ఎమ్బీయస్‍: అర్జున్ ఏ మేరకు బాధ్యుడు?

అనుమతి నిరాకరించి ఉంటే మీరు థియేటరు వద్ద ఎందుకు ఉన్నారు? అర్జున్‌ని ఎందుకు అడ్డుకోలేదు?

ఈ వ్యాసం చదివే ముందు https://telugu.greatandhra.com/mbs/mbs-revanth-knows-how-to-deal-with-tollywood.html, https://telugu.greatandhra.com/mbs/allu-pai-jallu.html చదవగోర్తాను. నా మొదటి వ్యాసంలో రేవంత్ రెడ్డి టిక్కెట్టు 3 వేలు అని ఎలా అన్నారా? అని ఆశ్చర్యపడ్డాను కదా. దానికి ఆంధ్రజ్యోతిలో సమాధానం దొరికింది. దాని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 800 స్క్రీన్లలో బెనిఫిట్ షోలు అనుమతించారు. ఆ విధంగా మొత్తం 1600 బెనిఫిట్ షోలు పడ్డాయి. ఆంధ్రలో బెనిఫిట్ షో రేటు రూ.800 ఫిక్స్ చేయగా, తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లలో సుమారు రూ.1000, మల్టీప్లెక్స్‌లో రూ.1200 వరకూ పలికాయి. సంఘటనకు ప్రత్యక్షసాక్షిని అంటూ ఒకాయన చేసిన వీడియోల సంధ్య థియేటర్లో టిక్కెట్టు రూ.1100 అన్నారు. మరి 3 వేలు ఎక్కణ్నుంచి వచ్చింది? ఆంధ్రజ్యోతి ప్రకారమే కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమ ఆఫీసు ద్వారా బ్లాక్‌లో అదే టిక్కెట్టును రూ.3000కు అమ్మారట!

ముఖ్యమంత్రికి అందిన సమాచారం ప్రకారం భాస్కర్ కుటుంబం అలా బ్లాక్‌లో కొందన్నమాట. 30వేల ఉద్యోగి 1100 పెట్టి కొనడమే సంసారం చేసే లక్షణం కాదనుకుంటే, 3 వేలు పెట్టి కొనడాన్ని ఏమనాలో తెలియకుండా ఉంది. కొందరు వాళ్లు టిక్కెట్ రిజర్వ్ చేసుకుని వచ్చారు. అందువలన మొదటి రోజు రావడంలో తప్పేముంది? అని వాదిస్తున్నారు. కేవలం సినిమా గురించే అయితే దిల్‌సుఖ్ నగర్ నుంచి చిక్కడపల్లి వరకు రావలసిన అవసరమే లేదు. అర్జున్ వస్తున్నాడనే వాళ్లు యింత దూరం వచ్చారు. అలా వచ్చినపుడు ఎంత రష్ ఉంటుందో వాళ్లు గెస్ చేసి ఉండాల్సింది. పైగా రేవతి గారికి, శ్రీతేజ్‌కు ఆస్తమా ఉందని కూడా కొందరంటున్నారు. గుంపుల్లోకి వస్తే ఊపిరాడక పోయే ప్రమాదం ఉందని వారికి తెలిసే ఉంటుంది. రిస్కు తీసుకుని వచ్చారు. పాపం, యిలా పరిణమించింది. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని వినడం ఊరట కలిగిస్తోంది. వీళ్లను చూసి, తక్కిన కుటుంబాలైనా జాగ్రత్త పడాలి.

ఆవిడ ఊపిరాడకనే పోయారని రిపోర్టు వచ్చే లోపున అర్జున్ బౌన్సర్లు ఆమె గుండెలపై తొక్కుతూ పోయారని కొందరు, మరి కొందరు అర్జునే స్వయంగా తొక్కుకుంటూ పోయాడని వీడియోలలో చెప్పేశారు. అర్జున్‌పై ఏ రాయి వేసినా వజ్రంలా భావించే రోజులివి! పనిలో పనిగా బౌన్సర్ల వ్యవస్థపై కూడా అందరి చూపూ పడింది. దాన్ని రెగ్యులరైజ్ చేస్తే మంచిదే. యాక్టర్ కేటగిరీని ఫిక్స్ చేసి, ఎంతమందిని పెట్టుకోవచ్చో నిర్ణయిస్తే సరి! బౌన్సర్లు మమ్మల్ని వెళ్లనీయ లేదు అని పోలీసులన్నట్లు కొందరు చెప్తున్నారు. అలాటి వార్త బయటకు వస్తే పోలీసులపై గౌరవం పోతుంది కూడా. సినిమాల్లో సెన్సారు వాళ్లు ఎలాగూ పరువు తీస్తున్నారు. బయట తమ పరువు తామే తీసుకంటే ఎలా?

సరే, యీ విషయం మాట ఎలా ఉన్నా, డిస్ట్రిబ్యూటరు ఆఫీసులోనే బ్లాక్‌లో సినిమా టిక్కెట్లు అమ్ముతున్నారన్న విషయం ముఖ్యమంత్రి ఒప్పేసుకున్నారు కాబట్టి, దీన్ని నివారించడానికి ఏం చేయబోతున్నారో ఆయన ప్రకటించాలి. ఎందుకంటే దీనివలన ఆ అదనపు ఖరీదుపై రావలసిన జిఎస్టీ ఆదాయానికి గండి పడుతోంది. సినిమా నటుల ‘బలుపు’ తగ్గించే ప్రయత్నాలు ఓ పక్క చేస్తూనే, రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం కూడా చేయాలి కదా!

ఇక రెండో విషయం – దీని వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నారని భావిస్తున్నారా? అని అడుగుతూ నాకు చాలామంది మెయిల్స్ రాశారు. వాస్తవాలు ఎవరికీ తెలియవు కానీ వాళ్లు ఉన్నారనడం లాజిక్‌కు అందటం లేదు. ఏ నాలుగైదు సీట్ల తేడాతోనో కూటమి ఓడిపోయి ఉంటే అర్జున్ నంద్యాల కాండిడేట్ కోసం రావడంతోనే చుట్టుపట్ల నియోజకవర్గాలు ప్రభావితమై అధికారం చేజారిందని వాళ్లు పగ బట్టారనుకోవచ్చు. కానీ వైసిపికి 11 సీట్లే దక్కాయి. వాటిలో అర్జున్ వచ్చిన నంద్యాల లేదు. ఇక అర్జున్ రావడం వలన కూటమి నష్టపోయిందేముంది? గుడ్డి కన్ను తెరిచినా, మూసినా ఒకటే అనుకుని నవ్వుకుని ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధిస్తే మజా ఉంటుంది కానీ, రాజకీయంగా ఏ బలమూ లేని వాడిపై సాధించి ప్రయోజనం ఏముంటుంది?

సినిమా యాక్టర్లకు కూడా స్నేహితులుంటారు. చిరంజీవి మిత్రుల్లో ఒకరు నిర్మాత అశ్వినీదత్. ఆయన టిడిపి తరఫున 2004లో విజయవాడలో పోటీ చేస్తే చిరంజీవి వెళ్లి కాన్వాస్ చేశారు. అంతమాత్రం చేత వైయస్ చిరంజీవిపై పగ బట్టలేదు. 2024లో అర్జున్ కాన్వాస్ చేయలేదు. వచ్చి వెళ్లారంతే. ఇంకో మాట, టిడిపి కూటమిలో పవనూ, బాలకృష్ణా స్టార్లు. అనేకమంది స్టార్లు టిడిపికి అనుకూలంగా ఉన్నారు. ఇవాళ అర్జున్‌కి జరిగింది రేపు వాళ్లకీ జరగవచ్చు. సహజంగా జరగక పోయినా, ఎవరైనా కావాలని ఆ గుంపులో ఏ ముసలాణ్నో ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసి ‘అదిగో ఆ హీరోని అరెస్టు చేయండి’ అని డిమాండు చేయవచ్చు. ఈ ప్రమాదం నాయకుల విషయంలో కూడా ఉంది. ఇది రిస్కీ గేమ్. సినిమా రంగంలో ఉన్న వాళ్లెవరూ యీ కేసులను సమర్థిస్తారని అనుకోవడానికి లేదు.

