది ప్రతిపక్షాల అభూతకల్పన అని ఆయనకు తెలుసు. ఇది తను సృష్టించిన అభూత కల్పన అనీ తెలుసు. అందుకనే న్యాయస్థానం, కేంద్ర ఏజన్సీలు అనకుండా తన మాట వినే వారితోనే ‘సిట్’ వేశారు.
24) కానీ సుప్రీం కోర్టు దాన్నీ హర్షించలేదు. విచారణ పూర్తి కాకుండానే సిఎం తీర్పు యిచ్చేస్తే, ఆయన కింద పని చేసే ఆఫీసర్లతో వేసిన సిట్, సిఎం అభిప్రాయానికి భిన్నంగా పని చేయగలదా అని సందేహం వెలిబుచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని యిన్వాల్వ్ చేసింది. చివరకు రాష్ట్ర సిట్‌ను రద్దు చేసి, సిబిఐ డైరక్టరు ఆధ్వర్యంలో ఐదుగురితో విచారణ కమిటీ వేసింది. ఇద్దరు సిబిఐ వారు, యిద్దరు రాష్ట్ర పోలీసులు, ఒకరు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీనియర్ అధికారి. దీని టర్మ్‌స్ ఏమిటో, కాలపరిమితి ఏమిటో యింకా బయటకు రాలేదు.
వీళ్లు ఏం విచారణ చేస్తారు? లడ్డూలో సదరు నేతి ట్యాంకర్లు వాడలేదని ఈఓ యిచ్చిన స్టేటుమెంటు కరక్టా? వాడారంటూ బాబు యిచ్చి స్టేటుమెంటు కరక్టా? ఎన్‌డిడిబికి పంపినా శాంపుల్ ఏఆర్ వారి ట్యాంకర్లోంచే, ఏ యితర పదార్థాలు కలపకుండా వెళ్లిందా లేదా? – ఇవే కదా! కల్తీ నెయ్యి వాడారు అని తేలిస్తే బాబు హయాంలోనే జరిగింది కాబట్టి ఆయనకు దెబ్బ. జరగలేదని తేలిస్తే, జరిగిందని అబద్ధం ఎందుకు చెప్పారు అంటూ దెబ్బ.
గత ఐదేళ్లలో కల్తీ నెయ్యి వాడారని నిరూపించ గలిగితేనే బాబు ప్రతిష్ఠ నిలుస్తుంది. అది జరగాలంటే టిటిడి ల్యాబ్ టెస్టుల్లో విఫలమైన ట్యాంకర్లను వెనక్కి పంపకుండా స్టోర్సు లోకి తరలించారు అనే రికార్డు దొరకాలి. ఏ బుద్ధిహీనుడూ అలా రికార్డు చేయడు. అందువలన విచారణ రిపోర్టు ఎలా వచ్చినా బాబు నడిపే ఎన్‌డిఏ ప్రభుత్వానికి నష్టం కాబట్టి, సిబిఐ ఆధ్వర్యంలోని కమిటీ విచారణ జాప్యం చేస్తూ, క్రమేపీ జనం దీని గురించి మర్చిపోయేట్లా చేయవచ్చు. ఆ విధంగా భూస్థాపితం కావచ్చు.
ఇదంతా బడే మియా బాబు గురించి రాశాను. కోర్టు కూడా ‘బాధ్యతాయుతమైన సిఎం పదవిలో ఉండి..’ అని ఆయన గురించే మాట్లాడింది తప్ప, డిప్యూటీ సిఎం అయిన ఛోటే మియా గురించి మాట్లాడలేదు. ఆయన బాబును మించి యిస్యూని మరో లెవెల్‌కి తీసుకుపోయి హిందువులను రెచ్చగొడదామని చూస్తున్నాడు. ఆయన విన్యాసాల గురించి ‘సందట్లో సడేమియా’ అనే వ్యాసంలో మాట్లాడుకుందాం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2024)
అంత బానే వుంది మీరు ఒకటి మర్చి పోయారు అప్పుడు సుబ్బారెడ్డి కాదు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి
టీటీడీకి ఎలెక్షన్లకి సంబంధం ఏమిటి? ఇంతకీ ఏమి చదువుకున్నావ్ ?
సోషల్ మీడియా చదువుకున్నాడు..
అది కూడా వైసీపీ సోషల్ మీడియా కి పరిమితమైపోయి ఉంటాడు..
ttd cheppi vaadaledani chebite elactionlo gelisina baabu vaadaaru ani cheppataaniki emi harhatundi neevu emi mingaavo teliyade
g….muskora…
Naa chaduvu endukule neeku ardam kaledu ani edu
టిడిపి పట్టాభి సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉండగానే మార్చారని బల్ల గుద్ది చెపుతున్నారు. నిజమే కావచ్చు. మార్చిన రూల్సు ప్రకారం కరుణాకర రెడ్డి టెండర్లు కాల్ ఫర్ చేసి ఉండవచ్చు
టిడిపి చెప్పింది కరెక్ట్ అయినప్పుడు పైన కవరింగ్ వ్యాసాలు ఎందుకు ?
