కార్పొరేట్ కోట్ల మీద కన్నేసిన బాబు సర్కార్!

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిధుల సమీకరణకు ఒక కొత్త ఎత్తుగడతో ముందుకు రానుంది.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిధుల సమీకరణకు ఒక కొత్త ఎత్తుగడతో ముందుకు రానుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ ఉండే నిధులను అడ్డదారిలో ప్రభుత్వ పనులకు దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తున్నది.

కొత్త సంవత్సరం ఆరంభం నాడు.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికలతో చేసిన కొత్త ఆలోచనల్లో ఇది కూడా ఒకటి. చంద్రబాబునాయుడు అధికారులతో భేటీ అయిన సందర్భంగా.. ఒక అధికారి ఇలాంటి సూచన చేశారు. పెద్ద సంస్థలు సీఎస్ఆర్ కింద వెచ్చించే నిధులను ఒకే గొడుగు కిందకు తెస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చునని అధికారి చేసిన సూచనకు చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా ఓకే చెప్పేశారు.

అమరావతి ప్రాంతంలోనే వేలాది కోట్ల రూపాయల పనులు, నిర్మాణాలు చేపడుతున్న ప్రస్తుత తరుణంలో.. చంద్రబాబు సర్కారు.. కార్పొరేట్ కంపెనీల నుంచి వందల కోట్ల రూపాయలు దండుకుని అమరావతి అగ్నిహోత్రంలోనే సమర్పించుకోవాలని భావిస్తున్నట్టుగా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా సీఎస్ఆర్ నిధుల మీద ప్రభుత్వమే కన్నేయడం వలన.. రాష్ట్రంలో సామాన్యులకు, పేదలకు ఆయా సంస్థల ద్వారా అందగల సాయం, చేయూత ఇక ఉండవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేట్ కంపెనీలు చేసే సేవా కార్యక్రమాలకు సంబంధించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఏర్పాటు ఒకటి ఉంటుంది. ఆయా కంపెనీలు వార్షికంగా తమకు లభించే ఆదాయం నుంచి నిర్దిష్టంగా కొంత శాతం మొత్తాన్ని ఈ ఫండ్ కిందికి కేటాయించాలి. ఆ సొమ్ము ద్వారా సేవా కార్యకలాపాలు చేయాలి.

సాధారణంగా సీఎస్ఆర్ ఫండ్స్ తో ఆ కంపెనీలు ఏ ప్రాంతంలో అయితే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయో ఆ ప్రాంతాల్లో పేదల అవసరాలకు, అభ్యున్నతికి ఖర్చు పెడుతుంటారు. ఏటా ఈ రకంగా కొన్ని వందల వేల కోట్ల రూపాయల విలువైన పనులు పేదలకోసం సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా జరుగుతుంటాయి.

ఇప్పుడు చంద్రబాబునాయుడు సర్కారు ఆ నిధుల మీద కూడా కన్నేసినట్టుగా కనిపిస్తోంది. అమరావతిలో అనేక రకాల పనులు జరుగుతుంటాయి.. గనుక.. ఏవో కొన్ని పనులను సీఎస్ఆర్ నిధులు వెచ్చించగల పరిధిలోకి తీసుకురావడం పెద్ద కష్టం కాదు. ఆ తర్వాత.. ఆ పనులకు సరిపడా డబ్బులను పెద్ద సంస్థల సీఎస్ఆర్ ఫండ్స్ నుంచి పొందవచ్చు. అయితే ఇలా చేయడం వల్ల.. ఆ కంపెనీల ద్వారా సాయం పొందగల పేదలకు దక్కే అవకాశాలు మూసుకుపోతాయి.

పెద్ద కంపెనీలకు ప్రభుత్వంతో చాలా పనులుంటాయి గనుక.. సీఎస్ఆర్ ఫండ్స్ ను ప్రభుత్వ పెద్దలు ఏ పనికి చెబితే ఆ పనికి ఖర్చు పెట్టడానికి వారు ఓకే చెప్పేస్తారు. కానీ.. నష్టపోయేది మాత్రం పేదలే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

12 Replies to “కార్పొరేట్ కోట్ల మీద కన్నేసిన బాబు సర్కార్!”

  1. రాష్త్ర అబిరుద్దికె వాడుతున్నరు కాని మన అన్నలా పార్టి ఫండ్ కి వాడటం లెదు అంటవా?

  2. Corporates have right to decide what causes their CSR will fund. As long as the cause if for the development or upliftment of the society or people, how does it matter if they are directly giving to a poor man or investing in a development or progress agenda. Stop thinking with pea brains.