ఇది రేవంత్ వ్యూహం మాత్రమే తప్ప వేరే వాళ్ల ప్రమేయం ఉందనుకోను. ఆయన కూడా ‘కహీపే నిగాహే, కహీపే నిశానా’ అన్నట్లు అర్జున్‌పై విల్లు ఎక్కుపెట్టినట్లు నటిస్తూనే సినీపరివారం మొత్తాన్ని తన వద్దకు రప్పించుకో గలిగారు. ఇది ఎబిఎన్ రాధాకృష్ణ గార్ని మెప్పించింది. ‘సిఎం ఛైర్ కాదు, ఫైర్’ అంటూ 22-12-24 కొత్త పలుకులో మెచ్చుకున్నారు. ఇలాటి కేసులేవీ పెట్టకుండా, కేవలం టిక్కెట్టు ధరలను నియంత్రించి, సినీపరివారంలో కొందర్ని తన వద్దకు తెప్పించుకున్న జగన్ విలన్‌గా, అతనిది మొరటు పద్ధతిగా తోచిన వీరికి యిప్పుడు రేవంత్ తెలివైన హీరోగా భాసిస్తున్నాడు. అదే కొత్త పలుకులో రాధాకృష్ణ ‘మహిళ మృతికి అర్జున్ ప్రత్యక్ష కారణం కాకపోయినప్పటికీ, అంటే కుట్రపూరిత ఉద్దేశంతో వ్యవహరించ నప్పటికీ కేసులో చిక్కుకున్నారు.’ అని రాశారు.

చిక్కుకోవడానికి కారణమేమిటో ఒక వారం పోయాక 29-12-24 కొత్తపలుకులో చెప్పేశారు కూడా. రేవంత్‌కు అంత కోపం ఎందుకు వచ్చిందంటే సినిమా సక్సెస్ మీట్‌లో రేవంత్ పేరును అర్జున్ మర్చిపోయినప్పుడు విచారం వ్యక్తం చేయమని ముఖ్యమంత్రి సన్నిహితులు సూచిస్తే, రాజకీయాలతో నాకు సంబంధం లేదంటూ అర్జున్ నిరాకరించారట. ఇది చెప్తూ ‘దీంతో ఒక రాత్రి అతను జైల్లో ఉండాల్సి వచ్చింది, హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందినప్పటికీ పోలీసులు గంటల పాటు స్టేషన్‌కి రప్పించి విచారించారు.’ అని చేర్చారు రాధాకృష్ణ. రేవంత్, చంద్రబాబు రాధాకృష్ణ గారికి సన్నిహితులని లోకమంతా అనుకుంటున్న తరుణంలో యీయన రేవంత్ వ్యక్తిగత ఆభిజాత్యమే అర్జున్ కష్టాలకు కారణమంటూ రాయడం రేవంత్ ప్రతిష్ఠను దిగజార్చడమే! దీనికి ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి సోమవారం నాడు ఖండన వస్తుందని ఎదురు చూశా. రాలేదు. ఇటువంటి ‘టఫ్’ యిమేజే రేవంత్ కోరుకుంటున్నారేమో తెలియదు.

అర్జున్‌పై కేసు పెట్టడం, అరెస్టు కావడం, బెయిలు ఆర్డరు వచ్చినా తమకు చేరలేదంటూ ఒక రాత్రంతా జైల్లో కూర్చోబెట్టడం.. యివన్నీ పోలీసులు కావాలని చేస్తున్నారని స్పష్టంగా అందరికీ తెలిసేట్లు చేశారు. పోలీసులు అనగా వారు ఉపకరణాలు మాత్రమే, వారిని ఉపయోగించే కరం హోం మంత్రి కమ్ ముఖ్యమంత్రిదే అనే దానిలో సందేహమే అక్కరలేదు. ఇలాటి స్టాంపీడ్ కేసుల్లో భద్రతా ఏర్పాట్ల వైఫల్యం అంటూ స్థానిక పోలీసుల మీద, ఆర్గనైజర్స్ మీద కేసులు పెడతారు కానీ వచ్చిన అతిథులపై పెట్టరు. థియేటరు ప్రాంగణంలో జరిగింది కాబట్టి థియేటరు యాజమాన్యంపై పెట్టవచ్చు, మేం సినీ నిర్మాణ సంస్థకు ఆ రెండు రోజులు లీజుకి యిచ్చేశాం అని థియేటరు వాళ్లంటే, వాళ్ల మీద పెట్టవచ్చు. కానీ వచ్చిన అతిథిపై కేసు పెట్టినపుడే యిదేమిటి? అంటూ కనుబొమలు పైకి లేచాయి.

పది రోజులు పోయాక, యింటికి వెళ్లి అరెస్టు చేయడం (చంద్రబాబుని స్టేషన్‌కి పిలిచి విచారించ వచ్చుగా, నంద్యాల వెళ్లి అరెస్టు చేయడమెందుకు? అని అడిగిన వాళ్లు యిప్పుడు పోలీసు స్టేషన్‌కి రప్పించి అరెస్టు చేయవచ్చుగా అనటం లేదెందుకో), బెడ్‌రూమ్‌ లోకి కూడా వెళ్లారన్న వార్తలను పోలీసులు ఖండించక పోవడం యివన్నీ వింతగా తోచాయి. హైకోర్టులో వాదనలు జరుగుతూండగానే నాంపల్లి కోర్టులో హాజరు పరిచి, 14 రోజుల రిమాండు అడగడం మరీ చిత్రం. 14 రోజులు అడిగేటన్ని ప్రశ్నలేముంటాయి? పోలీసు స్టేషన్‌లో కొన్ని గంటలు, సీన్ రికనస్ట్రక్షన్‌కి కొన్ని గంటలు పట్టాయి. నాంపల్లి కోర్టు అప్పటికప్పుడు రిమాండుకి యిచ్చేయడం, పోలీసులు జైలుకి తరలించడం జరిగి పోయింది. ఈ లోపున హైకోర్టు బెయిలు యిచ్చింది. కానీ సాంకేతిక కారణాల వలన బెయిలు ఆర్డరు తమ చేతికి అందలేదంటూ అర్జున్‌ని రాత్రంతా జైల్లో ఉంచారు.

ఇదంతా చూసేసరికి చట్టం తన పని చేసుకుంటోంది అనే అనుకోవడం మానేశారు. ఎందుకంటే మోహన్‌బాబు విషయంలో (28 వ తారీకు దాటిపోయింది, గమనించారా?) అది పని చేసుకోవటం లేదు. రేవంత్ కక్ష సాధిస్తున్నారు అని అందరూ అనుకోసాగారు. దాంతో ‘అదేమీ కాదు, అర్జున్ శిక్షార్హుడు కాబట్టే యిదంతా అనుభవిస్తున్నాడు’ అనే వాదనను బలంగా ముందుకు తీసుకు రావడానికి సమకట్టారు రేవంత్ అనుయాయులైన కాంగ్రెసు వారు, రేవంత్‌ను భుజాన వేసుకున్న తెలుగు మీడియా, టిడిపి సమర్థకులు! వీళ్లందరూ కోరస్‌గా అందుకున్న పల్లవి ఒక్కటే – అర్జున్ ఏటిట్యూడే సర్వానర్థాలకు కారణం, అందుకే అతనికి శిక్ష పడాలి. వారందరి స్పోక్స్‌మన్ అయిన రాధాకృష్ణ ‘కొత్తపలుకు’లో ‘అర్జున్ వెంటనే స్పందించక పోవడం, విలేఖరుల సమావేశం పెట్టడం’ వగైరాలను తప్పు పట్టారు.