Yevadainaa aa thanu mukka nee kada.
Chaala vivaramgaa ardhamavutundi cbn kuyukti.. Kitta eo vaccheka digubadi chesina neyyatone gadibidi…
Call boy works 9989793850
ఆద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదములు. టెక్నికల్ గా తెలియని విషయాలు ఎన్నో చెప్పి అందరి నోరు మూయించారు. కానీ కొందరు మీ విశ్లేషణ మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారు. వాళ్ళు చంద్రబాబు రాగానే లడ్డూకు రుచి, వాసన వచ్చిందనే భ్రమలో పడ్డారు.
జగన్ రెడ్డి వచ్చాకే సంక్షేమం వచ్చింది..
జగన్ రెడ్డి వచ్చాకే జనాలు అన్నం తింటున్నారు..
జగన్ రెడ్డి వచ్చాకే ప్రజలు బట్టలు కట్టుకొంటున్నారు..
జగన్ రెడ్డి వచ్చాకే ఆంధ్ర రాష్ట్రం లో పిల్లలు పుడుతున్నారు..
అని భ్రమలో ప్రచారం చేసుకొనే నీలికుక్కలకు .. మీరు పైన రాసిన కా మెంట్ చెప్పు తో కొట్టినట్టు చెప్పారు ..
Ayyo aithe 151 to 11 laga 124 to antaru
కల్తీ నెయ్యి లో కూడా మన అన్నయ్య కే క్రెడిట్ దక్కాలి అంటావ్….😂😂🙏🙏.. కలికాలం GA… ఇంకా నయం ఈ 5yrs లో లడ్డూ ప్రసాదం అద్భుతం గా ఉందని జనం పొగిడారని చెప్పలేదు…సంతోషం…
అన్నీ మతాలను గౌరవించండి….మన ధర్మాన్ని, సంప్రదాయాలను చులకన గా చూడవద్దు…మన ధర్మాన్ని మనమే హేళన చెయ్యడం తప్పు అని చెప్పాడు….. ఐనా కూడా pawan kalyan గారి మీద విషం కక్కాలని చూస్తే…..ఇక మీ ఖర్మ….అంతే…. పవన్ మీద ఎంత విషం కక్కితే మీ పతనం కూడా అంతే దారుణం గా వుంటుంది…. డౌట్ వుంటే మన అన్నయ్య ను అడగండి…చెప్తాడు…
Vadi cutout ki single ga okkka seat gelavamanu
ఏది, మన సింగల్ సింహం రెండు సింగిల్స్ (11) గెలిచినట్టా??
ఐనా అహంకారం తో కళ్ళు మూసుకుపోయి దేవుడి కన్నా నేనే గొప్ప అని కనీసం declaration మీద కూడా సంతకం పెట్టకుండా…..సంబంధం లేని వ్యవహారం లోకి దళితులను లాక్కొచ్చి కుల , మత రాజకీయాలు చెయ్యాలని చూసింది ఎవరో అందరూ చూశారు లే GA….🙏🙏
లడ్జూక్వాలిటీ నిజంగానేపెరిగింది .ఇంతకుముందులడ్డు
కొండపైనుండికిందకువచ్చెలోగానే చితికిపోయేది .నేను28 9 2024 తిరుమలవెళ్ళాను .లడ్డూ ఇంటికివచ్చేదాకా
భద్రంగావుది .నాలుగురోజులు నిలవవుంది .
ఔను, ఇంతకు ముందు రెండో రోజే బూజు పట్టేసేది. అందుకే తెచ్చిన వెంటనే పంచి పెట్టే ముందు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సి వచ్చేది.
What JP is for TDP this writer is for YCP . Medhavi la kanapaduthu Jagan better ani cheppe Rakam to motivate middle class voters tilt towards Jagan
Puttukoatho vachinna CBN vyathirekatha pudakalathone poddi, prajalu cheppu teesukuni kotti 11 ichinaa nee buddi maaraledu. Idi ee rachayotha moli.
మాములు షాప్ లోనే నెయ్యి ఒక కిలో కొంటె, 15 కిలోలు కొంటె డిస్కౌంట్ ఇస్తారు. స్వామి వారి లడ్డుకి నెయ్యి సప్లై చేయడం అదృష్టంగా భావిస్తారు అందరు. 1000 -2000 కిలోలు ఒకే ఖాతాదారు, అందులో స్వామివారి లడ్డు కోసం డిస్కౌంట్ ఇవ్వకుండా వుంటారా…దీని కోసమే కదా ప్రతి 6 నెలలకి టెండర్లు పిలిచేది.
నెయ్యి తాయారు చేసే విధానం బట్టి కూడా రేటు ఉంటుంది.
పాలనుండి పచ్చివెన్న తీసి నెయ్యి చేస్తే ఒక రుచి, ఒక రేటు.
పాలని మరిగించి పైన మీగడ తీసి నెయ్యి చేస్తే ఒక రుచి, ఒక రేటు.
పాలని తోడుపెట్టి పెరుగు మీద మీగడ సేకరించి, మజ్జిగలో చిలికి వెన్న తీస్తే ఒక రుచి, ఒక రేటు.
