మంత్రి పదవికి బదులుగా…!

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పి. గణబాబుకు ప్రభుత్వ విప్ పదవి దక్కింది. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా…

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పి. గణబాబుకు ప్రభుత్వ విప్ పదవి దక్కింది. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. అయినా మంత్రి పదవి మాత్రం ఊరిస్తూనే ఉంది. 2024లో నాలుగవ సారి గెలిచాక ఆయనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ విశాఖ జిల్లాకే మంత్రి పదవి దక్కకుండా పోయింది.

ఇపుడు ఆయనకు ప్రభుత్వ విప్ పదవి దక్కింది. ఈ పదవి మంత్రి పదవికి బదులుగా అనుకోవాల్సిందే అని వినిపిస్తోంది. ఈ పదవిలో చాలా మందిని తీసుకున్నారు. వారిలో తొలిసారి ఎమ్మెల్యే అయిన వారు జూనియర్లు కూడా ఉన్నారు.

అందువల్ల సీనియారిటీకి దక్కిన గౌరవంగా దీనిని తీసుకోవాలా అంటే అలా అనుకోలేని పరిస్థితి. అసలు పదవి లేకుండా ఏదో వచ్చింది అని భావించాలనే ఇచ్చారనుకోవాలేమో అని అంటున్నారు. పార్టీ పట్ల నిబద్ధత కలిగిన గణబాబు సీనియర్ నేత దివంగత మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పల నరసింహం రాజకీయ వారసుడు.

ఇక్కడ విశేషం ఏమిటంటే అప్పల నరసింహానికి కూడా మంత్రి యోగం పట్టలేదు. ఇపుడు రాజకీయ జీవితంలో చాలా ముందుకు వచ్చినా గణబాబుకూ ఆ అవకాశం లభించడం లేదు. విప్ తో సరి అనుకోవాలా లేక విస్తరణలో చాన్స్ ఉంటుందా అంటే కాలమే ఆ జవాబు చెప్పాలని అంటున్నారు.

4 Replies to “మంత్రి పదవికి బదులుగా…!”

Comments are closed.