ఎవరి విషయంలోనైనా చేసిన యాక్షన్‌కు కోర్టు శిక్ష వేస్తుంది. రియాక్షన్‌కూ, పోస్ట్ యీవెంట్ రెస్పాన్స్‌కూ, యాటిట్యూడ్‌కూ కాదు. మనిషి చాలా వినయవంతుడు కాబట్టి దోపిడీ చేసినా ఫర్వాలేదని వదిలేయదు. హత్య చేసి, ‘‘ముత్యాల ముగ్గు’’లో రావు గోపాలరావులా షికారెళ్లి పరామర్శించి వస్తే, పరామర్శించాడు కదాని వదిలేయదు. చంపేసి, చ్చొచ్చొచ్చొ అంటే శిక్ష తగ్గించదు. హతుడి కుటుంబానికి కోట్లు యిచ్చాను కదా వదిలేయండి అంటే వదలదు. నేరం లేదా యాక్సిడెంటుకి ముందు జరిగిన సంఘటనకు, దానికి ఎవరు బాధ్యులు అన్న దానినే పరిగణన లోకి తీసుకుంటుంది. అర్జున్ విషయంలో అంతా ఉల్టాగా మాట్లాడుతున్నారు. రేవతి మృతిలో అర్జున్ పాలెంత అనేది డిస్కస్ చేయడం మానేసి, సంఘటన జరగగానే ఆసుపత్రికి వెళ్లాల్సింది, సారీ చెప్పాల్సింది అంటూ మాట్లాడ సాగారు. ఒక లాయరైతే అర్జున్ శ్రీతేజ్‌ దగ్గరే ఉండి కోలుకునే దాకా సేవ చేసి ఉంటే కోర్టు దయ చూపుతుంది అంటూ మాట్లాడారు. అర్జున్ డాక్టరా? నర్సా? తెలిసీతెలియక ఏదో చేయబోతే రేపు ఆ అబ్బాయికి ఏమైనా అయితే కావాలని ప్రత్యక్షసాక్షి నోరు మూయించాడు అనరా?

అర్జున్ విషయంలో యీ రకమైన సలహాలు కుప్పలుతిప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఆసుపత్రికి వెళ్లి చూడాల్సింది అని ప్రతీవాడూ మాట్లాడే వాడే. అతను తన కార్యక్షేత్రమైన సినిమా థియేటరుకి వస్తేనే యింత అనర్థం జరిగింది, యిక ఆసుపత్రికి వెళితే ఎంత గోల జరిగేదో అనే కోణంలో వీళ్లెవరూ ఆలోచించటం లేదు. ఒకసారి రేలంగి ఒక పత్రికలో వ్యాసం రాశారు. తాడేపల్లి గూడెంలో అయిన వాళ్లెవరో చనిపోయారని రోదిస్తూ మద్రాసు నుంచి కారులో వెళుతూంటే అడుగడుగునా కారు ఆపి ‘జోక్స్ వేసి నవ్వించు’ అని పీడించారట. ఆసుపత్రికి వెళ్లినా ‘తగ్గేదేలే..’ డైలాగు చెప్పమని యితన్ని చంపుకు తింటే? ఖర్మ కాలి, అక్కడా రద్దీ జరిగి, ఎవరికైనా ఏమైనా ఆయితే? అసలు ఆసుపత్రికి వచ్చేదే రోగులు! దొడ్డి గుమ్మం నుంచి లోపలికి తీసుకుని వెళితే యిన్ పేషంట్లు కూడా బెడ్ మీద నుంచి లేచి చూడగలరు. డాక్టర్లు తిట్టిపోస్తారు – ‘థియేటరు దగ్గర తీసిన ప్రాణం సరిపోలేదా?’ అంటూ!

లీగల్ టీము వెళ్లవద్దంది అని అరవింద్ చెపితే ‘అలాటివి పట్టించుకోకూడదు, హృదయంతో ఆలోచించాలి. మానవత్వం చూపాలి’ అంటూ సుద్దులు చెప్తున్నారు కొందరు. ‘‘కానూన్’’ సినిమాలో హత్యానేరంపై ఒక ముద్దాయి జైల్లో ఉంటాడు. అతను నేను నేరం చేయలేదంటూ ఉంటాడు. కేసు విచారణ సమయంలో అనుమానం అశోక్ కుమార్‌పై మళ్లుతుంది. అతని కూతురు మాలా సిన్హా జైల్లో ముద్దాయిని కలుస్తుంది. ఆ విషయాన్ని డిఫెన్స్ లాయరు బయట పెట్టి అశోక్ కుమార్‌కు వ్యతిరేకంగా కేసు బలపడేట్లు చేస్తాడు. ఇప్పుడు అర్జున్ బాధిత కుటుంబం దగ్గరకు వెళితే వాళ్లను డబ్బుతో లోబరుచు కున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించే ప్రమాదం ఉంది.

ఇలాటి వాతావరణంలో ఒక సెలబ్రిటీ అడుగులు చాలా జాగ్రత్తగా వేయాలి. అర్జున్ ‘మా తరఫున బన్నీ వాసుని పంపించాను, మా నాన్న కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడుతున్నారు’ అని ఎన్ని చెప్పినా, ‘నువ్వెందుకు వెళ్లవు? పొగరా?’ అన్న పాటే పాడుతున్నారు. చిత్రం ఏమిటంటే అర్జున్ అహంకారి అని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా అవస్థ పడుతున్న రాధాకృష్ణ ‘ఆయన తండ్రి మాట వినరని అంటారు’ అని కూడా ప్రస్తావించారు. టీనేజికి రాకుండానే పిల్లలు తల్లి, తండ్రి మాట లక్ష్యపెట్టని యీ రోజుల్లో 42 ఏళ్ల అర్జున్ తండ్రి మాట వినకపోవడం ఒక వింత విషయమా? అతనిపై పెట్టిన కేసుకీ, దీనికీ ఏమైనా లింకుందా?

అందరూ పదేపదే ప్రస్తావించే విషయం మరొకటి – రేవతి మృతి వార్త అర్జున్‌కి ఎప్పుడు తెలిసింది? వివేకా హత్య కేసులో ‘డాక్యుమెంట్ల కోసం హత్య చేశాం, బీరువాలో వాటి కోసం వెతికాం’ అని అప్రూవరుగా మారిన హంతకుడు దస్తగిరి చెపితే ఆ విషయంపై విచారణ చేయకుండా, హత్య కబురు జగన్‌కు ఎప్పుడు తెలిసింది? అన్నదానిపై చర్చోపచర్చలు జరిపినట్లే యిప్పుడు రేవతి మృతిలో అర్జున్ పాలెంత అనే దానిపై కాకుండా, ఆయనకు ఎప్పుడు తెలిసింది? అనే దాన్ని డిస్కషన్‌కు పెట్టారు. ‘వెంటనే తెలిసింది. ఆయన వెంటనే యకాయెకీ ఆసుపత్రికి వెళ్లి భాస్కర్‌ను ఓదార్చేయాల్సింది’ అని తీర్మానించేస్తున్నారు. రోగి చనిపోతే అతని బంధువులు డాక్టరుపై దాడి చేసే రోజులివి. వెళ్లినదాకా ఉండి భాస్కర్ ‘మా ఆవిడ ప్రాణాలు తీశావు కదరా దుర్మార్గుడా’ అంటూ అర్జున్‌పై లంఘిస్తే…? అప్పుడు అర్జున్ బౌన్సర్లు భాస్కర్‌ని కొడితే..? అది మరో కేసు అయితే..? అనే లాజికల్ ప్రాబబిలిటీస్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు.

పైగా చావు వార్త వినగానే అర్జున్ ‘పోన్లెండి నరబలి జరిగింది’ అని సంతోషించారని నేను గౌరవించే జర్నలిస్టు వైయన్నార్ చెప్పడం నన్ను విస్మయ పరిచింది. ‘రిలయబుల్ సోర్స్ ద్వారా నేను విన్నాను’ అంటూ ఆయన చెప్పారు. అర్జున్‌పై విలిఫికేషన్ కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న యీ తరుణంలో అది ప్లాంటెడ్ న్యూసేమో అనే సందేహం ఆయనకు రాలేదెందుకో! అర్జున్ ఆ మాట అనలేదని నేనేమీ సర్టిఫై చేయటం లేదు. కానీ లాజికల్‌గా ఆలోచిస్తే చావు వార్త విన్న వారెవరైనా సరే భయపడతారు – మృతి అనంతరం ప్రజల రియాక్షన్ ఎలా ఉందో అని. క్షణాల్లో ప్రజల మూడ్ మారుతుంది. ఏదైనా తేడా వస్తే నెత్తి కెత్తుకున్న మరుక్షణంలోనే నేలకేసి విసిరి కొట్టగలరు. ఎందుకైనా మంచిదని అర్జున్ అక్కణ్నుంచి కుటుంబంతో సహా జారుకునే వారు.