అసలు తిరుమలకి ఎవరెవరు ఏమి సప్లై చేస్తారు అని గూగుల్ లో ఆరా తీస్తుంటే..౨ నెలల క్రితం ఒక శీర్షిక నన్ను ఆకర్షించింది. (https://www.eenadu.net/telugu-article/sunday-magazine/srikakulam-jaggery-for-srinivasu/28/324000836) శ్రీనివాసునికి సిక్కోలు బెల్లం అనే రైతుల శీర్షికని మన గులనాడు అందించింది.
బెల్లం నాణ్యత తెలుసుకోవడం టీటీడీ వారు కోసం 137 పరీక్షలు చేస్తారని, ఆలా పరీక్షలు చేశాకే టీటీడీ వాళ్ళు గత రెండేళ్లుగా బెల్లం కొంటున్నారని కూడా రాసింది.
ఒక బెల్లానికే 137 పరీక్షలు ఉంటే మిగతా సరుకులైన నెయ్యి, శనగపిండి, యాలకలు, జీడిపప్పు పరీక్షలు లేకుండా తీసుకుంటారా….
రాజకీయాల కోసం ప్రజలని, ముఖ్యంగా హిందువులని వాడుకొని పబ్బం గడుపుకునే వాళ్ళకి ఆ శ్రీనివాసుడే సమాధానం చెబుతాడు.
నిజం తెలిసేలోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టి వచ్చినా నిజమే గెలుస్తుంది.
పూకనాథం ఆలా ఇవ్వట్లేదు జగన్ రెడ్డి కల్తీ పాలనా నాటకాలు వేరే లెవెల్ లో ఉంటాయి
పరిక్షలు లేవు తొక్కా లేదు , లడ్డూలో ఉండే జీడి పప్పు పరమ నాసి రకం , యాలకుల తొక్క తప్ప గింజలు ఉండవు , ప్రతి సరుకు చాలా నాసిరకం , అందుకే గత 10 ఏళ్ళుగ రుచి తగ్గింది
రేయ్ ముసలి పింజం… నీ ముతక కళ్ళతో ముతక లాజిక్కులు చెప్పుకుంటా బతికేసేయ్… అన్నట్టు నీకు ఇంకా డబ్బులు ఇస్తున్నారా రా ఇలాంటి ముండమోపి జ్ఞానం తో తికమక పడి అమాయకులని తికమక పెడుతున్నందుకు…
Baga chepparu kuhana medavi . Annattu nenu eppudu tirumala lo 2019 varaku fast food center aithe chudala. Evala akkada dorike items ani kalyana katta pakkane dorukutunnai
Annattu rooms lo Swami patam vundedi adi tesesaru ante nammaledu
Evala rooms lo chusthe okkati ledu
తిరుమల లడ్డూలో అన్నీ ఫస్ట్ క్వాలిటి సరుకులు వాడాలి అంటారు కదా మరి నాసి రకం జీడిపప్పు నూక , 3వ రకం యాలకులు , కలకండ చిప్స్ , ఉంటున్నాయి , మరి వాటి నాణ్యత సంగతి ఏంటి. ??
అరే అయ్యా కేజీ నెయ్యి తయారీకి 1500-1900 అవుతుంది అనేది శుధ్ద అబధ్దం, నెయ్యి తీసేసాక వచ్చిన పాలని , టోన్డ్ మిల్క్ అని , స్కిమ్డ్ మిల్క్ అని లీటరు 50-70 రూపాయలకి అమ్ముతారు , ఇంకా చాలా రకాల బై ప్రోడక్ట్స్ తయారు చేస్తారు , డైరీ వాళ్లూ ఏది వృధా పోనీయరు.250 రూ లకి ఇవ్వడం మూమ్మాటికి సాధ్యమే.
అవన్నీ మతం మారిన రెడ్లు సుబ్బారెడ్డి , కరుణాకర్ రెడ్డి ,జగన్ రెడ్డి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు అందుకే వాటి ప్రస్తావన తేలేదు కానీ ఆ పాలకు అయిన డబ్బు మాత్రం చెల్లించేశారు
అరే అయ్యా – ఈ పదప్రయోగం మానండి. మీరు చెప్పిన పాయింట్లు ‘అదిగో పులి..’ ఆర్టికల్‌లో డిస్కస్ చేశాను, చూసుకోండి.
బయట వెయ్యి రూపాయలకు నెయ్యి దొరుకుతూండగా.. అని చంద్రబాబుతో సహా అంటున్న టిడిపి నాయకులకు యీ మాటలు చెప్పండి
సవరించాను , క్షమించగలరు, thanks for the reply
బీఫ్ టాలో అంటే పంది కొవ్వు కాదనుకుంటా..
పాలలో కొవ్వు శాతం ఎక్కువ ఉన్న పాలనే నెయ్యి తయారీకి వాడుతారు. ఒక కేజి నెయ్యి తయారీకి 20-25 లీటర్ల పాలు చాలు.
