మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు వైసీపీ జాతకాన్ని దగ్గర పెట్టుకున్నారు. ఆయన తరచూ మీడియా ముందుకు వచ్చి వైసీపీ జాతకం ఏ మాత్రం బాగాలేదని పెదవి విరుస్తున్నారు. వైసీపీలో ఎవరూ మిగలరని ఆయన సర్వే లాంటి జాతకం ఒకటి తాజాగా చెప్పారు.
వైసీపీలో అంతా కట్టకట్టుకుని బయటకు పోతారని కూడా గంటా చెప్పారు. వైసీపీకి భవిష్యత్తు అన్నది లేదని అన్నారు. వైసీపీ అధినాయకుడు జగన్ అయిదేళ్ళ పాలనలో ఏపీ నాశనం అయింది అన్నారు. ఏపీలో పెట్టుబడులు అన్నీ వెనక్కి పోయాయని ఆయన విమర్శించారు. వాటిని తిరిగి ఏపీకి తీసుకుని వస్తున్న ఘనత చంద్రబాబు లోకేష్ బాబులదే అని కితాబు ఇచ్చారు. విశాఖతో పాటు ఏపీకి బాబు నాయకత్వంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని గంటా ఘంటాపధంగా చెప్పారు.
వైసీపీ మీద విమర్శలు చేయడంతో పాటు టీడీపీ పెద్దలను గంటా కీర్తించడం ద్వారా బాబు దృష్టిలో పడాలని చూస్తున్నారు అని అంటున్నారు. మంత్రి పదవి ఈ టెర్మ్ లో తప్పకుండా గంటాకు దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు. అయితే అది లభించలేదు. విశాఖ జిల్లాకే మంత్రి పదవి లేకుండా పోయింది.
ఏపీ మంత్రివర్గంలో ఒక బెర్త్ ఇంకా ఖాళీగానే ఉంది. సమీప భవిష్యత్తులోనైనా దానిని భర్తీ చేస్తారేమో అని చాలా మందికి ఆశలు ఉన్నాయి. వైసీపీ నాశనం టీడీపీ వైభోగం గురించి జాతకాలు చెబుతున్న గంటాకు మంత్రి యోగం ఉందా లేదా అన్నది చూడాలని అంటున్నారు.
గంటా జాతకం నిజం అవుతుంది..అవుతున్న సూచనలు కూడా కనపడుతున్నాయి..
కానీ.. ఆయన మంత్రి పదవి కోసం నువ్వు చెపుతున్న జాతకం మాత్రం నిజమవదు ..
గంటా పథం
ye ghanta?
Call boy jobs available 9989793850
vc estanu 9380537747
Indian Bank Loans Paid or not Gantaji?