ఆమె మృతి వార్తను రాత్రి 11 గంటలకు డిసిపి స్వయంగా అర్జున్‌కు చేరవేసి, థియేటరు బయట పరిస్థితి బాగోలేదని, వెంటనే థియేటరు విడిచి వెళ్లకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని బెదిరించాకనే అర్జున్ అక్కణ్నుంచి కదిలారని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. దీనికి కౌంటరుగా పరిస్థితి అంత తీవ్రంగా ఉందని తెలిస్తే తన కొడుకుని, కూతుర్ని హాల్లోనే విడిచి ఎందుకు వెళతానని అర్జున్ అడిగారు. చాలా వేలిడ్ పాయింట్! ఎవరైనా సరే, ప్రమాదం ఉందని తెలియగానే ముందుగా పిల్లల్ని బయటకు పంపించి వేస్తారు తప్ప ‘నేనూ, అమ్మా బౌన్సర్లను వెంటపెట్టుకుని యింటికి వెళ్లిపోతాం. మీరిక్కడే ఉండి ఆ రిస్కు ఫేస్ చేయండి.’ అని పిల్లలకు చెప్పరు.

థియేటరు బయట గొడవగా ఉందని పోలీసాధికారి చెప్పినపుడు అభిమానుల రద్దీ అనే అర్జున్ అనుకుని ఉండవచ్చు. ‘మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు చావుబతుకుల్లో ఉన్నాడు’ అని చెప్పి ఉంటే ‘మా పిల్లాడి ప్రాణాలు తీశావు, మీ పిల్లాడి ప్రాణాలు తీస్తాను’ అని మహిళ భర్త తన పిల్లలకు హాని తలపెడతాడన్న భయం వేయదా? అర్జున్ పిల్లల్ని వదిలేయడ మనేది గమనిస్తే మృతి సంగతి తెలియదని అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ విషయాన్ని చెప్పడానికి అతను ప్రెస్ మీట్ పెట్టడంతో, తాము చెప్పేది అబద్ధమని తేలుతుందనే భయం ముఖ్యమంత్రి, పోలీసుల్లో కలిగి ఉంటుంది. వెంటనే వారి అనుచరగణం రంగంలోకి దిగింది. అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పు అని తీర్పు యిచ్చేసింది!

ఇదో పెద్ద జోక్. ఎవరైనా తనపై ఆరోపణ చేస్తే తన తరఫు వెర్షన్ వినిపించే హక్కు కూడా ఒక పౌరుడికి ఉండదా? ఆ చెప్పుకునేదేదో కోర్టులోనే చెప్పుకోవాలి అంటే మరి ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎందుకు చెప్పినట్లు? పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు చెప్పినట్లు? ప్రెస్ మీట్ విషయమై కోర్టు అర్జున్‌ని ఏమీ మందలించ లేదే! కానీ తెలుగు మీడియా యావత్తు అర్జున్ పత్రికా సమావేశంలో తన వెర్షన్ వినిపించి, నా కారెక్టర్ ఎసాసినేట్ చేయకండి ప్లీజ్ అని వేడుకోవడం బ్రహ్మహత్యాపాతకంతో సమానం అని తీర్పు నిచ్చేసింది. రాధాకృష్ణ కూడా ‘ముఖ్యమంత్రి ప్రకటనను తప్పు పట్టే విధంగా మాట్లాడడమని ఎవరు సలహా యిచ్చారో తెలియదు’ అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రకటనను తప్పు పట్టడం అంత ఘోరమైన నేరమని నాకు తెలియదు. ప్రతిపక్షాలు, పత్రికలు నిత్యం ఆ పని చేస్తూనే ఉంటాయి. అర్జున్ విషయంలో ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా ఉన్నాయా?

ఇక అర్జున్ థియేటరుకి రావడానికి అనుమతి ఉందా లేదా అన్న విషయానికి వస్తే – మొదట్లో పోలీసులు ఆయన వస్తున్న సమాచారం తమకు లేదని అన్నారు. పోలీసులంటే వాళ్లంతట వాళ్లే సమాచారం సేకరించ వలసిన వాళ్లు. ‘వాళ్ల ఏరియాలో ఉన్న థియేటరులో యింత సందడి జరగబోతోందని తెలుసుకో లేకపోతే యిదేం పోలీసింగ్? అర్జున్ పిఆర్ టీము వాట్సాప్‌లతో హోరెత్తించేస్తున్నారని కూడా వాళ్ల నోటీసుకు రాలేదా?’ అనుకున్నాను. ఇంతలో థియేటరు వాళ్లు మేం పర్మిషన్ కోసం రాశాం అనే లెటరును బయటపెట్టారు. ఇక పోలీసులు ‘పర్మిషన్ నిరాకరించాం, ఆ లెటరు వెనక్కాలే రాశాం’ అంటూ వాదించ సాగారు. ఆ నిరాకరణను థియేటరు యాజమాన్యానికి తెలియపరిచారా? ఎలా తెలియపరిచారు? అన్నదే కీలకమైన ప్రశ్న.

రాతపూర్వకంగా తిరస్కరిస్తే ఎక్నాలెజ్‌మెంట్ తీసుకున్నారా? ఏ వాట్సాప్ ద్వారానో తెలియపరిస్తే దాన్ని బయట పెట్టగలరా? ఫోన్ చేసి తెలియపరిస్తే ఫోన్ రికార్డులు చూపగలరా? ఈ ప్రశ్నలకు ఎవరూ సమాధానం యివ్వటం లేదు. ఈ రోజుల్లో మంత్రులు కూడా ట్విటర్ ద్వారా ప్రకటనలు చేసేస్తున్నారు. వీళ్లు పోనీ అలా చేశారా? చేసి ఉండకపోతే సంఘటన జరిగిన తర్వాత తమ వద్ద ఉన్న కాగితంపై తమంతట తామే ఏదో రాసేసుకున్నారేమో! బ్యాక్ డేట్‌తో నోటీసులు యిచ్చేసినట్లు రాసుకోవడాలు ప్రభుత్వాఫీసుల్లో వింతేమీ కాదు. ఎక్నాలెజ్‌మెంట్ గురించి కోర్టులో డిఫెన్సు లాయరు అడిగినప్పుడు పోలీసులు ఏం చెప్తారో చూడాలి. నిరంజన రెడ్డి జగన్ మనిషి అని మీడియాలో హోరెత్తించేస్తున్నారు. ఆయన సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వాదిస్తున్నాట్ట. లాయర్లకు వృత్తే ముఖ్యం. ఒక పార్టీలో ఉంటున్నా ప్రతిపక్ష పార్టీ నాయకుణ్ని క్లయింటుగా ఆమోదిస్తూంటారు. ఆయన గట్టి లాయరు కాబట్టే జగనూ పెట్టుకుని ఉండవచ్చు, అర్జునూ పెట్టుకుని ఉండవచ్చు.

పోలీసులు సంధ్య థియేటరు యాజమాన్యానికి మీకు లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదు? అని అడుగుతూ 11 ప్రశ్నల ప్రశ్నావళి పంపారు. దానికి జవాబిస్తూ థియేటరు 6 పేజీల ఉత్తరం రాసిందంటూ దాని వివరాలు డిసెంబరు 30న బయటకు వచ్చాయి. ఆ జవాబులలో అనుమతి నిరాకరణ గురించిన సమాధానం ఏదైనా ఉందా అని వెతికాను. లేదు. మరి పోలీసు ప్రశ్నావళిలో ఆ ప్రశ్న – అంటే ‘మేము అనుమతి నిరాకరించిన విషయం అర్జున్‌కు చెప్పావా? లేదా!?’ ఉండి ఉంటే – థియేటరు వాళ్లు ‘చెప్పాం/చెప్పలేదు/ అసలు నిరాకరించినట్లు మీరు మాకెప్పుడు చెప్పారు?/ చెప్పినట్లు మీ దగ్గర రుజువుందా?’ వంటి సమాధానాలు యిచ్చేవారు కదా! పోలీసు ప్రశ్నావళిని చూసిన వారెవరైనా ఉంటే క్లారిఫై చేయగోర్తాను. ఒకవేళ అత్యంత కీలకమైన యీ ప్రశ్న పోలీసులు వేసి ఉండకపోతే వారు నిరాకరణను థియేటరు వారికి చెప్పలేదని ఊహించాల్సి వస్తుంది. నాంపల్లి కోర్టులో అర్జున్‌కు బెయిలివ్వద్దు అని వాదించే సమయంలో ప్రాసిక్యూషన్ ‘మేం అనుమతి నిరాకరించామని తెలిసి కూడా ఆయన వచ్చాడు..’ అని చెప్పకపోవడం గమనార్హం.