రైతుల దగ్గర పాల ధర 45/-
Procurement cost 20×45=900
Production expenses 100
total 1000
sub products
18 liters of toned or skimmed milk, each litre costs 50-70/ total 900
1 kg ghee 300/-
paneer 500 gms -200/-
other bi-products worth of 200/-
total =1600
in which way its loss if they sell ghee at 350/- per kg ??
అదేదో సనాతన బోర్డు పెడితే పీడా పోతుంది కదా…
నిజాన్ని పాతరేయటానికి ఇన్ని వ్యాసాలు రాసే బదులు నెయ్యి లో కల్తీ జరగలేదు అని గత 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఒక్క రిపోర్ట్ బయట పెడితే సరిపోయేది
జరగలేదు అని రిపోర్టు ఎలా ఉంటుందో నా ఊహకు అందటం లేదు.
ఈ వ్యాసాలు నిజాన్ని పాతర వేయడానికి కాదు, వెలికి తీయడానికి. మాటలు మార్చే ఈఓను ఎక్స్‌పోజ్ చేయడానికి! ఏ ఆధారం లేకుండా హిందువులందరినీ భయభ్రాంతులను చేయడానికి చూసే సిఎం మాటలు నమ్మనక్కరలేదని భక్తులకు ధైర్యం కలిగించడానికి!
Siggu leninraatalu aapandi. Eda nenu Tinedi Annam kaadu pents ilane raastani Ani cheppayuendi. Musugulo guddulata yenduku
ఏవండీ నెయ్యి అనేది బై ప్రోడక్ట్… అంటే ఒక పదార్థం ప్రాసెస్ చేయగా వచ్చే ఇంకో పదార్థం .. నెయ్యి వచ్చే ప్రాసెస్ లో మిగిలిన పాలు మిగతా పదార్థాలు ఎంతో విలువైనవి.. అవేమి బోదే లో పారబోయారు… అక్కడితోనే తమరి పరిశీలన సామర్థ్యం కడతేరింది
అసలు ఆ లడ్డూ నాణ్యత గమనించండి మహాప్రభో మేము తేడా గమనించాము అంటే ఆకుకూర వంకాయ అంటరేంటండి… మేము చెప్పేది అసలు సంబంధం లేదు అంటారేంటి… అసలు విషయం ఏ లడ్డూ గురించి అయితేను .. దీనినే ఆంగళం లో confirmation bias అంటారు… మనకి ఏమైతే కావాలో ఏమైతే చూడాలని అనుకుంటున్నామో వాటి వైపే చూడటం
కాబట్టి సదరు ఎంబిఎస్ గారు ఇది చంద్రబాబు గారు చేసిన అభూతకల్పన అని తేల్చి తీర్పు ఇచ్చినారు కావున … సుప్రీమ్ కోర్ట్ వారు ఆ రకం గా తీర్పు ఇవ్వాలని కోరుతున్నాము
నెయ్యి వచ్చే ప్రాసెస్ లో మిగిలిన పదార్థాలు ఎంతో విలువైనవి.. అవేమి బోదే లో పారబోయారు… అక్కడితోనే తమరి పరిశీలన సామర్థ్యం కడతేరింది – ఈ ముక్క టిటిడి ఈఓ గారికి చెప్పండి. 320కే యిస్తున్నారు కాబట్టి, నేతికి క్వాలిటీ ఉండదని భావించినది ఆయన. ప్రాసెస్‌లో తేడా, బల్క్ ఆర్డర్, మార్కెటింగు ఖర్చు మిగలడం, యివన్నీ అదిగో పులి.. ఆర్టికల్‌లో డిస్కస్ చేసేశాను. చూసుకోండి
2) లడ్డూ నాణ్యత, నేతి నాణ్యత వగైరాలు సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయాలి. భౌతిక పరీక్ష చేసి నెయ్యి బాగా లేదని తిప్పి పంపేశాము అన్నది ఆ ఈఓ గారే. మీరన్న confirmation bias ఆయనకే వర్తిస్తుంది.
నువ్వో పేద్ద మేతావి వి… నువ్వు రాయడం అంటే విధాత తీర్పు అంటావు… అయినా విధాత విష్ణువు ఇలాంటివన్నీ నీ లాంటి గొర్రెగానికి తెలుసా అని మా శంఖ..
మోకాలికి బోడి గుండు కి లింక్ పెడుతున్నారు మళ్లీ.. నేను చెప్పిన … నెయ్యి విలువైనది అనేది 2000/- అవుతుంది అని మీరు చెప్పిన ఎనాలిసిస్ కి… అబ్బే.
సో మన ఎంబిఎస్ గారు ఇది కచ్చితం గా చంద్రబాబు అభూత కల్పన అని తీర్పునిచ్చారు.. సుప్రీమ్ కోర్ట్ వారు గమనించ ప్రార్థన
Point 18 – Cow’s milk has more fat? How? Compared to what? Gede milk has more fat than cow’s. Cow milk has generally low fat content.
