హనుమాన్ సినిమా 2024లో ఓ సంచలనం. కానీ ఆ సంచలనం ఆ సినిమా నిర్మాతకు, దర్శకుడికి కూడా అదే ఏడాదిలో ఆనందాన్ని మిగల్చడం లేదు. హనుమాన్ ఇచ్చిన లాభాలను డబుల్ ఇస్మార్ట్ సినిమా పట్టుకుపోయింది నిర్మాతకు. హనుమాన్ ఇచ్చిన క్రేజ్ తో ప్లాన్ చేసుకున్న రెండు ప్రాజెక్ట్ లు క్యాన్సిల్ అయ్యాయి దర్శకుడు ప్రశాంత్ వర్మ కు.
హనుమాన్ తరువాత ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకున్న రణ్ బీర్ కపూర్ ప్రాజెక్ట్ ఆరంభంలోనే ఆగిపోయింది. సరే ఆ తరువాత ప్లాన్ చేసిన నందమూరి మోక్షజ్ఙ ప్రాజెక్ట్ కూడా ఆదిలోనే ఆగిపోయింది. ప్రారంభోత్సవం మాత్రమే ఆగింది అని ముందుగా చెప్పినా, ఇక నందమూరి మోక్షజ్ఙతో సినిమా చేయడంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ విముఖతతో వున్నారని తెలుస్తోంది.
ఎందుకంటే ఇప్పుడు ప్రారంభోత్సవం దగ్గర సడెన్ గా ఆగింది కనుక సరిపోయింది. రేపు సినిమా సగంలో వుండగా ఆగితే మొత్తానికే మోసం వస్తుందని ప్రశాంత్ వర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిర్మాత సుధాకర్ కు మాత్రం సినిమా చేస్తారు.
మరి ఇప్పుడు ప్రశాంత్ వర్మకు ఏ హీరో దొరుకుతారు అన్నది క్వశ్చను. రిషబ్ శెట్టి ప్రాజెక్ట్ ఇప్పుడే కాదు. ఎందుకంటే ఆ హీరోకు వేరే రెండు కమిట్ మెంట్లు వున్నాయి. అందువల్ల ఇప్పుడు తన సూపర్ విజన్ లో తయారయ్యే డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ సినిమా మీద దృష్టి పెడతారేమో?
మొత్తం మీద హనుమాన్ విజయం నిర్మాత, దర్శకులకు 2024లో అయితే ఆనందాన్ని నిలబడనివ్వలేదు.
రణ్ బీర్ కపూర్ కాదు.. రణ్ వీర్ సింగ్ తో ప్లాన్ చేశాడు
రణ్ బీర్ కపూర్ కాదు.. రణ్ వీర్ సింగ్ తో ప్లాన్ చేశాడు