వైసీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ను అర్ధ‌రాత్రి!

కూట‌మి స‌ర్కార్ అరెస్ట్‌ల ఆక‌లి మీద ఉన్న‌ట్టుంది. ప‌గ‌లూరాత్రి అనే తేడా లేకుండా ప్ర‌త్య‌ర్థుల్ని ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా అదుపులోకి తీసుకుంటూ భ‌య‌కంపితుల్ని చేస్తోంది

కూట‌మి స‌ర్కార్ అరెస్ట్‌ల ఆక‌లి మీద ఉన్న‌ట్టుంది. ప‌గ‌లూరాత్రి అనే తేడా లేకుండా ప్ర‌త్య‌ర్థుల్ని ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా అదుపులోకి తీసుకుంటూ భ‌య‌కంపితుల్ని చేస్తోంది. గుంటూరులో గ‌త అర్ధ‌రాత్రి వైసీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌ను కొంద‌రు కిడ్నాప్ త‌ర‌హాలో తీసుకెళ్లిపోయారు.

కుటుంబ స‌భ్యులు ఎంత‌గా వేడుకుంటున్నా క‌నిక‌రం చూప‌క‌పోవ‌డానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ విష‌య‌మై మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు, బాధితుడి కుటుంబ స‌భ్యులు పోలీసు అధికారుల్ని క‌లిసి ఫిర్యాదు చేశారు. వెంట‌నే ప్రేమ్‌కుమార్ ఎక్క‌డున్నారో ఆచూకీ తెలియ‌జేయాల‌ని విన్న‌వించారు.

అర్ధ‌రాత్రి ప్రేమ్‌కుమార్ ఇంటికెళ్లిన వారు ముందుగా క‌రెంట్ లేకుండా చేశారు. అనంత‌రం అత‌న్ని ఇంట్లో నుంచి బ‌య‌టికి లాగారు. పోలీస్ యూనిఫాంలో లేక‌పోవ‌డంతో మీరెవ‌రు? ఏం చేస్తున్నార‌ని? ప్రేమ్‌కుమార్ కుటుంబంలోని మ‌హిళ‌లు ప్ర‌శ్నించారు. కానీ స‌మాధానం చెప్ప‌కుండానే జీపులో ఎక్కించుకెళ్ల‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వీధి చివ‌రి వ‌ర‌కూ జీపును కుటుంబ స‌భ్యులు వెంబ‌డించినా ఫ‌లితం లేక‌పోయింది.

కూట‌మి స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డం వ‌ల్లే అదుపులోకి తీసుకున్న‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. రౌడీలా? టీడీపీ గూండాలా? అనేది తెలియ‌డం లేద‌ని కుటుంబ స‌భ్యులు వాపోయారు.

17 Replies to “వైసీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ను అర్ధ‌రాత్రి!”

  1. వైజా*గ్ సుధా*కర్ నీ ఇలానే చేసి*నప్పుడు నీ వె*బ్సైట్ లో ప్యా*లస్ పుల*కేశి గా*డిని పోగి*డావె.

    రంగనా*యకమ్మ అనే హో*టల్ యజమాను*రాలు నీ ఇలానే అర్థ*రాత్రి అరె*స్టు చేసి*న అప్పు*డు కేరిం*తలు కొ*ట్టావు కదా గ్రే*ట్ ఆం*ధ్ర.

    గుర్తుకు వస్తున్నాయా ?

Comments are closed.