సర్, టెక్నికల్ గా నిరూపించగలరో లేదో తెలియదు కానీ, లడ్డూ క్వాలిటీ తగ్గడం చాలామందికి స్వానుభవం, అందులో పెద్దల ప్రమేయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
Always beating around the bush and pointless
what JP is to Telugudesam this writer is to Jagan.Medhavi laga buildup istu Jagan better ani prove cheyyadaniki Chala try chestunnadu to motivate middle class voters
నువ్వు యే మాత్రం మారలేదు రా యంగటి.. పొట్టోడు అధికారం లో వున్నప్పుడు ఉడతవూపుల తో వాన్ని తికమక పట్టించావు… వాడు పెపంచం లోనే గొప్ప పాలకుడు అని నువ్వు నమ్మి వాన్ని అవే బ్రమల్లో బతికేలా చేసి 151 నుంచి చావు తప్పి కుయ్యో మొర్రో అనుకుంటా 11 కి దించినావు… పోనీ ఇప్పుడన్నా వాడికి నిజం తెలుసుకొనే అవకాశం ఇవ్వకుండా ఏదో నీ కోడి బుర్రకు తోచిన ఎదవ లాజిక్కులు చెప్పి తీర్పు రాసినావు…
నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే పొట్టోడు వాని తొండిమందా జనాలను తిరుమలకు రానివ్వకుండా ఆపడానికి చెయ్యని చండాలపు పనులు లేవు… తిరుమలేషుడు మాట్లాడకపోయినా చేయాల్సింది చేస్తాడు, చేసాడు. దాని పర్యవసానమే మహమేత గాడు గోచిలో కుక్క చావు.
ఇంక కల్తీ నెయ్యి వివాదం అంటావా… మీ పొట్టి కల్తీ రెడ్డి గాడు వాడి వందమాధిగలు చేసిన చండాలపు పనుల్లో ఇది జస్ట్ ఒకటి మాత్రమే… నీతో సహా,మీ అదృష్టం ఏంటంటే బాబు గారు చాలా దూరం ఆలోచించి రేపటి గురించి భయపడతారు… లేకపోతే మిమ్మల్ని తొక్కి నారతీయాలి.. నువ్వు కూడా కళ్ళు తెరచి నిజాలు తెలుసుకొని జనాలకు చెప్పకపోయినా పొట్టోనికి చెప్పు… నిజాలు అంటే వాడి పెళ్ళాం చేస్తున్న రంకు కాదు, ఓట్లసిన జనాలకు ఏం చేయాలి, ఎలా చేయాలి అని..
ఇలాంటి చెత్త తీర్పులు మానేసి కళ్ళతో నిజాల్ని చూడు… కోడి బుర్రను పక్కకు పెట్టి వాస్తవాలు తెలుసుకో, అవే రాయి…
////లడ్డూ, నేతి విషయం కొంచెం గమనించుకో అని బాబు తనను హెచ్చరించారని ఈఓయే చెప్పారు. ఏఆర్ స్థానంలో హెచ్చు రేటు పెట్టి మరొకరిని తేవాలనే సూచన దానిలో ఉండి ఉండవచ్చు. అందుకని తక్కిన వారి మాట ఎలా ఉన్న ఈఓ ఏఆర్పై బాణాన్ని ఎక్కుపెట్టారని అనుకోవచ్చు. దాన్ని బద్నామ్ చేసి తీసి పారేస్తే కానీ హెచ్చు రేటు పెట్టి మరొకర్ని ఎందుకు తెచ్చారన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం.////
.
జగన్ అదికారం లొ ఉండగా లడ్డు నాణ్యత మీద అనెక మంది భక్తులు, అలానె TDP నాయకులొ కూడా విమర్సలు చెసారు. చంద్రబాబు CM కాగనె, అన్న ప్రసాదల నాణ్యత పెంచాలి అనుకున్నారు. EO విచరించగా లడ్డు కు వాడె నెయ్యి, నాణ్యతకు అతి ముక్యమైన అంశం గా అర్ధం చెసుకున్నరు. నెయ్యి ల్యాబ్ కి పంపి చూసె ఉందవలసిన S. Value లొ భారీ వ్యత్యాసం ఉంది అని గుర్తించారు.
నాకు తెలిసి ఎ YCP నాయకుడు కూడా ఆ AR సంస్త నెయ్యి కల్తీది కాదు అన్నట్తు చూడలెదు, Vegetable oil కలిపి ఉంటారు, animal fat కాదు అంటూ సమర్దిచుకుంటున్నవారినె చూసా! అయితె ఈయన ఏకంగా AR సంస్త నికార్సు అయినదె… అయినా దానిని చంద్రబాబు కుట్ర పన్నె, కల్తీ అని దాన్ని బద్నామ్ చేసి తీసి పారే సారు అని రాయటం చూస్తె ఎవరు అయినా ముక్కు మీద వెలు వెసుకొవాల్సిందె! నాకు అయితె నెను సాక్షి చూస్తున్ననా అన్న అనుమానం కాసెపు వచ్చింది.
ఈ మద్య రెండూ ఒకలానె ఉంటున్నాయి అంటారా? ఏమొ అది పాఠకులకె తెలియాలి? అయినా! కొందరు మారతారు అని అనుకొవటం అత్యాశె అవుతుంది అనుకుంటా!
