రాజకీయ నాయకులు చాలా అందమైన అబద్ధాలు చెబుతుంటారు. అమాయకులైన సాధారణ ప్రజలకు ఆ అబద్ధాలను నమ్మేయాలని అనిపిస్తుంది. నమ్మకపోతే మనమే నష్టపోతాం అనే భయం కూడా వేస్తుంది. అంత అందంగా అబద్ధాలు చెప్పడం, నాటకీయ డైలాగులతో వ్యవహారాలను రక్తి కట్టించడం అనేది రాజకీయ నాయకులకు మాత్రం చెల్లిన విద్య.
రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన తర్వాత.. ఈ విద్య అతి సహజంగా అబ్బుతుంది. ఎవ్వరూ నేర్పే పనేలేదు. అబద్ధాల డైలాగుల్లోకి రమ్యమైన నాటకీయత కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ మాజీ మంత్రి భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కూడా అలాంటి అందమైన అబద్ధాల్ని వండి వారుస్తున్నారు. ‘తాను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని’ కేటీఆర్ ప్రకటించారు. ఇందులో నాటకీయత ఏముంది.. ఆయన ఇష్టం.. చేసుకోవచ్చు కదా.. అని ఎవరికైనా అనిపించవచ్చు.
కానీ.. తాను ‘కార్యకర్త అభీష్టం, ఒత్తిడి మేరకే పాదయాత్ర చేయబోతున్నట్టుగా కేటీఆర్ వివరిస్తున్నారు. ఇక్కడే ఉంది అసలు మెలిక! నాయకులకు ఏదో ఒక ఘనకార్యం చేయాలనిపిస్తుంది. తమంత తాము ఆ పని చేసేయాలంటే వాళ్లకు కొంత ఈగో అడ్డు వస్తుంది. పురజనుల కోరిక మేరకు మాత్రమే తాము ఆ పనిచేస్తున్నట్టుగా ప్రపంచం గుర్తించాలనే తపన ఉంటుంది. అందుకే పార్టీ మారదలచుకున్న ఎమ్మెల్యేలు అందరూ.. ముందు కార్యకర్తలతో ఒక సమావేశం పెడతారు. ఆ సమావేశంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. సమావేశం ముగిసిన తర్వాత.. తన అనుచరులు, కార్యకర్తలు అందరూ కోరుతున్నారు గనుక.. తాను పార్టీ మారడానికి నిర్ణయించుకున్నట్టుగా ఒక ప్రకటన చేసేస్తారు. ఇదంతా ఒక పెద్ద నాటకం లాగా నడిచిపోతుంది.
ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు మాటలు కూడా అలాగే ఉంటున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయడం అంటే.. కష్టానికి సిద్ధపడడమే. అయితే.. పాదయాత్ర అనేది సీఎం కుర్చీకి అడ్డదారి అనే సెంటిమెంటు ఒకటి మనకు నాటుకుంటున్నందున.. కేటీఆర్ ఆ మార్గం అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
వైయస్ఆర్, చంద్రబాబు, జగన్ అందరూ పాదయాత్రల తర్వాత అధికారం అందుకున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారు. డిప్యూటీ అయ్యారు. ఈ సెంటిమెంటును నమ్ముకుని కేటీఆర్ కూడా తాను పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతానని అనుకుంటుండవచ్చు. కానీ.. స్ట్రెయిట్ గా ఆ పని చేయలేక.. పార్టీ కార్యకర్తలందరూ తన పాదయాత్రను కోరుకుంటున్నారు గనుక.. చేస్తానని ఆయన వారి మీదకు నెట్టేయడం తమాషాగా ధ్వనిస్తోంది.
Call boy works 9989793850
vc available 9380537747
వీడొక దగుల్బాజి పుండాకోరు వెధవ
ప్రపంచం లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మించిన శ వ రాజకీయం ఎవరు చేయలేదు – KTR