అనుమతి నిరాకరించి ఉంటే మీరు థియేటరు వద్ద ఎందుకు ఉన్నారు? అర్జున్‌ని ఎందుకు అడ్డుకోలేదు? అనే ప్రశ్నకు పోలీసులు సమాధానం చెప్పటం లేదు. మహామహా జెడ్ కాటగిరీ ప్రతిపక్ష నాయకుల్నే ఎయిర్‌పోర్టు దగ్గరే ఆపేయగలరు పోలీసులు. అర్జున్ థియేటర్లోకి అడుగు పెట్టగానే ‘గో బ్యాక్’ అనకుండా దగ్గరుండి, దారి క్లియర్ చేసి పంపడమేమిటి? ప్రత్యక్షసాక్షిని అంటూ వీడియో చేసినాయన 20 మంది పోలీసులున్నారక్కడ అని చెప్పారు. పోలీసు స్టేషన్ రికార్డులు వెరిఫై చేస్తే ఎంతమంది అక్కడ ఉన్నారో తెలుస్తుంది. వారిలో ఒక్కరైనా అర్జున్‌ను వారించినట్లు అక్కడ తీసిన ఫోటోల్లో కానీ, వీడియోల్లో కానీ, పోలీసు వారు పబ్లిక్‌కు చూపించిన ఫుటేజిలో కానీ ఉందా? అర్జున్ అదే మొత్తుకున్నాడు – పోలీసులు నాకు దారి క్లియర్ చేస్తూ ఉంటే నాకు అనుమతి లేదని ఎలా అనుకోగలను? అని.

ఇక అర్జున్ చేతులూపడం అనే దాన్ని పెద్ద అంశంగా రేవంత్ చెప్తున్నారు. నాయకులకూ అది తప్పదు. ఓటుకు నోటు కేసులో వీడియో సాక్షిగా పట్టుబడిన రేవంత్ సైతం జైలు నుంచి బయటకు వస్తూ చేతులూపారు. అనుచరులను, అభిమానులు హుషారు చేయాలంటే ఆ మాత్రం తప్పదు. అర్జున్ అనుమతి లేకుండా రోడ్ షో చేశారు అనేది ఒక ఆరోపణ. ‘అది రోడ్ షో కాదు, నా అభిమానులు రోడ్డంతా బ్లాక్ చేసేస్తే, వారిని ఉపశమింప చేయడానికి కారు బయటకు వచ్చాను.’ అని అర్జున్ వివరణ. చిన్నప్పటి నుంచి సినీ అభిమానులను చూస్తూ వచ్చిన నాకు అది విచిత్రంగా కనబడలేదు. సినిమా నటులు వచ్చేదాకా గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు, వారు కారు లోంచి బయటకు రాకపోతే కారు మీద రాళ్లేసి కొట్టేవారు.

మా వీధిలో జమున బంధువులుండేవారు. ఆవిడ అప్పుడప్పుడు వచ్చి, వాళ్లింట్లో రెండు, మూడు గంటలున్నపుడు ప్రతీ అరగంటకు డాబా ఎక్కి, గుమిగూడిన జనాలకు అభివాదం చేసి కిందకు వెళ్లేది. అలా కనబడకపోతే రాళ్లేసి ఆ యింటి కిటికీ అద్దాలు పగలగొట్టేవారు. అభిమానులు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. నటీనటుల పట్ల అభిమానం అంటూనే గిల్లేస్తారు, కొరికేస్తారు, గాఢంగా హత్తుకుంటారు, బ్లేడుతో గీసేస్తున్నారు కూడా అని పవన్ మొత్తుకున్నారు. బాలకృష్ణ అభిమానిని కొట్టాడు అంటే ఊరికే కొడతాడా? ఇలాటి చేష్టల వలననే కొట్టి ఉంటాడు. తారలు బయటకు కనబడి దణ్ణాలు పెడితేనే, ప్రజలు కోరిన హావభావాలు ప్రదర్శిస్తేనే వాళ్లు శాంతిస్తారు, దారి యిస్తారు. అర్జున్ చేసినది రోడ్ షో ఔనా కాదా, రేవతి మృతి చెందిన సమయంలో అర్జున్ ఎక్కడున్నారు? వంటి విషయాల్లో పోలీసులు ఒక స్టాండ్ తీసుకుని దానికి భిన్నంగా ఎవరైనా ఏమైనా అంటే ఖబడ్దార్ అంటున్నారు కాబట్టి నేను వాటి జోలికి పోను. ఇలాటిది గతంలో ఎప్పుడూ నేను చూడలేదు. ఇదో రకమైన గ్యాగ్ ఆర్డరేమో! కోర్టు విచారణ తర్వాత స్పష్టత రావచ్చు.

అయితే ఈ ఘటనలో అర్జున్‌కి బాధ్యత లేదా? ఉంది. అంత జనసమ్మర్దం ఉన్న ప్రదేశానికి తను వెళ్లడం బాధ్యతారాహిత్యం. గతంలో అనేక సార్లు వెళ్లాను అనే ఎక్స్‌క్యూజ్ పనికి రాదు. పుష్ప 1 సక్సెస్ తర్వాత తన యిమేజి ఎంత పెరిగిందో నంద్యాలకు వెళ్లినపుడు హైవే పై జరిగిన ట్రాఫిక్ జామ్ నిరూపించింది. అది గ్రహించాక ఆ యిరుకు థియేటరుకి వెళ్లి ఉండకూడదు. జగన్ తెచ్చిన జీవో 1ని వ్యతిరేకించిన నాయకులను నేను విమర్శించాను. అదే విమర్శ అర్జున్‌కూ వర్తిస్తుంది. అంతేకాదు తన పిల్లలను కూడా తీసుకుని వెళ్లి రిస్క్‌కు గురి చేయడంలో భాస్కర్‌లో కనబడిన బాధ్యతారాహిత్యమే, అర్జున్‌లో కూడా కనబడింది. ‘నాకు బౌన్సర్లున్నారులే’ అని అర్జున్ అనకూడదు. వేల మంది జనం మీద పడితే పదుల సంఖ్యలో ఉన్న బౌన్సర్లు ఏం చేయగలరు?

ఈ సంఘటన తర్వాతైనా స్టార్లందరూ మేల్కొనాలి. ‘‘దేవర’’ ఫంక్షన్‌కు జూనియర్ వెళ్లకుండా తనను తాను కాపాడుకున్నారు. కానీ నోవాటెల్ హోటల్‌ను కాపాడలేక పోయాడు కదా! క్రేజ్ పెంచిన కొద్దీ తమకే ముప్పని స్టార్లు గుర్తించాలి. ఇక ప్రస్తుత విషయానికి వస్తే యిది యాక్సిడెంటు అనేది స్పష్టం. పని కట్టుకుని, కుట్ర పన్ని హత్య చేశారని ఎవరైనా అంటే హాస్యాస్పదం. ఇలా మరణం సంభవిస్తుందని తెలిసి కూడా అర్జున్ వ్యవహరించేడన్నది తర్కానికి నిలబడదు. దీనిలో పోలీసుల వైఫల్యం కనబడుతోంది, థియేటరు యాజమాన్యం వైఫల్యం కూడా ఉంది. వాళ్లు మేము ఆ రెండు రోజులూ నిర్మాతలకు అప్పగించేశాం అని వాదించవచ్చు గాక, అసలిక్కడ యిలాటి ఈవెంటు కుదరదు అని వాళ్లే స్పష్టంగా చెప్పాల్సింది.