////లడ్డూ, నేతి విషయం కొంచెం గమనించుకో అని బాబు తనను హెచ్చరించారని ఈఓయే చెప్పారు. ఏఆర్ స్థానంలో హెచ్చు రేటు పెట్టి మరొకరిని తేవాలనే సూచన దానిలో ఉండి ఉండవచ్చు. అందుకని తక్కిన వారి మాట ఎలా ఉన్న ఈఓ ఏఆర్పై బాణాన్ని ఎక్కుపెట్టారని అనుకోవచ్చు. దాన్ని బద్నామ్ చేసి తీసి పారేస్తే కానీ హెచ్చు రేటు పెట్టి మరొకర్ని ఎందుకు తెచ్చారన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం.////
.
జగన్ అదికారం లొ ఉండగా లడ్డు నాణ్యత మీద అనెక మంది భక్తులు, అలానె TDP నాయకులొ కూడా విమర్సలు చెసారు. చంద్రబాబు CM కాగనె, అన్న ప్రసాదల నాణ్యత పెంచాలి అనుకున్నారు. EO విచరించగా లడ్డు కు వాడె నెయ్యి, నాణ్యతకు అతి ముక్యమైన అంశం గా అర్ధం చెసుకున్నరు. నెయ్యి ల్యాబ్ కి పంపి చూసె ఉందవలసిన S. Value లొ భారీ వ్యత్యాసం ఉంది అని గుర్తించారు.
నాకు తెలిసి ఎ వై.సి.పి నాయకుడు కూడా ఆ AR సంస్త నెయ్యి కల్తీది కాదు అన్నట్తు చూడలెదు, Vegetable oil కలిపి ఉంటారు, animal fat కాదు అంటూ సమర్దిచుకుంటున్నవారినె చూసా! అయితె ఈయన ఏకంగా AR సంస్త నికార్సు అయినదె… అయినా దానిని చంద్రబాబు కుట్ర పన్నె, కల్తీ అని దాన్ని బద్నామ్ చేసి తీసి పారే సారు అని రాయటం చూస్తె ఎవరు అయినా ముక్కు మీద వెలు వెసుకొవాల్సిందె! నాకు అయితె నెను సాక్షి చూస్తున్ననా అన్న అనుమానం కాసెపు వచ్చింది.
ఈ మద్య రెండూ ఒకలానె ఉంటున్నాయి అంటారా? ఏమొ అది పాఠకులకె తెలియాలి? అయినా! కొందరు మారతారు అని అనుకొవటం అత్యాశె అవుతుంది అనుకుంటా!
మన జగన్ అన్న చెసిన అతి మాత్రం…. చివరికి డిక్లరెషన్ దగ్గర బూమరాంగ్ అయ్యింది.
ఇక మీదట హిందువులు, జగన్ ని తమలొ ఒకడిగా చూడకపొవచ్చు! బొహిశా ఇంత పెద్ద బూమరాంగ్ ఈ మద్య కాలంలొ నెను చూడలెదు.
అయితె ఈయన ఏకంగా AR సంస్త నికార్సు అయినదె… అని రాయటం చూస్తె
అలా రాశానా!?
విచరించగా లడ్డు కు వాడె నెయ్యి, నాణ్యతకు అతి ముక్యమైన అంశం గా అర్ధం చెసుకున్నారు
///ఏఆర్ మంచిదో, చెడ్డదో మనకు తెలియదు///
ఇందులొ తెలియపొవటానికి ఎముంది? మరి AR మంచిది అయితె S value లొ ఎందుకు అంత భారీ తెడా వచ్చింది?
///టెస్టింగుకి పంపినప్పుడు రహస్యంగా పంపడం దేనికి?///
రహస్యం గా పంపించారు అని మీకు ఎవరు చెప్పారు? కనీసం అలా AR సంస్త కూడా చెప్పలెదె? మీరు అలా ఎలా ఊహించుకుంటారు?
///320 రూ.ల రేటుకిచ్చే వాణ్ని తీసేసి 450కి యిచ్చేవాణ్ని తెచ్చారు. పిలిచి యిదిగో నీ ఎదుటే శాంపుల్ తీస్తున్నా అని ఛాలెంజ్ చేసి పంపవచ్చుగా////
AR సంస్థ నె సుమారు 350 రూపాయలకి వెరె సంస్థల నుండి నయ్యి దిగుమతి చెసుకున్నట్టు ఆధారలు దొరికాయి అన్న వార్థలు కూడా వచ్చాయి . మరి ఇది ఎలా సాద్యం?
అలానె వాళ్ళ నెయ్యి స్టొరెజ్ క్యపాసిటీనె ఒక ట్యంకర్ కంటె చిన్నది అన్న విషయం కొన్ని మాద్యమాలలొ వచ్చింది. విచరణలొ మరన్ని విషయాలు భయటకి రావచ్చు.
అసలు టెండర్ నిభందనలు ఎందుకు మార్చారో చెప్పాలి కదా.. ఇప్పటివరకు కేవలం డైరీలు మాత్రమే అదికూడా సామర్థ్యం ఉంటేనే టెండర్లలో పాల్గొనే అవకాశం వుండేది.. మరి ట్రేడర్లు ఎందుకు వచ్చారు?
