ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోగా, ఆస్పత్రులపై దాడులు చేయిస్తూ దొంగలుగా చూస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం దూదికి, సూదికి కూడా డబ్బుల్లేవని, ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద సేవల్ని అందించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ చేతులెత్తేసింది. ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తున్నట్టు ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది.
ఆ లేఖలో ఏముందంటే…. “ప్రజల శ్రేయస్సు.. ఆరోగ్యం.. సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న రాష్ట్రప్రభుత్వానికి అన్నివిధాలా మా వంతు.. మా స్థాయిలో సహాయసహకారాలు అందించాలన్న గట్టి సంకల్పం ఉంది.. సత్తా ఉంది. పట్టుదలా ఉంది.. అంకితభావమూ ఉంది. కానీ గత కొద్ది నెలలుగా ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న కష్టాలు.. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఇవేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. గత 8 నెలలుగా సరైన చెల్లింపులు లేకపోవటంతో ఆస్పత్రులను నడపటం చాలా కష్టంగా మారింది. ప్రతి ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రికి రావాల్సిన బకాయిలు బాగా పెరిగిపోయాయి.
2023 సెప్టెంబరు వరకు ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలు బాగానే వచ్చాయి. ఇక ఆ తర్వాత నుండి బకాయిలు బాగా పేరుగుపోతూ వచ్చాయి. 2024 మే నెలకు ఆ బకాయిలు మరింత పెరిగిపోయి, సుమారు రూ.1750కోట్లకు చేరాయి. ఇక మా వల్ల కాదని మేమంతా చేతులెత్తేసినపుడు, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు, అపద్ధర్మ ప్రభుత్వం ఉందని, అందువల్ల రూ.500కోట్లు ఇస్తామని, మమ్మల్ని నమ్మించి, చివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. బాధపడ్డాం. ఆ బాధను గుండెల్లోనే దాచుకున్నాం. ఎందుకంటే ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం మా బాధలను అర్ధం చేసుకుంటుందన్న ఆశ. కానీ కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు మా బాధలను వినలేదు. మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాగానీ, కనీస స్పందన కూడా లేదు.
మేం చేస్తున్న సేవలను ప్రభుత్వ పెద్దలు గుర్తిస్తారని, ఈ రోజు కాకపోతే రేపయినా గానీ మా బకాయిలను విడుదల చేస్తారన్న గట్టి నమ్మకంతో ఏదో విధంగా ఇంతకాలం భారంగా నెట్టుకొస్తున్నాం. అందినకాడికి అప్పులు చేయటం, బ్యాంకుల నుండి ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకోవటం వంటి అన్ని అవకాశాలను వాడేసుకున్నాం. ఇప్పుడిక ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయాయి. దూది.. సూది కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నామంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్ధంచేసుకోవాలని మనవి చేస్తున్నాం. ఇక ఆసుపత్రులను నడపటం నూ వల్ల కావటం లేదు. ఇప్పటి వరకు ఉన్న అవకాశాలను అన్నింటినీ ఉపయోగించుకుని, ప్రభుత్వానికి ఎక్కడా చెడ్డ పేరు రాకూడదని, పేద వర్గాలకు కష్టం కలుగకూడదు.. నష్టం జరగకూడదన్న ఉద్దేశ్యంతో నడుపుడుతున్న మేము, ఇక ఎంత మాత్రం ఆ భారాన్ని మోయలేని పరిస్థితుల్లో ఉన్నాం.
మేము నాలుగు గోడల మధ్య గౌరవంగా, ప్రశాంతంగా పని చేసుకోవాలని మనసా వాచా కర్మేణా కోరుకునే వాళ్లమేగానీ, రోడ్డెక్కాలని ఎప్పుడూ కోరుకోము. అలాంటి మేము ఇప్పుడిలా నిస్సహాయతను వ్యక్తం చేస్తూ.. ఇక నుండి ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో వైద్యం చేయలేమని చెబుతున్నామంటే, గదిలో బంధించిన పిల్లి ఎలా ప్రతిస్పందిస్తుందో అలా మా పరిస్థితి తయారయిందన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలని కోరుతున్నాము. తాజాగా సుమారు రూ. 2వేల 500కోట్ల బకాయిలు ఆసుపత్రులకు రావాల్సిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రులకు విడుదల చేసింది… కేవలం రూ.160కోట్లు మాత్రమే.
