వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ ద్వారకా తిరమలరావు షాక్ ఇచ్చారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకూ తన కార్యాలయంలోనే ఉండాలంటూ ఆయన ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. జగన్ ప్రభుత్వంలో అంటకాగారంటూ చంద్రబాబు సర్కార్ ఇప్పటికే కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వని సంగతి తెలిసిందే.
వీళ్లందర్నీ జీఏడీకి అటాచ్ చేశారు. దీంతో వెయిటింగ్లో ఉన్న సీనియర్ అధికారులు హెడ్ క్వార్టర్స్‌లో వుండకుండా సొంత పనులు చక్కదిద్దుకుంటున్నారనే సమాచారం డీజీపీకి అందింది. పనిష్మెంట్ కింద వాళ్లకు పోస్టింగ్‌లు ఇవ్వలేదని, అలాంటి వాళ్లంతా ఎక్కడెక్కడో తిరగడం ఏంటనే ఫిర్యాదులు అందాయి. దీంతో డీజీపీ తక్షణం స్పందించారు.
హెడ్ క్వార్టర్స్‌లో వుండని సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఆయన మెమో జారీ చేశారు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ డీజీపీ కార్యాలయంలోనే గడపాలని పరోక్షంగా వాళ్లకు శిక్ష విధించారు. అలాగే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం వెయిటింగ్లో 16 మంది సీనియర్ అధికారులున్నారు. వాళ్లలో పీఎస్సార్ ఆంజనేయుడు, సునీల్‌కుమార్, సంజయ్, కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వరరెడ్డి, జాషువా , అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్‌గున్ని తదితరులున్నారు.
These tainted IPS’ showed the power of J-gang!
Nee emmahookuraalanjodaka
w
Vc available 9380537747