చంద్రబాబు సర్కార్ వరుసగా పదవుల పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులను ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో ముగ్గురికి ప్రభుత్వ విప్ పదవులు ఇవ్వడం విశేషం. కూటమిలోని మూడు పార్టీలకు సమన్యాయం చేయడం ఇక్కడ ప్రత్యేకత.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (బీజేపీ), కడప ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి (టీడీపీ), రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (జనసేన)కు ప్రభుత్వ విప్ పదవులు దక్కాయి. వీళ్లలో ఆదినారాయణరెడ్డి, మాధవీరెడ్డి ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శిస్తున్నారు.
జమ్మలమడుగు, కడప నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై సొంత పార్టీల్లోనే వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా కడపలో టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు శివకొండారెడ్డిపై హత్యాయత్నం జరిగినా ఇంత వరకూ అతీగతీ లేదు.
జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డిపై టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. టీడీపీ ఇన్‌చార్జ్ భూపేష్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా బజార్ను పడి విమర్శించుకునే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. రైల్వేకోడూరులో కూడా టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయి. ముగ్గురికీ ప్రభుత్వ విప్ పదవులు రావడం విశేషం.
Call boy jobs available 9989793850
vc estanu 9380537747
బులుగు బుగ్గ కారు..అంతేగా!
నీకు కావలిసింది అదే కదా