మా బకాయిలు చెల్లించకపోయినా గానీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదన్న సదుద్దేశ్యంతో మేం పనిచేస్తుంటే, బకాయిలు అడిగిన పాపానికి మా ఆసుపత్రుల మీద దాడులు చేసి, మమ్మల్ని దొంగలుగా చూపిస్తున్నారు. మన దేశ సంస్కృతిలో మనకు చిన్న సాయం చేసిన వారికి కూడా మనమెంతో రుణపడి ఉంటాం. కానీ అటు పేద వర్గాలకు, ఇటు ప్రభుత్వానికి సేవలందిస్తున్న మాపై దాడులు చేయటం.. దొంగలుగా చూపించటం ద్వారా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. అయినా సరే ఇక మేము వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకున్నాము.
ఇలాంటి విధానాలు మన రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడవని సవినయంగా మనవి చేస్తున్నాం. వాస్తవానికి ఈ పాటికే రాష్ట్రంలో వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. కానీ అది జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మా ఇబ్బందులను పరిష్కరించేందుకు దృష్టిపెట్టాలి. ఇప్పటి వరకు పేరుకు పోయిన బకాయిలను చెల్లించాలి. ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలను క్రమ పద్ధతిలో చెల్లించే విధంగా ఒక విధానాన్ని రూపొందించాలని కోరుకుంటున్నాం” అని లేఖలో స్పష్టం చేయడం గమనార్హం.
ఇప్పటికే ఆరోగ్యశ్రీని ఎత్తివేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బకాయిలు చెల్లించే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. ఆరోగ్యశ్రీని దివంగత వైఎస్సార్ తీసుకొచ్చారు. ఎంతో మందికి ప్రయోజనం కలిగింది. అలాంటి మంచి పథకాన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎత్తివేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
సెప్టెంబర్ 23 నుండి బకాయిలు పెట్టి నెల రోజుల క్రితం వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని బాద్యుల్ని చేస్తున్నాడు వీడు
Jagan aithe.. bakayilu kontha chellinchi…scheme continue chesevaadu.. adhi excellent scheme… poor people ku chaala prayojanam. Ippudu kutami motham scheme lepetattugaa vundi..
Let jalaga vedhava clear 1750 crores
1000 cr bakaeilu maamule . 15000 cr spend chesindi 2019-2024 madyalo . 1700 cr is normal . next gov has to clear the dues and continue . 2019 also jagan gov did same thing . cleared 500 to 700 cr dues and continue the scheme .
Dues from sap 23
Jalaga vedhava palana raani daddamma
వీళ్లకి జగన్ ఉన్నప్పుడు నోరు లేవదు, చంద్ర బాబుని చూడగానే అన్నీ రూల్స్ గుర్తుకు వస్తాయి. మెత్తగా ఉంటె మోట్ట బుద్దవుతుంది, జగన్ లా అన్నీ ఎగ్గొట్టి, అడిగితే తిరిగి విరుచుకుపడిపోవడమే కరెక్ట్.
Chaa…. Dabbulu isthunte matladataniki emi untundhi…priority list lo schemes lenappudu ilage untadhi… E 5 years lo CBN chese oke okka pani amaravthi ni immovable ga cheyyadame..ink 50 years taravata jagan unna leka poina rayalaseema AP lo baganga undadhu….amaravathi kastha Kammaravathi ga Maripothundi
Avnu reddy kani nee comment lo CBN meedha dvesham and jagan meedha Prema kanapaduthundhi.. nijaniki jagan gadiki nayakudiki unde lakshanalu em levu abaddhala koru factionist reddy mee nakili reddy
2023 September varaku bakayilu teerchesarani chepparu kada sir! Ippudu kuda veella badha bakayilu kosam kante, dongalu antunnarane
Call boy works 8341510897
Vc estanu 9380537747
అన్న మొగ్గ గుగిపించాడుగా
Mosagadini nammi votes vesaru.Anubhavinchandi…..vaadu CM ayyindi sontha caste develop cheyyadaniki.