జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు

విజ‌య‌వాడ స్వ‌రాజ్ మైదాన్‌లో అంబేద్క‌ర్ స్మృతి వ‌నం నిర్మించి, సామాజిక న్యాయానికి చిహ్నంగా రాజ్యాంగ‌ రూప‌శిల్పి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని త‌మ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌గా, అక్క‌సుతో శిలాఫ‌ల‌కాన్ని టీడీపీ మూక‌లు ధ్వంసం…

విజ‌య‌వాడ స్వ‌రాజ్ మైదాన్‌లో అంబేద్క‌ర్ స్మృతి వ‌నం నిర్మించి, సామాజిక న్యాయానికి చిహ్నంగా రాజ్యాంగ‌ రూప‌శిల్పి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని త‌మ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌గా, అక్క‌సుతో శిలాఫ‌ల‌కాన్ని టీడీపీ మూక‌లు ధ్వంసం చేశాయ‌ని జాతీయ ఎస్సీ క‌మిష‌న్ చైర్మ‌న్ కిషోర్ మ‌క్వానాకు వైసీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు.

తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి నేతృత్వంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ త‌దిత‌రులు ఢిల్లీలో జాతీయ ఎస్సీ క‌మిష‌న్ చైర్మ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా అంబేద్క‌ర్ విగ్ర‌హ శిలాఫ‌ల‌కం ధ్వంసానికి దారి తీసిన ప‌రిస్థితుల్ని గురుమూర్తి వివ‌రించారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేతృత్వంలో ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌దైన అంబేద్క‌ర్ విగ్ర‌హం, లైబ్ర‌రీ ఏర్పాటు చేయ‌డ‌మే నేర‌మైంద‌న్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిపాలన గాడి తప్పిందని, శాంతిభద్రతలు క్షీణించాయని గురుమూర్తి వివ‌రించారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల భద్రతను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింద‌నే వాస్త‌వం ఈ సంఘటనతో రుజువైంద‌న్నారు. సాక్ష్యాధారాలున్న‌ప్ప‌టికీ నిందితుల్ని గుర్తించ‌డంలో ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న లేక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది అంబేద్క‌ర్‌ను అవ‌మానించ‌డంగా భావిస్తున్నామ‌న్నారు.

దాడి సమయంలో అనుమానాస్పదంగా లైట్లు ఆఫ్ చేయడం వంటి పరిస్థితులు ప్రభుత్వ ప్రమేయాన్ని బలంగా సూచిస్తున్నాయన్నారు. నిష్పాక్షికమైన విచారణ జరిగేందుకు, అంబేద్కర్ విగ్రహానికి భద్రత కల్పించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచార‌ణ బాధ్య‌త‌ల్ని అప్పగించాలని కోరారు.

జాతీయ ఎస్సీ కమిషన్ తక్షణమే జ్యోక్యం చేసుకొని వ్యక్తిగతంగా సంఘటన ప్రదేశాన్ని సందర్శించి వేగవంతమైన దర్యాప్తు జరిపి షెడ్యూల్డ్ కులాల వారి గౌరవం, హక్కులను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చైర్మ‌న్‌కు గురుమూర్తి నేతృత్వంలోని బృందం విన్న‌వించింది.

7 Replies to “జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు”

  1. వాడి పాలనలో అంబెడ్కర్ విదేశీ విద్యా పధకానికి జగన్ పేరు మార్చుకున్న విషయం కూడా ఫిర్యాదు చేయాల్సింది.

  2. అసలు జగ్గాడ్ కి ఎం అర్హత వుంది రా వాడి పేరు వేయించుకోవటానికి?వాడి పేర్ల పిచ్చ మీరూ.. అసలు వాడికి ముఖ్యమంత్రి అయ్యేదాక అంబేద్కర్ అంటే ఎవరో తెల్సా??ఇలాంటి టైం వేస్ట్ పనులు ఆపి ప్రజలకి ఏదన్నా ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోండి.

  3. సూది కోసం సోది కెళ్తే పాత ర్యాంకు అంతా బయటపడింది అంట….ఇప్పుడు వాళ్ళు వచ్చి అన్ని విచారిస్తే దళిత డ్రైవర్ డోర్ డెలివరీ ..చెయ్యడం బయట కి వచ్చిన వ్యక్తి అన్న తో కూర్చుని సామజిక సాధికార యాత్ర లు చేయడం దళిత ఎమ్మెల్యే అధికారం అతను ఎంజాయ్ చెయ్యడం లాంటివి అన్ని బయట కి వాట్సాయేమో

Comments are closed.