ఇలాటి బాధ్యతారాహిత్యానికి ఏయే సెక్షన్ల కింద కేసులు పెట్టాలో అవి పెట్టి, ఎంతో కొంత శిక్ష పడేట్లా చేస్తే తక్కినవాళ్లకీ బుద్ధి వస్తుంది. పొరపాటు సెక్షన్ల కింద కేసులు పెట్టి, వాటిని నిరూపించలేక, వీరికి ఏ శిక్ష పడకుండా చేస్తే మాత్రం అది చెడ్డ ఉదాహరణ అవుతుంది. అర్జున్‌కు శిక్ష పడాలి – రద్దీపై సరైన అంచనా లేకుండా ప్రమాదం జరగడానికి కారణ భూతులైన వారిలో ఒకడిగా! కావాలని హత్య చేశాడని కేసు పెట్టడం మాత్రం సమంజసం కాదు, నా దృష్టిలో! కోర్టు ఏమంటుందో చూడాలి. ఈ వ్యాసంలో యిచ్చిన సమాచారంలో తప్పు ఉన్నా, లోపం ఉన్నా ఎత్తి చూపించ గోర్తాను. ఇన్ఫరెన్స్ అంటారా, ఎవరిష్టం వాళ్లది. వ్యాసంపైనే వ్యాఖ్యానించండి, నాపై వ్యక్తిగత వ్యాఖ్యలు వ్యర్థం.

– ఎమ్బీయస్ ప్రసాద్

[email protected]

74 Replies to “ఎమ్బీయస్‍: అర్జున్ ఏ మేరకు బాధ్యుడు?”

  1. “చంద్రబాబుని స్టేషన్‌కి పిలిచి విచారించ వచ్చుగా, నంద్యాల వెళ్లి అరెస్టు చేయడమెందుకు? అని అడిగిన వాళ్లు యిప్పుడు పోలీసు స్టేషన్‌కి రప్పించి అరెస్టు చేయవచ్చుగా అనటం లేదెందుకో”…

    what kind of logic is this?

  2. ///వివేకా హత్య కేసులో ‘డాక్యుమెంట్ల కోసం హత్య చేశాం, బీరువాలో వాటి కోసం వెతికాం’ అని అప్రూవరుగా మారిన హంతకుడు దస్తగిరి చెపితే ఆ విషయంపై విచారణ చేయకుండా, హత్య కబురు జగన్కు ఎప్పుడు తెలిసింది? అన్నదానిపై చర్చోపచర్చలు జరిపినట్లే///

    .

    అయ్యొ! ఆ డాక్యుమెంట్ల గురించి వెతికితె పాపం నారాసుర రక్త చరిత్ర తెలిసి, మన అవినాష్ రెడ్డి పత్తితు అని తెలిసిపొద్ది అంటారా!

    మొత్తం మీద బాబయి గుండె పొటు నుండి గొడలి పొటు, ఆపై చంద్రబాబు, లొకెష్ లె దీని వెనుక ఉన్నారు అన్నంత వరకూ ఆడిన నాటకం లొ.. నిజాలు ఈ రాస్త్రం లొ ప్రజలు అందరికీ అర్ధం అయినా… నువ్వు మాత్రం ఇంకా డాక్యుమెంట్లు అంటూ సన్నాయి నొక్కులు నొకుతున్నావు అంటె, తమరి రాతల లొని డొల్లతనం అందరికీ అర్ధం అవుతున్నాయి.

    ఇక డబ్బు కొసం హత్య చెసెవరికి మొత్తం సమాచారం ఇవ్వరు! పనిలొ పనిగా డాకుమెంట్లు కూడ చూడంది ఇని చెప్పి ఉండవచ్చు! పాపం విచరణలొ మాత్రం అందరూ మన అవినాష్ ఇంట్లొ ఎందుకు కలిసారు అని తెలిందొ!

  3. హాలీవుడ్ లో హీరో లని నటుడు అని మాత్రమే పిలుస్తారు.

    కానీ, మన దేశంలో మాత్రమే అనుకుంటా,

    ఐఏఎస్, ఐపీఎస్ లాగ హీరో అనేది ఏదో ప్రత్యేక హోదా లాగ,

    నటుడుని హీరో అని సంబోధిస్తారు.

  4. Meeru okati annaru CBN arrest this compare chesi, akkadebarrest enduku ani ???? I think first station teesuka velli basic things vicharinchaka chesaranukuntanu… House ninche kadha, not from shooting.. how you can compare both ????

  5. Meeru okati annaru C BN arr e st tho compare chesi, akkade arr e st enduku ani ???? I think first sta tion teesuka velli basic things vicharinchaka chesaranukuntanu… House ninche kadha, not from sho otin g.. how you can compare both ????

  6. Meeru okati annaru C B N ar r e st tho com pare chesi, akkade arr e st enduku ani ???? I think first sta tion teesuka velli basic things vich arin chaka chesaranukuntanu… Hou se ninche kadha, not from sho otin g.. how you can comp are both ????

  7. Meeru okati annaru babu ar r e st tho com pare chesi, akk ade arr e st enduku ani ???? I think first st a tion teesuka velli bas ic things vich arin chaka chesaranukuntanu… Hou se ninche kadha, not from sh o otin g.. how you can comp are both ????

  8. ///ఇది రేవంత్ వ్యూహం మాత్రమే తప్ప వేరే వాళ్ల ప్రమేయం ఉందనుకోను. ఆయన కూడా ‘కహేపే నిగాహే, కహీపే నిశానా’ అన్నట్లు అర్జున్పై విల్లు ఎక్కుపెట్టినట్లు నటిస్తూనే సినీపరివారం మొత్తాన్ని తన వద్దకు రప్పించుకో గలిగారు. ///

    ///ఇలాటి కే.-.సులేవీ పెట్టకుండా, కేవలం టిక్కెట్టు ధరలను నియంత్రించి, సినీపరివారంలో కొందర్ని తన వద్దకు తెప్పించుకున్న జగన్ విలన్గా, అతనిది మొరటు పద్ధతిగా తోచిన వీరికి యిప్పుడు రేవంత్ తెలివైన హీరోగా భాసిస్తున్నాడు. ///

    .

    ఈ ఒక్క మాటతొ జగన్ అతి మంచితనం, అతి నిజాయితీ గుర్తించి రెండు చెతులూ జెబులొ పెట్తుకొని ఎవరినా వెల్లిపొవలసిందె అంటారా?

    పవన్ సినిమా వస్తుంది అనగానె సినిమా రెట్లు అమాంతం తగ్గించి, ఆ తరువాత నిదనంగా సిని పెద్దలలొ చర్చించి మళ్ళి యదాతదంగా రెట్లు పెట్టారు అంటె, జగన్ ఎంథ పెద్ద హీరొనొ కదా?

    ఇక సినిమా వారు చెస్తున్న అతికి, రెవంత్ బెనిఫిట్ షౌ లు వద్దు అన్నరె కాని, ఎక్కడా సినిమా కి నెనె రెట్లు నిర్నయిన్స్తా, 5 రూపయలకె సినిమా టిక్కెట్లు అమ్మాలి అనలెదు! అలానె సినిమా వారు రెవంత్ ని కలసింది అల్లు అర్జున్ వ్యక్తిగత అంశం మీద కాని, జగన్ లా అదికారం అడ్డుపెటుకొని 5 రూపయలకె సినిమా టిక్కెట్ పెట్టితె పరిశ్రమలొ సంగ్షొభం వస్తుంది అన్నందుకు కాదు!

    Y.-.C.-.P వాళ్ళ , బులుగు మీడియా వాళ్ళ వాదనలె మీరు రాస్తున్నరు తప్ప, ఎందులొ ఎ తర్కం లెదు!

  9. Mee ru ok ati an naru ba bu ar r e st tho com pare che si, akk ade arr e st enduku ani ?I th ink fi rst st a tion teesu ka velli b as ic things vich arin chaka chesaranukuntanu… Hou se ninche kadha, not from sh o otin g.. how you can comp are both ?

      1. అది వైసీపీ నినాదం..

