రాజకీయ ప్రత్యర్థుల మీద ఎంతటి కక్ష అయినా ఉండొచ్చు.. ఆ కక్ష తీర్చుకోవడానికి వేరే మార్గం దొరకనప్పుడు.. వారి కుటుంబ సభ్యులనైనా ఇబ్బంది పెట్టి, ఇరికించి ఆనందించాలని అనుకోవడం వేధింపులకు పరాకాష్ట అవుతుంది. ఇప్పుడు పేర్ని నాని- జయసుధ వ్యవహారంలో ఇంచుమించుగా అదే జరుగుతోంది.
ప్రభుత్వం మీద విమర్శలతో విరుచుకుపడుతూ ఉండే పేర్ని నాని సులువుగా తమకు చిక్కడం లేదు కాబట్టి.. గోడౌన్లో బియ్యం మాయం కేసులో ఆయన భార్య జయసుధను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదా? అనే అనుమానం కలుగుతోంది.
తాజాగా ఆమె పోలీసు విచారణకు కూడా హాజరైన నేపథ్యంలో.. విచారణ పేరుతో మరోసారి కూడా పిలిచి వేధించగలరు తప్ప.. సర్కారు పెద్దలు కోరుకుంటున్నట్టుగా ఆమెను అరెస్టు చేయడం, ఆమె నేరం చేసినట్టుగా నిరూపించి శిక్షలు పడేలా చేయడం అంత ఈజీ కాదని న్యాయనిపుణులు భావిస్తున్నారు.
బుధవారం నాడు పేర్ని జయసుధ విచారణకు హాజరు కాగా పోలీసులు ప్రశ్నలు అడిగిన తీరు కూడా ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. పొట్లపాలెంలోని వారి గోడౌన్ నిర్మాణం ఎఫ్పుడు జరిగింది, ఎంత భూమి కొన్నారు, ఎవరి పేరున ఉంది, ఎంత అద్దెకు ఇచ్చారు.. బియ్యం నిల్వ వ్యవహారాలు మీరే చూశారా? లాంటి ప్రశ్నలు పోలీసులు అడిగారు. విచారణకు మరోసారి కూడా రావాల్సి ఉంటుందని పోలీసులు ఆమెకు చెప్పి పంపారు.
అయితే పోలీసు విచారణలో గోడౌన్ వ్యవహారాలు తనకేమీ తెలియదని, అంతా మేనేజర్ మానస్ తేజ్ చూసుకునే వారని జయసుధ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది చాలా సహేతుకమైన సమాధానమే. గోడౌన్ ఆమె పేరిట ఉన్నంత మాత్రాన.. అందులో జరిగే ప్రతి లావాదేవీని ఆమె స్వయంగా పర్యవేక్షిస్తుంటారని అనుకోవడం భ్రమ.. అలా జరుగుతున్నదని నిరూపిస్తే తప్ప పోలీసులు ఆమె పాత్రను నిర్ధరించలేరు.
ఒక నేరం జరిగితే.. ఆస్తి ఎవరి పేరిట ఉన్నదో వారిని విచారించడం సాధ్యమవుతుంది గానీ.. వారికి నేరంలో పాత్ర ఉన్నదని నిరూపించడం అంత సులువు కాదు. ఈ విషయాలన్నీ వారికి కూడా తెలుసు గనుకనే.. పేర్ని జయసుధను మరింతగా ఇరికించడానికి అనువుగా కొత్త ప్రశ్నలు తయారుచేసుకోవడానికి వ్యవధి కావాలి గనుక.. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పినట్టుగా పలువురు భావిస్తున్నారు.
సర్కారు మీద విరుచుకుపడుతూ ఉండే పేర్నినానిని కట్టడి చేయడానికి దీనిని ఒక మార్గంగా ప్రభుత్వం భావిస్తుండవచ్చు. మేనేజరు మానస్ తేజ్ తదితరుల అకౌంట్లలోకి సొమ్ము లావాదేవీలు జరిగాయనే కారణం చూపించి.. విచారణలో కొన్ని విషయాలు తెలిసాయంటూ.. పేర్ని నాని పేరును కూడా కేసులో ఏ6గా చేర్చారు. అంతమాత్రాన ఆయనకు శిక్ష పడేలా చేయడం కూడా కష్టమేననే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
కొరికలు తీర్చు కొవాలి అనుకుంటె, కొర్టు కి వెళ్ళి బైలు తెచ్చుకునె సమయం ఇస్తారా?
అంతే కదా..
మన జగన్ రెడ్డి దోచుకున్న సొమ్ముకు.. శ్రీ లక్ష్మి లాంటి అధికారాలు జైలు కి వెళతారు..
పేర్ని నాని దోచుకున్న సొమ్ముకు.. ఆ గోడౌన్ లో పని చేసే అధికారాలు బాధ్యులు అవుతారు..
..
మేము తప్పు చేస్తాం.. ఆ తప్పు నిరూపించినా.. మమ్మల్ని పట్టుకోలేరు.. అని ఎంత గొప్పగా, గర్వం గా చెపుతున్నారో చూసారా..