వైసీపీకి షాక్‌పై షాక్‌

ఎట్ట‌కేల‌కు గ్రంధి శ్రీ‌నివాస్‌పై జ‌రిగిన ప్ర‌చార‌మే నిజ‌మైంది. కాస్త ఆల‌స్యంగా అయినా ఆయ‌న వైసీపీని వీడారు.

వైసీపీకి షాక్‌పై షాక్‌. ఇవాళ ఉద‌యం వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకోక‌నే మ‌రో కీల‌క నేత పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీ‌నివాస్ గుడ్‌బై చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నుంచి 2019లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై గెలిచి రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని శ్రీ‌నివాస్ ఆక‌ర్షించారు. 2024లో ఆయ‌న జ‌న‌సేన అభ్య‌ర్థి పులివ‌ర్తి రామాంజ‌నేయులు చేతిలో ఓడిపోయారు. అప్ప‌టి నుంచి గ్రంధి శ్రీ‌నివాస్ రాజ‌కీయాల‌కు దూరంగా వుంటున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తార‌నే ప్ర‌చారం గ‌త కొంత‌కాలంగా సాగుతోంది.

ఇటీవ‌ల గ్రంధి శ్రీ‌నివాస్ వ్యాపార సంస్థ‌ల‌పై ఐటీ దాడులు జ‌రిగాయి. దీంతో రాజ‌కీయంగా ఆయ‌న్ను భ‌య‌పెట్టి వైసీపీ నుంచి దూరం చేయాలని కూట‌మి ప్ర‌య‌త్నిస్తోంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఎట్ట‌కేల‌కు గ్రంధి శ్రీ‌నివాస్‌పై జ‌రిగిన ప్ర‌చార‌మే నిజ‌మైంది. కాస్త ఆల‌స్యంగా అయినా ఆయ‌న వైసీపీని వీడారు.

ఇవాళ ఇద్ద‌రు ముఖ్య నాయ‌కులు వైసీపీకి గుడ్ బై చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇద్ద‌రి పేర్లు శ్రీ‌నివాస్ కావ‌డం ప్ర‌త్యేక‌త‌. ఇంటి పేర్లే వేరు. ఒక‌రేమో గ్రంధి, మ‌రొక‌రు అవంతి శ్రీ‌నివాస్ కావ‌డం ఇక్క‌డ ప్ర‌త్యేక‌త‌. ఇద్ద‌రూ కాపు నాయ‌కులే. వీళ్లిద్ద‌రూ జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశాలే ఎక్కువ‌. ఎందుకంటే, గ‌తంలో ప్ర‌జారాజ్యంతో వీళ్లిద్ద‌రికి అనుబంధం వుంది.

19 Replies to “వైసీపీకి షాక్‌పై షాక్‌”

  1. 2014-19 మధ్యలో 23 మంది వైసీపీ ఎం. ఎల్ . ఏ. లు జగన్ కి షాక్ ఇచ్చారని, 2019 ఎన్నికల్లో ప్రజలు వారిలో 22 మందికి షాక్ ఇచ్చారని జ్ఞాపకం. ఈ ఇద్దరినీ పార్టీలోకి తీసుకుంటే జనసేనకే నష్టం.

  2. ఘోరంగా ఓడిపోయిన ఆరు నెల్లకే పోరాటం అంటే ఎవడికి ఉంటది ఓపిక, ఇంట్రెస్ట్ ? అధికారం లో ఉన్నప్పుడు భజన బ్యాచ్ కి పదవులు ఇచ్చి ఇప్పుడు పోరాడదాము రండి అంటే ఎవడొస్తాడు..

  3. Daridram entha twaraga velithe antha manchidi..

    elagu Jagan daggara vaalla Chitta unthndi..poyina emi peekaleru..

    the faster they go, the better for Jagan. He will make new leaders

  4. అవంతి శ్రీనివాస్ 

    గ్రంధి శ్రీనివాస్ 

    ఆళ్ల నాని

    సామినేని ఉదయభాను 

    బాలినేని శ్రీనివాసరెడ్డి 

    వాసిరెడ్డి పద్మ 

    బీద మస్తాన్ 

    ఆర్ కృష్ణయ్య 

    మోపిదేవి వెంకట రమణ 

    కర్రి పద్మశ్రీ 

    బల్లి కల్యాణ చక్రవర్తి 

    పోతుల సునీత 

    ..

    అన్నయ్య..ఈ తొక్కలో పార్టీ ఎంతో అర్ధం కావట్లేదు తిప్పి కొడితే పంది మంది మిగిలారు. అందరినీ వేసేస్తే ఇంటికెళ్లిపోవచ్చు..

Comments are closed.