        శిల్పా రెడ్డి కోసం ప్రచారం చేసినందుకు.. అల్లు అర్జున్ కి అందిస్తున్న కానుక ఇది..

        అక్కడ శిల్పా రెడ్డి గెలవలేదు..ఇక్కడ అల్లు అర్జున్ గెలవడు ..

        ఆ విషయం ఈ కుక్కలకు తెలియదు..

  10. వీడి లేకి రాతలు చదవడం కన్నా.. ఆ రాతలను ఎండకడుతూ రాసే కామెంట్స్ లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది..

    ఇలాంటి పనికిమాలిన వాళ్లనే “రాజకీయ విశ్లేషకులు” అంటుంటాడు .. ఈ వెంకట్ రెడ్డి

      1. శర్మ గారు

        ప్యాలస్ రెడ్డి గారి చంక లో పంచదార పోసుకుని నాకే పని లో చేరినట్లు విన్నారే.రోజుకో చంక నా లేక రెండు చంక లు నాకమని ప్యాలస్ రెడ్డి గారు చెప్పారా !

  11. ప్రసాదంగారి లాజిక్ సరిగా లేదు. పోలీసులు విడుదల చేసిన వీడియో ఆధారాల్లో బన్నీ చేసిన తప్పు స్పష్టంగా కనిపించింది. ఆ ఆధారంలో తప్పుంటే ఈరోజు వరకూ దానికి అర్జున్ కాంప్ నుండీ కౌంటర్ లేదేందుకు? రేవంత్ కి భయపడి మాట్లాడలేదనుకుంటే ఆయనకే లేని బాధ వైసీపీ ఎర్నలిస్టులకి ఎందుకు? ఇది టీ కప్పులో తుఫాను, నాలుగు రోజుల్లో అందరూ మర్చిపోతారు. నా అంచనా కరెక్ట్ అయితే గేమ్ చేంజర్ సినిమాకి కూడా టికెట్ రేట్ పెంచుకోవడానికి అనుమతి దొరుకుతుంది.

  12. ప్రసాదంగారి లాజిక్ సరిగా లేదు. పోలీసులు చూపించిన చేసిన వీడియో ఆధారాల్లో బన్నీ చేసిన తప్పు స్పష్టంగా కనిపించింది. ఆ ఆధారంలో తప్పుంటే ఈరోజు వరకూ దానికి అర్జున్ కాంప్ నుండీ కౌంటర్ లేదేందుకు? రేవంత్ కి భయపడి మాట్లాడలేదనుకుంటే ఆయనకే లేని బాధ వైసీపీ ఎ.. ర్న.. లి..స్టులకి ఎందుకు? ఇది టీ కప్పులో తుఫాను, నాలుగు రోజుల్లో అందరూ మర్చిపోతారు. నా అంచనా కరెక్ట్ అయితే గేమ్ చేంజర్ సినిమాకి కూడా టికెట్ రే..ట్ పెంచుకోవడానికి అనుమతి దొరుకుతుంది.

  13. ప్రసాదగారి లాజిక్ సరిగా లేదు. పో.. లీ.. సు..లు చూపించిన చేసిన ఆధారాల్లో బన్నీ చేసిన త..ప్పు స్పష్టంగా కనిపించింది. ఆ ఆ.. ధా..రంలో తప్పుంటే ఈరోజు వరకూ దానికి అర్జున్ కాంప్ నుండీ కౌం.. ట..ర్ లేదేందుకు? రేవంత్ కి భయపడి మాట్లాడలేదనుకుంటే ఆయనకే లేని బాధ వై.. సీ..పీ ఎ.. ర్న.. లి..స్టులకి ఎందుకు? ఇది టీ కప్పులో తు.. ఫా..ను, నాలుగు రోజుల్లో అందరూ మర్చిపోతారు. నా అంచనా కరెక్ట్ అయితే గే..మ్ చేంజర్ సినిమాకి కూడా టికెట్ రే..ట్ పెంచుకోవడానికి అనుమతి దొరుకుతుంది.

  14. There is a flaw in this logic. Hyderabad police showed video evidence of the Bunny’s mistakes. Bunny, who held a media conference when Revant made the statement, did not utter a word when ploce showed the evidence. The concludes the discussion.

  15. Gumpulo oka musolodni champesi pratipakshalu plan cheyyochuu anna idea Jaggadu lanti vaallaki vache untai.anduke aayana saanubhootiparudiga emi teleenatlu raasaav..

  16. వైఎ*స్ఆర్ మర*ణం అంబా*ని చేసిన కు*ట్ర అన్నాడు జగ*న్. రిలయ*న్స్ షాపు లా మీద దాడు*లు చేపిం*చారు. సి*ఎం పద*వి రాగానే , సీ*బీఐ ఉంక్వై*రీ మాత్రం చేయలేదు, విజయ*మ్మ గారు అడిగిన కూడా.

    రహ*స్యం ఏమి ఐ వుండొచ్చు.?

    వైఎ*స్ఆర్ త*మ్ముడు వి*వేకా ను చంద్ర*బాబు చంపా*డు అని జ*గన్ అన్నాడు. సి*ఎం అయిన తర్వాత సీబీ*ఐ విచారణా లో ఆ నే*రం తన మీద*నే అను*మానం వచ్చేసరికి, ఆ సీబీ*ఐ వాళ్ళని రాకుం*డా ఆపేశా*డు.

    అంటే వైఎస్ఆ*ర్ మర*ణం కూడా . ఇదే లా*జిక్ ప్రకా*రం.. అనుమా*నం అంతే.. సీ*బీఐ విచా*రణ చె*పిస్తే విజయ*మ్మ గారి అను*మానం తీరిపో*తుంది. వైఎ*స్ఆర్ అభి*మానుల కోరి*క తీరు*తుంది.

  17. Government would have responded with an official letter, which is a computer typed, along with complaint number, date and time. How come you write a “denial-of-permission” on the back side of the complaint letter?

    It is also questioning how Govt. is handling complaints!

  18. It seems that both parties have some mistakes from their sides. Society, including Heroes, Govt. and parents, needs to learn a lot from this incident to avoid these incidents in future.

  19. ఇ ముసలాయన కి కమ్మ వాళ్ళు అంటే ద్వేషం, ఆ జగన్ supporters అందరకి ఇలా తలా తోక లేని సమర్ధనలు చేసి ఒక ఆర్టికల్ రాశి షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటాడు

  20. 30k jeetham vachhe udyogi 1100 petti ticket konte samsara lakshanam kadhaa……manamevaram aa mata cheppadaaniki…….ticket konadam avasaramaa ani?????aayana sampadinchukunnaadu…koduku sarada theeruddam anukunnaademo….konnaadu….

  21. Ikkada thappu andarilo kanapaduthondhi…

    1). Chinna pillalani theesukuni aa benifit shows ki midnight velladam aa kutumbam chesina thappu…may be valla ilaa veluthuu vuntaremo…innallu ye issue ledhu…un fortunate…

    2). police lu, celebraties madya guudu putani kuuda thelusthondhi…..may be it is a formality that – police reject these risky visits officially but still allow the celebraties…anduke…police lu AA ni theater loki vellanichhaaru….unexpected gaa ee issue jarigi vundaka pothe ilaantivi bayataku vachhevi kaadu…ledante local gaa akkada deploy ayina police lani manage chesi vundochhu….

    ikkada AA, Police ladi iddari thappu vundi kabatti iddaru ee point ni sagadeeyatledu

    3). AA ki theater lo undaga police lu Revathi chanipoyinatlu cheppam antunnaaru…but i doubt it…. minimum sense vunnollu yevarynaa situation seriousness ni ardam chesukuni pillalatho saha vellipothaaru….pillalani vadilesi vellaru kadha…

  22. dear prasad, i am not criticizing you..i am just talking about myself..

    If I loose shame, what kind articles i will be capable of writing.. :-p..can i write an article like this?

  23. జగన్ కి , కేసీఆర్ కి అధికారం పోయిందని ఒకవైపు మనోవేదన… పుండు మీద కారంలా చంద్రబాబు, రేవంత్ లు ముఖ్యమంత్రులు అయ్యారనే బాధ, అన్నీ కలిపి mbs ilaa వెళ్లగక్కి సంతృప్తి పడుతున్నాడు

  24. అల్లు అర్జున్ ఆటిట్యూడ్ మెయిన్ మ్యాటర్ అయ్యింది.