  3. మరి.. మా జగన్ రెడ్డన్న ..

    పంచాయితీ నిధులు మింగేశాడు..

    కేంద్ర వాటా నిధులు మింగేశాడు..

    ఉద్యోగుల సేవింగ్స్ నిధులు మింగేశాడు..

    6 లక్షల కోట్లు అప్పులు తెచ్చి మింగేశాడు..

    మద్యం మీద వచ్చే ఆదాయం మింగేశాడు..

    అన్నీ తీసుకెళ్లి పేదలకు సంక్షేమం పేరుతో పంచేశామని చెప్పుకొంటున్నాడు ..

    ..

    మరి అన్నేసి లక్షల కోట్లు పేదలకు పంచేస్తే.. వాళ్ళు ఇంకా “పేదలు” గా ఎలా ఉంటారు..

    రాష్ట్రం లో పేదలు అనేవాళ్లే లేరు కాబట్టి.. చంద్రబాబు ఆ కార్పొరేట్ నిధులు అభివృద్ధి కి, వ్యవసాయానికి వాడేసుకొంటున్నారు.. ఇందులో నీకు వచ్చిన నొప్పి ఏంటి..? మూసుకుని అమరావతి, పోలవరం, జల హారతి పనులు అప్డేట్స్ ఇస్తూ ఉండు..

    ..

    బై ది వే.. అమరావతి బొమ్మ బాగుంది.. ఇంకో రెండోళ్లలో ఇంకా బెటర్ గా ఉంటుంది..

    నీ జగన్ రెడ్డి ఏడుపంత అందం గా ఉంటుంది..

    1. చదివిన మాకే కాదు, రాసిన మీకు కూడా అంటే “భగవాన్ అచ్చా కరేగాతో సాధూ బిచ్చా కరేగా” పాపం తండ్రిలేని పిల్లాడు ప్యాలెస్లు కట్టుకోడానికి తన ఇంటికి రోడ్లు వేసుకోడానికి 43వేల కోట్లు తస్కరిస్తే కూడా ఈ సమాజం నిలదీస్తోంది అంటే మనం ఎటు పోతున్నాం అధ్యక్షా. బాబుగారు…కొంచెం ప్రజాధనం తస్కరించిన A1 ని లోపలన్నా వేసి సత్కరంచండి. బయట ఉంటే పాపం అందురూ ఇలాగే ప్రశ్నించి పసివాడిని భయపెతున్నారు.

      1. మరి.. మా జగన్ రెడ్డన్న ..

        పంచాయితీ నిధులు మింగేశాడు..

        కేంద్ర వాటా నిధులు మింగేశాడు..

        ఉద్యోగుల సేవింగ్స్ నిధులు మింగేశాడు..

        6 లక్షల కోట్లు అప్పులు తెచ్చి మింగేశాడు..

        మద్యం మీద వచ్చే ఆదాయం మింగేశాడు..

        అన్నీ తీసుకెళ్లి పేదలకు సంక్షేమం పేరుతో పంచేశామని చెప్పుకొంటున్నాడు ..

        ..

        మరి అన్నేసి లక్షల కోట్లు పేదలకు పంచేస్తే.. వాళ్ళు ఇంకా “పేదలు” గా ఎలా ఉంటారు..

        రాష్ట్రం లో పేదలు అనేవాళ్లే లేరు కాబట్టి.. చంద్రబాబు ఆ కార్పొరేట్ నిధులు అభివృద్ధి కి, వ్యవసాయానికి వాడేసుకొంటున్నారు.. ఇందులో నీకు వచ్చిన నొప్పి ఏంటి..? 

  4. Before this know approx. How much CSR is spent in AP by AP registered/operating companies and then talk about his plan. Without numbers anybody can say any in intangible terms. This is where most papers fail and naadu twists and shines. Learn it!

    1. just got the numbers its ~6.7crs in AP by any CSR excluding PAN india spends in 2023-24. Now Unless the kickbacks are earned anything beyond this spend is questionable.

  5. CSR was concept initiated in the early 90s after liberalization/economic reforms and has TAX benefits too. In way Govt tried remind the corporates the responsibility as they exploit public natural resources. There is no fixed percentage and there is no complusion on the areas that they need to use it, but govt can always make an effort plod the corporates to direct to the areas that they would prefer. Whats wrong in it? By the way, I am seriously interested a to how much Bhrathi Cements spent on CSR and where.

Comments are closed.