ఇదే AR డైరీ 6 నెలల కిందట టెండర్లలో 420 లోపు సప్లై చెయ్యలేము అని తప్పుకుంది.. మరి తరువాత 319 కి ఎలా సప్లై చేస్తోంది.. పైగా వేరే డైరీ నుంచి 355 కు కొని టీటీడీ కి 319 ఎలా ఇస్తోంది? అదికూడా వైష్ణవి డైరీ నుంచి ఎలా సప్లై చేస్తున్నారు?
Yes Correctly said. Investigation should appear to be fair. The samples should have been taken in front of supplier, and should have been sent to testing. It appears some thing big motive is there. May be some day Heritage may make backside entry.
ప్రసాద్ గారూ బీఫ్ టాలో అంటే గొడ్డు నుండి వచ్చే కొవ్వు అనుకుంటా పంది నుండీ కాదు…lard అంటే పంది నుండి వచ్చే కొవ్వు
మన జగన్ అన్న చెసిన అతి మాత్రం…. చివరికి డిక్లరెషన్ దగ్గర బూమరాంగ్ అయ్యింది.
నా ద్రుష్టిలొ ఇక మీదట హిందువులు, జగన్ ని తమలొ ఒకడిగా చూడకపొవచ్చు! బొహిశా ఇంత పెద్ద బూమరాంగ్ ఈ మద్య కాలంలొ నెను చూడలెదు. రెపు SIT నివెదిక వస్తె వై.సి.పి భూస్తాపితం కూడా కావచ్చు
vc available 9380537747
vc estanu 9380537747
అసలు. వీవీ. క. కూతురు. పోరాటం వల్లనే. ఆ కే. సూ. పక్క ధారు పట్టింది వివేకా పరువూ పోయింది అని రాసేసిన మీరు. ఇక ఏదన్నా రాయ గాల్సీ తారు. ఇంకో ఆర్టికల్. లో మల్ల కే. సు ను.మోసేస్తేనే మంచిది అని ఒక వాదన వదలండి
Logic is flawed. You have already made up your mind to blame babu and co and put in points to justify the same – Your Confirmation Bias is clearly visible.
Let’s , for argument sake, go with what you said. If the whole intention is to blame AR Dairy and give the contract to some one else, what is the hurry ? Anyhow the contract is only for 6 months. TTD could always tweak the Tender conditions just like how YV Subbareddy did. Mari antha tondara emiti ?
Why would TDP want to favor Nandhini ? It is a Karnataka government entity and is very unlikely to offer any bribes. So what would Babu and co gain if they favor Nandhini ?
There are reports in Newspapers that AR does not have the capacity to supply Ghee in such large quantities. They themselves are buying it from some other companies and a much higher prices. Tankers from the dairy are reaching Thirumala weeks after they start from AR dairy. What do we make of this ?
Why was this not same when govind got tender in 2015 from nandini?
May be after sometime Heritage will come to picture. If not now, may be some other day.
కల్తీ బాబు కీ దూల తీరుస్తారు ఉండు
సార్ అతి తెలివి గా రాశారు గాని టెండర్ ప్రాసెస్ లో A R diary kosam.నిబంధనలు మార్చారు . కేవలం దాన్ని క్వాలిఫై చెయ్యడానికి . ఇక ఆ R diary direct gaa నియ్యి sekahaana sudhui cehse process lo లేదు. దానికి ఆ సమర్ధ్యం లేదు .మీరు.ఎక్వలం రేటు ప్రాతిపదికనే A r qualify అయ్యింది అని రాశారు . ఇప్పుదు చూస్తే 355 కు కాంట్రాక్టు తీసుకొని వైష్ణవి అనే సబ్ కాంట్రాక్టర్ కు ఇస్తే వాడు ఉత్తరాఖండ్ నుండి భోల్ బాబాభ అనే company nundi తెచ్చారు .ఇవన్నీ విత్ proofs tho ఉన్నాయి నేట్ లారీ చలన లతో సహా commercia టాక్స్ ఉద్యోగుల ద్వారా తేలాయి. ట్రాన్స్పోర్ట్ అంత ఆధాన్నగా పడుతున్న ఎలాంటి problem లేకుండా సఫర అచ్సారు అంటేనే కల్తీ గనుకనే చెయ్య గలిగారు అనే అర్థం అవుతుంది అసలు A R ku 10 tons kooda sarara cehse సామర్థ్యం లేదని తెలిసి ఎలాంటి మెరిట్ చూడకుండా నిబంధనాలు మార్చి contract ku ఇచ్చారు
కొత్త కొత్త జరిగిన చెత్త ఆధారాలతో సహ బైటకి వస్తున్నాయి … రచయత గారు అనుసరిస్తున్నారో లేదో
మతపరమైన మోసాల వెనుక దాక్కునే బదులు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిజమైన సమస్యలపై దృష్టి పెట్టండి. మనకు ఉపన్యాసాలు కాదు, పరిష్కారాలు కావాలి.
“Focus on real issues that affect people’s lives instead of hiding behind religious platitudes. We need solutions, not sermons
మతపరమైన మోసాల వెనుక దాక్కునే బదులు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిజమైన సమస్యలపై దృష్టి పెట్టండి. మనకు ఉపన్యాసాలు కాదు, పరిష్కారాలు కావాలి.