    ఎలక్షన్స్ టైం లో నంద్యాల వచ్చింది ఆటిట్యూడ్ తోనే

    పవన్ కి ఆటిట్యూడ్ చూపిద్దము అని వెళ్ళాడు

    అప్పుడు వచ్చినోలలో అల్లు అభిమానులు కన్న వైసిపి వాళ్ళు ఎక్కువ…వీడికి అంత సీన్ లేదు

    ఒక్క చెత్త సినిమా హిట్ అవ్వగానే షో చేస్తున్నాడు

    అరేయ్ ప్రసాదం వీడికి హాస్పిటల్ వెళ్లి బాధితులు చూడాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ మిడ్నైట్ ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళ వచ్చు

    అక్కడ వీడి కోసం ఎ గ పడే అంత సీన్ లేదు

    మళ్లీ జైల్ నుంచి రాగానే షో ఆఫ్ కార్యక్రమం అది మళ్ళీ లైవ్ లో

    సిగ్గు ఉండాలి ఆడికి నీకు

  25. అల్లు అర్జున్ ఆటిట్యూడ్ మెయిన్ మ్యాటర్ అయ్యింది.

    ఎలక్షన్స్ టైం లో నంద్యాల వచ్చింది ఆటిట్యూడ్ తోనే

    పవన్ కి ఆటిట్యూడ్ చూపిద్దము అని వెళ్ళాడు

    అప్పుడు వచ్చినోలలో అల్లు అభిమానులు కన్న వైసిపి వాళ్ళు ఎక్కువ…వీడికి అంత సీన్ లేదు

    ఒక్క చెత్త సినిమా హిట్ అవ్వగానే షో చేస్తున్నాడు

    అరేయ్ ప్రసాదం వీడికి హాస్పిటల్ వెళ్లి బాధితులు చూడాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ మిడ్నైట్ ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళ వచ్చు

    అక్కడ వీడి కోసం ఎ గ పడే అంత సీన్ లేదు

    మళ్లీ జైల్ నుంచి రాగానే షో ఆఫ్ కార్యక్రమం అది మళ్ళీ లైవ్ లో

    సిగ్గు ఉండాలి ఆడికి నీకు

  26. నా వ్యాసంలో ‘14 రోజుల రిమాండు అడగడం మరీ చిత్రం. 14 రోజులు అడిగేటన్ని ప్రశ్నలేముంటాయి?’ అని అడగడం సరికాదన్నారు నా లాయరు మిత్రుడు శ్రీ గోవర్ధన్ (మంగళగిరి). ‘అది జుడిషియల్ రిమాండ్. దాన్ని సాధారణంగా 14 రోజులకే యిస్తారు. ఆ పీరియడ్‌లో పోలీసులు ఏ విచారణా జరపరు. ‘విచారించడానికి పోలీసు కస్టడీకి యివ్వండి’ అని పోలీసులు కోర్టుని అడుగుతారు. కోర్టు ఒప్పుకునే వరకు లేదా బెయిలు వచ్చేవరకు వ్యక్తి జుడిషియల్ కస్టడీలోనే ఉంటాడు’ అని వివరించారు.

    1. So, మీరు కనీస ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుండా/ తెలుసుకోకుండా పుంఖానుపుంఖాలుగా రాసేస్తారన్న మాట. ప్రతి ఒక్క కేసులోనూ పోలీసులు అరెస్టు చేసినప్పుడు కోర్టు 13/14 రోజులు రిమాండ్ విధించే విషయం రెగ్యులర్ గా వార్తా పత్రికలు చదివే సామాన్యులకు కూడా అవగాహన ఉంటుంది. అలాంటి మీలాంటి గొప్ప మేధావికి తెలియకపోవడం ఆశ్చర్యం కలుగుతోంది.

      1. బాహుబలి సినిమాలో ఈయానికి చెట్టు ఒకటి కనపడలేదు .. దాని మీద కూడా రాసారు. కర్రపుల్లలు ఎలా వొచ్చాయి అని ..

        1. మీకు కనబడిందా?

          కర్రపుల్లలు ఎలా వచ్చాయి? అనూష్క దగ్గర ఎలా పోగు పడ్డాయి? అని అడగడం అంత మహాపరాధం అని నాకు తెలియదుస్మీ.

          1. చాల చక్కగా ఒక పెద్ద చెట్టు కనపడింది… మీకు ఓపిక ఉంటె మరలా OTT లో చూడండి .. అడగడము మహాపరాధం కాదు కానీ .ఒక్క బాహుబలి మీద మీరు రాసిన వ్యాసం తరువాత విడుదల అయినా ఎటువంటి తెలుగు సినిమాకి కనపడ లేదు .. ఆఖరికి మొన్న వొచ్చిన పుష్పా౨ మీద కూడా ..

          2. నేను సినిమా సమీక్షకుణ్ని కాదు. పాత సినిమాలను పరిచయం చేస్తూంటాను, అప్పుడప్పుడు. మీరు చదివిన ఆ వ్యాసం బాహుబలి మార్కెటింగు టెక్నిక్స్ ని వివరిస్తూ రాసినది. పనిలో పనిగా సినిమా కథపై విమర్శలు చేశాను. దాని తర్వాత విడుదల అయిన ఏ సినిమా మీదా రాయలేదన్నారు. అంటే మీరు నన్ను ఫాలో కావటం లేదని అర్థం. ఎప్పుడో పదేళ్ల క్రితందే మనసులో పెట్టుకున్నారు పాపం. దాని తర్వాత బాహుబలి 2 గురించి రెండు వ్యాసాలు రాశాను. ఆరారార్ లో అల్లూరి పాత్ర గురించి, ఆరారార్ ను ఆస్కార్ కై ప్రమోట్ చేయడం వలన కలిగే లాభాల గురించి, థాంక్యూ సినిమా థీమ్ గురించి, ఆచార్య సినిమా గురించి.. యిలా రాస్తూనే ఉన్నాను.

      2. ప్రతీ కేసులోనూ 14 రోజుల రిమాండు సంగతి నేనూ చదువుతూంటాను స్వామీ. జుడిషియల్ కస్టడీలో ఉండగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయలేరన్నదే నాకు న్యూస్. కోర్టు ప్రతినిథుల సమక్షంలో అడగాల్సిన ప్రశ్నలు అడుగుతారనుకున్నాను. నేను గొప్ప మేధావినని మీరనుకుంటే అది మీ పొరపాటు, నాది కాదు.

        ఇక మీకు వీటిల్లో పరిజ్ఞానం ఉన్నట్లుంది. పోలీసులు ఏమీ ప్రశ్నలడక్కుండా ఉట్టినే జుడిషియల్ కస్టడీ పేర 14 రోజుల పాటు వాళ్లను కూర్చోపెట్టి, మేపడంలో లాజిక్ ఏమిటో కాస్త చెప్పగలరా?

  27. గుంపులో ముసలోడిని ఊపిరాడకుండా చేసి చంపి ప్రతి పక్షాల మీద తోసే ఐడియా, ముమ్మాటికీ పదకొండేశ్వరుడు జలగ రెడ్దిదే.. అందుకే నువ్వు రాసావ్.

  28. గుంపులో ముసలోడిని ఊపిరాడకుండా చేసి చంపి ప్రతి పక్షాల మీద తోసే ఐడియా, ముమ్మాటికీ పదకొండేశ్వరుడు జలగ రెడ్దదే.. అందుకే నువ్వు రాసావ్.

  29. గుంపులో ముసలోడిని ఊపిరాడకుండా చేసి చంపి ప్రతి పక్షాల మీద తోసే ఐడియా, ముమ్మాటికీ పదకొండేశ్వరుడు జల గ దే.అందుకే నువ్వు రాసావ్.

  30. If Arjun has not visited the theatre, Revathi could have lived, so he is responsible. He may not be a killer or accomplish or has the motive, but his actions have contributed, and the c@ase against him is justified. What is there to discuss this long?

Comments are closed.