Focus on real issues that affect people’s lives instead of hiding behind religious platitudes. We need solutions, not sermons
//ఆవు పాలలో కొవ్వు శాతం ఎక్కువ//
తప్పు. అది కొవ్వు కాదు వెన్న. ఇంకో తప్పు గేదె పాలతో పోలిస్తే ఆవు పాలలో వెన్న శాతం తక్కువ, ఇచ్చే పాలు కూడా తక్కువే. అందుకే ఎక్కువ పాడి రైతులు గేదెలే పెంచుతారు. ఇంకొకటి ఆవు ఏది పడితే అది తినదు, గేదెలు ఏదైనా తింటాయి. ఆవులు ఎక్కువగా పచ్చి గడ్డి, మొక్కజొన్న, జొన్నలు లాంటివి తింటాయి
దేశవాళీ ఆవు నెయ్యి బల్క్ లో చేస్తే 1000-1200 లో తప్పకుండా లభిస్తుంది. Himalayan Natives, Country Delight తదితర బ్రాండ్లు అమ్ముతున్నాయి దేశవాళీ నెయ్యి. విదేశీ ఆవుల నెయ్యి 400-600 లో వస్తుంది
Don’t support unethical acts of ycp and jagan
In 70s & 80s we used to get ghee smell of Pulla Reddy Sweets (Abids, Hyderabad) to a distance of about 100m i.e. upto GPO. Nowadays we hardly get ghee smell near to Pull Reddy Sweets Shop.. What it means.. ?
Same may be the deterioration of taste of ‘Tirupati Laddu’ with time… I feel.. Quality deteriooration is a ‘vague’ unless properly monitored or recorded..
I know @Writer Prasad Garu is a very good fiction writer.
After reading this article I couldn’t hesitate to agree your fiction knowledge skills to recreate things which you imagined in favour of Jagan Mohan Reddy and gang.
My suggestion to you is to wake-up from the fiction world and start living in the reality, so that people can accept your writing skills. Bcz all your talent these days is limited to biased articles than bold truth articles.
All the best Prasad Garu 🙏
పక పక
enduku meeku jagan ante intha prema
ఇంతకీ చెప్పవచ్చేది ఏమిటి అంటే హిందువులు మూర్ఖతంవం తో జగన్ ను కాదని బాబుని గెలిపించారు, దానికి అనుభవిస్తున్నారు . బడే మియా చోటే మియా వల్లకానిది జగన్ బాగా చేయగలడు, చేసి చూపించాడు గత 5 ఏళ్లలో . హిందువులు అనవసర తద్దినం నెత్తిన పెట్టుకున్నారు, బీజేపీ వీళ్ళని వెనకాల వుంది ఆడిస్తోంది. హిందువులకి తిరుపతి లడ్డు తో పని లేదు, పక్క స్వీట్ షాప్ లో కొని దేవుడి పేరు చెప్పుకుని తిని సరిపెట్టుకోకా? ఇదంతా అనవసర రాద్ధాంతం.
Proofs anni undali
pakka sweet shop lo laddu koni adhe tirupathi laddoo anukovalaa
కాం గా ఉండుంటే … చంద్రబాబు వేసిన సిట్ ఎంక్వయిరీ పూర్తి అయ్యాక ఇది ఫాల్స్ రిపోర్ట్ అని రాజకీయం చేసుకోవటానికి వీలుగా ఉండేది ఈ యెహోవా విన్సెంట్ సుబ్బారెడ్డి గాడు కోర్టు కు పోయి మొత్తానికి నాకించేసాడు
కేవలం AR Dairy ని వెళ్ళగొట్టి నందిని ని తీసుకురావడం కోసం బాబు ఈ తేనె తుట్టెని కదిపి ఉంటాడనే వాదన నవ్వులాటగా ఉంది. Kick backs ఉన్నాయనుకుంటే అవి ఎంత? సముద్రంలో కాకి రెట్టంత! కాబట్టి ఈ రాధ్థాంతానికి అసలు కారణం జగన్ ని రాజకీయంగా దెబ్బగొట్టడం కావొచ్చు. తన ఆరోపణలు నిరూపణ కాకపోతే జరిగే పరిణామాలు బాబుకి తెలియదనుకోవడం మన అమాయకత్వం. He is playing cards close to his chest అని నేను అనుకుంటున్నాను. Let us see as things unfold.
Good article
అయ్యా…పాఠకులకి వినతి: ఎంబీస్ గారు ఎప్పుడో తన రచనా విలువలను గ్రేట్ ఆంధ్ర కి తాకట్టు పెట్టిమరి డబ్బులు తెచ్చుకుంటున్నారు…కాబట్టి ఆయన ఏమీ రాసినా దాంట్లో ఒకటి ఒక వైసిపి కి అనుకూలం గా టిడిపి కి వ్యతిరేఖంగా ఉంటాయి..దయచేసి పాఠకులు ఈయన రచనా విలువలను పట్టించుకోనవసరం లేదు…